Brahmamudi February 3rd Episode: దుగ్గిరాల ఫ్యామిలీలో రుద్రాణి చిచ్చు.. రాజ్ ఫ్యామిలీపై ధర్మేంద్ర హత్యాయత్నం
Photo Courtesy: JioHotstar
తులసి ఒడిలో ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోన్న తన పాపకి కావ్య పాలు ఇస్తుంది. అది చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. మీరు నా బిడ్డకు, నాకు చాలా సాయం చేశారు.. మీకు కూడా నేను సాయం చేస్తానని రాజ్, కావ్యలను ఇంటికి రమ్మంటుంది తులసి. నా బిడ్డకు నేను పాలు ఇవ్వడానికి కూడా ఒకరి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని రాజ్ దగ్గర బాధపడుతుంది కావ్య. పాపకు బారసాల చేయాలని, ఆమె జాతకం చూడాలని పంతులుగారిని పిలిపిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. చిన్నారి మహర్జాతకురాలని.. ఆమెకు తిరుగులేదని పంతులు చెప్పడంతో అంతా సంతోషిస్తారు. పాపకి హెల్త్ ప్రాబ్లమ్ అని దుగ్గిరాల ఫ్యామిలీ చెబుతుండగా.. అలాంటివేవి లేవని పంతులు అంటాడు.
ఇంతలో రేఖ వచ్చి.. పాపకి పాలే ఇవ్వడానికి ఒప్పుకోని కావ్య.. బారసాలకు ఒప్పుకుంటుందా? అని ప్రశ్నిస్తుంది. దాంతో అపర్ణ, ఇందిరలు ఆమెపై మండిపడతారు. ధర్మేంద్ర, రుద్రాణిలు మాట్లాడుకుంటూ ఉండగా రాజ్, కావ్యలు మినిస్టర్ ఇంటికి వస్తారు. వాళ్లని చూసి రుద్రాణి దాక్కుంటుంది. మర్యాదగా చేసిన తప్పుని ఒప్పుకుని నా బిడ్డను నాకు ఇవ్వమని ధర్మేంద్రకు రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్ 946లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మినిస్టర్ ఇంటి నుంచి వెళ్తూ ఒక్కసారి మేం బిడ్డను ఎత్తుకోవచ్చా అని కావ్య అడగటంతో తులసి ఇస్తుంది. బిడ్డను హత్తుకుని కావ్య పొంగిపోతుంది. మేం మీ ఫ్యామిలీ జోలికి రావడం తప్పే... కానీ దీనికి కారణం మీరే. మీ స్వార్ధం కోసం మా బిడ్డను మాకు దూరం చేశారు. అందుకే మీ భార్యకు దగ్గరయ్యాం.. మీ ఆవిడ కలిసినప్పుడే నిజం చెప్పడం మాకు చాలా చిన్న విషయం. కానీ ఆ తల్లిని చూస్తే జాలి వేసింది. నిజం చెప్పి తనని బాధపెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ ఆ నిజం, నువ్వు చేసిన తప్పు .. నువ్వే నీ భార్యకు చెప్పాలి, నువ్వే కన్విన్స్ చేయాలని వార్నింగ్ ఇస్తాడు రాజ్. నా భార్య నీకు 15 రోజులు గడువిచ్చింది.. ఆ లోపు నువ్వే నాకు బిడ్డను తిరిగి అప్పగించాలి, లేదంటే జరిగే నష్టం మీకు తెలుసు అంటాడు రాజ్. అతని మాటలతో మినిస్టర్ రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి.. ఆ రాజ్ గాడు దానిని అంత తేలికగా ఎలా నమ్మాడో అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్లు మళ్లీ నా గడప తొక్కకూడదని అడుగుతాడు మినిస్టర్.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ... బారసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్యలు అక్కడికి వస్తారు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పడంతో కావ్య, రాజ్ షాక్ అవుతారు. దుగ్గిరాల వారి వారసురాలి బారసాల చేయాలి కదా? వచ్చే వారమే ముహూర్తం.. పంతులు గారు చెప్పారని అని ఇందిర అంటుంది. కూతురి బారసాల అంటే ఏం మాట్లాడరేంటీ అని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఇప్పుడే మీ నాన్నగారికి, బాబాయ్‌కి చెప్పాను. నా ముని మనవరాలి బారసాల అంటే చాలా గొప్పగా చేయాలని, అందుకే పనులన్నీ ఈరోజే మొదలుపెట్టమని చెప్పానని అంటుంది ఇందిర. పరిస్ధితులు తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు.. డాక్టర్ ఇప్పుడిప్పుడే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు, పాపని అలా చూస్తు బారసాల ఏంటో చెప్పు అంటాడు రాజ్.
