Brahmamudi February 19th Episode: రాజ్- కావ్యలకు ధాన్యం క్షమాపణలు.. అప్పూ హత్యకు రుద్రాణి కుట్ర

Photo Courtesy: JioHotstar

అప్పూ - కళ్యాణ్‌ల ఆచూకీని వెతుకుతూ ఓ ఇంట్లో వచ్చిన కావ్య - రాజ్‌లకు వీడియోలో చూసిన ఇల్లు ఇది కాదని అనుమానం వస్తుంది. ఆ వీడియోను పరీక్షగా చూడగా అందులో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెడతారు. అప్పూకి నెలలు నిండటంతో నొప్పులు మొదలవుతాయి.. భార్య పరిస్ధితి చూసిన కళ్యాణ్ తమను వదిలేయాల్సిందిగా రౌడీలను వేడుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్- కావ్యలు.. రౌడీల కన్నుగప్పి అప్పూ- కళ్యాణ్‌లను విడిపిస్తుండగా రౌడీలు వచ్చి రాజ్‌ను చితకబాదుతారు. దాంతో రాజ్ స్పృహతప్పి పడిపోతాడు.

అప్పూ- కళ్యాణ్‌లు తప్పించుకున్నారని రుద్రాణికి రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. వాళ్లిద్దరూ తప్పించుకుంటే నేను దొరికిపోతాను, వాళ్లను చంపేయమని చెబుతుంది. అప్పూని రౌడీలు చంపబోతుండగా రాజ్ వచ్చి అడ్డుకుని అందరినీ చితకబాదుతాడు. అనంతరం అప్పూని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం అక్కడికి వస్తుంది. మీరే కిడ్నాప్ చేయించి.. మీరే కాపాడినట్లు నటిస్తున్నారని రాజ్- కావ్యలను ధాన్యం నానామాటలు అనడంతో కళ్యాణ్ మండిపడతాడు. అన్నయ్య, వదిన సమయానికి రాకపోయుంటే ఈరోజు అప్పూ దక్కేది కాదని చెబుతాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 19వ తేదీ ఎపిసోడ్ 960లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 19th 2026 Episode 960 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

చిన్నత్తయ్యని ఎవరూ ఏమీ అనొద్దు.. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు. అప్పూ - కళ్యాణ్‌లు కనిపించకపోయేసరికి అలా ప్రవర్తించిందే కానీ, మరొకటి కాదని అంటుంది కావ్య. ఆ వీడియో చూడగానే నాకే ఏమీ తోచలేదు.. అలాంటిది పిన్ని ఎలా తట్టుకుంటుంది? తల్లి మనసు కదా? ఆ మాత్రం కంగారు ఉంటుంది.. అందుకే కళ్యాణ్ - అప్పూలని ఎలాగైనా తీసుకురావాలని మేమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతాడు రాజ్. దాంతో రాజ్‌కి క్షమాపణలు చెబుతుంది ధాన్యలక్ష్మీ. మీరేంటో తెలిసికూడా నిన్ను, కావ్యని అనరాని మాటలు అన్నాను అని బాధపడుతుంది. అప్పూ కాసేపట్లో పురుడు పోసుకుంటోంది. నీకు కాసేపట్లో మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు.. ఇలాంటి సమయంలో సంతోషంగా ఉండాలని చెబుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి అప్పూకి ఆడపిల్ల పుట్టిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.

కళ్యాణ్‌కి రాజ్ క్షమాపణలు చెబుతాడు. నేను ట్రస్ట్ గురించి మన ఫ్యామిలీ ముందు చెప్పకుండా ఉండాల్సింది.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. కారణం ఏదైనా ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేసేవరకు వచ్చారంటే ఆలోచించాల్సిన విషయమే అంటాడు రాజ్. సరైన సమయానికి మేం అక్కడికి వెళ్లాం కాబట్టి అప్పూ - కళ్యాణ్‌లను ఇలా చూడగలుగుతున్నామని చెబుతుంది కావ్య. మిమ్మల్ని కిడ్నాప్ చేసినవాళ్లని మీరు చూశారు కదా? వాళ్ల మాటల్లో దీని వెనుక ఎవరున్నారో మీరు గమనించారా? అని రాజ్ అడుగుతాడు. రౌడీలు చాలాసార్లు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు.. అవతలి వాళ్ల మీద అనుమానం రాకుండా నీ పేరు వాడారు. కానీ దీని వెనుక ఎవరో శత్రువులు ఉన్నారని అనిపిస్తోందని అంటాడు కళ్యాణ్.

