Brahmamudi February 14th Episode:అప్పూ- కళ్యాణ్ కిడ్నాప్.. కట్టుబట్టలతో మిగిలిన రాజ్- కావ్య.. ఫ్యామిలీ ముక్కలు

Photo Courtesy: JioHotstar

ఆస్తిలో సగభాగం వదులుకుని ట్రస్ట్ పెట్టడానికి నేను ఒప్పుకోనని తేల్చేస్తుంది ధాన్యలక్ష్మీ. కోడలి మాటలతో సీతారామయ్య బాధపడతాడు. ఇన్నాళ్లకు నా కలను కావ్య, రాజ్‌లు తీరుస్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుపడుతోందని అంటాడు. రాజ్, కావ్యలు ఖచ్చితంగ మీ కోరిక తీరుస్తారని చెబుతుంది ఇందిర. అర్ధరాత్రి ఇంటికొచ్చిన అప్పూ - కళ్యాణ్‌లకు జరిగినది చెబుతాడు ప్రకాశం. దాంతో కోపంతో ఊగిపోయిన కళ్యాణ్.. తన తల్లికి క్లాస్ పీకుతాడు. నాకు ఆస్తుల మీద ఏమాత్రం ఆశలేదని.. అన్నా వదినలు ఏం కావాలంటే అది చేసుకోమని చెబుతాడు కళ్యాణ్.

ఆస్తిని రెండు వాటాలుగా విభజించి మన వాటాను ట్రస్ట్‌కి, మరో వాటాను కళ్యాణ్ పేరు మీద రాసేద్దామని కావ్య చెప్పడంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు. కావ్య బిడ్డను మార్చింది ఎవరో మినిస్టర్ చెప్పలేదని అప్పూ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆసుపత్రిలోని సీసీకెమెరా ఫుటేజ్‌ను పరిశీలించమని చెబుతుంది. ఇదంతా చూసిన కళ్యాణ్‌.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటాడు. మన శత్రువు ఎవరో కనిపెట్టాల్సిందేనని అంటుంది అప్పూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ 956లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 14th 2026 Episode 956 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య అక్క బిడ్డ మీద అటాక్ చేసినవాళ్లని పట్టుకుంటే దీని వెనుక ఉన్నది మినిస్టరా? లేక రుద్రాణి ఆంటీయా? అనేది తేలిపోతుందని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. నిజాలేంటో పూర్తిగా తెలిసేవరకు ఈ విషయాల్ని ఇంట్లో వాళ్లకి చెప్పొదని అంటాడు కళ్యాణ్. నిన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేశాక.. నువ్వు ఏ ఒక్క ప్లాన్ సక్సెస్ చేయలేకపోయావని రుద్రాణిపై మండిపడుతాడు రాహుల్. కావ్యని లేకుండా చేస్తానని అన్నావు.. అది బతికి మా బతుకుల్ని శాసిస్తోందని అంటుంది రేఖ. నేను అన్ని కరెక్ట్‌గానే ప్లాన్ చేశాను.. కానీ టైం బాలేదు, ఇలాగే బెడిసికొడుతుందని అంటుంది రుద్రాణి. అక్కడ వాళ్లు వాటాలు వేసుకుంటున్నారని రేఖ అనడంతో రుద్రాణి షాక్ అవుతుంది.

ఉన్న ఆస్తిలో సగం వాళ్లు పంచుకుని, మిగతా ఆస్తితో ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నారని రాహుల్ చెప్పడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. పేదలకు సాయం చేస్తారట, రేపు రాబోయే తరాలు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలని అంటున్నారని రేఖ చెబుతుంది. కావ్య ఐడియా చెప్పడంతో అంతా ఒప్పుకున్నారు.. కానీ ధాన్యలక్ష్మీ అత్తయ్య మాత్రం ఒప్పుకోలేదు. నా కొడుక్కి అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిందని అంటాడు రాహుల్. ఆవిడ అంటే మాత్రం కావ్య, రాజ్‌లు ఆగేరకం కాదని చెబుతుంది రేఖ. అదే జరిగితే మన చేతికి చిప్పేనని అంటాడు రాహుల్. అసలే నా బిజినెస్ లాస్‌లో ఉంది.. ఇప్పుడు మన ముగ్గురికి గుడి మెట్లే గతి అంటాడు.

