Brahmamudi February 25th Episode: దుగ్గిరాల కుటుంబం సజీవ దహనం.. చనిపోతూ రాహుల్‌ని చంపేసిన రాజ్

Photo Courtesy: JioHotstar

శ్రీశైలం వెళ్లే వ్యాన్ రావడంతో డ్రైవర్‌ని మాటల్లో పెట్టి తాళాలు తీసుకుంటాడు రాహుల్. ఇంతలో కిరాయి హంతకుడు వచ్చి వ్యాన్ కింద టైం బాంబు పెట్టి వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతాడు రాహుల్. మీరు ఆ బస్సులో రాకుండా మరో కారులో 200 అడుగుల డిస్టెన్స్‌లో ఫాలో అవ్వమని చెబుతుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి మన విజయవాడ ప్రాపర్టీకి ఏదో ప్రాబ్లమ్ ఉందని అక్కడికి వెళ్లాలని చెబుతుంది. శ్రీశైలంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి విజయవాడ వెళ్దామని చెబుతాడు రాహుల్. అందరం ఒకే వ్యాన్‌లో వెళ్తున్నాం కాబట్టి కుదరదని, మనం వేరే కారులో వెళ్దామని అంటుంది స్వప్న. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో సరేనని చెబుతాడు రాహుల్.

కావ్య పాపకి ఇందు అని, అప్పూ పాపకి నందూ అని పేరు పెడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కావ్య కూతురిని రేవతి కొడుకు ఊయలలో వేసి నా పెళ్లాన్ని నేనే చూసుకుంటానని అంటాడు. దాంతో అంతా సరేనని చెప్పి నవ్వుకుంటారు. త్వరగా బయల్దేరకపోతే శ్రీశైలం ఘాట్ రోడ్ మూసేస్తారని రాహుల్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వ్యాన్ ఎక్కేస్తారు. రాహుల్ - స్వప్న రాకపోవడంతో మీరు వేరే కారులో ఎందుకు? అందరం ఈ వ్యాన్‌లో వెళ్దామని చెబుతాడు రాజ్. నాకు విజయవాడలో చిన్న ప్రాపర్టీ ఇష్యూ ఉందని అందుకే నేనే కారులో వెళ్దామని చెప్పానని రాజ్‌తో అంటుంది స్వప్న. దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యాన్‌ను వెనుక కారులో ఫాలో అవుతారు రాహుల్- రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 25వ తేదీ ఎపిసోడ్ 965లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 25th 2026 Episode 965 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా ఆగిపోయి దానిలో నుంచి అప్పూ, కావ్యలు దిగడంతో రాహుల్ షాకై ఏం జరిగిందని అడుగుతాడు. మేం అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం.. మీరు మాత్రం ఇలా సెపరేట్‌గా వస్తున్నారని చెబుతుంది అప్పూ. మా అక్క కూడా మాతో కలిసి ఎంజాయ్ చేస్తుందని చెప్పి స్వప్నని తీసుకెళ్తారు అప్పూ, కావ్య. వీళ్ల చావు వీళ్లు చావకుండా నా పెళ్లాన్ని కూడా తీసుకెళ్లాలా అని రాహుల్ టెన్షన్ పడతాడు. ఈ విషయాన్ని వెంటనే రుద్రాణికి చెబుతాడు. మన ప్లాన్‌ని ఆపడం మంచిదని అనిపిస్తుందని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. కావ్య, అప్పూ కలిసి వాళ్లు ఎంజాయ్ చేయడం కోసం స్వప్నని కూడా వ్యాన్ ఎక్కించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో స్వప్నని నేను తిరిగి తీసుకురాలేను కాబట్టి.. ఈ ప్లాన్‌ని ఆపడం మంచిదని అంటాడు రుద్రాణి మాత్రం ఈ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చేస్తుంది.

ఆ స్వప్నని నువ్వు నిజంగా ప్రేమించావా? మొన్నటి వరకు దానిని ఎలా వదిలించుకోవాలనే కదా ఆలోచించావు? సడెన్‌గా ఇంత ప్రేమ చూపిస్తున్నావని మండిపడుతుంది. నువ్వు చేసే ఒక్క త్యాగంతో నీ తలరాతే మారిపోతుంది? కోట్ల ఆస్తి ఒకవైపు.. భార్య ఒకవైపు ఏది కావాలో నువ్వే తేల్చుకోవాలని ప్రశ్నిస్తుంది. నాకు డబ్బే ముఖ్యం.. ఇంతదూరం వచ్చాక తగ్గేది లేదని అంటాడు రాహుల్. అది నా కొడుకంటే .. దూరంగా వ్యాన్ ఫాలో అవ్వండి, మిగతాది నేను నడిపిస్తానని అంటుంది రుద్రాణి.

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం ఘాట్ దగ్గరికి రాగానే ప్లాన్ ప్రకారం రిమోట్ నొక్కి వ్యాన్‌ని పేల్చేస్తుంది రుద్రాణి. మంటల్లో పడి అంతా సజీవ దహనం అవుతారు. అది చూసి రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. దుగ్గిరాల వారి శవాలన్నీ నేను దగ్గరుండి చూడాలని అనుకుంటూ కిందకి వెళ్తుంది రుద్రాణి. అయితే ప్రమాదంలో నుంచి తృటిలో బయటపడ్డ అపర్ణ.. తన కుటుంబమంతా చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతుంది. అది చూసిన రాహుల్, రేఖలు షాక్ అవుతారు.

