Brahmamudi February 18th Episode: అప్పూ- కళ్యాణ్‌లను కాపాడిన రాజ్-కావ్య... ఇరుక్కుపోయిన రుద్రాణి
Photo Courtesy: JioHotstar
రాజ్ - కావ్యలపై లేనిపోని అభాండాలు వేయడంతో ధాన్యలక్ష్మీపై అపర్ణ, సుభాష్‌లు సీరియస్ అవుతారు. రేవతి ఇంటి దగ్గర జరిగినదంతా చెప్పడంతో అప్పూ - కళ్యాణ్‌ల ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతుందని అంటుంది. తమ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ కావడంతో రాహుల్, రేఖలతో కలిసి రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. ఆస్తి పంపకాలని, ట్రస్ట్ ఏర్పాటును అడ్డుకున్నప్పటికీ త్వరలో ఆ మంత్రిని అడ్డం పెట్టుకుని దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టబోతున్నట్లు చెబుతుంది రుద్రాణి. ఇంతలో పాపకి బాగా జ్వరం రావడంతో రాహుల్‌కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది స్వప్న. ఆఫీసులో బాగా బిజీగా ఉన్నానని.. రావడానికి లేట్ అవుతుందని చెబుతాడు రాహుల్.
దాంతో ఏం చేయాలో తెలియక కావ్యకి ఫోన్ చేయడంతో స్వప్న కోసం పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్తారు రాజ్- కావ్య. స్వప్నని తీసుకుని సుభాష్ హాస్పిటల్‌కు వచ్చి కావ్య, రాజ్‌లకు ధైర్యం చెబుతాడు. పాప కోలుకోవడంతో కావ్య- రాజ్‌లకు థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌ల ఆచూకీ తెలిసినట్లు ఎస్ఐ లోకేషన్ పెట్టడంతో అక్కడికి వెళ్లిచూసిన రాజ్ - కావ్యలకు ఎవరూ కనిపించరు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 18వ తేదీ ఎపిసోడ్ 959లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కళ్యాణ్ - అప్పూలని కిడ్నాప్ చేసిన ఇంటికి రాజ్ - కావ్యలు వచ్చి మొత్తం పరిశీలిస్తారు. ధాన్యలక్ష్మీ పంపించిన వీడియోను క్షుణ్ణంగా చూసిన కావ్యకు అనుమానం వస్తుంది. అప్పూ- కళ్యాణ్‌లను వాళ్లు ఇక్కడికి తీసుకురాలేదు.. కావాలనే మనల్ని తప్పుదోవ పట్టించారని గుర్తిస్తుంది కావ్య. ఆ వీడియోలో ఉన్న కిటికీ, ఇంట్లో ఉన్న కిటికీ సంబంధం లేదని గుర్తిస్తుంది. ఆ వీడియోలో ఓ ఫోన్ నెంబర్ కనిపించడంతో దానికి ఫోన్ చేస్తారు. అది ఒక యాడ్ కంపెనీ కావడంతో మేం యాడ్ చేయించుకోవాలని అనుకుంటున్నామని.. మీ అడ్రస్‌లు పెట్టమని చెబుతారు. దాంతో ఆ కంపెనీ ఓనర్ అన్ని అడ్రెస్‌లు పెడతాడు. దాంతో అప్పూ - కళ్యాణ్‌లను వెతకడానికి వెళ్తారు.
మరోవైపు.. కిడ్నాపర్ల చెరలో ఉన్న అప్పూకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో కళ్యాణ్ కంగారుపడతాడు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నా వైఫ్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెబుతాడు కళ్యాణ్. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను.. మా సార్ ఆర్డర్ అని చెబుతారు రౌడీలు. మా అన్నయ్య అలాంటి వాడు కాదని కళ్యాణ్ మండిపడతాడు. నొప్పులు తట్టుకోలేక అప్పూ ఏడుస్తుంది. ఇంతలో రాజ్- కావ్యలు కళ్యాణ్ - అప్పూలను వెతుక్కుంటూ వచ్చి చూస్తారు.
అప్పూకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని, ఇప్పుడెలా అని కావ్య కంగారుపడుతుంది. దాంతో వాళ్లిద్దరూ మరో డోర్ ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అన్ని వైపులా రౌడీలు ఉండటంతో ఎలాగోలా వాళ్ల కళ్లుగప్పి అప్పూ - కళ్యాణ్‌ల దగ్గరికి చేరుకుని కట్లు విప్పేస్తారు. ఇంతలో రౌడీలు వచ్చి వీరిని అడ్డుకుంటారు. కళ్యాణ్ - అప్పూలను విడిపిస్తుండగా రౌడీలు రాజ్‌ని పట్టుకుంటారు. అయినప్పటికీ అప్పూని తీసుకుని వెళ్లిపోమని చెబుతాడు రాజ్. దాంతో కావ్య అందరినీ కర్రతో చితక్కొడుతుంది. దాంతో రాజ్ - కావ్యలను రౌడీలు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టడంతో రాజ్ స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి కళ్యాణ్ - అప్పూలు తప్పించుకున్నారని చెబుతారు రౌడీలు.
ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం కానీ వాళ్లు పారిపోయారని చెబుతారు. ఒక్కొక్కడు ఎద్దుల్లా ఉన్నారు.. ఇద్దరినీ కాపలా కాయలేకపోయారా అని రుద్రాణి మండిపడుతుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు.. వాళ్లు తప్పించుకోకూడదు. వాళ్లు కనుక ఎస్కేప్ అయితే నేను దొరికిపోతాను, కాబట్టి వాళ్లని ఎలాగైనా చంపేయమని చెబుతుంది రుద్రాణి. తప్పించుకుని వెళ్లిపోతున్న అప్పూ- కళ్యాణ్‌లను రౌడీలు పట్టుకుని రౌండప్ చేస్తారు.
అప్పూని పట్టుకుని చంపబోతుండగా.. వదిలేయమని బతిమలాడతాడు కళ్యాణ్. కత్తితో అప్పూని పొడవబోతుండగా రాజ్ వచ్చి అడ్డుకుని వాళ్లతో ఫైట్ చేస్తాడు. ఇంతలో కావ్య కారు తీసుకుని వచ్చి అప్పూ- కళ్యాణ్‌లను తీసుకెళ్తుంది. రాజ్ మాత్రం రౌడీలతో ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు. అప్పూని ఆసుపత్రిలో చేర్చడంతో డాక్టర్లు ఆపరేషన్ మొదలుపెడతారు. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్‌కు వస్తుంది. అప్పూకి ఎలా ఉందని ధాన్యలక్ష్మీ అడగ్గా.. నొప్పులు బాగా ఎక్కువయ్యాయని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ కంగారుపడతారు.
డాక్టర్ ఏమన్నదని ఇందిర అడగ్గా.. ఇంకా ఏం చెప్పలేదని అంటాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మీ టెన్షన్ పడుతుండగా.. అప్పూకి ఏం కాదని ధైర్యం చెబుతాడు రాజ్. ఆ మాటలతో ధాన్యం సీరియస్ అవుతూ.. నువ్వు మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు సర్ది చెబుతున్నావా? ఎందుకు ఇదంతా? మీకు వాళ్లు ఏం ద్రోహం చేశారని ఈ కక్ష. మీరే నా కొడుకు కోడల్ని కిడ్నాప్ చేస్తారు.. మళ్లీ మీరే గొప్పవాళ్లలా హాస్పిటల్‌లో చేరుస్తారు. మీ నాటకాలు మాకు తెలియవా? అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అన్నయ్య వదిన మమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటని కళ్యాణ్ సీరియస్ అవుతాడు.
ఆస్తిలో నీ వాటా నీకు పంచివ్వాల్సి వస్తుందని.. మీ ఇద్దరినీ కిడ్నాప్ చేయించాడని అంటుంది ధాన్యం. ఆ మాటలతో కళ్యాణ్ తల్లిని ఛీ కొడతాడు. నువ్వు ఎవరిని తప్పుబడుతున్నావో? ఎవరి మీద నిందలు వేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా? అన్నయ్య, వదినలని మాట అనేముందు కాస్త వెనుక ముందు ఆలోచించమని మాట్లాడమని సీరియస్ అవుతాడు. మమ్మల్ని కిడ్నాప్ చేశారు.. కానీ అన్నయ్య, వదినలు కిడ్నాప్ ఎందుకు చేస్తారు. ఎవరో కావాలని చేశారు.. మాకు ఏమి అర్ధం కాలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, డబ్బు వద్దంటారు.. కారణం చెప్పమంటే చెప్పరు. తప్పించుకునే వీలు లేదు.. అప్పూకి నొప్పులు మొదలయ్యాయి, అలాంటి టైంలో అన్నయ్య, వదిన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారని చెబుతాడు కళ్యాణ్. సమయానికి అన్నయ్య, వదిన రాకపోయుంటే అప్పూ, నేను ఏమైపోయేవాళ్లమో. అన్నయ్య వదిన ఎలాంటి వాళ్లో తెలిసికూడా వాళ్ల మీద నిందలు వేస్తున్నావని మండిపడతాడు కళ్యాణ్.
కిడ్నాప్ అయినట్లు వీడియో పంపారు.. అందులో రాజ్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పారని అంటుంది ధాన్యలక్ష్మీ. అన్నయ్యే మమ్మల్ని కిడ్నాప్ చేయించాడని రౌడీలు మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. అది ఎవరో చేసిన కుట్ర అని నీకు అర్ధం కాలేదా? ఎవరో మన ఫ్యామిలీని తప్పుదోవ పట్టిస్తే .. అన్నయ్య, వదినల్ని అనుమానించావని ధాన్యంపై మండిపడతాడు కళ్యాణ్. ఇప్పటికీ నా కొడుకు, కోడలు నీకంటికి నేరస్తుల్లాగే కనిపిస్తున్నారా? అని అపర్ణ ప్రశ్నిస్తుంది. అభం శుభం తెలియని వాళ్ల మీద ఎన్ని నిందలు వేశావు.. మాట జారేముందు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదని సుభాష్ మండిపడతాడు. నింద నిజం కాదని నిరూపించడానికి వాళ్లిద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారని అంటుంది అపర్ణ. మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి ఏం చేస్తున్నానో? ఎవరిని తప్పుబడుతున్నానో అర్ధం కాలేదని అంటుంది ధాన్యలక్ష్మీ. మనవాళ్లెవరో? పరాయి వాళ్లెవరో? మన కోసం పాటుపడేవాళ్లెవరో? తెలుసుకుని ప్రవర్తించాలని అంటుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