నేను బ్రతికుండగా అలా జరగనిస్తానా? అని అంటుంది రుద్రాణి. వాళ్లకు ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే దానిని ఇంప్లిమెంట్ చేసేవరకు వదిలిపెట్టరు అంటుంది రేఖ. నేను ఆ ఇంట్లోనే ఉండి ఉంటే ట్రస్ట్ ఆలోచనని తుంచేసే దానిని అంటుంది రుద్రాణి. నిజం బయటకు రాకుండా ఆ మినిస్టర్ నోరు మూయించగలిగాను కానీ, ఆ ఇంట్లోకి నేను అడుగుపెట్టే మార్గం తెలియడం లేదని అంటుంది రుద్రాణి. ఇంతలో రుద్రాణికి రౌడీలు ఫోన్ చేసి మన మీద పోలీసులకు డౌట్ వచ్చిందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. మీరంతా అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోండి.. ఎట్టి పరిస్ధితుల్లోనూ నా పేరు బయటకు రాకూడదని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.

అప్పూ నా గురించి తీగ లాగుతోంది.. దానికి ఏమాత్రం అనుమానం వస్తే నీ దాకా వచ్చేస్తుందని అంటాడు రాహుల్. అది నా గురించి ఆలోచించే లోగా.. నేనే దాని మీద అటాక్ చేయిస్తా. దానిని అటాక్ చేసి నా గురించి ఆలోచించకుండా చేస్తా, దాని వాడుకుని అప్పూని కిడ్నాప్ చేయించింది రాజేనని ధాన్యలక్ష్మీని నమ్మిస్తా. ఆస్తి కోసమే రాజ్, కావ్యలు అప్పూని కిడ్నాప్ చేశారని.. అప్పూని కిడ్నాప్ చేసి ధాన్యలక్ష్మీకి వారసత్వం లేకుండా చేశారని రెచ్చగొడతా. అప్పుడు ధాన్యం చేసే గొడవకి దుగ్గిరాల కుటుంబం జుట్టు పీక్కుంటుందని అంటుంది రుద్రాణి.

పాప మీద అటాక్ చేసిన రౌడీలను పట్టుకున్న పోలీసులు ఈ విషయాన్ని అప్పూకి చెబుతారు. కానీ వాళ్లు ఎంత అడిగినా మినిస్టర్ పేరే చెబుతున్నారని అంటారు. దాంతో తానే బయల్దేరుతున్నానని అప్పూ చెబుతుంది. రౌడీలు దొరికిన విషయాన్ని కళ్యాణ్‌కు చెబుతుంది అప్పూ. అక్కడికి నేను తీసుకెళ్తాను కానీ వాళ్లు ఏం చెప్పినా ఈ ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆపేయాలని చెబుతాడు కళ్యాణ్. దాంతో కళ్యాణ్‌కు మాటిస్తుంది అప్పూ.

ఉదయాన్నే లాయర్‌కు ఫోన్ చేసి.. ఆస్తిలో సగం కళ్యాణ్ పేరు మీదకి, మిగిలిన సగం ట్రస్ట్ పేరు మీదకి రాస్తున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేయమని చెబుతాడు. ఈ మాటలు విన్న కావ్య.. ఇంట్లో వాళ్ల పర్మిషన్ తీసుకున్నాక ఈ నిర్ణయం తీసుకోవాలని భర్తతో చెబుతుంది. పిన్ని మాటలతో వినేరకం కాదు.. కాగితాల్ని తన చేతుల్లో పెడితేనే ఊరుకుంటుందని అంటాడు రాజ్. మీలాంటి భర్త దొరికినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను.. నేను అడగ్గానే ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడ్డారని కావ్య ఎమోషనల్ అవుతుంది.

అప్పూ, కళ్యాణ్‌లు బయటకు వెళ్లారని రుద్రాణికి ఫోన్ చేసి చెబుతుంది రేఖ. దాంతో ఇద్దరినీ కిడ్నాప్ చేయిస్తానని అంటుంది రుద్రాణి. కళ్యాణ్ -అప్పూలు కారులో వెళ్తుండగా ఒకతను రోడ్డు మీద పడి ఉంటాడు. ఏం జరిగిందోనని కళ్యాణ్ దిగి వెళ్తాడు. ఇంతలో రౌడీలు వచ్చి కళ్యాణ్‌ని చితకబాదుతారు. అదేంటో చూసేందుకు వెళ్లిన అప్పూని, కళ్యాణ్‌తో కలిపి కిడ్నాప్ చేస్తారు రౌడీలు. ఈ విషయాన్ని రౌడీలు రుద్రాణికి చెబుతారు. దాంతో కళ్యాణ్, అప్పూలని వీడియో తీసి నేను చెప్పిన నెంబర్‌కి పంపించమని చెబుతుంది రుద్రాణి. ఇక రాజ్, కావ్యల ఆశలు కుప్పకూలిపోతాయని, ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచనే ఉండదని అనుకుంటుంది.