అప్పూ - కళ్యాణ్, బిడ్డలకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. పుట్టిన బిడ్డ ముందు కవితలు చదువుతున్న కళ్యాణ్‌పై మండిపడుతుంది అప్పూ. చిన్నప్పటి నుంచే బిడ్డకు కవితా జ్ఞానం ఉండాలని చెబుతాడు. పాప నాలాగా పోలీస్ అవుతుంది.. డేరింగ్‌గా ఉండాలని అంటుంది అప్పూ. నీలాగా పోలీస్.. నాలా రైటర్ అయ్యేలా చేద్దామని అంటాడు కళ్యాణ్. మనవరాళ్లతో ధాన్యలక్ష్మీ, అపర్ణ ఆడుకుంటూ ఉండటంతో సుభాష్, ప్రకాశంలు చూసి సంతోషిస్తారు. ఆ తర్వాత అప్పూ, కావ్యలు వచ్చి పిల్లల్ని పడుకోబెడదామని చెబుతారు. కాసేపు మా మవనరాళ్లతో ఆడుకుని పడుకోబెడతామని అంటారు అపర్ణ, ధాన్యలక్ష్మీ. పిల్లల రాకతో దుగ్గిరాల ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

ఇద్దరికీ బిడ్డలు పుట్టారు.. మీకు తేరగా దొరికానని, నా మీద పోయిస్తున్నారని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నీ పాపకి మూడో నెల వస్తోంది, చిన్నది కూడా పుట్టి 20 రోజులు కావొస్తోంది. బారసాల గురించి ఆలోచించారా? అని ఇందిర అడుగుతుంది. ఇద్దరికీ ఒకేసారి బారసాల చేయాలని అన్నావు.. నువ్వేమీ మాట్లాడవేంటీ అని అప్పూని ప్రశ్నిస్తుంది. మీరు రెడీ అంటే నేను రెడీ అంటాడు కళ్యాణ్. వెంటనే పంతులుగారిని పిలిపించి బారసాలకు ముహూర్తం పెట్టిద్దామని అంటారు అపర్ణ, ధాన్యలక్ష్మీ. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర రావడంతో అంతా షాక్ అవుతారు. నా పాపకు రేపు బారసాల, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చానని చెబుతాడు ధర్మేంద్ర.

అన్ని సమస్యలు తీరిపోయాక.. నా పాపకు నేను చేస్తున్న తొలి పండుగ ఇది. నా భార్య మీరు తప్పకుండా వచ్చి పాపని ఆశీర్వదించాలని పట్టుబడుతోంది. కావ్యగారు మీరే కావు.. మీ కుటుంబమంతా నా ఆప్తులే, అందుకే మీరందరూ తప్పకుండా రావాలని ఆహ్వానిస్తాడు ధర్మేంద్ర. మినిస్టర్ గారింట్లో బారసాలకు మనందరం వెళ్దామని చెబుతాడు రాజ్. కానీ మేం ఎక్కడికీ రామని చెబుతుంది ఇందిర. తెలిసి చేసినా తెలియక చేసినా నా కోడలి కష్టానికి కన్నీటికీ కారణం అయినవాడు కదా? ఎలా వెళ్తామని అడుగుతుంది అపర్ణ. అతని మీద కోపం లేదు, అలాంటి వాళ్లకి కొంచెం దూరంగా ఉంటేనే మంచిదని చెబుతుంది ఇందిర.

