Brahmamudi February 24th Episode: స్వప్నని డైవర్ట్ చేసిన రాహుల్... చావు అంచుల్లో దుగ్గిరాల ఫ్యామిలీ

Photo Courtesy: JioHotstar

మా అమ్మ చేసిన పాపాలకు ఈ ఇంట్లో ఉండలేమని, మీ ముందు తలెత్తుకుని బతకలేమని రేఖ, రాహుల్‌లు డ్రామాలు ఆడతారు. నువ్వు కూడా మన బిడ్డను తీసుకొని వచ్చేస్తే వెళ్లిపోదామని స్వప్నకు చెబుతాడు రాహుల్. మా ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. చివరి వరకు ఓకే చోట కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నామని మమ్మల్ని విడదీయొద్దని రాహుల్‌ని బతిమలాడుతుంది కావ్య. అయినా మీ అమ్మ చేసిన దానికి మీరేం చేస్తారు.. మనమంతా కలిసే ఉందామని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చెప్పడంతో తమ ప్లాన్ వర్కవుట్ అయినందుకు రాహుల్, రేఖలు సంతోషిస్తారు.

ట్రస్ట్ పనులు మొదలవుతున్నాయి, పాప నామకరణం కూడా చేసేస్తున్నాం.. ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్దామని కావ్యతో చెబుతాడు రాజ్. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతారు రాహుల్, రేఖ. ఫ్యామిలీ మొత్తాన్ని శ్రీశైలం వెళ్లేదారిలో బాంబు పెట్టి ఒకేసారి చంపేద్దామని.. అప్పుడు దుగ్గిరాల కుటుంబంలో మన ముగ్గురం మాత్రమే మిగులుతామని తన ప్లాన్ చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే మినిస్టర్ ధర్మేంద్ర.. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి ఓ వ్యక్తితో కలిసి వస్తాడు. మినిస్టర్ గారు, గురుమూర్తి గారు, కావ్యలు ముగ్గురు ఈ ట్రస్ట్ బాధ్యతలు చూసుకుంటారని చెబుతాడు రాజ్. సగం ఆస్తిని ట్రస్ట్‌కు రాసివ్వడానికి ధాన్యలక్ష్మీతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతకాలు పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 24వ తేదీ ఎపిసోడ్ 964లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 24th 2026 Episode 964 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

శ్రీశైలం వెళ్లేందుకు వ్యాన్ రావడంతో వెహికల్ డ్రైవర్‌ని మాటల్లో పెట్టి తాళాలు తీసుకుంటాడు రాహుల్. ఈ విషయాన్ని వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి చెబుతాడు. అయితే మనింటి బయటే బాంబు పెట్టేవాళ్లు ఉన్నారని రుద్రాణి చెబుతుంది. జీవితంలో మనకి దొరికిన చివరి అవకాశం ఇది.. ఇందులో ఏ పొరపాటు జరిగినా, మన జీవితాలు తలకిందులైపోతాయని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆ వ్యాన్‌లో ఉండకుండా ఏం ప్లాన్ చేశావని అడుగుతుంది రుద్రాణి. ఈ పాటికి స్వప్నకి ఫోన్ వచ్చుంటుంది, ఇందులో కూర్చోకుండా తనే మనకి సాయం చేస్తుందని అంటాడు రాహుల్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ మిస్ అవ్వదని చెబుతాడు. రాహుల్, రేఖ కలిసి వ్యాన్ కింద బాంబు పెట్టిస్తుండగా.. స్వప్న రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు.

విజయవాడ మేనేజర్ కాల్ చేశాడు.. ఏదో ట్యాక్స్ విషయంలో మాట్లాడాలి, అర్జెంట్‌గా వెళ్లాలని చెబుతుంది స్వప్న. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తర్వాత విజయవాడ వెళ్దామని చెబుతాడు రాహుల్. అందరం ఈ వ్యాన్‌లోనే వెళ్తున్నాం కదా మనం సెపరేట్‌గా ఎలా వెళ్లగలమని అడుగుతుంది స్వప్న. మనం వేరే కారులో శ్రీశైలం వెళ్లి.. అక్కడి నుంచి విజయవాడ వెళ్దామని చెబుతాడు రాహుల్. సరేనని స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వ్యాన్ కింద బాంబు పెట్టానని ఆ టైంకి శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఉండేలా చూసుకోమని చెబుతాడు రౌడీ. మొత్తానికి నీ భార్య చేతే మన ప్రాణాల్ని కాపాడేలా ప్లాన్ చేశావని రాహుల్‌ని మెచ్చుకుంటుంది రేఖ. సూర్యుడు అస్తమించే సమయానికి దుగ్గిరాల కుటుంబం కూడా అస్తమిస్తుంది. రుద్రాణి కుటుంబమే చక్రం తిప్పబోతుందని చెబుతుంది.

