Brahmamudi February 10th Episode: రాజ్‌ని కాపాడిన మినిస్టర్.. కావ్య చెంతకి కన్నబిడ్డ, రగిలిపోతోన్న రుద్రాణి

Photo Courtesy: JioHotstar

పాపని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లడంతో కావ్య, రాజ్‌లు తల్లడిల్లిపోతారు. పాపకు ఏం కాదు కదా? ప్రాణాలతో తిరిగొస్తుంది కదా అని కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇంతలో రుద్రాణి తన మనుషులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో పాపని చంపేయమని చెబుతుంది. వెంటనే హెడ్ నర్స్ నీలవేణికి ఫోన్ చేసి నా మనుషులు వస్తున్నారు.. పాపని చంపేస్తారు, వాళ్లకి హెల్ప్ చేయమని అంటుంది. తాను చేయనని నీలవేణి చెప్పగా.. నీ బిడ్డల్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.

వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్లిన రుద్రాణి.. ఇక శాశ్వతంగా పాప అడ్డు తొలగించే ప్లాన్ వేశానని, పాపను చంపేస్తున్నానని చెబుతుంది. ఆ మాటలు వినగానే ధర్మేంద్ర కోపం కట్టలు తెంచుకుని రుద్రాణిని లాగిపెట్టి కొడతాడు. నా బిడ్డ ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ, చంపాలని అనుకోలేదని వెంటనే ఆసుపత్రికి బయల్దేరతాడు. మరోవైపు... పాపను చంపడానికి ధర్మేంద్ర రౌడీలను పంపుతున్నట్లు కావ్య, రాజ్‌లకు నీలవేణి చెబుతుంది. ఇంతలో రౌడీలు ఆసుపత్రికి రాగా.. వారిని కాసేపు నీలవేణి అడ్డుకుంటుంది. ఆ వెంటనే ఐసీయూ రూమ్‌లోకి వెళ్లగా... అక్కడ పాపకు బదులు బొమ్మ ఉంటుంది. దాంతో రౌడీలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 10వ తేదీ ఎపిసోడ్ 952లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 10th 2026 Episode 952 Here is Today s full story
Photo Courtesy: JioHotstar

పాపని చంపడానికి వచ్చిన రౌడీలతో రాజ్ గొడవపడతాడు. ఇంతలో ఓ రౌడీ రాజ్‌ను పొడవబోతుండగా కావ్య వచ్చి ఆపుతుంది. కత్తి తెగడంతో ఆమెకు రక్తం పోతుంది. ఇంతలో మినిస్టర్ వచ్చి రౌడీలను తరిమేస్తాడు. కన్నకూతురిని చంపుకోవాలని అనుకున్నావా? నువ్వు తండ్రివేనా? అంటూ ధర్మేంద్ర చొక్కా పట్టుకుని నిలదీస్తాడు రాజ్. నీ భార్య సంతోషం కోసం బిడ్డల్ని మార్చావు.. నీకు వారసురాలు కావాలని నా భార్యకు బిడ్డను దూరం చేశావు.. ఇప్పుడు శాశ్వతంగా మా బిడ్డ మీ దగ్గరే ఉండాలని చివరికి కన్నకూతురిని కూడా చంపుకోవాలని అనుకున్నావా అంటూ మండిపడతాడు రాజ్. దాంతో నన్ను క్షమించమని అడుగుతాడు ధర్మేంద్ర.

క్షమించమని అడిగే అర్హత కూడా లేని పాపాత్ముడిని, మీరు నన్ను క్షమించడం కాదు నరికేయండి అంటాడు. నిన్ను క్షమించడం కాదు.. నీ లాంటి వాడి నీడ మా మీద పడ్డా మాకు పాపం చుట్టుకుంటుంది అంటుంది కార్తీక్. మా ఆనందం కోసం మిమ్మల్ని ఏడిపించిన రాక్షసుడిని. కానీ ఆ రాక్షసత్వం ఈరోజు నీ మాతృత్వం ముందు ఓడిపోయింది. నేను చేసింది తప్పు కాదు నేరం. నా భార్యను బతికించుకోవడం కోసం నీ అమ్మతనాన్ని బలి చేశాను, స్వార్ధంగా ఆలోచించాను. మనసులో మరో తల్లికి అన్యాయం చేస్తున్నాను అనిపించినా... నా స్వార్ధం, నా భార్య ఆనందం దానిని చూడనివ్వకుండా చేసింది. అందుకే కళ్లు తెరిచి మీ ముందు ఇలా దోషిగా నిలబడ్డానని చెబుతాడు ధర్మేంద్ర.

మీకు ఏ సంబంధం లేని బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.. నా పాపని కాపాడటానికి ఆరాటపడ్డారు. కానీ నేను నా కన్నకూతురిని చంపడానికి సిద్ధపడ్డాను, నేను తండ్రిని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదని చెబుతాడు. నా పాపకి ఉన్న ఆరోగ్య సమస్య తెలిసి భయపడ్డాను.. నా భార్య ఏమైపోతుందోనని బెదిరిపోయాను. పిల్లల్ని మార్చేస్తే నా ఇల్లు వెలిగిపోతుందని అనుకున్నానే కానీ ఓ తల్లి పేగు బంధాన్ని తెంచేస్తే అది చీకటిగా అయిపోతుందని ఇప్పుడే అర్ధమైందని నన్ను క్షమించమని అడుగుతాడు. మీరు పడ్డ బాధకి, అనుభవించిన క్షోభకు కారణం నేనే.. అందుకు మీరు ఏ శిక్ష వేసినా నేను తలవంచుతాను అంటాడు. ఇంతలో తులసి అక్కడికి వచ్చి జరిగినదంతా వింటుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

