Brahmamudi February 17th Episode: కావ్యతో రుద్రాణి మైండ్‌గేమ్... దొరకని అప్పూ- కళ్యాణ్‌ల ఆచూకీ

Photo Courtesy: JioHotstar

ఈ ట్రస్ట్ ఆగిపోకూడదు, తాతగారి కల నెరవేరాలని బతిమలాడుతుంది కావ్య. ఇందుకోసం కళ్యాణ్‌కు అన్యాయం చేయాలని అనుకోవడం లేదని చెబుతుంది. మీరిద్దరూ నాటకాలు వేయడం బాగా నేర్చుకున్నారు. నా చేతిలో ఆస్తి పేపర్లు పెట్టి.. అక్కడ నా కొడుకు, కోడల్ని కిడ్నాప్ చేశారని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. రుద్రాణి మనుషులు పంపిన వీడియోలో అప్పూ- కళ్యాణ్‌లు కట్టేసి ఉంటారు. రాజ్ సార్ వీళ్లని కిడ్నాప్ చేయమన్నారని రౌడీలు మాట్లాడటం అందులో వినిపిస్తుంది. మా మీద పడిన నిందని మేమే చెరిపేస్తాం.. అప్పూ - కళ్యాణ్‌ల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు మేం కూడా ఇంట్లో అడుగుపెట్టమని చెబుతారు రాజ్ - కావ్య.

రేవతి ఇంటికి వెళ్లి జరిగినదంతా చెబుతారు రాజ్ - కావ్య. అప్పూ - కళ్యాణ్‌లను జాగ్రత్తగా చూసుకోవాలని ఏమాత్రం తప్పించుకోకూడదని రౌడీలకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టేలా రాజ్- కావ్యలు ఆ రేవతి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్న ధాన్యం.. ఇంటిలో పెద్ద గొడవ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ 958లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 17th 2026 Episode 958 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నా కొడుకు, కోడలిని వెతుకుతానని వెళ్లిన రాజ్- కావ్యలు మీ కూతురి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. పిల్లల మనసుల్ని తెలుసుకుని మాట్లాడమను అంటున్నాను, నీ భార్యది అవివేకం కాబట్టే.. ఇంటికి మూలస్తంభాలైన కావ్య - రాజ్‌లపై నిందలు వేస్తోందని సుభాష్ సీరియస్ అవుతాడు. మరోవైపు.. తన ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా అమలు కావడంతో రుద్రాణి, రేఖ, రాహుల్‌లు పార్టీ చేసుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలని తల్లిని పొగుడుతాడు రాహుల్.

అప్పూ- కళ్యాణ్‌ల కిడ్నాప్‌తో ఒకపక్క ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన ఆగిపోయింది.. మరోపక్క రాజ్- కావ్యల మీద ఈ కిడ్నాప్ నింద పడిందని అంటుంది రేఖ. ఇప్పుడు రాజ్ - కావ్యలు కళ్యాణ్ - అప్పూల్ని వెతికి తీసుకురాలేరని అంటాడు రాహుల్. మనం అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. ఇకపై జరుగుతూనే ఉంటుంది, మీరు చేయాల్సింది చాలా ఉందని అంటుంది రుద్రాణి. నేను ఆ మినిస్టర్ ద్వారా తిరిగి ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాను.. ఈ లోపు ఆ ఇంటి మనుషుల్ని మీ మాటలు, చేతలతో దీనావస్థలోకి నెట్టాలని చెబుతుంది రుద్రాణి.

పాపకు జ్వరం తగ్గకపోవడంతో స్వప్న కంగారు పడుతుంది. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పగా.. హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెబుతుంది డాక్టర్. దాంతో ఈ విషయాన్ని రాహుల్‌కు చెప్పి త్వరగా ఇంటికి రమ్మని అడుగుతుంది స్వప్న. నాకు ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉందని, రేపు మార్నింగ్ కల్లా ఫైల్ సబ్మిట్ చేయాలని మాయమాటలు చెబుతాడు రాహుల్. నువ్వు ఇంట్లో ఎవరినైనా తోడు తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లు.. నేను వర్క్ అయిపోగానే డైరెక్ట్‌గా ఆసుపత్రికి వచ్చేస్తానని అంటాడు రాహుల్. దానిని అంతగా బతిమలాడుతున్నావ్ ఏంటని రాహుల్‌పై మండిపడుతుంది రుద్రాణి. మంచివాడుగా నటించడం మహాకష్టం అంటాడు రాహుల్. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవ్వరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని చెబుతుంది రుద్రాణి.