నామకరణం సందర్భంగా పాపని ఊయలలో వేయమని అపర్ణతో చెబుతుంది కావ్య. ఇంతలో రేవతి తన భర్త, కొడుకుతో అక్కడికి వస్తారు. మేనకోడలి నామకరణం అంటే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి కదా? చుట్టపు చూపుగా చూసి వెళ్దామని వచ్చావా? అని అడుగుతుంది కావ్య. నీ మేనల్లుడిని రెడీ చేసి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టిందని అంటుంది రేవతి. పాపని అపర్ణ ఊయలలో వేయబోతుండగా రేవతి కొడుకు ఆగండి అంటూ గట్టిగా అరుస్తాడు. నాకింత అన్యాయం చేస్తారా? నాకు న్యాయం కావాలని అడుగుతాడు. నా మనవరాలిని నేనే ఊయలలో వేస్తానని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. మరదలిని ఊయలలో వేసి ఊపేయాలని అనుకుంటున్నాడని ఇందిర సంతోషిస్తుంది. నీ పెళ్లాన్ని నువ్వే ఊయలలో వేసుకుని నువ్వే పేరు పెట్టుకోమని చెబుతుంది అపర్ణ. పాపని ఊయలలో వేసి ముద్దు చేస్తుంటాడు రేవతి కొడుకు.

ఇంతకీ నా పెళ్లాం పేరు ఏమని పెడతారని అడుగుతాడు పిల్లాడు. నా పేరే పెట్టారని ఇందిర చెప్పడంతో, ఇంత పాత పేరు పెట్టారా? అని ఛీ కొడతాడు. చాక్లెట్స్ ఇచ్చావని నీ పేరు పెడతానంటే ఊరుకుంటానా అని మండిపడతాడు రేవతి కొడుకు. నీకు ఇందిరా దేవి అని ఇష్టం లేకపోతే ఇందు అని పేరు పెట్టమని చెబుతుంది కావ్య. ఈ పేరు చాలా బాగుందని.. ఇందు ఇందు అని పిలుస్తాడు రాజ్. తర్వాత ధాన్యలక్ష్మీ చేతికి బిడ్డను ఇచ్చి ఊయలలో వేయమంటుంది అప్పూ. నేను పెట్టేపేరు మీకు నచ్చదు కదా? అని చెబుతుంది ధాన్యం. మీరు పెట్టిన నందన అనే పేరు మాకు కూడా బాగా నచ్చిందని అంటుంది అప్పూ. పెద్దదాని పేరు ఇందు, చిన్నదాని పేరు నందు చాలా బాగుందని ఇందిర అంటుంది.

పిల్లల నామకరణంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. వ్యాన్ మొత్తం రెడీ చేశాను.. శ్రీశైలం ఘాట్ రోడ్‌ చెక్‌పోస్ట్ మూసేస్తారు. 9 గంటల లోపు మనం ఫారెస్ట్ దాటేయాలని చెబుతాడు రాహుల్. దాంతో కుటుంబం మొత్తం కలిసి వ్యాన్ ఎక్కుతారు. స్వప్న, రాహుల్, రేఖలు మాత్రం వ్యాన్ ఎక్కకుండా ఉండటంతో ఎందుకని ప్రశ్నిస్తాడు రాజ్. మేం వ్యాన్‌లో రావడం లేదు.. కారులో వస్తున్నామని చెబుతాడు రాహుల్. అందరం కలిసి సరదాగా వెళ్దామని అనుకున్నాం కదా? అని కావ్య అడుగుతుంది. దానికి కారణం మీ అక్కేనని చెబుతాడు రాహుల్. తాతగారు నాకిచ్చిన విజయవాడ ప్రాపర్టీకి ఏదో ట్యాక్స్ ప్రాబ్లమ్ వచ్చింది.. అక్కడికి వెళ్లి ఒకసారి మాట్లాడి రావాలి.. శ్రీశైలంలో దేవుడి దర్శనం తర్వాత అటు నుంచి విజయవాడ వెళ్తామని చెబుతుంది స్వప్న.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వ్యాన్ ఎక్కేసిందని ఇక నువ్వే చూసుకోవాలని రుద్రాణికి చెబుతుంది రేఖ. ఆ బాంబు చాలా పవర్‌ఫుల్, మీరు మినిమమ్ ఆ వ్యాన్‌కి 200 అడుగుల దూరంలో ఉండాలని చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కాలి బూడిద అవ్వడం నా కళ్లారా చూడాలి.. అందుకే ఘాట్ రోడ్ దగ్గరున్న గెస్ట్‌హౌస్‌లో ఉన్నానని చెబుతుంది రుద్రాణి. అందరూ శ్రీశైలానికి వెళ్తుండగా నాకు బోర్ కొడుతోందని అంటాడు ప్రకాశం. అయితే భార్యాభర్తల్లో ఒకరు పాటపాడతారు.. ఒకరు డ్యాన్స్ చేయాలని చెబుతుంది కావ్య. ముందు ధాన్యం- ప్రకాశంను చేయమని చెబుతుంది ఇందిర. దీంతో వాళ్లు డ్యాన్స్ చేస్తారు.. తర్వాత అప్పూ- కళ్యాణ్‌, అనంతరం కృష్ణమూర్తి - కనకం, రేవతి ఆమె భర్తలు డ్యాన్స్ చేస్తారు. శ్రీశైలానికి వెళ్తుండగా సడెన్‌గా వ్యాన్ ఆగి అందులోంచి కావ్య, అప్పూ దిగి వస్తుండటంతో ఏం జరిగిందోనని రాహుల్- రేఖలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X