Brahmamudi February 16th Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్- కావ్య.. రేవతి రీ ఎంట్రీ, రాహుల్ ట్రాప్‌లో ధాన్యం

Photo Courtesy: JioHotstar

పాప మీద అటాక్ చేసిన వాళ్లను పట్టుకుంటే అసలు బిడ్డల్ని మార్చిందెవరో తెలిసిపోతుందని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. ఇంట్లో జరుగుతున్నదంతా రుద్రాణికి చెబుతారు రాహుల్ - రేఖ. నువ్వు వేసిన ప్లాన్స్ సరిగా వర్కవుట్ కావడం లేదని ఇలాగే వదిలేస్తే మనకి మిగిలేది చిప్పేనని అంటారు. సగం ఆస్తిని కావ్య ట్రస్ట్‌కు రాసేస్తోందని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతో రుద్రాణికి రౌడీలు ఫోన్ చేసి తమను పోలీసులు వెంటాడుతున్నారని చెప్పడంతో అప్పూ- కళ్యాణ్‌లను కిడ్నాప్ చేయించాలని అనుకుంటుంది రుద్రాణి. పాప మీద అటాక్ చేయించిన రౌడీలను పోలీసులు పట్టుకుని అప్పూకి ఫోన్ చేస్తారు. దాంతో కళ్యాణ్‌ని తీసుకుని అప్పూ అక్కడికి బయల్దేరుతుండగా దారి మధ్యలో రుద్రాణి మనుషులు వాళ్లని కిడ్నాప్ చేస్తారు.

ఉమ్మడి ఆస్తిలో మా వాటాను ట్రస్ట్‌కి రాసిస్తున్నామని.. మిగిలిన ఆస్తిని కళ్యాణ్‌కు రాసిస్తున్నామని కావ్య, రాజ్‌లు చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా కొడుకు, కోడలు ఈ కుటుంబం కోసం ఎంతో చేశారు.. రూపాయిగా ఉన్న ఆస్తిని 10 రూపాయలు చేశారని, వాళ్లు చేస్తోన్న మంచి పనిని నువ్వు అడ్డుకుంటున్నావని ధాన్యంపై సుభాష్ మండిపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 16వ తేదీ ఎపిసోడ్ 957లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 16th 2026 Episode 957 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆస్తుల కోసం ఇంట్లో వాళ్లు గొడవ పడుతుండటంతో కావ్య మండిపడుతుంది. ట్రస్ట్ అన్నది తాతగారి కల, ఈ ఇంటి వారసుడిగా నా భర్త, ఈ ఇంటి కోడలిగా నేను ఉన్నందుకు ఆ పెద్దమనిషి కోరిక తీర్చనివ్వండి అని బతిమలాడుతుంది కావ్య. ఈ ట్రస్ట్ ఆగిపోకూడదు, భవిష్యత్‌లో మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా.. దుగ్గిరాల ఇంటిపేరు శాశ్వతం కావాలని చెబుతుంది కావ్య. ఇన్నేళ్లుగా మనమంటూ పెద్దగా ఎవరికీ ఏం చేయలేదు, అందుకే ఎంత కష్టపడినా ఈ ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నాం.. ఉమ్మడి ఆస్తిని దానం చేయాలనో, మా ఆస్తిని కాపాడుకోవాలనో, కళ్యాణ్‌కు అన్యాయం చేయాలని అనుకోవడం లేదని చెబుతుంది కావ్య.

మీ నాటకాలు ఆపండి.. నటించడం మీ ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే ట్రస్ట్ అన్నారు, పేరు అన్నారు.. ఇప్పుడు నా కొడుకు మీద ఆస్తి రాసిచ్చినట్లు నటించి నా కడుపు మీద తన్నారని ధాన్యం మండిపడుతుంది. నువ్వు కోరుకున్నట్లే చేశాం కదా ఎందుకు మమ్మల్ని తిడుతున్నావని అడుగుతాడు రాజ్. ఆస్తి ఇవ్వడం ఇష్టం లేక.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేక ఇక్కడ ఆస్తి కాగితాలు నా చేతిలో పెడుతూ.. అక్కడ నా కొడుకు, కోడలి జీవితాలు నాశనం చేయాలని అనుకుంటున్నారా అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఈ వీడియో చూస్తే మీ అందరికీ పిచ్చి పడుతుంది.. మీ కొడుకు కోడలు ఎంత ఘనకార్యం చేశారో మీకే తెలుస్తుంది. అప్పూ- కళ్యాణ్‌లు కిడ్నాప్ అయ్యారని రుద్రాణి చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

