Brahmamudi February 11th Episode: కావ్య బిడ్డను మార్చిందెవరు? రుద్రాణిపై కళ్యాణ్, అప్పూ అనుమానం

Photo Courtesy: JioHotstar

రౌడీల బారి నుంచి పాపను కాపాడబోతుండగా రాజ్‌ను కత్తితో పొడిచి చంపాలని రౌడీలు వస్తారు. ఇంతలో కావ్య వచ్చి కత్తిని పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయం అవుతుంది. ఇంతలో ధర్మేంద్ర వచ్చి రౌడీలను తరిమేస్తాడు. కన్నబిడ్డ ప్రాణం తీయాలనుకున్న నువ్వు కన్నతండ్రివేనా అని ధర్మేంద్రపై మండిపడతాడు రాజ్. నా భార్య కోసం కావ్య దగ్గరి నుంచి బిడ్డను దూరం చేశానని చెబుతాడు ధర్మేంద్ర. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టానని రాజ్ కాళ్లపై పడతాడు. ఇంతలో తులసి అక్కడికొచ్చి జరిగినదంతా తెలుసుకుంటుంది. నీకు బిడ్డను దూరం చేసినా నువ్వు మాత్రం మా బిడ్డకు ప్రాణాలు పోశావని కావ్యకు దండం పెడుతుంది తులసి. అనంతరం పాపని కావ్య చేతిలో పెట్టి వెళ్లిపోతారు తులసి, ధర్మేంద్ర.

కన్నబిడ్డతో ఇంటికొచ్చిన కావ్య, రాజ్‌లకు దుగ్గిరాల కుటుంబం హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. నీ కన్నపేగుని అర్ధం చేసుకోలేకపోయామని అపర్ణ, ఇందిరలు కావ్యకు క్షమాపణలు చెబుతారు. త్వరలోనే నా పాపకు, అప్పూ పాపకి బారసాల చేద్దామని కావ్య అంటుంది. తన ప్లాన్ ఫెయిల్ కావడం, కావ్య దగ్గరికి బిడ్డ చేరిపోవడంతో రుద్రాణి రగిలిపోతుంది. నువ్వే బిడ్డల్ని మార్చిన విషయం కావ్య, రాజ్‌లకు తెలియదని.. ముందు ఆ రహస్యం బయటపడకుండా చూడమని రాహుల్, రేఖలు తల్లికి వార్నింగ్ ఇస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 11వ తేదీ ఎపిసోడ్ 952లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 11th 2026 Episode 953 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆడుకుంటున్న బిడ్డను చూసుకుని మురిసిపోతాడు రాజ్. మీ అమ్మ నీ స్థానంలోకి మరొకరు వచ్చారంటే నేను నమ్మలేకపోయాను. తన వేదనని తెలుసుకోకుండా బాధించాను.. నీ దూరం మీ అమ్మకి భారం అవుతున్నా విభేదించాను. మీ అమ్మ మమకారం ఇప్పుడు నా చేతుల్లోకి రప్పించింది. నేను కళ్లు తెరవడం ఇంకాస్త ఆలస్యమైతే నేను చచ్చేవరకు నీకు క్షమాపణలు చెబుతూనే ఉండేవాడిని అంటాడు రాజ్. ఇంతలో కావ్య వచ్చి కార్తీక్‌ని ఓదారుస్తుంది. బిడ్డల్ని మార్చినట్లు నీకొచ్చిన అనుమానం నాకెందుకు రాలేదని ప్రశ్నిస్తాడు రాజ్. బిడ్డని గుర్తుపట్టడంలో దేవుడు నన్ను వెనకనే ఉంచాడని అంటాడు. నిన్ను ఎంతో ప్రేమించాను... ఎప్పుడైతే పాప నీ కడుపున పడిందో అప్పటి నుంచి నా ప్రేమ పాప మీదకి వెళ్లిపోయింది. అలాంటిది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని ఎందుకు గుర్తుపట్టలేకపోయాను అని ప్రశ్నిస్తాడు రాజ్.

