Brahmamudi February 20th Episode: దుగ్గిరాల ఫ్యామిలీపై రుద్రాణి పగ.. యాక్సిడెంట్‌లో అప్పూ- కళ్యాణ్ దుర్మరణం?

Photo Courtesy: JioHotstar

చేయని తప్పుకి మీ మీద నిందలు వేశానని రాజ్- కావ్యలకు ధాన్యలక్ష్మీ క్షమాపణలు చెబుతుంది. ఇంతలో అప్పూకి డెలివరీ జరిగి పండంటి ఆడపిల్ల పుట్టినట్లు డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. మన కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారని.. ఏమాత్రం ఆలస్యమైనా అప్పూ ప్రమాదంలో పడేదని కావ్య అనడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇద్దరు పాపల రాకతో దుగ్గిరాల ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర వచ్చి జరిగినదానికీ అందరికీ క్షమాపణలు చెప్పి తన కూతురు బారసాల ఫంక్షన్‌కి రమ్మని ఆహ్వానిస్తాడు. రాజ్ - కావ్యలు సరేనని చెప్పగా దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం మండిపడుతుంది.

నువ్వు వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతోంది.. అక్కడ ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటోందని రాహుల్, రేఖలు రుద్రాణికి చెబుతారు. నేను త్వరలోనే దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టబోతున్నానని, ఇందుకు మినిస్టర్‌ను వాడుకోబోతున్నట్లు చెబుతుంది రుద్రాణి. కానీ అప్పూకి తనను కిడ్నాప్ చేయించినవాళ్లు, పాప మీద అటాక్ చేయించినవాళ్లు ఎవరో కనుక్కునే పనిలో ఉందని రేఖ చెప్పడంతో దాని సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది రుద్రాణి. పాప మీద అటాక్ చేయించినవాళ్లని ఏం చేయమంటారు అని పోలీసులు ఫోన్ చేయడంతో అప్పూ ఆలోచనలో పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 20వ తేదీ ఎపిసోడ్ 961లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 20th 2026 Episode 961 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కళ్యాణ్ - అప్పూలు ఫంక్షన్ కోసం రెడీ అవుతుండగా.. అప్పూకి పోలీసులు ఫోన్ చేస్తారు. పాప మీద అటాక్ చేసినవారిలో కొందరినీ పట్టుకుని సీక్రెట్‌గా ఉంచామని వాళ్లని ఏం చేద్దామని అడుగుతారు. ఇంకా లేట్ చేస్తే ఈ విషయం సీఐ గారికి తెలిసిపోతుందని చెబుతాడు. నేను పర్సనల్‌ పనుల్లో పడి దాని సంగతి మరిచిపోయాను వాళ్లు ఏమైనా నోరు విప్పారా? అని అడుగుతుంది అప్పూ. అందులో ఒక వ్యక్తి నోరుజారి వాళ్లకు డబ్బులిచ్చింది ఒక లేడీ అని చెప్పేశాడు. కానీ ఆమె పేరు అడిగితే మాత్రం చెప్పడం లేదని అంటాడు. దాంతో నేను బయల్దేరుతున్నానని చెబుతుంది అప్పూ. ఈ మాటలన్నీ విన్న కళ్యాణ్.. నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ, ముందు మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లి తర్వాత అక్కడికి వెళ్దామని చెబుతాడు కళ్యాణ్. మొన్న కిడ్నాప్ జరిగిన దగ్గరి నుంచి మనల్ని బయటకు పంపించడానికి అమ్మ కంగారు పడుతోందని అంటాడు. అప్పూ బతిమలాడటంతో కళ్యాణ్ సరేనని అంటాడు.