నేను పాపకు బారసాల చేయొద్దు అనడం లేదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే పాప ఆరోగ్యం కుదుటపడ్డాక చేద్దామని అంటాడు రాజ్. 21వ రోజుకు ఏ బిడ్డకైనా ఊయలలో వేసి, నల్లపూసలు కడితే చీడపీడ తొలగిపోతుంది. అందరి ఆనందోత్సాహాల మధ్య బిడ్డ తన ఒంటినిండా బంగారం పెట్టుకుంటే దాని భవిష్యత్ పండగలా ఉంటుందని అంటుంది ఇందిర. పాప ఆపరేషన్ అయ్యే దాకా.. పాప భవిష్యత్ చెప్పే పరిస్ధితి లేనప్పుడు ఈ బారసాలతో ఆనందం ఎలా వస్తుందని ప్రశ్నిస్తాడు రాజ్. బారసాల విషయంలో కొద్దిరోజులు ఆగడం మంచిది.. పాపకి ఆపరేషన్ అయిపోతుంది, అప్పూకి నెలల నిండి తనకు కూడా డెలివరీ అవుతుంది. అప్పుడు ఇద్దరు బిడ్డలకు కలిపి బారసాల చేయొచ్చు కదా అని అడుగుతుంది కావ్య. ఇంకొన్ని వారాల్లో అప్పూకి డెలివరీ అయిపోతుంది.. అప్పుడు పాపకి కూడా నయం అవుతుంది.. ఇద్దరికీ కలిపి బారసాల గ్రాండ్‌గా చేద్దామని అంటాడు కళ్యాణ్. వాళ్లు చెప్పినట్లే చేద్దామని దుగ్గిరాల ఫ్యామిలీ అంగీకరిస్తుంది.
రాజ్, కావ్యలు తనకు వార్నింగ్ ఇవ్వడంతో ధర్మేంద్ర రగిలిపోతుంటాడు. తులసితో పరిచయం పెంచుకుని నా ఇంట్లో అడుగుపెట్టారు... వాళ్ల తెగింపు నాకు నచ్చడం లేదని రుద్రాణితో అంటాడు. మీరంటే ఏంటో? మీ పవర్ అంటే ఏంటో వాళ్లకి తెలియాలని అంటుంది రుద్రాణి. వాళ్లిద్దరికీ భయం లేదు అన్నప్పుడు.. వాళ్ల బలహీనత మీద దెబ్బకొట్టాలని చెబుతుంది. వాళ్ల ఫ్యామిలీయే వాళ్ల బలహీనత.. వాళ్లు మీ ఫ్యామిలీ జోలికి వచ్చారు కాబట్టి, మీరు కూడా వాళ్ల ఫ్యామిలీ జోలికి వెళ్లండి.. మిమ్మల్ని టచ్ చేస్తే భయంతో వణుకు పుట్టాలని అంటుంది రుద్రాణి. మీరు కొట్టే దెబ్బతో మళ్లీ ఈ జన్మలో మీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని రెచ్చగొడుతుంది.
ఉదయాన్నే రాజ్‌కి ధర్మేంద్ర ఫోన్ చేస్తాడు.. నీకు నా గురించి నా పవర్ గురించి తెలియదు. నేను ఉన్న చోటి నుంచి నీ ఇంట్లో ఉప్పెన సృష్టించగలను అని వార్నింగ్ ఇస్తాడు ధర్మేంద్ర. నా ఇంటికొచ్చి.. నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్లాక నేను నీ మీద ఫోకస్ చేయనని ఎలా అనుకున్నావు. నా లాంటి వాడితో పెట్టుకున్నాక జాగ్రత్తగా ఉండాలి. నీకంటూ పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? చూసుకోవాలి. మీ తాతయ్య నాయనమ్మ గుడికి వెళ్లారు... వాళ్లు తిరిగి వస్తారో రారో ఆలోచించవా? అని ప్రశ్నిస్తాడు ధర్మేంద్ర. ఆ మాటలతో రాజ్ కంగారు పడతాడు. ఆ వెంటనే తాతకు ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగేలోగా.. పెద్దవాళ్లిద్దరూ గట్టిగా కేకలు పెడతారు.
ఇంతలో ధర్మేంద్ర మళ్లీ ఫోన్ చేసి మీ అమ్మానాన్నల్ని కాపాడుకోమని చెప్పడంతో రాజ్ కంగారు పడతాడు. వెంటనే సుభాష్‌కి ఫోన్ చేసి ఇంటికొచ్చేయమని చెబుతుండగా వాళ్లిద్దరూ కూడా గట్టిగా కేకలు పెడతారు. ఇంతలో ధర్మేంద్ర మళ్లీ ఫోన్ చేసి వాళ్లను కాపాడుకోలేకపోయావు.. కనీసం నీ తమ్ముడినైనా కాపాడుకోమని చెబుతాడు. అప్పూ - కళ్యాణ్ ఎక్కడున్నారని రాజ్ అడగ్గా.. అమ్మని చూస్తానంటే కళ్యాణ్ తీసుకెళ్లాడని చెబుతుంది కావ్య. ఆ మినిస్టర్ అమ్మానాన్న.. తాతయ్య నాయనమ్మలకు యాక్సిడెంట్ చేయించాడని రాజ్ చెప్పడంతో కావ్య, ప్రకాశంలు షాక్ అవుతారు. ఇంతలో సీతారామయ్య - ఇందిర, సుభాష్ - అపర్ణలు సేఫ్‌గా ఇంటికి రావడంతో రాజ్- కావ్యలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లు వచ్చి మా కారుకు కూడా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
ఒక్కకారుకి జరిగితే యాక్సిడెంట్ అంటారు.. అలాంటిది ఒకే ఇంట్లో మూడు కార్లకు ఒకేసారి యాక్సిడెంట్ జరిగితే అది యాక్సిడెంట్ అవ్వదని అంటుంది ధాన్యలక్ష్మీ. నాకేదో అనుమానంగా ఉందని అనడంతో ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర వచ్చి కరెక్ట్‌గా గెస్ చేశావని అంటాడు. మీ అబ్బాయికి, మీ కోడలికి నేను చాలా బాగా తెలుసు.. మీ ఇంట్లో ఒకేసారి ఆరు శవాలు లేచేవని వార్నింగ్ ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










