Brahmamudi February 4th Episode: ధర్మేంద్రపై రాజ్ కౌంటర్ అటాక్.. తులసి మిస్సింగ్, కావ్య మైండ్‌గేమ్

Photo Courtesy: JioHotstar

మినిస్టర్ ఇంటికి వచ్చిన కావ్య - రాజ్‌లు ధర్మేంద్రతో మాట్లాడుతుండగా తులసి వస్తుంది. ఒకసారి పాపను ఎత్తుకుంటానని కావ్య అడగ్గా.. తులసి సరేనని ఇస్తుంది. ఇదంతా చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. నా భార్య చెప్పినట్లు నీకు 15 రోజులు గడువు ఇస్తున్నా.. ఆ లోగా మా బిడ్డను మాకు తెచ్చి ఇవ్వాలని, మీ ఆవిడ ముందు నిజం ఒప్పుకోవాలని రాజ్ డెడ్‌లైన్ పెట్టి వెళ్లిపోతాడు. పాపకు బారసాల చేయాలని దుగ్గిరాల కుటుంబం చెప్పగా.. రాజ్, కావ్యలు ఇప్పట్లో అలాంటివి వద్దని.. పాప ఆరోగ్యం బాలేదని చెప్పడంతో అంతా సరే అంటారు.

రాజ్ తనకే వార్నింగ్ ఇవ్వడంతో మినిస్టర్ ధర్మేంద్ర రగిలిపోతుండగా.. అతని ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టాలని రుద్రాణి సలహా ఇస్తుంది. దాంతో రుద్రాణి చెప్పిన ప్లాన్‌కు మినిస్టర్ సరేనంటాడు. ఉదయాన్నే రాజ్‌కు ఫోన్ చేసి సీతారామయ్య - ఇందిర, సుభాష్ - అపర్ణ, అప్పూ - కళ్యాణ్‌ల కార్‌లకి యాక్సిడెంట్ చేయించి దమ్ముంటే కాపాడమని సవాల్ విసురుతాడు ధర్మేంద్ర. ఇంట్లో అందరికీ ఒకేసారి ఇలా జరగడంతో దుగ్గిరాల ఫ్యామిలీ కంగారు పడుతుండగా.. ధర్మేంద్ర నేరుగా అక్కడికే వస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 4వ తేదీ ఎపిసోడ్ 947లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 4th 2026 Episode 947 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఈరోజు మీ కార్లకు యాక్సిడెంట్ జరగడానికి, తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణం మీ అబ్బాయి రాజ్, మీ కోడలు కావ్యలే కారణమని అంటాడు ధర్మేంద్ర. దాంతో రాజ్‌కి కోపం వచ్చి మినిస్టర్ కాలర్ పట్టుకుంటాడు. చేసినదంతా చేసి నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నా ఫ్యామిలీని చంపాలని చూస్తావా? నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడతావా అంటూ మండిపడతాడు రాజ్. ఈ ఆవేశమే మిమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చిందని అంటాడు మినిస్టర్. మీ అందరినీ భయభ్రాంతులకు గురిచేసిందని చెబుతాడు. నీ స్వార్ధం కోసం మా వాళ్లని హతమార్చాలని చూసిన రాక్షసుడివి.. నీకేంటీ రా మర్యాద అని థూ అని ఉమ్మేస్తుంది.

ఎవరు ఈయన? మినిస్టర్ అంటున్నాడు? మనమీద ఇంత కక్ష ఏంటీ? అని సుభాష్ అడుగుతాడు. మీవాడు చెప్పలేకపోతున్నాడు.. నేనే చెబుతానని చెబుతాడు. మీకు నాకు ఎలాంటి శతృత్వం లేదు.. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ మీ కొడుకు, కోడలు నా ఫ్యామిలీ జోలికి వచ్చారని ధర్మేంద్ర చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నేను ఊరుకుంటానా? అందుకే నేను నా ఫ్యామిలీ జోలికి, మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఏం జరిగిందో మీ అబ్బాయి చెబుతాడు.. అదంతా విన్న తర్వాత నాలాంటి వాడి జోలికి, నా ఫ్యామిలీ జోలికి రావొద్దని చెప్పండి అందరూ బతికిపోతారు.