బిడ్డ ఊపిరి, వెచ్చదనాన్ని బట్టి ఈ బిడ్డ నాది కాదు అని చెప్పగలిగిన తల్లి మనసుకు అంత గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు... తండ్రిని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంచేశాడని అంటాడు రాజ్. తండ్రికి బిడ్డ మనసుని చూడగలిగే శక్తిని ఇచ్చాడని చెబుతుంది కావ్య. ఏ ఆడపిల్లకైనా అమ్మ మీద కంటే నాన్న అంటేనే ఎంతో ఇష్టం. తండ్రికి అంతకన్నా వరం ఏం కావాలని ప్రశ్నిస్తుంది. నా పాపని ఇలా హత్తుకునే అవకాశం ఇచ్చావు.. నువ్వు లేకపోతే ఏం జరిగేదో అని భార్యకు థ్యాంక్స్ చెబుతాడు రాజ్.

అప్పూ బాధపడుతూ ఉండగా కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. మినిస్టర్ తన కూతురిని చంపడానికి మనుషుల్ని పంపించాడు కదా? మరి అలాంటప్పుడు మళ్లీ వెంటనే కాపాడటానికి తనే ఎందుకొచ్చాడు? అని ప్రశ్నిస్తుంది అప్పూ. తన కూతురిని తనే చంపడం తప్పని బాధపడి ఉంటాడు.. అందుకే వచ్చి కాపాడుకున్నాడని అంటాడు కళ్యాణ్. చంపాలనుకున్న మనిషి అంత త్వరగా తన నిర్ణయం మార్చుకోడని చెబుతుంది అప్పూ. ఆ మినిస్టర్ వెనుక ఎవరో ఉన్నారు అంటుంది. కావ్య అక్క జాయిన్ అయిన హాస్పిటల్‌లోనే ఆ మినిస్టర్ వాళ్లు కూడా వచ్చారు.. అది వాళ్ల హాస్పిటలే కాబట్టి అక్కడికి వచ్చారు. మనకి ఆ మినిస్టర్‌కు, అసలు సంబంధం లేదు.. అలాంటప్పుడు కావ్య అక్కకి పుట్టిన బిడ్డను.. వాళ్ల బిడ్డ ప్లేస్‌లో పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది? అదే రోజు హాస్పిటల్‌లో ఇంకో ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు? వాళ్లను కాదని.. కావ్య అక్కని పుట్టిన ఆడపిల్లనే ఎందుకు మార్చారు? ఎవరో మినిస్టర్‌కు సలహా ఇచ్చారు? అని ప్రశ్నిస్తుంది అప్పూ.

అయినా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు.. మన పాప మన దగ్గరికి వచ్చేసింది కదా అని అంటాడు కళ్యాణ్. మన శత్రువు ఎవరో మనకి తెలియకపోవడం అన్నింటి కంటే ప్రమాదకరమైన విషయం. ఒకవేళ నా అనుమానమే నిజమైతే.. ఆ శత్రువు మనల్ని చీకట్లోనే చూస్తున్నాడు, మనల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. కానీ వాళ్ల గురించి మనకే ఏం తెలియదు అని ప్రశ్నిస్తుంది అప్పూ. దీనిని ఇలాగే వదిలేస్తే మన ఫ్యామిలీకి ప్రమాదం.. మనం ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని చెబుతుంది. ముందు ఆ మినిస్టర్ వెనుక ఎవరున్నారు? అనేది తెలియాలని అంటుంది. దీనంతటికీ కారణం మినిస్టర్ అని తెలిశాక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని అప్పూకి సాయం చేయడానికి ఒప్పుకుంటాడు కళ్యాణ్.

