Brahmamudi February 12th Episode: మినిస్టర్ ఇంట్లో రుద్రాణి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ

Photo Courtesy: JioHotstar

బిడ్డను పట్టుకుని జరిగినదానిని తలచుకుంటూ రాజ్ బాధపడుతుంటాడు. ఇంతలో కావ్య రావడంతో నువ్వు ఎంత చెబుతున్నా నేనే పట్టించుకోకుండా పరాయి బిడ్డను నీ బిడ్డేనని మూర్ఖంగా ప్రవర్తించానని కుమిలిపోతాడు రాజ్. మీరు నిజం తెలుసుకుని నాకు అండగా నిలవకపోతే మన బిడ్డ మనకి దక్కేది కాదని అంటోంది కావ్య. అప్పూ దేని గురించో ఆలోచిస్తుండగా కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఆసుపత్రిలో ఆరోజు ఎంతోమంది డెలివరీలు జరిగితే కావ్య అక్క బిడ్డనే మినిస్టర్ ఎందుకు మార్చాడు? తన బిడ్డను చంపమని రౌడీలను పంపి.. తనే కాపాడటానికి ఎందుకొచ్చాడు? ధర్మేంద్ర వెనుక ఎవరో ఉన్నారని అనుమానపడుతుంది అప్పూ.

ఆ శత్రువుని గుర్తించకపోతే మన కుటుంబానికి పెను ప్రమాదం తప్పదని అప్పూ చెప్పడంతో కళ్యాణ్ కంగారుపడతాడు. ఆ శత్రువు ఎవరో కనిపెట్టాలని చెప్పగా కళ్యాణ్ సరేనని అంటాడు. ఉదయాన్నే పనిమనిషి శాంత ఏడుస్తుండగా ఏం జరిగిందని అడుగుతుంది కావ్య. తన బిడ్డ అనారోగ్యంతో ఉందని సర్జరీ చేయాలంటే 4 లక్షల రూపాయలు కావాలని చెప్పడంతో కావ్య- రాజ్‌లు సాయం చేస్తారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి మనం ఏదైనా ట్రస్ట్ లాంటిది పెట్టాలని భర్తతో చెప్పగా రాజ్ సరేనని అంటాడు. నేనే బిడ్డను మార్చిన విషయం రాజ్‌కు చెప్పొద్దని మినిస్టర్ ఇంటికి వచ్చి వేడుకుంటుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 12వ తేదీ ఎపిసోడ్ 954లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 12th 2026 Episode 954 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

బిడ్డల్ని మార్చడంలో నేను మీకు సాయం చేసినట్లు రాజ్, కావ్యలకు తెలిస్తే నన్ను బత్రకనివ్వరని ధర్మేంద్రకు చెబుతుంది రుద్రాణి. నాకొక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుతుంది. ఇంతలో కళ్యాణ్, అప్పూలు అక్కడికి రావడంతో వారిని చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. వాళ్లు ఎందుకొచ్చారో నాకు తెలియదు, నా గురించి వాళ్లకు చెప్పొద్దని తలుపు చాటుకి వెళ్లి దాక్కొంటుంది. సెక్యూరిటీ వాళ్లు కళ్యాణ్, అప్పూలను ఆపడంతో ధర్మేంద్ర వెళ్లి లోపలికి తీసుకొస్తాడు. ఎందుకొచ్చారు? ఏం కావాలని? అడుగుతాడు ధర్మేంద్ర. బిడ్డల మార్పు విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెబుతుంది అప్పూ.

మీరొక మినిస్టర్ అయ్యుండి, బాధ్యతల గల పదవిలో ఉంది ఇలా చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది అప్పూ. నా వైపు తప్పు జరిగిందని మీ అక్కా బావకి క్షమాపణలు చెప్పానని.. ఇప్పుడు నా బిడ్డతో ఆనందంగా ఉన్నానని చెబుతాడు ధర్మేంద్ర. మాకు తెలియాల్సిన కొన్ని నిజాలు అలాగే ఉండిపోయాయని కళ్యాణ్ అంటాడు. కానీ ఆపరేషన్ జరుగుతున్న మీ కూతురిని చంపితే మీ దగ్గరున్న మా ఇంటి పాప.. మీ దగ్గరే ఉండిపోతుందన్న ఆలోచనతో మీ పాపని చంపాలనుకున్న మీరు.. మళ్లీ అంతలోనే పాపని కాపాడుకోవాలని ఎందుకు అనుకున్నారని ప్రశ్నిస్తుంది అప్పూ. నా తప్పు తెలుసుకున్నాను.. బిడ్డను చంపుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు అంటాడు ధర్మేంద్ర.

