Brahmamudi February 23rd Episode: ట్రస్ట్‌కు ధాన్యం గ్రీన్‌సిగ్నల్.. దుగ్గిరాల ఫ్యామిలీకి రుద్రాణి మరణ శాసనం
Photo Courtesy: JioHotstar
రాజ్- కావ్యల విషయంలో నేను చేసింది మరిచిపోయి మా ఇంటికి మీరంతా వచ్చినందుకు సంతోషంగా ఉందని ధర్మేంద్ర అంటాడు. ఇంతలో మినిస్టర్ ఇంట్లో రుద్రాణి ప్రత్యక్షం కావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వెంటీ ఇక్కడ? నీకు మినిస్టర్ గారికి సంబంధం ఏంటీ? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మిమ్మల్ని మినిస్టర్ గారు ఈ ఫంక్షన్‌కు పిలుస్తారని నాకు తెలుసు... మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను, నేను చేసిన దానికి క్షమించాలని రుద్రాణి మొసలి కన్నీరు కారుస్తుంది. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లు గాయాలతో ప్రత్యక్షం కావడంతో రుద్రాణి, దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. అక్క పాపని మార్చించి, మమ్మల్ని కిడ్నాప్ చేయించింది, ఈరోజు యాక్సిడెంట్ చేసి చంపాలని అనుకున్నది ఈ రుద్రాణియే అని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది.
బిడ్డలను మార్చమని నాకు సలహా ఇచ్చింది.. నా బిడ్డను చంపమని రౌడీలను పంపింది.. ఈ రుద్రాణియే అని చెప్పడంతో రుద్రాణిని చెప్పుతో కొడుతుంది కావ్య. నా కళ్లముందు కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది కావ్య. తనకు జరిగిన అవమానానికి రుద్రాణి రగిలిపోతూ.. కత్తితో పొడుచుకుని చనిపోవాలని అనుకుంటుంది. ఇంతలో రాహుల్ - రేఖలు వచ్చి ఆపుతారు. ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామని రేఖ, రాహుల్‌లు చెప్పడంతో సరేనని అంటుంది రుద్రాణి. జరిగినదానికి దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుండగా రాహుల్, రేఖలు బ్యాగులు సర్దుకుని కిందకి వచ్చి మేం ఇంట్లోంచి వెళ్లిపోతామని నాటకాలు ఆడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్ 963లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈ ఇంట్లో నుంచి మేం శాశ్వతంగా వెళ్లిపోతున్నామని రాహుల్, రేఖలు చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది చాలు.. ఇకపై మా అమ్మ ఆగడాలు భరించే ఓపిక మాకు లేదు. ఇంత జరిగాక ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటాడు రాహుల్. ఇన్నాళ్లు నువ్వు నా వల్ల ఇబ్బందిపడ్డావు, ఇప్పుడు మా అమ్మ చేసిన పనికి నాతో పాటు నువ్వు కూడా తలదించుకోవాల్సి వచ్చిందని స్వప్నతో అంటాడు. నేను మారాను, కానీ మా అమ్మ మాత్రం మారదు. చివరికి నీ చెల్లినే చంపాలని అనుకుంది, నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. నన్ను క్షమించి నువ్వు నాతో పాటు వస్తే ఈ దేవాలయానికి, ఇంతటి మంచి మనుషులకు దూరంగా బతుకుదామని అంటాడు రాహుల్. దాంతో రాజ్ మండిపడతాడు.
ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్లిపోవడం వల్ల జరిగే నష్టం తీరిపోతుందా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఇక్కడే ఉంటే మా అమ్మ చేసిన పాపం గుర్తొచ్చినప్పుడల్లా మనసు బాధపడుతుందని చెబుతుంది రేఖ. తప్పు చేసింది మీ అమ్మ.. దానికి మీరేం చేస్తారు? దానిని మేం శిక్షించకపోవచ్చు.. కానీ ఏదో ఒకరోజు ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడని అంటుంది. అందుకే తప్పు ఎవరు చేసినా శిక్ష మేమే పడాలి.. మేము వెళ్లిపోతామని చెబుతుంది రేఖ. మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మా ముగ్గురు అక్కాచెల్లెళ్లం కలిసే ఉంటాం. మా ముగ్గురని విడదీయొద్దని బతిమలాడుతుంది కావ్య. కానీ మీ అమ్మ పేరు ఎత్తొద్దు.. ఆ పేరు కూడా వినిపించకూడదని చెబుతారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ ఇంట్లో హోమం చేయించి బారసాల పనులు మొదలుపెట్టాలని ఇందిర చెబుతుంది.
పాపని కావ్య ముద్దు చేస్తూ ఉండటంతో నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలమే ఈ సంతోషమని అంటాడు రాజ్. మా కుటుంబం కోసం నువ్వు ఎంతో చేశావు.. కానీ నేను మాత్రం నీకు ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు రాజ్. ఈ ఆనందం ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలని చెబుతుంది కావ్య. రేపు ట్రస్ట్ ఓపెనింగ్‌కి వెళ్తున్నాం కదా.. పిల్లలకు పేరు కూడా అప్పుడే పెడదామని అంటాడు రాజ్. అలాంటి మంచి కార్యంలో మన పిల్లల నామకరణం చేస్తే పిల్లల జీవితం బాగుంటుందని అంటుంది కావ్య. ట్రస్ట్ ఓపెనింగ్, నామకరణం పూర్తవగానే అందరం కలిసి శ్రీశైలం వెళ్దామని చెబుతాడు రాజ్.