వీళ్లను మాత్రం వదలకూడదని రాజ్ సార్ వార్నింగ్ ఇచ్చారు.. వీళ్లు కనుక తప్పించుకున్నారో? రాజ్ సార్ మనల్ని చంపేస్తాడని ఆ వీడియో ఎవరో మాట్లాడుతున్నట్లుగా ఉండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆస్తిని ఎక్కడ పంచి ఇవ్వాల్సి వస్తుందోనని నా కొడుకు, కోడల్ని మీరిద్దరూ కిడ్నాప్ చేశారు. మీరు అనుకున్నది సాధించడానికి నేను అడ్డుపడుతున్నానని.. ఎవరి భవిష్యత్ కోసమైతే నేను పోరాడుతున్నానో వాళ్లనే లేకుండా చేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఉంటుందని ఇంతకి తెగించారని అంటుంది ధాన్యం. ఆ మాటలతో రాజ్ - కావ్యలు ఉలిక్కిపడతారు.

ఇదంతా అబద్ధమని రాజ్ ఎంత చెబుతున్నా ధాన్యలక్ష్మీ వినిపించుకోదు. అప్పూ నా చెల్లెలు, కళ్యాణ్ నా భర్తకు తమ్ముడు.. అలాంటిది మేం వాళ్లని కిడ్నాప్ చేస్తామా? అని కావ్య ప్రశ్నిస్తుంది. ఇదంతా మీరు పథకం ప్రకారమే చేశారు.. అందుకే ఆస్తి పేపర్లు చేతిలో పెట్టే టైంకి ఈ వీడియో పంపించేలా చేశారని అంటుంది ధాన్యం. దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాం దీనికి మాకు ఏ సంబంధం లేదని చెబుతాడు రాజ్. మీకు, ఈ కిడ్నాప్‌కు ఏ సంబంధం లేకపోతే.. ఆ వీడియోలు రౌడీలు మీ పేరు ఎందుకు చెబుతారు? ఈ వీడియో ఎవరో తీశారు? ఇంకెవరో కిడ్నాప్ చేశారు? అనుకుంటే? మాకు కానీ, కళ్యాణ్‌కి కానీ శత్రువులు లేరు. ఎవరికి ఇంతటి అవసరం లేదు.. పోనీ డబ్బు కోసమే కిడ్నాప్ చేశారనుకుంటే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయకుండా వీడియో ఎందుకు పంపిస్తారని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది.

ఆ మాటలతో అపర్ణ మండిపడుతుంది. నీ ఆవేశంతో, అవివేకంతో నా కొడుకు వ్యక్తిత్వాన్ని చంపాలని చూడొద్దు, ఇన్నాళ్లుగా చూస్తున్నావు.. నా కొడుకు, నా కోడలు ఎలాంటి వారో తెలిసి కూడా వాళ్ల మీద నిందలు వేస్తున్నావని సీరియస్ అవుతుంది. ఈ సాక్ష్యాలు చూసి కూడా ఇంకా ఎందుకు గొంతెత్తున్నావు.. ఆస్తి కోసం నీ కొడుకు ఎంతకు తెగించాడో చూడు, నన్ను భయపెట్టడానికి ఇంతలా దిగజారారు అని ధాన్యలక్ష్మీ నానామాటలు అంటుంది. దాంతో కావ్య సీరియస్ అవుతూ.. ధాన్యలక్ష్మీ గారు అని పిలుస్తుంది. ఈ పని ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ మీరు మా మీద నింద వేశారు కాబట్టి.. కళ్యాణ్ - అప్పూ ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని అంటుంది కావ్య. నా కోడలు కడుపుతో ఉంది.. మీరు మాత్రం ఇక్కడ హ్యాపీగా ఉండాలి, వాళ్లు మాత్రం అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాలా అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. కళ్యాణ్ - అప్పూలను తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు మేం కూడా ఈ ఇంట్లో ఉండమని చెప్పి కావ్య, పాపను తీసుకుని వెళ్లిపోతాడు రాజ్. చేయని తప్పుకు మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఎందుకు? అని అపర్ణ బాధపడుతుంది.

మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మీకు ఏం కావాలని కళ్యాణ్ - అప్పూలు రౌడీలను అడుగుతారు. నా వైఫ్ ప్రెగ్నెంట్ .. తనకు చాలా ప్రాబ్లమ్ అవుతుందని, తనని వదిలేయమని బతిమలాడతాడు కళ్యాణ్. మిమ్మల్ని ఒకరు కిడ్నాప్ చేయమంటేనే చేశాం.. మా సార్ చెప్పే వరకు మీరిద్దరూ ఇక్కడే ఉంటారని రౌడీలు చెబుతాడు. ఇంతలో రుద్రాణి ఫోన్ చేసి నేను చెప్పేవరకు వాళ్లను వదిలిపెట్టొద్దని రౌడీలకు వార్నింగ్ ఇస్తుంది. నేను మళ్లీ ఆ ఇంటిలో అడుగుపెట్టేందుకు మార్గం దొరికిందని అనుకుంటుంది రుద్రాణి.

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాజ్ - కావ్యలు .. రేవతి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెబుతారు. సొంత తమ్ముడిని, తోడబుట్టిన చెల్లెలిని ఆస్తి కోసం కిడ్నాప్ చేస్తారా అని రేవతి ప్రశ్నిస్తుంది. మీకు అలాంటి ఆలోచన వచ్చిందంటే ధాన్యలక్ష్మీ పిన్ని ఎలా నమ్మిందని అడుగుతుంది. అసలు కళ్యాణ్ - అప్పూలను కిడ్నాప్ చేసి మా మీదకి నెట్టాలని ప్లాన్ చేసిందెవరు? ఇవి తెలియాలని అనుకుంటుంది కావ్య. ఇంతలో రాజ్‌కి ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఇంతలో రాజ్ మేనల్లుడు వచ్చి.. ఈ బుజ్జిది నాకు ఏం అవుతుంది? అని అడుగుతాడు. ఇప్పుడైతే నీ మరదలు, పెద్దయ్యాక నీకు పెళ్లాం అవుతుందని చెబుతుంది కావ్య. నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా చేసుకుంటానని అంటాడు రాజ్. ఇప్పుడే ఆశ పడొద్దు.. ఆ భగవంతుడు ఏం రాసిపెట్టాడో ఏంటో అంటుంది రేవతి.

కళ్యాణ్ - అప్పూలు ఎక్కడున్నారో వెతకడానికి నా వంతు ప్రయత్నం నేనూ చేస్తున్నాను అని రేఖ దగ్గర నటిస్తాడు రాహుల్. రాజ్ బావ, కావ్యలు వెతకడానికి వెళ్లారు కదా? అని రేఖ అంటుంది. కళ్లారా చూసిన విషయాన్ని చెప్పాలని ఉన్నా.. బయటకు చెప్పలేనని అంటాడు రాహుల్. రాజ్ - కావ్యలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు? ఏం చెప్పి వెళ్లారు? అని ప్రశ్నిస్తాడు రాహుల్. రాజ్ - కావ్యలు కళ్యాణ్ - అప్పూలను వెతకడం లేదు.. వెళ్లి రాజ్ వాళ్ల అక్క రేవతి ఇంట్లో కూర్చొన్నారని రాహుల్ చెప్పగా.. ఇదంతా వింటున్న ధాన్యం షాక్ అవుతుంది. ముందు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు? కళ్యాణ్- అప్పూలను కిడ్నాప్ చేసింది వాళ్లే కాబట్టి ఇక వెతకాల్సిన అవసరం ఏంటని అంటాడు. ఈ మాటలతో ధాన్యలక్ష్మీ కోపంతో ఊగిపోతూ బయటికొచ్చి అపర్ణని నానామాటలు అంటుంది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. కాస్త ఓపిక ఉంటే అన్ని నిజాలు తెలుస్తాయని చెబుతుంది అపర్ణ. నీ కొడుకు - కోడలు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని చెబుతుంది ధాన్యలక్ష్మీ. వాళ్లిద్దరూ నీ కూతురు రేవతి ఇంట్లో వెళ్లి కూర్చొన్నారని చెప్పడంతో అపర్ణ - సుభాష్ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X