Brahmamudi February 26th Episode: భద్రకాళిలా రుద్రాణిని చంపేసిన కావ్య.. బిడ్డలతో అనాథగా అపర్ణ

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యాన్ సడెన్‌గా ఆగిపోయి అప్పూ, కావ్యలు దిగడంతో రాహుల్ - రేఖలు షాక్ అవుతారు. మేం అక్కడ ఎంజాయ్ చేస్తుంటే .. మా అక్క ఒక్కటే ఇక్కడ ఉండిపోయిందని స్వప్నని ఇద్దరూ కలిసి తీసుకెళ్తారు. స్వప్న వ్యాన్ ఎక్కిందని మన ప్లాన్ ఆపేద్దామని రుద్రాణితో అంటాడు రాహుల్. నీకు పెళ్లాం కావాలా? ఆస్తి కావాలా? అని రుద్రాణి నిలదీయడంతో ఆస్తే కావాలని చెబుతాడు రాహుల్. శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరికి రాగానే వ్యాన్‌ని రిమోట్‌తో పేల్చేస్తుంది రుద్రాణి. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మంటల్లో కాలిపోతారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిఉంటాయి.

ఇంతలో అపర్ణకి స్పృహ వచ్చి.. విగతజీవులుగా పడిఉన్న తన కుటుంబాన్ని చూసి ఏడుస్తుంది. ఇంతలో సుభాష్‌కి స్పృహ వచ్చి తన చేతిలో ఉన్న అప్పూ బిడ్డని ఇస్తాడు. కావ్య పొత్తిళ్లలో ఉన్న బిడ్డను కూడా తీసుకుని అపర్ణ ఏడుస్తుండగా రాహుల్ గన్‌తో వచ్చి అపర్ణని కాల్చబోతాడు. ఇదంతా నేను, మా అమ్మ కలిసి చేయించానని చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. నిన్ను కూడా చంపేస్తానని తుపాకీ గురిపెట్టగా రాజ్ అడ్డుకుంటాడు. ఈ పెనుగులాటలో గన్ పేలి బుల్లెట్ రాహుల్‌కి తగులుతుంది, ఆ వెంటనే రాజ్ గన్ లాక్కొని రాహుల్‌ని కాల్చి చంపుతాడు. ఇది చూసిన రేఖ, రుద్రాణిలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 26వ తేదీ ఎపిసోడ్ 966లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 26th 2026 Episode 966 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాహుల్‌ని చంపడంతో రాజ్‌ని వెనుక నుంచి వచ్చి కొడుతుంది రుద్రాణి. దాంతో రాజ్ కిందపడిపోతాడు. నీ ప్లాన్‌ని సక్సెస్ చేయలేకపోయానని చెప్పి రాహుల్ కన్నుమూస్తాడు. కొడుకు చనిపోవడంతో రగిలిపోయిన రుద్రాణి... రాజ్‌ని కొట్టి కొట్టి చంపుతుంది. నా వారసుడిని నువ్వు చంపావు కదా? ఇప్పుడు నీ వారసురాలిని నేను చంపుతానని వెళ్తుంది రుద్రాణి. దాంతో కావ్యను రాజ్ నిద్రలేపుతాడు. మన పిల్లల్ని కాపాడలేకపోయాను, నువ్వే వాళ్లని కాపాడాలి. నీ కడుపులో పెరిగిన మన కూతురి కోసం నీ ప్రాణమైనా వదులుకోవడానికి సిద్ధపడ్డావు కదా? ఇప్పుడు ఆ పాపే ప్రమాదంలో ఉంది, తనని కాపాడు. మన ప్రేమ ఎప్పుడు చెరిగిపోదు, శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతూ కన్నుమూస్తాడు రాజ్.

పిల్లల్ని ఏమీ చేయొద్దని బతిమలాడుతుంది అపర్ణ. ఒకప్పుడు నేను కూడా నిన్ను ఇలాగే బతిమలాడాను, కానీ నన్ను అవమానించి ఇంట్లోంచి గెంటేశారు. అప్పుడు జాలి అనిపించలేదా నీకు అని అంటుంది రుద్రాణి. నీ కాళ్లు పట్టుకుంటాను, వదిలేయమని అడుగుతుంది అపర్ణ. పిల్లల్ని రుద్రాణి కాలుస్తుండగా కావ్య స్పృహలోకి వచ్చి కర్రతో రుద్రాణి చేతిలో ఉన్న గన్‌ని కిందపడేస్తుంది. నా ప్రాణం అడ్డుగా పెట్టయినా సరే, పిల్లల్ని కాపాడతానని చెబుతుంది కావ్య. నేనుండగా అది జరగనివ్వను.. నా కొడుకుని నాకు దూరం చేసిన మీ కుటుంబంలో ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదని అంటుంది రుద్రాణి. నువ్వు నీ కొడుకు ఏమైనా దానధర్మాలు చేశారా? వందేళ్లు బతకడానికి.. మా కుటుంబాన్ని చంపాలనుకున్నాడు, వాడికి మా ఆయన చేతుల్లో సరైన గతే పట్టింది. ఇక మిగిలింది నువ్వే.. రోడ్డు పాలు కావాల్సిన నీ జీవితాన్ని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టింది ఈ కుటుంబం. అడుక్కు తినాల్సిన నీ కొడుకుని మహారాజులా చూసుకుంది. తిన్నంటి వాసాలు లెక్కపెట్టే నీకు బతికే అర్హత లేదని అంటుంది కావ్య.