మరి పరాయివాళ్ల బిడ్డను మార్చడానికి మీ మనసు ఎలా ఒప్పుకుంది? అని ప్రశ్నిస్తుంది అప్పూ. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత ఆలోచించాను.. నేరం అనిపించింది మనసు మార్చుకున్నాను అంటాడు ధర్మేంద్ర. నా వల్ల తప్పు జరిగింది.. రాజ్, కావ్యల మంచితనం వల్ల అంతా మంచి జరిగిందని చెబుతాడు. ఇప్పటికే మా ఫ్యామిలీలో ఎన్నో అనర్ధాలు జరిగాయి.. మా అక్క ఎన్నో కష్టాలు పడింది, పసిబిడ్డ కళ్లు తెరిచాక కూడా ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నట్లు చెబుతుంది అప్పూ. నేను మనిషిని నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అంటాడు ధర్మేంద్ర. మీ వల్ల రాదు అంటే ఇంకెవరి వల్ల అయినా వస్తుందా అని ప్రశ్నిస్తుంది అప్పూ.. ఆ మాటలతో ధర్మేంద్ర, రుద్రాణిలు షాక్ అవుతారు.

మీకు డబ్బుంది పలుకుబడి ఉంది. మీరు అనుకుంటే పాపకి ఆపరేషన్ చేయించగలరు.. ఇంత అవకాశం ఉండి కూడా పరాయి వాళ్ల బిడ్డను మార్చాలన్నది మీ ఆలోచనేనా? మీకు ఎవరైనా సలహా ఇచ్చారా అని ప్రశ్నిస్తుంది అప్పూ. నాకు ఎవ్వరూ సలహా ఇవ్వలేదు.. ఇంతటి దుర్మార్గమైన ఆలోచన నాకే వచ్చిందని కవర్ చేస్తాడు ధర్మేంద్ర. నా పాపని నేనే కాపాడుకున్నానని చెబుతాడు. భార్యను ఇంత ప్రేమించే మీరు.. బిడ్డను కూడా అంతే ప్రేమిస్తారు.. అలాంటిది కడుపున పుట్టిన బిడ్డను చంపేంత ఆలోచన చేస్తారా అని ప్రశ్నిస్తుంది.

కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తప్పవని అంటాడు ధర్మేంద్ర. పాపని చంపాలనుకున్నది, మళ్లీ మనసు మార్చుకుని కాపాడాలనుకున్నది మీరేనా అని ప్రశ్నించి వెళ్లిపోతుంది అప్పూ. వాళ్లు వెళ్లిపోగానే నా పేరు చెప్పకుండా నన్ను కాపాడినందుకు ధర్మేంద్రకు థ్యాంక్స్ చెబుతుంది రుద్రాణి. ఇప్పటికైనా మనిషిలా బతకమని ధర్మేంద్ర వార్నింగ్ ఇస్తాడు. అప్పూ, కళ్యాణ్‌లు ఇంటికి వెళ్తుండగా... మినిస్టర్ ఇంట్లో నుంచి రుద్రాణి రావడం చూసిన అప్పూ షాక్ అవుతుంది. రుద్రాణికి, మినిస్టర్‌కి ఏంటీ సంబంధమని కళ్యాణ్‌ను అడుగుతుంది. దాంతో ఆమె కారును కళ్యాణ్, అప్పూలు ఫాలో అవుతారు.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య, రాజ్‌ల కోసం వెయిట్ చేస్తుంటారు. మీరిద్దరూ చెప్పాలని అనుకుంటున్నారని అంతా ప్రశ్నించగా.. మనం ఈ స్థాయిలో ఉండటానికి ఎంతోమంది సహాయ సహకారాలు ఉన్నాయి. మన ఎదుగుదల కోసం కష్టపడిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కళావతికి ఆలోచన వచ్చిందని అంటాడు రాజ్. రెండు మూడు నెలలు బోనస్ ఇస్తే సరిపోతుందని అంటాడు ప్రకాశం. జనానికి కష్టం వస్తే కన్నీళ్లు కాకుండా మనం గుర్తుకు రావాలి.. చదువు కోసం, వైద్యం కోసం వాళ్లు దుగ్గిరాల వారింటి వైపు చూస్తారని అంటుంది కావ్య. దుగ్గిరాల వారి ఛారిటబుల్ ట్రస్ట్ అనే వ్యవస్థను నెలకొల్పుదామని చెబుతుంది కావ్య.

నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చిందని కానీ ఆచరణలో పెట్టలేకపోయానని సీతారామయ్య బాధపడతాడు. ట్రస్ట్ నడవాలంటే చాలా డబ్బు కావాలని దుగ్గిరాల ఫ్యామిలీ అంటుంది. మన ఆస్తుల నుంచి 50 శాతం ట్రస్ట్‌లో పెడదామని రాజ్ చెప్పగా ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. నాకు ఈ ఆలోచన నచ్చలేదు... మీరంతా కలిసి ట్రస్టే పెట్టుకుంటారో? హాస్పిటల్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం... కానీ ఈ ఉమ్మడి ఆస్తిని ఖర్చుపెడదామంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. ఎవరి ఆస్తి ఎవరికీ దానం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. నా కొడుక్కి అన్యాయం జరుగుతోంది.. ఉన్న ఆస్తి అంతా కావ్య పేరు మీద ఉంది. సగం ట్రస్ట్‌కి ఇచ్చేస్తే... మిగిలిన సగం కావ్య, రాజ్‌లదే అంటుంది ధాన్యలక్ష్మీ. రేపు పుట్టబోయే పిల్లలకు అన్యాయం జరగకూడదంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు, ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా బయటకు వెళ్లకూడదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X