దూరంగా పడున్న రాజ్, కావ్యల మృతదేహాన్ని చూసి ఏడుస్తుంది అపర్ణ. అయితే కావ్య ఒడిలో బిడ్డ బతికే ఉండటంతో కూతురిని చూడమంటూ ఏడుస్తుంది. సుభాష్ కొనఊపిరితో ఉండగా.. అతని ఒడిలో అప్పూ బిడ్డ ఉండటంతో పాపకి ఎలా ఉంది అని అడుగుతాడు. పాప బతికే ఉంది మనం ఆసుపత్రికి వెళ్దామని సుభాష్‌కి చెబుతుంది అపర్ణ. నా వల్ల కావడం లేదు.. నడుముకు దెబ్బ తగిలినట్లుగా ఉందని చెబుతాడు సుభాష్. అపర్ణ బతికి ఉండటం చూసిన రాహుల్.. వెంటనే గన్ తీసుకుని ఆమెను చంపేయాలని అనుకుంటాడు. ఏం జరిగినా నువ్వు మాత్రం బయటకు దిగొద్దని రేఖకి చెబుతాడు. ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ బతికి ఉండకూడదు అమ్మ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని అంటుంది రేఖ.

రాహుల్‌ని చూడగానే అపర్ణకి ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. మీ మావయ్య బతికే ఉన్నాడు.. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్దామని బతిమలాడుతుంది. చంపాలనుకున్న వాళ్లే కాపాడతారని ఎలా అనుకున్నావని రాహుల్ అనడంతో అపర్ణ షాక్ అవుతుంది. వెంటనే గన్ తీసి ఆమెను కాల్చేయబోతాడు. నువ్వు విన్నది, చూస్తున్నది అంతా నిజమే. నేను, మా అమ్మ కలిసి చేసిన ప్లాన్ ఇది. అందరినీ చంపేద్దామని అనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తూ మీరు బతికారు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదని మన పెద్దలు చెబుతుంటారు కదా. మీరు బతికుంటే నిజాలన్నీ బయటకు వస్తాయి. అదే మీరు చస్తే మీ ఆస్తి మాకు వస్తుందని అంటాడు రాహుల్.

దాంతో అపర్ణని వదిలేయమని బతిమలాడతాడు సుభాష్. ఆస్తి మొత్తం మీరే అనుభవించాలా? మాకేం వద్దా అని ప్రశ్నిస్తాడు రాహుల్. తల్లిని కాల్చేయబోతుండగా రాజ్ వచ్చి అడ్డుపడతాడు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావా? అడిగితే ఇచ్చేసేవాడిని అంటాడు రాజ్. నీతో ఇదే ప్రాబ్లమ్.. నీలో నాకు నచ్చనిది ఇదే అంటాడు రాహుల్. నిన్ను నా తమ్ముడిలా చూసుకున్నానని రాజ్ చెబుతాడు. మరి నీ తమ్ముడికి వాటా ఇచ్చినట్లు నాకెందుకు ఇవ్వలేదు.. పిచ్చోడిలా నా ముఖాన ఓ కంపెనీ ఎందుకు పడేశావు? ప్రతిక్షణం నిన్ను నా నీడలా చూసుకున్నాను. నా పక్కనే పెట్టుకున్నాను అంటాడు రాజ్.

ప్రతిక్షణం నీ నీడలా పెట్టుకుని నన్ను చీకట్లో పడేశావు.. నువ్వు వెలిగిపోతే నేను చీకట్లో మగ్గిపోయాను. పేరు, ప్రతిష్ట, చప్పట్లు అన్నీ నీకే.. మరి నాకు అవమానాలు మాత్రమే మిగిలాయ్. ఆ ఇంటికి వారసుడిగా నువ్వు పెరిగితే, ఆ ఇంటికి బానిసలా నేను బతికాను అంటాడు రాహుల్. వెలుగులో తలెత్తుకుని బతికే బతుకు నీది.. నీ వెనుక చీకట్లో తలదించుకుని బతికే బతుకు నాది అని చెబుతాడు. భూమిలో నాటిన విత్తనం కూడా భూమిని చీల్చుకుని బతికొచ్చినట్లు.. ఈరోజు నేను వచ్చానని అంటాడు. నీ కళ్లు ముందు కనిపిస్తున్న నిజాన్ని చూడు.. నీ మీద పెంచుకున్న ద్వేషాన్ని చూడు అని చెబుతాడు. రాహుల్‌‌ నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో అతని చేతిలో నుంచి రాజ్ గన్ లాక్కోబోతుండగా తుపాకీ పేలి బుల్లెట్ రాహుల్‌కి తగులుతుంది. వెంటనే గన్ లాక్కొని రాహుల్‌ని కాల్చి చంపుతాడు రాజ్. అది చూసిన రేఖ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X