కాదు.. కూడదు అని మళ్లీ నా ఇంటి వైపు చూస్తే నేను మళ్లీ మీ ఇంటికి రావాల్సి వస్తుంది. కానీ ఈసారి మీతో చర్చించడానికో, మీకు వివరణ ఇవ్వడానికో కాదు... మీ అందరి ఫోటోలకు దండలు వేయడానికి వస్తానని వార్నింగ్ ఇస్తాడు ధర్మేంద్ర. నీ బెదిరింపులకు మేం భయపడమని కావ్య, రాజ్ అంటారు. కుర్రోళ్లకు ఏం అర్ధం కావడం లేదు. నేనంటే ఏంటో చూసి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు.. మీరే నచ్చజెప్పాలని అంటాడు మినిస్టర్. నా జోలికి వస్తే మీ ఇంట్లో ఎవ్వరూ మిగలరని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

వాడికీ, మీకు ఏంటి సంబంధం.. వాడి జోలికి ఎందుకు వెళ్లారని ప్రకాశం, ధాన్యలక్ష్మీలు నిలదీస్తారు. జరగరానిది ఏదైనా జరుగుంటే కడుపుతో ఉన్న నా కోడలి పరిస్ధితి ఏంటీ? ఒక్కగానొక్క కొడుకు ఏమైపోయేవాడని ధాన్యం మండిపడుతుంది. ఇంట్లో వాళ్లంతా ఏం అడిగినా కావ్య, రాజ్‌లు మౌనంగా ఉండిపోతారు. ఇంట్లో వాళ్ల మాటలకు రాజ్‌కు కోపమొచ్చి నిజం చెప్పబోతుండగా కావ్య ఆపి.. వ్యాపారపరమైన శతృత్వం.. కానీ వాడు ఇంతకు తెగిస్తాడని అనుకోలేదని మమ్మల్ని క్షమించండి అని అంటుంది. ఇంకెప్పుడు ఇలా జరగదని చెబుతుంది కావ్య. ఏ ప్రమాదం కానీ, ఏ శత్రువు కానీ ఈ ఇంటి వైపు రాకుండా మేం చూసుకుంటామని కావ్య అంటుంది.

రాజ్, కావ్యలకు వార్నింగ్ ఇవ్వడంతో రుద్రాణి, ధర్మేంద్రలు పార్టీ చేసుకుంటారు. నువ్వు మామూలు మహిళవి కాదు.. మహా అరుదైన మహిళవని పొగుడుతాడు ధర్మేంద్ర. నువ్వు రాజకీయాల్లోకి వస్తే నన్నే మించిపోతావని అంటాడు. నాకు అలాంటి ఆశలు లేవు.. కేవలం పగ మాత్రమే ఉందని చెబుతుంది రుద్రాణి. నేను వర్కవుట్ అయ్యే ఐడియా మాత్రమే ఇస్తుంది.. నీ భార్య కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉండకూడదు అన్నారు, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కావ్య, రాజ్‌లు ఇకపై మీ ఇంటి గురించి, మీ గురించి ఆలోచించరని చెబుతుంది రుద్రాణి.

