Brahmamudi February 21st Episode:రుద్రాణి పాపాలు బయటపెట్టిన అప్పూ.. చెప్పుతో కొట్టిన కావ్య, పగబట్టిన రుద్రాణి
Photo Courtesy: JioHotstar
అప్పూకి ఎస్ఐ ధనుంజయ్ ఫోన్ చేసి పాప మీద అటాక్ చేసిన రౌడీలను ఎక్కువ రోజులు సీక్రెట్‌గా దాయలేమని చెబుతాడు. దాంతో తనను అక్కడికి తీసుకెళ్లమని అప్పూ అడగటంతో కళ్యాణ్ సరేనని చెబుతాడు. కావ్య పాపకు ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారని అడుగుతుంది ఇందిర. నీ పేరుని బట్టి ఇందు అని పెడదామని అనుకుంటున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర ఎమోషనల్ అవుతుంది. మినిస్టర్ గారింట్లో ఫంక్షన్‌కి ముందు మీరు వెళ్లండి.. మేం గుడికి వెళ్లొస్తామని కళ్యాణ్ - అప్పూలు రౌడీల్ని దాచిన ప్లేస్‌కి వెళ్తారు. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతుంది రేఖ. నా జోలికి వస్తున్నారు కాబట్టి.. ఇక వాళ్లు ప్రాణాలతో ఇంటికి తిరిగిరారని రేఖతో అంటుంది రుద్రాణి.
తెలివిగా నాటకం ఆడి రౌడీలతో నిజం చెప్పిస్తుంది అప్పూ. మాకు డబ్బులచ్చింది ఒక లేడీ అని.. ఆవిడ పేరు, అడ్రస్ ఏం తెలియవని చెబుతారు రౌడీలు. కానీ ఫోన్‌లో రుద్రాణి ఫోటో తీసి చూపించడంతో అప్పూ- కళ్యాణ్‌లు షాక్ అవుతారు. కావ్య - రాజ్‌ల కోసం ధర్మేంద్ర, తులసిలు ఎదురుచూస్తుంటరు. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మినిస్టర్ ఇంటికి వస్తుంది. తన బిడ్డకు ప్రాణం పోసిన నువ్వే ఊయలలో వేయాలని కావ్యతో అంటుంది తులసి. నీ చల్లని చూపు, స్పర్శ నా బిడ్డకు తగలితే తను నిండు నూరేళ్లు హాయిగా ఉంటుందని చెబుతుంది తులసి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్ 962లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తన బిడ్డకు దుర్గ అని పేరు పెడతారు తులసి, ధర్మేంద్ర. నేను మీ పాపని ఊయలలో వేశానని అనుకోవడం లేదు... నా బిడ్డకే బారసాల చేశానని అనుకుంటున్నాను అని చెబుతుంది కావ్య. ఇంతలో ఫంక్షన్‌కి రుద్రాణి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. ఈవిడకి మీకు ఏంటీ సంబంధమని మినిస్టర్‌ను అడుగుతాడు సుభాష్. తను మీ ఇంటి ఆడబిడ్డని నాకు కొంచెం లేట్‌గా తెలిసింది. అది మా ఇంటి ఆడబిడ్డ కాదు.. అదొక మృగం. జీవితాంతం మమ్మల్ని పీక్కుతింటుందని చెబుతుంది ఇందిర. అందుకే మేం తనని ఇంట్లో నుంచి తరిమేశామని చెబుతాడు ప్రకాశం. నేనొచ్చింది మినిస్టర్ గారు ఫంక్షన్‌కి పిలిచారని కాదు... మీరంతా వస్తున్నారని తెలిసి, మిమ్మల్ని క్షమాపణలు అడుగుదామని అని చెబుతుంది రుద్రాణి.