నువ్వేమైనా మీర్జాపూర్ యువరాణిని అనుకుంటున్నావా? బొమ్మలకు రంగులేసుకుని బతికే దానివి అని మండిపడుతుంది రుద్రాణి. నేను కుండలు అమ్ముకుని బతికినా, నీలాగా దిగజారిపోయిన బతకలేదని అంటుంది కావ్య. ఈ నీతి మాటలు చెప్పి ఈ ఇంటికి మహారాణిలా కూర్చొన్నావు.. నువ్వొచ్చినప్పటి నుంచే నేను అనుకున్నది ఏది జరగలేదు. నువ్వు అడ్డుపడకపోయుంటే ఈపాటికి నా కొడుకుని మహారాణిని చేసేదానిని అంటుంది రుద్రాణి. కళ్ల ముందు శవంలా పడున్నాడు కదా? తీసుకెళ్లి పాడి మీద మహారాజులా ఊరేగించమని చెబుతుంది కావ్య. నా కొడుకు నిజంగానే మహారాజు.. రాజు శవం ఎప్పుడూ ఒంటరిగా వెళ్లదు, తనతో పాటు పదిమందిని తీసుకెళ్తుంది, మీ అందరినీ చంపి వాడికి తోడుగా పంపిస్తానని చెబుతుంది రుద్రాణి.

కావ్యని విసిరి కొట్టగా ఆమె నేల మీద పడిపోతుంది. నీ కళ్ల ముందే నీ కూతురిని చంపుతానని గన్‌తో రుద్రాణి కాల్చబోతుండగా.. పక్కనే ఉన్న అమ్మవారి దగ్గరున్న త్రిశూలంతో రుద్రాణిని పొడిచి చంపుతుంది కావ్య. నా కూతురి బాధ్యత ఇక మీ చేతుల్లో పెడుతున్నానని అత్తగారికి చెబుతుంది కావ్య. నీకు ఏం కాదు.. ఆసుపత్రికి వెళ్దామని అంటుంది అపర్ణ. మీ అబ్బాయితో నాకు మూడు ముళ్లు పడినప్పుడే నాకు బ్రహ్మముడి పడిపోయింది, తను లేకపోతే నేనుండలేను, నా కథ ఇక్కడితో ముగిసిపోయింది నాకొక మాట ఇవ్వండి. ఏం జరిగినా సరే మీరు నా కూతురితో ఉండాలి, తన భవిష్యత్‌ని నేను ఆశపడినట్లుగా తీర్చిదిద్దండి. మన దుగ్గిరాల ఇంటిపేరును నా కూతురికి అందివ్వమని మాట తీసుకుని కావ్య ప్రాణాలు విడుస్తుంది.

ఇంతలో దూరంగా ఎగిరిపడి స్పృహలోకి వచ్చిన రేవతి కొడుకు అమ్మ.. అమ్మ అని అరుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు. ఇంతలో ఓ కుటుంబం శ్రీశైలంలో మల్లిఖార్జునస్వామిని దర్శించుకుని వస్తుంటారు. నిద్రవస్తే కాసేపు పక్కనే ఆపి పడుకో.. అసలే ఇది ఘాట్ రోడ్. జరగరానిది జరిగితే ఖర్చుపెట్టడానికి మా దగ్గర రూపాయి కూడా లేదని డ్రైవర్‌తో చెబుతాడు భర్త. ఇంతలో రేవతి కొడుకు రోడ్డు మీద పడిపోవడంతో స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యిందని, ఏదైనా జరిగితే నేను ఇరుక్కుపోతానని డ్రైవర్ పారిపోతుండగా ఆ భార్యాభర్తలు మాత్రం స్వరాజ్‌ని ఆసుపత్రికి తీసుకెళ్తారు.

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన అపర్ణ.. పసిబిడ్డల్ని తీసుకుని ఆసుపత్రికి వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకుంటుంది. నాతో నా కుటుంబం ఉంది.. వాళ్ల నవ్వులు, వాళ్ల ఆనందం చూస్తుంటే స్వర్గమే కళ్లముందుకు వచ్చిందా? అనిపించింది. కానీ ఒక్క క్షణంలోనే అవన్నీ అగ్గిలో పడి కాలి బూడిద అయిపోయాయి. వాళ్లందరి చావు, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేసి హాస్పిటల్ గుమ్మంలోకి విసిరేసింది. నా భర్తను జీవచ్ఛవంలా చేసింది. ఇదంతా ఓ పీడకల అని నా కొడుకొచ్చి నన్ను నిద్రలేపితే బాగుండు, నా కుటుంబం అంతా నా దగ్గరి వస్తే బాగుండు అని అపర్ణ కంటతడి పెడుతుంది. పిల్లలకు ఏం కాలేదని అంతా బాగున్నారని చెబుతాడు డాక్టర్. సుభాష్ వెన్నెముక విరిగిపోయిందని ఆయన లేచి నడవటం కష్టమని డాక్టర్ చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X