నువ్వు చెప్పినట్లు ఆ ఫ్యామిలీ కళ్లలో చావు కనిపించింది. ఆ రాజ్, కావ్యల కళ్లలో భయం చూశానని అంటాడు ధర్మేంద్ర. ఆ కుటుంబంలో ఉన్నవాళ్లంతా సెంటిమెంటల్ ఫూల్స్.. ఎవరి కోసం వాళ్లు బతకరు, పక్కవాళ్లకి కన్నీళ్లు రావొద్దని బతుకుతారు. నా వెనకుండి నన్ను బాగా నడిపిస్తున్నావు.. నీ రుణం తీర్చుకునే అవకాశం మాత్రం నాకు ఇవ్వడం లేదని అంటాడు ధర్మేంద్ర. ఆ సందర్భం ముందుంది.. ఆ ఇంట్లో ప్రళయం, నా కొడుక్కి పట్టాభిషేకం.. ఒకేసారి జరుగుతాయని అంటుంది రుద్రాణి. ఇకవాళ్లు నా కూతురి జోలికి రారు.. నేను, నా భార్య సంతోషంగా ఉంటామని చెబుతాడు ధర్మేంద్ర.

ఇంట్లోవాళ్లకి జరిగినదానికి, మినిస్టర్ నేరు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ రగిలిపోతాడు. వాడితో మనం వైరానికి దిగలేం.. వాడికి డబ్బుతో పాటు పదవి, పలుకుబడి కూడా ఉంది. తెలివిగా దెబ్బ కొట్టాలని చెబుతుంది కావ్య. పవర్‌లో ఉన్నాడని వాడిని మనం ఏం చేయలేమని ఊహల్లో ఉన్నాడు.. వాడిని ఏ పవర్, ఏ పరపతి కాపాడలేవని వాడే ఒప్పుకోవాలని అంటాడు. మనం వాడిని దెబ్బకొట్టాలంటే ఒక సాక్ష్యం కావాలని చెబుతాడు రాజ్. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒకచోట తప్పులు చేస్తాడని ..డాక్టర్ చక్రవర్తి చాలా రోజులుగా కనిపించడం లేదు. మనం ఆ డాక్టర్ ఎక్కడున్నాడో కనిపెడితే చాలని అంటుంది కావ్య. దాంతో భార్యకి రాజ్ ఓ ప్లాన్ చెబుతాడు.

ఉదయాన్నే తన భార్య కనిపించకపోవడంతో ధర్మేంద్ర కంగారుపడతాడు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో టెన్షన్ పడతాడు. ఇంతలో మినిస్టర్‌కి రాజ్ ఫోన్ చేసి మీ ఆవిడ కనిపించడం లేదా అని అడగ్గా ధర్మేంద్ర షాక్ అవుతాడు. నువ్వు నన్ను, నా ఫ్యామిలీని భయపెట్టావు.. కానీ నేను ఈరోజు నీకు లైఫే లేకుండా చేస్తానని అంటాడు రాజ్. నేను నీ భార్యకి నిజం తెలిసేలా చేస్తానని రాజ్ చెప్పడంతో మినిస్టర్ వద్దు వద్దు అని బతిమలాడతాడు. నీ భార్యను డాక్టర్ చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్తానని రాజ్ చెప్పడంతో మినిస్టర్ భయంగా కారులో ఎక్కడికో వెళ్తాడు. అతని కారును రాజ్ ఫాలో అవుతాడు. ఈ విషయాన్ని కావ్యకి చెబుతాడు రాజ్.

ఇంతలో తులసి వచ్చి.. నన్ను ఉదయాన్నే ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. మీకు పాలు పడటం లేదని చెప్పారు కదా? నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఇక్కడికి వస్తున్నారు, ఆయనతో మీకు మెడిసిన్ ఇప్పిద్దామని అనుకున్నట్లు చెబుతుంది కావ్య. మీరు ప్రతిసారి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు.. కానీ నేను మీకు ఏం చేయలేకపోతున్నానని అంటుంది తులసి. ఏదో ఒక రోజు మీరు సాయం చేయాల్సిన రోజు వస్తుంది.. ఆ రోజు కాదనకుండా సాయం చేయమని అంటుంది కావ్య. మినిస్టర్‌ని ఫాలో అవుతూ గెస్ట్‌హౌస్ దగ్గరికి వస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X