మరోవైపు.. అన్ని ప్లాన్స్ ఫెయిల్ కావడంతో రుద్రాణిపై రాహుల్, రేఖలు మండిపడతారు. కావ్యకి కూతురిని దూరం చేసి దానిని పిచ్చిదానిని చేసి రాజ్‌ని నా సొంతం చేస్తానని చెప్పావు ఫెయిల్ అయ్యావు. ఆఖరికి కళ్యాణ్ - అప్పూలని చంపి అది రాజ్ - కావ్యల మీద వేస్తానని చెప్పి ఫెయిల్ అయ్యావు. అక్కడ వాళ్ల వంశానికి ఇద్దరు మహాలక్ష్ములు పుట్టారని బారసాల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతుంది రేఖ. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. కానీ మళ్లీ ట్రస్ట్ పెడతాం, ఆస్తిలో సగం వాటా ట్రస్ట్‌కు ఇచ్చేస్తామని అంటేనే మనకు ప్రాబ్లమ్ అంటాడు రాహుల్. అక్కడి వరకు నేనేందుకు రానిస్తాను, త్వరలోనే తిరిగి ఆ ఇంట్లో అడుగుపెట్టబోతున్నాను.. వాళ్ల ఆశల్ని, ఆశయాల్ని నాశనం చేస్తానని చెబుతుంది రుద్రాణి. వాళ్లు నువ్వంటేనే కోపంగా ఉన్నారు.. నిన్ను క్షమించరని చెబుతాడు రాహుల్.

రెండు కన్నీటి బొట్లు రాల్చేసరికి మినిస్టరే కరిగిపోయాడు.. వాళ్లు కరగారా? శత్రువుని కూడా దుగ్గిరాల ఫ్యామిలీ క్షమిస్తుంది. ఆ మినిస్టర్ అందరినీ బారసాలకి పిలిచాడు కదా? నేను కూడా అక్కడికి వస్తానని చెబుతుంది. నిన్ను చూడగానే అమ్మమ్మ నిన్ను చంపాలన్నంత కోపంగా ఉందని అంటాడు రాహుల్. వాళ్లతో పాటు మీరు కూడా నన్ను అసహ్యించుకోండి. ఆ తర్వాత మిగతాది నేను చూసుకుంటానని చెబుతుంది రుద్రాణి. కానీ అప్పూతోనే నీకు ప్రాబ్లమ్ వస్తుందని చెబుతుంది రేఖ. హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలు.. ఇంకా అప్పూ కస్టడీలోనే ఉన్నారు. వాళ్లు కనుక నోరు తెరిస్తే దీని వెనుక ఉన్నది నువ్వేనని అందరికీ తెలిసిపోతుందని చెబుతుంది రేఖ. మళ్లీ ఎప్పుడైనా అప్పూ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుందని హెచ్చరిస్తుంది. పొరపాటున అప్పూ నిజం తెలుసుకుంటే అదే దానికి ఆఖరికి క్షణం అయ్యేలా చేస్తానని అనుకుంటుంది రుద్రాణి.

ఉదయాన్నే వంట చేస్తున్న కావ్య దగ్గరికి ఇందిర, అపర్ణ వచ్చి పాప గురించి అడుగుతారు. మీ మనవడు పాపని రెడీ చేస్తున్నాడని చెబుతుంది కావ్య. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి చూడగా పాపని రెడీ చేస్తూ ఉంటాడు రాజ్. అది చూసి ఇందిర, అపర్ణ షాక్ అవుతారు. ఈ ఆనందం, సంతోషం నీ వల్లే. మీరు తీసుకున్న నిర్ణయానికి ధాన్యలక్ష్మీ ఒప్పుకుంది.. మీ తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారని కావ్యని మెచ్చుకుంటారు ఇందిర, అపర్ణ. పాపని రెడీ చేస్తున్న అప్పూకి పోలీసులు ఫోన్ చేస్తారు. మనం హాస్పిటల్‌లో అటాక్ చేసిన వాళ్లని పట్టుకుని చాలా రోజులైంది, వీళ్లని ఏం చేద్దామని అడుగుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X