Brahmamudi February 28th Episode: కావ్య బిడ్డపై కత్తి, సుభాష్‌కి చిత్రహింసలు.. అపర్ణతో ఆస్తి రాయించుకున్న రేఖ

Photo Courtesy: JioHotstar

సుభాష్ గారు జీవితంలో మళ్లీ నడవలేరని.. ఇక మంచానికే పరిమితమని డాక్టర్ చెప్పడంతో అపర్ణ వెక్కివెక్కి ఏడుస్తుంది. మా కంటూ ఎవరు లేరు.. మేం ఎవరి కోసం బతకాలని బాధపడుతుంది. ఇంతలో రేఖ అక్కడికి వచ్చి.. నేను మీకు అండగా ఉంటాను. కన్నకూతురిలా చూసుకుంటానని చెబుతుంది. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. మీ అమ్మ, అన్నయ్య ఈ కుటుంబానికి చేసింది చాలు అంటుంది. ఒంటరి ఆడదాన్ని నా మీద కొంచెం జాలి చూపించమని అడుగుతుంది రేఖ. పాతికేళ్ల క్రితం మీ అమ్మ కూడా మా మామగారి దగ్గరికి వచ్చి ఇలాగే జాలి చూపించమని అడిగి ఆదరించిన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసిందని మండిపడుతుంది. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టి మిగిలిన పిల్లల్ని కూడ చంపేద్దామని అనుకుంటున్నావా? అంటుంది.

అపర్ణ మాటలతో రేఖలో కోపం తెంచుకుంటుంది. మా అమ్మ, అన్నల పగని నేను సాధిస్తాను. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో ఎవ్వరినీ బతకనివ్వనని అనుకుంటుంది. వెంటనే తన ప్రియుడి దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నీకు నా ఆస్తితో పాటు సంఘంలో పరువు, ప్రతిష్టల్ని కూడా ఇస్తానని చెబుతుంది. నేను, నా భర్త కూడా నీతో పాటు మీ ఇంట్లోనే ఉంటామని ప్రియుడి అక్క చెప్పడంతో రేఖ సరేనని అంటుంది. కుటుంబమంతా చనిపోయి ఒంటరిగా మిగిలిన సుభాష్, అపర్ణ ఏడుస్తుంటారు. ఇంతలో అక్కడికి రేఖ తన భర్తతో కలిసి వస్తుండగా అపర్ణ మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్ 968లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 28th 2026 Episode 968 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టబోతున్న రేఖను అపర్ణ అడ్డుకుంటుంది. అయినప్పటికీ రేఖ లోపలికి వచ్చేస్తుంది. పవర్‌లో లేని పొలిటిషన్‌కి, అన్ని కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద మాటలకు ఎలాంటి విలువ ఉండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ల మాటలు ఎవ్వరూ వినరు, ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే ఎలా పాలించగలవు. అందుకోసమే నేను వచ్చాను.. పెళ్లి చేసుకుని మందిమార్బలంతో వచ్చాను అంటుంది రేఖ. ఈ దుగ్గిరాల ప్రాపర్టీని చూసుకోవడం మీ వల్ల కాదు.. మా చేతుల్లో పెడితే కంటికి రెప్పలా చూసుకుంటానని అంటుంది. నువ్వు తలచుకుంటే ఈ ఇంటి ముందు గడ్డిపోచను కూడా కదపలేవు.. కానీ నేను అనుకుంటే నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడు తినిపిస్తానని అంటుంది అపర్ణ.

ఒకసారి నీ కొడుకుని చంపిన మా అమ్మని గుర్తుచేసుకో.. నీ కొడుకు తలని పగులగొట్టి తన ప్రాణాన్ని పంచభూతాల్లో కలిపేసిన నా తల్లి గుర్తొచ్చిందా? మా అమ్మే అంత చేసినప్పుడు.. తన రక్తాన్ని పంచుకుపుట్టిన నేను ఎంత చేయగలను అని ప్రశ్నిస్తుంది రేఖ. కళ్లముందు కుటుంబం కాలిపోతున్నా చూస్తూ బతకగలిగావు.. కొడుకు, కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా భరించగలిగావు. మరి అదే కళ్లముందు నీ వారసురాలిని చంపేస్తే ఇలాగే చూస్తూ నిలబడగలవా అని బెదిరిస్తుంది. దాంతో రేఖ భర్త.. బిడ్డను చంపాలని చూస్తాడు. ఆ వెంటనే రేఖ వదిన కర్రతో సుభాష్‌ని కొట్టడంతో అతను కిందపడిపోతాడు.

నా తల్లిని చంపిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాను.. నా మాటకు ఎదురుచెప్పకుండా ఈ పేపర్ల మీద సంతకాలు చేయమని చెబుతుంది రేఖ. నా చేత సంతకాలు చేయించి మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ చేశావా? అని అడుగుతుంది అపర్ణ. ఆస్తి కోసం అంత దూరం వెళ్లడానికి కూడా నేను సిద్ధమే. నేను సంతకం చేస్తే ఆస్తే కాదు.. ఈ ఇంట్లో ఆవగింజ కూడా నీ సొంతం కాదని అంటుంది అపర్ణ. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది.. ఇప్పుడు తను చనిపోయింది కాబట్టి, లీగల్‌గా ఈ ఆస్తి మొత్తం కావ్య కూతురికి చెందుతుంది. తనకి పాతికేళ్లు వచ్చేవరకు నేను కూడా గార్డియన్‌గా మాత్రమే ఉంటాను. కాదు కూడదని నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఈ ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కి వెళ్లిపోతుందని చెబుతుంది అపర్ణ. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది.

మీ అమ్మ గుంట నక్కలా తిరుగుతోందని.. నా కొడుకు, కోడలు పకడ్బందీగా డాక్యుమెంట్స్ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు ఏం చేయలేవని అంటుంది అపర్ణ. ఈ విషయం తెలిసే నువ్వు మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావా అని మండిపడుతుంది వదిన. దాంతో కోపంతో అపర్ణని కొడుతుంది రేఖ. ఇప్పుడు మనకి ఆస్తి దక్కకపోతే ఏంటీ.. ఈ పాపకి పాతికేళ్లు వచ్చాక ఆస్తిని మన సొంతం చేసుకుందామని అంటుంది రేఖ. గార్డియన్‌గా నేనుంటాను, దీనిపై సంతకం పెట్టు.. లేదంటే నీ మనవరాళ్లతో పాటు నడుము విరిగిపోయిన నీ మొగుడు కూడా చస్తాడని బెదిరిస్తుంది రేఖ. ఆస్తి దక్కనప్పుడు కనీసం పగైనా చల్లారాలని అంటుంది. చివరికి అపర్ణ సంతకం చేసేస్తుంది. ఇకపై నేనే ఈ ఇంటికి మహారాణిని, నా పర్మిషన్ లేకుండా ఏం చేయొద్దని ఆర్డర్స్ వేస్తుంది అపర్ణ. స్వరాజ్‌ని నీ పేరు ఏంటీ? మీ అమ్మనాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు కానీ ఏం చెప్పలేకపోతాడు. పిల్లాడికి భోజనం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు.

రేఖ వచ్చి ఆస్తిని లాక్కోవడంతో సుభాష్, రేఖలు బాధపడతారు. నా బాధ నువ్వు చేసిన సంతకం గురించి అని చెబుతాడు సుభాష్. కళ్లముందే నా అనుకున్న వాళ్లంతా దూరమైనా, కనీసం మనవరాళ్లనైనా కాపాడుకుందామని అనుకున్నాం. కానీ చివరికి పవర్ మొత్తం రేఖ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు రుద్రాణి మేకతోలు కప్పుకుని గుంటనక్కలా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తనేంటో తెలుసుకోకుండా తప్పు చేశాం. ఇప్పుడు రేఖ గురించి తెలిసి కూడా మళ్లీ తనకి అధికారం ఇచ్చి తప్పు చేశావని అంటాడు సుభాష్. ఆ దేవుడు నాకు మార్గం లేకుండా చేశాడు, రేఖ ఎలాంటిదో కళ్లారా చూశాక కూడా దానికి ఎదురెళ్లలేనని చెబుతుంది అపర్ణ. జైలుకు వెళ్లినా అది మళ్లీ బయటకు వస్తుంది.. రుద్రాణి లాగే కంటికి కనిపించని శత్రువులా తయారవుతుంది, ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక భయపడాల్సిందేనని చెబుతుంది.

రుద్రాణిని మనం దూరంగా పెట్టడం వల్లే కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్నామని అంటుంది అపర్ణ. రేఖ ఇక్కడే ఉంటే మన మనవరాళ్ల జీవితం ప్రశ్నార్ధకం అవుతుందని అంటాడు సుభాష్. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మనవరాళ్లను కాపాడటమే మన ముందున్న లక్ష్యమని చెబుతుంది అపర్ణ. మనం ఇంకా ప్రాణాలతో ఉన్నామంటే పిల్లల కోసమే.. నువ్వే వాళ్లకు అండగా నిలబడాలి, నీకు అండగా ఉండాల్సిందిపోయి, భారంగా తయారయ్యాను అని సుభాష్ భాధపడతాడు. ఇన్నాళ్లు మీరు నన్ను చూసుకున్నారు.. ఇకపై నేను మిమ్మల్ని చూసుకుంటానని అంటాడు సుభాష్. ప్రమాదం గుర్తొచ్చి నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు స్వరాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X