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సమావేశం కావడంతో.. నా నిర్ణయం అప్పుడే చెప్పాను కదా, మళ్లీ ఈ మీటింగ్స్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో రాజ్, కావ్యలు రాగా.. మీరు అనుకున్న దానికి సపోర్ట్‌గా నిలబడలేకపోతున్నానని ప్రకాశం క్షమాపణలు చెబుతాడు. తప్పు ఏమైనా జరిగుంటే అది మా వైపు నుంచే, కళ్యాణ్‌కు రేపు ఏదో జరిగిపోతుందన్న భయంలో నువ్వు ఉండకూడదని అంటాడు రాజ్. ట్రస్ట్ పెట్టాలన్న నిర్ణయం ఆగదు, ఆస్తిలో సగభాగం ఇవ్వడమూ ఆగదని కావ్య అనడంతో ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. నిర్ణయం మార్చుకోలేదు.. అలాగని తమ్ముడికి రావాల్సిన ఆస్తిని మేం తీసుకోలేదని అంటాడు రాజ్.

ఉమ్మడి ఆస్తిలో నుంచి సగభాగం ట్రస్ట్‌కు రాస్తే కళ్యాణ్‌కు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నావు కదా? అందుకే వాడికి ఏ నష్టం జరగకుండా ముందుగానే కళ్యాణ్ పేరు మీద సగం ఆస్తిని రాయించానని రాజ్ చెప్పి ఆస్తి పేపర్లు ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. ఆస్తిని పంపకాలు చేసేసి మీపాటికి మీరు నిర్ణయాలు తీసేసుకుంటే ఇంట్లో మేం ఎందుకున్నట్లు అని అపర్ణ ఫైర్ అవుతుంది. చిన్నత్తయ్యని ఒప్పించాలన్నా, అనుకున్నది చేయాలన్నా వేరే దారి లేదని కావ్య చెబుతుంది. చిల్లిగవ్వ కూడా లేకుండా మీరిద్దరూ బయటికి వెళ్లిపోతారా అని ఇందిర అడగటంతో .. ఇప్పుడు మీ అందరికీ భవిష్యత్తు గుర్తొచ్చిందా అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. మీరిద్దరూ ఆస్తిని ముక్కలు చేసి రాసిచ్చేస్తారా? అని అపర్ణ ఫైర్ అవుతుంది.

కావ్య పేరు మీద ఇంతకాలం ఆస్తి ఉండటంతో అంతా సంతోషించారు. ఇప్పుడు నా కొడుకు పేరు మీదకి ఆస్తి రాగానే అందరికీ బాధగా ఉందా అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నీ మనసు ఇంత మలినం అయిపోతుందని తెలియక బాధపడుతున్నాం.. ఆస్తి విషయంలో నీ మనసు ఇంత నీచంగా ఆలోచిస్తోందని అర్ధం కాక ఆశ్చర్యపడిపోతున్నామని అంటుంది ఇందిర. నా కోడలి పేరు మీద ఇంత ఆస్తి ఉన్నా ఏనాడూ పెత్తనం చూపించలేదు.. ఏనాడు తక్కువ చేసి చూడలేదు. నా కొడుకు, కోడలు కలిసి రూపాయిని 10 రూపాయలు చేశారే తప్పించి పైసా నష్టం తీసుకురాలేదని అంటాడు సుభాష్. ఒక మంచిపని చేసేటప్పుడు కుటుంబం మొత్తం వారికి అండగా నిలవాలి.. కానీ నువ్వు రచ్చ చేసి విషయం ఇక్కడిదాకా తీసుకొచ్చావని ధాన్యంపై మండిపడుతుంది ఇందిర. ఆ మాటలతో కావ్య సీరియస్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X