రాజ్- కావ్యలు ఉదయాన్నే బిడ్డను రెడీ చేస్తుండగా పనిమనిషి శాంత ఏడుస్తూ కనిపించడంతో ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. నా పాప హాస్పిటల్‌లో ఉందని, నెల రోజుల నుంచి అన్నం తినడం లేదు, ఆయాసపడుతోంది. మంచినీళ్లు తాగించినా బయటకు వచ్చేస్తున్నాయి.. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే కడుపులో ఏదో వ్యాధి ఉందని అంటున్నారని చెప్పి ఏడుస్తుంది. వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు.. 4 లక్షలు కడితేనే కానీ ఆపరేషన్ చేయలేమని అంటున్నారని చెబుతుంది శాంత. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది.. ఎక్కడి నుంచి తీసుకురాను, పాపకి ఏమైనా అయిపోతుందని భయంగా ఉందని కంటతడి పెడుతుంది శాంత. నా బిడ్డను మీరే కాపాడాలని వేడుకోవడంతో కావ్య ధైర్యం చెబుతుంది. నువ్వు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేయించు.. నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానని చెబుతాడు రాజ్. దాంతో ఇద్దరికీ దండం పెడుతుంది పనిమనిషి శాంత.

మన దగ్గర డబ్బుంది కాబట్టి.. శాంత మన దగ్గర పనిచేస్తుంది కాబట్టి ఆమెకు సాయం చేస్తున్నాం. కానీ ఇలాంటి వారు ఎందరో ఉన్నారు.. ఇలాంటి సమస్య వస్తే దేవుడిని నమ్ముకోవడం తప్పించి ఏం చేయలేరు. ఎందరో పిల్లల్ని పొగొట్టుకుంటున్నారు. వాళ్ల పరిస్ధితి ఏంటీ అని బాధగా ఉందని అంటుంది కావ్య. ఇలాంటి వారికి సాయం చేయాలని చెబుతుంది. మనం ఒక దుగ్గిరాల వారి ఫ్యామిలీ ద్వారా ట్రస్ట్ పెట్టి ఇలాంటి వారికి సాయం చేయాలని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. ముందు మన ఆలోచనని ఇంట్లో వాళ్లకి చెప్పి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని అంటాడు రాజ్.

ధర్మేంద్ర ఇంటికి రుద్రాణి రావడంతో ఆమెను చూడగానే మండిపడతాడు మినిస్టర్. నువ్వు నాతో మరో తప్పు చేయొద్దని చెబుతాడు. ఆ కావ్య- రాజ్‌కు చాలా అన్యాయం చేశా.. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని అంటాడు ధర్మేంద్ర. పిల్లలను మార్చడం వల్ల మీకు తప్ప.. నాకేం ఉపయోగం ఉందని అంటుంది రుద్రాణి. నీకేం అవసరం లేకుండానే నాకు అలాంటి తప్పుడు సలహా ఇవ్వగలిగావా? అని ప్రశ్నిస్తాడు ధర్మేంద్ర. ఆ ఫ్యామిలీ మీద ఎందుకంత పగబట్టావో కనిపెట్టకుండా నీతో చేతులు కలపడం నాది తప్పు అంటాడు. పసిబిడ్డ ప్రాణాలు కూడా తీయమని చెప్పావంటే నువ్వెంత ప్రమాదకరమైన మనిషివో అర్ధమవుతోందని చెబుతాడు. నేను ఆ ఇంటి ఆడబిడ్డని, రాజ్‌కి స్వయానా మేనత్తన అని రుద్రాణి చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు.

నేను చేసిన పనికి నా పిల్లలు, నన్ను అసహ్యించుకుంటున్నారు.. ఆ ఇంటికి వెళ్లలేను, అలాగని రోడ్డు మీద ఉండలేను అని నటిస్తుంది. నిన్ను క్షమించాల్సింది వాళ్లు మధ్యలో నేనేం చేయను అంటాడు ధర్మేంద్ర. ఇప్పటిదాకా జరిగినది, దీని వెనుక ఉన్నది నేనే అని వాళ్లకి చెప్పొద్దని బతిమలాడుతుంది రుద్రాణి. దీనింతటికీ కారణం నువ్వేనని చెప్పుంటే నువ్విలా నిలబడేదానివి కాదు.. అయినా నువ్వు ఆ ఇంట్లో అడుగుపెడితే వాళ్లకు ఎప్పటికైనా ప్రమాదమే అంటాడు ధర్మేంద్ర. నీ గురించి వాళ్లకు చెప్పి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని బతిమలాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X