ట్రస్ట్ ఓపెనింగ్ పనులు మొదలుపెట్టేశారని రుద్రాణికి చెబుతారు రేఖ, రాహుల్. అందరూ కలిసి శ్రీశైలానికి వెళ్తున్నారని చెప్పడంతో ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి కైలాసానికి పంపే అవకాశం వచ్చిందని అంటుంది రుద్రాణి. ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని చస్తే.. అందరూ చచ్చాక ఆ కుటుంబంలో మిగిలేది మనమే అంటుంది రుద్రాణి. ఫ్యామిలీ అంతా చనిపోయి మనం మాత్రం మిగిలిపోతే పోలీసులకు అనుమానం వస్తుందని రాహుల్ అంటాడు. వాళ్లు వెళ్లే బస్సులో బాంబు పెట్టి బ్లాస్ట్ చేద్దామని చెబుతుంది రుద్రాణి. మీరు, స్వప్నలు కూడా బస్సును ఫాలో అవుతూ వెనకే వెళ్లండి. బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత పోలీసులకు సాక్ష్యం చెప్పి స్వప్నే మనల్ని కాపాడుతుందని చెబుతుంది రుద్రాణి. టైం చూసి బాంబు ఫిక్స్ చేయగలిగితే అన్ని అదే చూసుకుంటుందని చెబుతుంది. దీంతో దుగ్గిరాల చరిత్ర ముగిసిపోయి.. ఈ రుద్రాణి రాసే కొత్త చరిత్ర మొదలవుతుందని అనుకుంటుంది రుద్రాణి.
దుగ్గిరాల ట్రస్ట్ అనే బోర్డ్ చూసుకుని కావ్య, రాజ్‌లు ఎంతో సంతోషిస్తారు. ఇంతలో అక్కడికి కృష్ణమూర్తి, కనకం వచ్చి మురిసిపోతారు. ఈ క్రెడిట్ మొత్తం మీ కూతురిదేనని మెచ్చుకుంటాడు రాజ్. ఇంతలో ఇందిర వచ్చి దీనికి కారణం మీరిద్దరూ అని మెచ్చుకుంటుంది ఇందిర. మనవరాళ్ల నామకరణానికి ఇద్దరూ ఆలస్యంగా వస్తారా అని మండిపడుతుంది. మా ఇంటికి ఇంత మంచి కోడళ్లను అందించినందుకు థ్యాంక్స్ అని చెబుతారు అపర్ణ, ధాన్యలక్ష్మీ. ట్రస్ట్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తున్నావని సుభాష్ అడగ్గా.. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర ఓ వ్యక్తితో వస్తాడు.
ఈ ట్రస్ట్ బాధ్యతలు ముగ్గురి చేతుల మీదుగా ఉంటుంది. మినిస్టర్ గారు ట్రస్ట్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు, అలాగే ట్రస్ట్‌లను 30 ఏళ్లుగా నడుపుతున్న సత్యమూర్తి గారు, మనింటి తరపున కళావతి ట్రస్ట్ బాధ్యతలు తీసుకుంటుందని రాజ్ చెబుతాడు. కావ్యకి మాత్రమే అన్ని బాధ్యతలు అప్పగిస్తే తను ఎలా చూసుకుంటుందని అడుగుతాడు సుభాష్. కుటుంబం అంటే చిన్న చిన్న గొడవలు సహజం. అందుకే మనింటి తరపున ఎవరో ఒక్కరే ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెబుతాడు రాజ్. మన తర్వాత మన పిల్లలు, తరతరాలు ట్రస్ట్ బాధ్యతలు తీసుకుంటారని చెబుతాడు రాహుల్. మన ఆస్తిలో సగం వాటా ట్రస్ట్ పేరు మీద రాశాం.. దీనికి మనింట్లో వాళ్లంతా ఒప్పుకుంటూ సంతకాలు పెట్టాలని చెబుతాడు రాజ్. దానికి ధాన్యలక్ష్మీ నేనే అందరికంటే ముందు సంతకం పెడతానని అంటుంది. తొలి సంతకం సీతారామయ్య పెడతాడు. అనంతరం అందరూ పూర్తి చేస్తారు.
ట్రస్ట్ బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నాం.. ఇక నుంచి మీరే ముందుకు తీసుకెళ్లాలని డాక్యుమెంట్స్ మినిస్టర్ చేతుల్లో పెడతాడు రాజ్. నా కూతురిని నాకు తిరిగిచ్చి.. నాకు నా భార్యకి కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలని అనుకుంటుంటే ఆ దేవుడు, ఈ రూపంలో నాకు అవకాశం ఇచ్చాడా అనిపిస్తోంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ట్రస్ట్ బాధ్యతల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ధర్మేంద్ర మాటిస్తాడు. మీరేం కంగారుపడొద్దు.. కష్టంలో ఉన్నవారికి ఈ దుగ్గిరాల ట్రస్ట్ అండగా నిలబడుతుంది. మీరు ఈరోజు చూసిన పనివల్ల మీ కుటుంబం పేరు తరతరాలుగా నిలబడిపోతుందని సత్యమూర్తి చెబుతాడు. ఇంతలో శ్రీశైలం వెళ్లడానికి వ్యాన్ దుగ్గిరాల వారింటికి వస్తుంది. ఈ బాధ్యతలు రాహుల్‌కి అప్పగిస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