కావ్య బిడ్డతో ఆడుకుంటున్న ఇందిర .. పాపకి ఏం పేరు పెట్టాలని అనుకున్నారని అడుగుతుంది. అదేదో నువ్వే చెప్పమని అంటాడు రాజ్. ఏ పేరు పెట్టినా సాంప్రదాయంగా ఉండాలని అంటుంది ఇందిర. నాకు తెలిసి చక్కగా సాంప్రదాయంగా ఉండే పేరంటే ఇందిరా దేవి అంటాడు రాజ్. నా పేరు ఈ బిడ్డకు వద్దు.. ఇది పెద్దది అయ్యాక, ముసలిదాని పేరు పెట్టారని మిమ్మల్ని నన్ను తిట్టుకుంటుందని అంటుంది ఇందిర. ఇందిరా దేవిని షార్ట్ కట్ చేస్తే ఇందు అవుతుందని చెబుతాడు రాజ్. వాళ్లు ఇష్టంగా నీ పేరు పెడతామని అంటుంటే నీకేమైందని ఇందిరని ఒపిస్తాడు సీతారామయ్య.

ఇంతలో కళ్యాణ్ - అప్పూలు రావడంతో మీరు కూడా ఫంక్షన్‌కి వస్తున్నారు కదా అని ప్రశ్నిస్తాడు రాజ్. మేం రావడం లేదు.. అప్పూ గుడికి వెళ్దామని అడిగింది. వద్దంటే ఆగిపోతామని అంటారు అప్పూ - కళ్యాణ్. దాంతో సరేనని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మినిస్టర్ ఇంటికి బయల్దేరారు.. అప్పూ- కళ్యాణ్‌లు ఇద్దరూ కలిసి గుడికి అని చెప్పి ఎక్కడికో వెళ్లారని రుద్రాణికి చెబుతుంది రేఖ. వాళ్లిద్దరూ పోలీసుల దగ్గరున్న నీ మనుషుల్ని కలిసి ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నారట అని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది

అప్పూ గురించి నీకు తెలుసు కదా? దీని బెదిరింపులకు ఏ ఒక్కడు నీ పేరు చెప్పినా ఇక అంతే అంటుంది రేఖ. వాళ్ల చావుకు ఇంకాస్త టైం ఉందనుకున్నా.. కానీ అప్పూ ఆలోచనలు నా చుట్టూనే తిరుగుతున్నాయి, చావడానికి తొందరపడుతోందని అంటుంది రుద్రాణి. ఫ్యామిలీ అంతా మినిస్టర్ ఇంటికి వస్తారు.. నేను కూడా వస్తాను. కానీ అప్పూ - కళ్యాణ్‌లు మాత్రం ఇంటికి తిరిగిరారు.. శాశ్వతంగా పైకి వెళ్తారు. పిల్లకాకులు కదా చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్లకి తెలియదని అంటుంది రుద్రాణి. కానీ ఈరోజు చూస్తారని చెబుతుంది రుద్రాణి.

రౌడీలు దాచిన ప్లేస్‌కి అప్పూ - కళ్యాణ్‌లు వస్తారు. అప్పూ తన స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తుంది అప్పూ. వీళ్లని ఇలా టార్చర్ చేశారేంటీ? పోలీసులంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అని ఎస్ఐ మీద సీరియస్ అవుతుంది అప్పూ. వాళ్లను ఎంత అడిగినా నిజం చెప్పలేదు.. అందుకే కొట్టామని అంటాడు ఎస్ఐ. ముందు వాళ్ల కట్లు విప్పి తాగడానికి వాటర్ ఇవ్వమని అప్పూ చెబుతుంది. దాంతో అప్పూ చెప్పినట్లుగానే రౌడీల కట్లు విప్పి, మంచినీళ్లు ఇస్తారు. మిమ్మల్ని టార్చర్ పెట్టడం, ఇరికించడం నా ఉద్దేశం కాదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి ఇచ్చింది మిమ్మల్ని రక్షించడానికి. ఆ మినిస్టర్ తనకు, మీకు ఏ సంబంధం లేదని చెప్పేశాడు. ఒక లేడీ ఫోన్ చేసి మీ డీల్ ఇప్పించిందని మీరే చెప్పారు.. ఆ లేడీ ఎవరో చెప్పకపోతే ఈ కేసు మీ మెడకు చుట్టుకుంటుందని బెదిరిస్తుంది అప్పూ.

కోర్టుకు తీసుకెళ్లి 14 ఏళ్లు జైలు శిక్ష వేస్తే అప్పుడు తెలుస్తుందని ఎస్ఐ అనడంతో రౌడీలు కంగారుపడతారు. ఎవరో తప్పు చేస్తే వీళ్లకు శిక్ష వేయడం ఏంటీ? వీళ్లు డబ్బుల కోసం వీళ్ల ఫ్యామిలీలను పోషించుకోవడం కోసం ఇలాంటి పనులు చేసుంటారు. 14 ఏళ్ల జైలు అంటే వీళ్ల ఫ్యామిలీలు ఏమైపోతాయని అంటుంది అప్పూ. వీళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్లు .. అవసరం తీరాక ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. వీళ్ల కడుపున పుట్టిన పాపానికి వీళ్ల పిల్లలు రోడ్డు మీద పడతారని చెబుతుంది అప్పూ. దాంతో ఓ రౌడీ ముందుకొచ్చి ఆ లేడీ ఎవరో నేను చూపిస్తానని ఫోన్‌లో ఉన్న రుద్రాణి ఫోటో చూపిస్తాడు. రుద్రాణి ఫోటోను చూడగానే అప్పూ - కళ్యాణ్‌లు షాక్ అవుతారు. నేను ముందు నుంచి చెప్పినట్లు మీ రుద్రాణి అత్తయ్యపైనే అనుమానం నిజమైంది, వెంటనే ఈ విషయం మనవాళ్లకు చెప్పాలని ఆవేశంగా వెళ్తుంది అప్పూ.

మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్‌కి భారీ ఏర్పాట్లు చేస్తాడు ధర్మేంద్ర. కావ్య - రాజ్‌లను చూడగానే తులసి - ధర్మేంద్ర ఎంతో సంతోషిస్తారు. తన పాపని ఎత్తుకుని ముద్దు చేస్తుండగా తులసి కంటతడి పెడుతుంది. మా వల్ల జరిగిన తప్పుని క్షమించడమే కాక మీ కుటుంబమంతా వస్తారని నేను అనుకోలేదని చెబుతుంది తులసి. తప్పు చేసిన వాళ్లను క్షమించడంలో మానవత్వం ఉందని రాజ్ అంటాడు. ఇలాంటి మనసు, మనస్తత్వం మీకే సొంతమని అంటాడు ధర్మేంద్ర. వాడు దుగ్గిరాల వారింటి వారసుడు.. మా కుటుంబానికి బతుకు నేర్పించేవాడు అయ్యాడు. మీరు మా ఇంటికొచ్చి మీ పాప బారసాల ఫంక్షన్‌కి పిలవగానే సుముఖంగా లేమని చెబుతుంది అపర్ణ. కానీ నా కొడుకు - కోడలు మాత్రం.. మినిస్టర్ గారు మీ దృష్టిలో చాలా పెద్ద తప్పు చేశారని అనుకుంటున్నారు.. కానీ తనతో తానే చాలా పెద్ద పోరాటం చేశారని చెప్పారని అంటుంది అపర్ణ. భార్య మీద ఇష్టంతోనే ఇదంతా చేశారని... మాకు నచ్చజెప్పి ఫంక్షన్‌కు వచ్చేలా చేశారని రాజ్ - కావ్యలపై దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశంసలు కురిపిస్తుంది.

పాపని నీ చేతులతో ఊయలలో వేయమని కావ్యతో చెబుతుంది తులసి. పాపని కన్నది నేనే అయినా తనకు ఆయుష్షును పోసింది నువ్వు.. ఈరోజు ఇంత ఆనందంగా మేం ఉండగలుగుతున్నామంటే నీ వల్లేనని చెబుతుంది తులసి. మినిస్టుర్ కూడా చెప్పడంతో కావ్య పాపని ఊయలలో వేస్తుంది. ఇంతలో అప్పూ- కావ్యలను యాక్సిడెంట్ చేసి చంపినట్లు రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి చెబుతారు. దాంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. దుగ్గిరాల వంశంలో ఇద్దరు జీవితాలు ముగిసిపోయాయి.. ఇక మిగిలిపోయింది మీరేనని రాజ్ - కావ్యల గురించి అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X