నీ ముఖం చూస్తేనే దరిద్ర్యం.. ఇక్కడి నుంచి పో అంటుంది ఇందిర. నేను చేయకూడని తప్పులే చేశాను.. అందుకు అనుభవిస్తున్నాను. దేవాలయం లాంటి ఇంటిని, బంగారం లాంటి మనుషుల్ని వదులుకున్నాకే నాకు మీ విలువ తెలిసింది. నా కొడుకు, కూతురు నన్ను అసహ్యించుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూసిపోదామని వచ్చానని అంటుంది రుద్రాణి. మళ్లీ మీ ప్రేమను పొందే అవకాశం నాకు మీరు ఇవ్వరు, కనీసం నన్ను క్షమించానన్న ఒక్క మాటైనా మీ నోట వని శాశ్వతంగా వెళ్లిపోతానని అంటుంది. నన్ను ఎవరు క్షమించినా, క్షమించకపోయినా మీరు నన్ను క్షమిస్తే ఆనందంగా వెళ్లిపోతానని రాజ్ - కావ్యల దగ్గర డ్రామాలాడుతుంది రుద్రాణి.
ఇంతలో నీ నాటకాలు ఆపమంటూ అప్పూ- కళ్యాణ్‌లు ఎంట్రీ ఇవ్వడంతో రుద్రాణి, రాహుల్, రేఖలు షాక్ అవుతారు. చాలా గొప్పగా నటిస్తున్నారు రుద్రాణి గారు, చాలా బాగా కన్నీళ్లు కారుస్తున్నారని అంటుంది అప్పూ. మా కుటుంబాన్ని ఇంకా ఎన్నాళ్లు నమ్మిస్తారని ప్రశ్నిస్తుంది. కొడుకు, కోడలికి దెబ్బలు, బ్యాండేజ్‌లు ఉండటంతో ఏం జరిగిందని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. మేం ఎలా బతికొచ్చామా? అని ఆశ్చర్యంగా ఉందా? అని ప్రశ్నిస్తుంది అప్పూ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వు మమ్మల్ని చంపాలని వేసిన ప్లాన్... ఎలా బెడిసికొట్టిందో అర్ధం కావడం లేదా? అని అప్పూ అంటుంది.
అక్కాబావల పాపని మార్చింది మినిస్టర్ గారే అయినా... దాని వెనకున్నది ఈ రుద్రాణియే. మినిస్టర్ గారు పాపని మార్చారు... అక్క కూతురు ఆయనకి శాశ్వతంగా దక్కాలంటే హాస్పిటల్‌లో ఉన్న పాప ప్రాణాలతో ఉండకూడదని అనుకున్నారు. కానీ అదే పాపని మినిస్టర్ గారు కాపాడాలని అనుకున్నారు. అప్పుడు నాకు అనుమానం వచ్చి మినిస్టర్ గారిని కలిశా... కానీ మినిస్టర్ గారు కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వలేదు. రుద్రాణి గారు ఇచ్చిన సలహా వల్లే తప్పు చేశానని మినిస్టర్ గారు చెప్పలేదని అంటుంది అప్పూ.
డిపార్ట్‌మెంట్ సహాయంతో మేం ఎంక్వైరీ మొదలుపెట్టాం.. ఆ విషయం తెలిసి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది. నిజానిజాలు బయటకు వస్తే తనెక్కడ దొరికిపోతానో అని ఈరోజు మమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది కూడా ఈ రుద్రాణియే అని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కానీ అదృష్టవశాత్తూ మేం బతికిపడ్డాం.. కానీ ఇక్కడికొచ్చి మీ అందరి ముందు కొత్త నాటకానికి తెరతీస్తోందని మండిపడుతుంది. ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని సాధిస్తావు... ఇంకా ఎన్నాళ్లు నీకు భయపడుతూ బతకాలని రగిలిపోతుంది ధాన్యలక్ష్మీ. నీకు నీడనిచ్చిన పాపానికి పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకున్నది చాలక... ఇప్పుడు నా కొడుకు, కోడల్ని చంపాలని అనుకుంటావా అంటూ మండిపడుతుంది.
ఏం చేయనట్లు మా ముందుకే వచ్చి దొంగ కన్నీళ్లు కారుస్తున్నావు... క్షమించమని అడుగుతున్నావా అంటూ స్వప్న మండిపడుతుంది. ఇంకా ఏం సాధించాలని ఈ దుర్మార్గం.. ఇంకా ఏం సాధించాలని ఈ రాక్షసత్వం. ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది, అసలు నువ్వు ఆడదానివా అని మండిపడతాడు రాజ్. మారిపోయానని చెప్పావు కదా.... మళ్ల ఏంటీ ఇదంతా అని రుద్రాణిపై రగిలిపోతాడు మినిస్టర్. నేను మారాను, నా కుటుంబంతో నేను కలవాలని ఒక్క అవకాశం ఇవ్వొద్దని ప్రాధేయపడితే ఈ సంగతి దాచిపెట్టానని చెబుతాడు ధర్మేంద్ర. నాకు ఆరోగ్యకరమైన బిడ్డ ఉండాలని అనుకున్నాను... నా అవసరాన్ని ఆసరాగా తీర్చుకుని మీ బిడ్డను మార్చమని సలహా ఇచ్చింది. ఇదంతా నా మంచికోసం కాదు... మీ మీద పగతీర్చుకోవడానికి చేసిందని నా బిడ్డను చంపడానికి రౌడీలను పంపాకే అర్ధమైందని చెబుతాడు మినిస్టర్. ఆ మాటలతో రుద్రాణిని చెప్పుతో కొడుతుంది కావ్య.
పసిబిడ్డల ప్రాణాలు తీయాలనుకున్నది, ఈ ఇంటి కొడుకుని కోడల్ని చంపాలనుకున్నది కేవలం ఆస్తి కోసమేనా. పగ, ద్వేషం ఏదైనా ఉంటే నా మీద, నా భర్త మీద చూపించాలి. నా బిడ్డ మీద చూపిస్తావా? నా అక్క, నా చెల్లి, నా కుటుంబమే సర్వస్వమని బతుకుతున్నాను.. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి ప్రాణం తీయాలని అనుకుంటావా? నువ్వు ఆడజాతికే కళంకం అయ్యావు. నా కళ్లముందు నుంచి వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇన్నాళ్లూ ఒక ఆడపిల్లను పెంచానని అనుకున్నాను, కానీ పాముకి పాలుపోసి బతికించానని ఇప్పుడే అర్ధమైందని అంటాడు సీతారామయ్య. నువ్వు నా తల్లివి అని ఎక్కడా చెప్పొద్దని రుద్రాణిని లాగిపడేస్తాడు రాహుల్.
జరిగిన అవమానానికి కత్తితో పొడుచుకుని చనిపోవాలని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో రాహుల్, రేఖలు వచ్చి చప్పట్లు కొడతాడు. మా లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పి నువ్వు భయపడి చావాలని అనుకుంటున్నావా? అని మండిపడుతుంది రేఖ. నాకు జరిగిన అవమానానికి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామని అనుకుంటున్నానని చెబుతుంది రుద్రాణి. రాజ్- కావ్యలను ఫినిష్ చేస్తే మనకి అడ్డు ఉండదు, వాళ్ల ఆస్తితో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ పేరు, ప్రతిష్టలు కూడా మన సొంతం అవుతాయని అంటాడు రాహుల్. ఆ ఫ్యామిలీని ఎలా అంతం చేయాలో నువ్వు ప్లాన్ చేయ్... నేను అన్నయ్య .. ఆ ఇంట్లో అందరి నమ్మకాన్ని గెలుచుకుంటామని చెబుతుంది రేఖ.
ఎన్ని తప్పులు చేసినా క్షమించాం.. కానీ ఈ ఇంటి మీద ఇంత విషం చిమ్ముతుందని అనుకోలేదని అంటుంది ఇందిర. కావ్య కడుపులోని బిడ్డను చంపాలని అనుకున్నప్పుడే దానిని జైలుకు పంపాల్సింది, అనవసరంగా వదిలేశామని అంటాడు సుభాష్. ఇంత జరిగాక కూడా పోలీసులకు పట్టించకుండా వదిలేశామని అంటుంది ధాన్యలక్ష్మీ. చేసిన తప్పులకు ఆధారాలు లేవని చెబుతుంది, ఏదైనా ఒక బలమైన ఎవిడెన్స్ కావాలని అంటుంది. ఇంతలో రాహుల్, రేఖలు బ్యాగ్‌లు సర్దుకుని కోపంగా కిందకు వస్తారు. ఈ ఇంట్లో నుంచి మేం శాశ్వతంగా వెళ్లిపోతున్నామని రాహల్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మా అమ్మ ఆగడాలు భరించే ఓపిక మాకు లేదు.. ఇంత జరిగాక మాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని అంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











