పుష్ప నటుడి పెళ్లికి పెద్దగా బ్రహ్మముడి రుద్రాణి... అప్పగింతల వరకు అన్నీతానై
బుల్లితెరపై సీరియల్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి . ఒకప్పటి లాగా కెరీర్ చివరి దశలో ఉన్న నటీనటులు కాకుండా యువత ఇటువైపు వస్తున్నారు. నేరుగా సినిమాల్లో అవకాశం దొరకని వారు ధారావాహికల ద్వారా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక సీరియల్స్‌లో హీరోయిన్లుగా, అమ్మ, అక్క, వదిన తదితర సహాయక పాత్రల్లో కనిపిస్తున్న అమ్మాయిలు మోస్ట్ టాలెంటెడ్. అందం, అభినయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కోవలోకే వస్తారు స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్న షర్మిత గౌడ.
చిన్న వయసులోనే అమ్మ, అత్త వంటి బరువైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్నారు. బ్రహ్మముడి సీరియల్ ఈ స్థాయిలో హిట్ కావడానికి షర్మిత పోషించిన రుద్రాణి క్యారెక్టర్ కూడా కీలకం. నక్కలాంటి తెలివి తేటలతో తనను పెంచి పెద్ద చేసిన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే రోల్‌లో ప్రేక్షకుల చేత తిట్టించుకుంటున్నారు షర్మిత. అంటే ఆమె ఏ స్థాయిలో నటిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే వయసు మళ్లిన పాత్రలలో నటించడానికి ఏమాత్రం నో చెప్పకపోవడం వృత్తిపట్ల షర్మిత అంకితభావానికి నిదర్శనం.

కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. చదువు పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ అయ్యారు. ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిత. ఈ నేపథ్యంలో బ్రహ్మముడిలో రుద్రాణి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఎపిసోడ్‌కు రూ. 20,000 నుంచి రూ.25,000కు పైగా తీసుకునే షర్మిత నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తారని బుల్లితెర వర్గాలు చెబుతుంటాయి.
ఇకపోతే.. అల్లు అర్జున్ - సుకుమార్‌ల బ్లాక్‌బస్టర్ మూవీ పుష్పలో జాలిరెడ్డిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ నటుడు కేఏ ధనుంజయ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ధన్యత అనే ఓ డాక్టర్‌ను ధనుంజయ పెళ్లాడారు. తనను అర్ధం చేసుకునే తోడు తన జీవితంలోకి వచ్చిందంటూ ధన్యతను ఆకాశానికెత్తేస్తున్నాడు ధనుంజయ. అంతేకాదు.. తన పెళ్లికి రెండు నెలల ముందు నుంచే సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ సహా పలువురు మిత్రులను తన పెళ్లికి ఆహ్వానించాడు.
ఫిబ్రవరి 16న ధనుంజయ - ధన్యతల వివాహం మైసూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ , రాజకీయ తదితర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మముడి విలన్ షర్మిత కూడా ఈ పెళ్లికి హాజరై పెద్దగా వ్యవహరించారు. వధువరుల కన్యాదానంతో పాటు అప్పగింతల వరకు ఉండి వారిని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షర్మిత గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications










