Brahmamudi February 2nd Episode: రాజ్, కావ్యల ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి.. రాజ్ ఫ్యామిలీపై మినిస్టర్ కన్ను
Photo Courtesy: JioHotstar
ఇంట్లో గొడవ జరిగిన తర్వాత పాపను ఆడిస్తున్న కావ్య దగ్గరికి వెళ్లి ఇప్పటికైనా నీ మనసు మార్చుకోమని చెబుతాడు రాజ్. దాంతో ఆసుపత్రిలో తనకు డాక్టర్‌కు జరిగిన సంభాషణను చెబుతుంది. అలాగే మినిస్టర్ నర్స్‌తో కలిసి తన బిడ్డను ఎలా మార్చింది.. ఎలా నాటకం ఆడింది అన్ని వివరాలు కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నా మాటల మీద మీకు నమ్మకం రావడం లేదా? అని వెంటనే భర్తను తీసుకుని మినిస్టర్ ధర్మేంద్ర ఇంటికి దొంగచాటుగా తీసుకెళ్తుంది కావ్య. అక్కడ బిడ్డను తులసి ముద్దు చేస్తూ ఉంటుంది. తులసి, ధర్మేంద్రలు భోజనం చేయడానికి వెళ్లగానే పాపని ముద్దాడుతూ మురిసిపోతుంది కావ్య. పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చని చూపించడంతో రాజ్ షాక్ అవుతాడు.
ఆ వెంటనే బిడ్డ ఏడ్చిన అలికిడికి ధర్మేంద్ర, తులసి పైకి వచ్చి చూస్తారు. నువ్వు చెబుతుంటే నేను నమ్మలేకపోతున్నా.. ఎంత ధైర్యం ఉంటే మన బిడ్డని మార్చేస్తాడని కావ్యతో అంటాడు రాజ్. మన బిడ్డను దక్కించుకోవడానికి నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానని చెబుతాడు. మనకి ఈ సమయంలో సాయం చేయగలిగింది ఆ తులసి గారే. అటు నుంచి నరుక్కుని రావాలని రాజ్‌తో అంటుంది కావ్య. మరుసటి రోజు కావ్య, తులసిలు తమ బిడ్డల్ని తీసుకుని ఆసుపత్రికి వస్తారు. అక్కడ రాజ్‌ని తులసికి పరిచయం చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ ఎపిసోడ్ 945లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తులసి ఒడిలో ఉన్న తన బిడ్డ ఆకలితో ఏడుస్తుండటంతో నేను పాలిస్తానని కావ్య చెబుతుంది. బిడ్డ ఆకలి తీరుస్తానంటే ఇందులో అభ్యంతరం ఏముంటుంది అని అంటుంది తులసి. ఇంకొకరి పాలిస్తే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని తులసి భయపడుతుండగా.. ఏం కాదని చెబుతుంది డాక్టర్. దాంతో తన బిడ్డకు పాలు ఇవ్వడానికి తులసి ఒప్పుకుంటుంది. తన బిడ్డకు పాలు ఇవ్వడంతో కావ్య పొంగిపోతుంది. తప్పు ఎవరు చేసినా ఈ అమ్మకి దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు.. దీనికి కారణం నేను కాకపోయినా, నీకు గుక్కెడు పాలు ఇవ్వలేకపోయానని బాధపడుతుంది కావ్య. ఇదంతా చూసిన రాజ్ ఎమోషనల్ అవుతాడు. అటువైపు... తన సొంత బిడ్డను తులసి ఆడిస్తుంది.
మీ వల్లే మా పాప ఏడుపు ఆపింది.. మీ వల్లే తన ఏడుపు ఆపిందని పాపని ఇవ్వమని తులసి అడగ్గా కావ్య బాధపడుతుంది. మనిద్దరికీ ఏదో రుణానుబంధం ఉన్నట్లుగా ఉంది. లేకపోతే ప్రతిసారి మా పాపకు మీరే సాయం చేస్తున్నారు. ఆరోజు గుడిలో ఏడిస్తే పాట పాడి ఊరుకోబెట్టారు.. ఈరోజు నా పాప ఆకలి తీర్చారు. మీ రుణాన్ని పెంచుకుంటూ పోతున్నారని అంటుంది తులసి. నేను కూడా తల్లినే బిడ్డ ఆకలికి రుణం అని పేరు పెట్టడం సరికాదుని అంటుంది కావ్య. నా కోసం ఇంత చేసిన మీకు నేను ఏదైనా చేయాలని చిన్న ఆశ అంటుంది తులసి. పాపను బాగా చూసుకుంటే నాకు అదే చాలని కావ్య చెబుతుంది. పాప నా ప్రాణం.. మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా వారు తలచుకుంటే మీ సమస్య ఇట్టే తిరిపోతుందని అంటుంది తులసి. మీరు చెప్పారు కదా రాకుండా ఉంటామా అంటాడు రాజ్.
ఆ దేవుడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు.. నా బిడ్డకు నేను పాలివ్వడానికి, నా బిడ్డను ఇంకొక్క నిమిషం హత్తుకోవడానికి, ఇంకొకరిని అడగాల్సి వస్తోందని కావ్య బాధపడుతుంది. నా పాప అలా వెళ్లిపోతుంటే నా ప్రాణాన్ని ఎవరో పట్టుకుని తీసుకుని వెళ్లిపోతున్నట్లుగా ఉందని అంటుంది కావ్య. ఆ దేవుడు మన పాపని దూరం చేయడం లేదు. నీకు దగ్గర చేస్తున్నాడని అంటాడు రాజ్. మన పాప త్వరలోనే మన దగ్గరికి తిరిగిస్తుంది.. లేకపోతే ఆ దేవుడు ఇలా చేయడు అంటాడు రాజ్. ఆ బిడ్డ మళ్లీ మళ్లీ నీ దగ్గరికే వస్తున్నాడంటే నీకు అర్ధం కావడం లేదా అని చెబుతాడు.
పాప జాతకం చూపించడానికి దుగ్గిరాల ఫ్యామిలీ పంతులుగారిని పిలిపిస్తుంది. పాపది మహర్జాతకం, కాకపోతే.. పాప జీవితంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి.. అయినా అనుకున్నది సాధిస్తుంది, మహారాణి జాతకం. పాప పుట్టగానే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని.. తన ఆరోగ్యం ఎలా ఉంటుందోనని టెన్షన్‌గా ఉందని అంటుంది అపర్ణ. జాతకంలో అలాంటి అడ్డుంకులు, సమస్యలు ఏమీ చూపించడం లేదని అంటాడు పంతులు. పాపను కన్న తల్లిదండ్రుల జాతకాన్ని బట్టి పాప ఆయుష్య రేఖ చాలా బలంగా ఉంది. నిండు నూరేళ్లు హాయిగా ఉంటుంది.. ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో, జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు సహజమని అంటాడు పంతులు. పాపకి బారసాల దగ్గరికి వస్తోంది.. దానికి మంచి ముహూర్తం పెట్టమని అడుగుతుంది ఇందిర.
ఇంతలో రేఖ వచ్చి.. ఇప్పుడు కావ్య ఉన్న పరిస్ధితి మీకు తెలుసు కదా? మీరేమో బారసాల అంటున్నారు.. కావ్య ఏమో పాప.. పాప అంటోంది. ఇప్పుడు దీనికి కావ్య ఒప్పుకుంటుందా అని రేఖ ప్రశ్నిస్తుంది. బిడ్డకు పాలే ఇవ్వని తల్లి.. బారసాల చేసి లాల పోస్తుందా అని అడుగుతుంది రేఖ. దాంతో అపర్ణ, ఇందిరలు ఆమెపై మండిపడతారు. మళ్లీ ఈ ఇంట్లో ఏ గొడవలు రాకూడదని ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నానని అంటుంది రేఖ. కావ్య మారిపోయింది.. తన కూతురేనని ఒప్పుకుంది, పాప ఆలనా పాలనా తనే చూసుకుంటుందని చెబుతుంది అపర్ణ.
బిడ్డ గురించి, తులసి గురించి ఆలోచిస్తున్న మినిస్టర్‌ని రుద్రాణి ఓదారుస్తుంది. దాని ఇంటిలోనే అది పిచ్చిది అయిపోయింది.. అలాంటిది మిమ్మల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదని అంటుంది రుద్రాణి. ఇంతలో రాజ్, కావ్యలు మినిస్టర్ ఇంటికి రావడంతో రుద్రాణి, ధర్మేంద్రలు షాక్ అవుతారు. రేపో మాపో బజారున పడటానికి రెడీగా ఉన్నవాడికి భయం ఎందుకు ఉండదు అంటాడు రాజ్. తప్పు చేస్తున్నావు.. భ్రమలో నుంచి బయటకురా, మన దగ్గర మన బిడ్డే ఉంది కదా అని కావ్యను వారించాను. కానీ పేగుతెంచి ప్రాణం పోసిన కన్నతల్లి గుండె భ్రమపడదని అంటాడు రాజ్. ఎవరో నీచుడు తన భార్య కోసం, తన ఆనందం కోసం ఇంకోకరి బిడ్డనే మార్చడానికి సిద్ధపడ్డాడు.. అలాంటిది రక్తం పంచి నా బిడ్డను నే చేతుల్లో పెట్టిన నా భార్యను ఎందుకు నమ్మలేకపోయానని బాధపడ్డానని అంటాడు రాజ్. నా భార్య చేయి పట్టుకుని నా బిడ్డ కోసం మీ గుమ్మంలోకి వచ్చేశానని చెబుతాడు.
నేను ఏం చేయగలనో, ఎంతకు తెగించగలనో మీకు తెలియదని మినిస్టర్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో తులసి రావడంతో ధర్మేంద్ర సైలెంట్ అయిపోతాడు. బిడ్డ కోసం కావ్య ఎంతో బాధపడుతోందని వాళ్ల బిడ్డను వాళ్లకు అప్పగించడంలో మీరే సాయం చేయాలని అంటుంది తులసి. వాళ్ల రుణం మనం తీర్చుకోవడం ఏంటీ అని ధర్మేంద్ర అడుగుతాడు. ఈరోజు మన పాప బోరున ఏడుస్తుంటే పాపకి పాలుపట్టి మన పాప ఆకలి తీర్చిందని చెబుతుంది తులసి. ఆ మాటలు వినగానే మినిస్టర్, రుద్రాణిలు షాక్ అవుతారు. వివరాలన్నీ మా ఆయనకి చెప్పండి ఖచ్చితంగా మీ పాపని మీకు చేర్చే పూచీ మా వారిదే అంటుంది తులసి. తులసి లోపలికి వెళ్తుండగా ఒక్కసారి మీ పాపని ఎత్తుకోవచ్చా అని కావ్య అడగటంతో ధర్మేంద్ర, రుద్రాణిలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