నా ఒడిలో ఉన్నది ఎవరి బిడ్డ.. నాకు బిడ్డ పుట్టలేదా? కన్నబిడ్డను మార్చి ఆ తల్లికి అన్యాయం చేసింది మీరేనా అని తులసి నిలదీస్తుంది. ఇదంతా నీకోసమే చేశాను.. పుట్టగానే మన బిడ్డకు గుండె సమస్య ఉందని తెలిసింది. అది నీకు తెలిస్తే నువ్వు దక్కవని భయపడి బిడ్డని మార్చేశానని నిజం చెబుతాడు ధర్మేంద్ర. మీరు పాపం చేశారు.. ఇలా నా ప్రాణాన్ని కాపాడే బదులు నాకు విషమిచ్చి చంపితే నాకింత బాధగా ఉండేది కాదని అంటుంది తులసి. మీ కళ్లలోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది.. నా భర్త చేసిన తప్పుకి నేను క్షమాపణలు చెబుతున్నాని అంటుంది తులసి. మీ భర్తకు మీ మీదున్న ప్రేమే ఇలా చేయించిందని చెబుతుంది కావ్య.

నా కడుపున పుట్టిన బిడ్డే నాకు కావాలని మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నానని కావ్యకు బిడ్డను ఇస్తుంది తులసి. బిడ్డను చూడగానే కావ్య, రాజ్‌లు ముద్దాడతారు. ఇంతలో డాక్టర్ అనూరాధ వచ్చి నిజం తెలిసిపోయిందా? ఇకపై మీ బిడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడంతో ధర్మేంద్ర, తులసిలు సంతోషిస్తారు. కావ్య, రాజ్‌లు ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించారని చెబుతుంది డాక్టర్. మీ బిడ్డను మా బిడ్డ అనుకున్నామే కానీ, పరాయి బిడ్డ అనుకోలేదు.. నా పాపని క్షేమంగా ఇస్తున్నాను అన్నారు, మరి అంతే క్షేమంగా మీ పాపని మీ చేతుల్లో పెట్టాలి కదా అని అంటారు కావ్య, రాజ్‌. బిడ్డను చూడగానే తులసి కన్నీటి పర్యంతం అవుతుంది. నేను మీకు ద్రోహం చేయాలని అనుకున్నాను, మీరు నా బిడ్డ ప్రాణాల్ని నిలబెట్టారు.. మీలాంటి గొప్పవాళ్ల రుణం తీర్చుకోలేనని రాజ్ కాళ్లపై పడతాడు ధర్మేంద్ర.

ఇంటి దగ్గర పాపకి, బిడ్డకు దిష్టి తీస్తారు అపర్ణ, ఇందిర. మీ మనవరాలు.. నా కన్నకూతురు అని అందరికీ చూపిస్తుంది కావ్య. నేను కూడా తల్లినే.. కానీ నీ బాధను అర్ధం చేసుకోలేకపోయామని ఇందిర, అపర్ణలు బాధపడతారు. రాజ్‌ని తన దారిలో నడిపించి తను అనుకున్నది సాధించిందని కావ్యను మెచ్చుకుంటుంది స్వప్న. వంద మందిలో ఉన్నా తల్లి తన బిడ్డను గుర్తించగలదని కావ్య నిరూపించిందని చెబుతుంది అపర్ణ. నన్ను కాపాడుకోవాలని ఈ ఇంటి బిడ్డ కాకపోయినా పరాయిబిడ్డను కూడా మన బిడ్డ అనుకున్నారని అంటుంది కావ్య. పాప బారసాల ఘనంగా జరిపిద్దామని సుభాష్ అంటుండగా.. నాకు కూడా పాప పుడుతుంది, ఇద్దరికీ కలిపి చేసేద్దామని చెబుతుంది అప్పూ.

ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడం, కావ్య దగ్గరికి తన బిడ్డ వచ్చేయడంతో రుద్రాణి తట్టుకోలేకపోతుంది. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు, స్టెప్ బై స్టెప్ ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మీద వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది, నేను ఓడిపోయాను అంటుంది రుద్రాణి. నువ్వు ఓడిపోలేదు.. బ్రతికిపోయావు, ఆ మినిస్టర్ తన అవసరం కోసం నీ ఐడియాను తీసుకుని, నీతో చేతులు కలిపి పాపని మార్చడానికి సిద్ధపడ్డాడు. కానీ అంతలోనే మారిపోయి ఆ కావ్య, రాజ్‌ కాళ్ల మీద పడ్డాడు.. వాడొక్కడే సరెండర్ అయ్యాడు? ఈ ఐడియా నీదని, దీని వెనుక నువ్వు ఉన్నావని కావ్య, రాజ్‌లకు చెప్పేసి ఉంటే ఈ పాటికే నీ ప్రాణాలు పోయేవని అంటాడు రాహుల్. ఎప్పటికీ ఈ కుట్ర వెనుక నువ్వు ఉన్నావని మినిస్టర్ చెప్పకుండా చూసుకోమని రుద్రాణికి రాహుల్, రేఖలు సలహా ఇస్తారు.

ఆ మినిస్టర్ నోరు మూయించడంతో పాటు వాడి ద్వారానే దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెడతానని అంటుంది రుద్రాణి. బయటి నుంచి నేను ఏం చేయలను, శత్రువు పక్కనే ఉంటేనే వాళ్ల పతనం చూడగలను అంటుంది. బిడ్డను చూసుకుంటూ రాజ్ మురిసిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X