అప్పూ- కళ్యాణ్‌లను కిడ్నాప్ చేసి వీడియోను షేర్ చేసిన నెంబర్‌ను పంపమని పోలీసులు రాజ్‌ని అడుగుతారు. పాపని హాస్పిటల్‌కి ఎవరిని తోడుగా తీసుకెళ్లాలని బాధపడుతూ వెంటనే కావ్యకి ఫోన్ చేసి జరిగింది చెబుతుంది స్వప్న. దాంతో రాజ్- కావ్యలు ఆసుపత్రికి బయల్దేరతారు. స్వప్నకి సుభాష్ ఎదురై .. ఏం జరిగిందని అడగ్గా జ్వరంగా ఉందని చెప్పగా.. ఆ టైంలో ఒక్కదానివే వెళ్తావా? రాహుల్ లేడా అని అడుగుతాడు సుభాష్. దాంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్తారు. ఇంతలో రాజ్- కావ్యలు అక్కడికి వస్తారు. పాపకి ఏమవుతుందోనని టెన్షన్‌గా ఉందని స్వప్న బాధపడుతుండగా అక్కని ఓదారుస్తుంది కావ్య. నువ్వు రాజ్ ఇంట్లో ఉండుంటే నేనింత కంగారు పడేదానిని కాదు.. కానీ కాసేపు పాపని అలా చూసి నా గుండె ఆగినంత పని అయ్యిందని చెబుతుంది స్వప్న.

చిన్నత్తయ్య తన అనుమానంలో తనుంది.. కళ్యాణ్ అప్పూల విషయంలో భయపడుతోంది, అప్పూ కళ్యాణ్‌లను వెతికి తీసుకురాకపోతే ఆమెను ఆపలేమని చెబుతుంది కావ్య. ఆ ధాన్యలక్ష్మీ అమాయకురాలో, మూర్ఖురాలో అర్ధం కావడం లేద.. అప్పూ- కళ్యాణ్‌లను మీరే కిడ్నాప్ చేశారని నింద వేసిందని మండిపడుతుంది స్వప్న. అందరికీ అన్నీ అర్ధమవుతాయని చెబుతుంది కావ్య. మీరు రేవతి ఇంటికి వెళ్లకుండా ఉండాల్సిందని కొడుకు మీద రాజ్ కోప్పడతాడు. మీరు అక్కడ సంతోషంగా ఉన్నారట, అప్పూ- కళ్యాణ్‌ల కోసం ఏ ప్రయత్నం చేయడం లేదని ఏదేదో మాట్లాడుతోందని మండిపడతాడు సుభాష్. కొడుకు కనిపించలేదన్న బాధలో పిన్ని అలా మాట్లాడుతోంది, ఎంత కష్టమైనా కళ్యాణ్ - అప్పూలను వెతికి తీసుకొస్తామని చెబుతాడు రాజ్. డిపార్ట్‌మెంట్ మొత్తం ప్రయత్నిస్తోంది.. మేం కూడా వెతుకుతున్నామని అంటాడు.

ఇంతలో డాక్టర్ వచ్చి పాపకి ఏం కాలేదని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. స్వప్న నిద్రపోతుండగా ఆమెను లేపి కాఫీ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత డాక్టర్ వచ్చి పాపని చెక్ చేసి ఇంటికి తీసుకెళ్లమని చెబుతుంది. మీరు సమయానికి రాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని అంటుంది స్వప్న. మరోవైపు.. అప్పూ- కావ్యలను దాచి ఉంచిన లోకేషన్‌ని పోలీసులు ట్రేస్ చేసి రాజ్‌కి చెబుతారు. ఈ విషయాన్ని చెప్పడంతో సుభాష్, స్వప్నలు సంతోషిస్తారు. అడ్రెస్ వెతుక్కుంటూ రాజ్ - కావ్యలు వెళ్తారు. ఇంతలో ఎస్ఐ వచ్చి మొత్తం వెతుకుదామని చెబుతాడు. కావ్య- రాజ్‌లు ఓ ఇంట్లోకి వెళ్లి చూస్తారు. అక్కడ ఎవరూ ఉండరు. ఆ వెంటనే కావ్యకు కిడ్నాపర్ల ఫోన్ దొరుకుతుంది. కళ్యాణ్ - అప్పూలను వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేశారని ఎస్ఐకి డౌట్ వస్తుంది. వాళ్లు ఇంత పకడ్బందీగా ఉన్నారంటే వాళ్లను ఎలా పట్టుకోవాలని రాజ్ - కావ్య టెన్షన్ పడతారు. కావ్యకు ఆ ఇంటి మీద అనుమానం వచ్చి ఇళ్లంతా మళ్లీ తిరిగిచూస్తుంది. కిడ్నాపర్లు పంపిన వీడియోను మరోసారి చెక్ చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X