Brahmamudi February 5th Episode:డాక్టర్‌ని రక్షించిన రాజ్.. కావ్య దెబ్బకి మినిస్టర్‌ పరుగులు,తులసిలో అనుమానం

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికొచ్చిన ధర్మేంద్ర.. ఈరోజు మీ ఇంట్లో మూడు యాక్సిడెంట్స్ జరిగి, ఆరు శవాలు లేచేవని దీనంతటికీ కారణం నేనే అని అంటాడు. నేను ఇలా ప్రవర్తించడానికి కారణం మీ అబ్బాయి రాజ్, మీ కోడలు కావ్యేనని చెబుతాడు. నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈసారి నిజంగానే ఈ ఇంట్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడని వార్నింగ్ ఇస్తాడు. అతను వెళ్లిపోగానే ధర్మేంద్ర గురించి అడుగుతారు దుగ్గిరాల ఫ్యామిలీ సభ్యులు. ఇదంతా బిజినెస్‌లో మా మీద కక్ష గట్టి చేస్తున్నాడని కావ్య కవర్ చేస్తుంది.

దుగ్గిరాల కుటుంబానికి ముచ్చెమటలు పట్టించినందుకు ధర్మేంద్రను అభినందిస్తుంది రుద్రాణి. మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటే చాలు.. అక్కడ నా కొడుకు, కూతురు సుఖంగా ఉంటారని అంటుంది. మినిస్టర్ తన ఇంటికే వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ రగిలిపోతాడు. దాంతో కావ్య అద్భుమైన ప్రణాళిక చెబుతుంది. దాని ఆధారంగా బందీగా ఉన్న డాక్టర్ చక్రవర్తిని విడిపించాలని ప్లాన్ చేస్తారు. ఉదయాన్నే ధర్మేంద్రకు ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తి దగ్గరకు వెళ్తున్నానని రాజ్ చెప్పడంతో మినిస్టర్ షాకై.. డాక్టర్‌ను దాచిన గెస్ట్‌హౌస్ వైపు వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 5వ తేదీ ఎపిసోడ్ 948లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 5th 2026 Episode 948 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ ఫోన్‌తో భయపడ్డ మినిస్టర్ ధర్మేంద్ర.. తన గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రౌడీలను ఆరా తీస్తాడు. డాక్టర్ సేఫ్‌గా ఉన్నాడని రౌడీలు చెబుతారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ వీడు తప్పించుకోకూడదు.. ఈ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా చంపేయని ఆర్డర్స్ వస్తాడు ధర్మేంద్ర. ఈ డాక్టర్ కోసం ఎవరొచ్చినా మా చేతుల్లో చచ్చిపోతారని చెబుతారు రౌడీలు. ఆ రాజ్‌గాడు ఎందుకలా చెప్పాడని ధర్మేంద్ర ఆలోచిస్తుండగా... రాజ్ ఫోన్ చేస్తాడు. నేను రాలేదని ఆలోచిస్తున్నావా? డాక్టర్ దగ్గరికని మీ వైఫ్‌ని తీసుకుని వెళ్తుంటే దారిలో ఒక చిన్న డౌట్ వచ్చింది.. నువ్వు చేసిన తప్పుకి డాక్టర్‌ చక్రవర్తికి సంబంధం ఏం ఉందని అనిపించింది అని అంటాడు రాజ్. డాక్టర్‌ని వదిలేసి నీకు సాయం చేసిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళితే నాకు కావాల్సిన సాక్ష్యాలు దొరకుతాయి.. అందుకే నీలవేణి దగ్గరికి బయల్దేరానని చెబుతాడు రాజ్. దాంతో ధర్మేంద్ర కంగారుగా హాస్పిటల్‌కు బయల్దేరతాడు. ఇదే అదనుగా రాజ్ లోపలికి వెళ్లి డాక్టర్ చక్రవర్తిని విడిపిస్తాడు.

మరోవైపు.. రాజ్ చెప్పిన మాటలతో నేరుగా నీలవేణి ఇంటికి బయల్దేరతాడు మినిస్టర్. నీకెంత ధైర్యం ఉంటే నాతో ఆటలు ఆడుతున్నావా అని నీలవేణిపై సీరియస్ అవుతాడు ధర్మేంద్ర. ఆ రాజ్ గాడితో కలిసి నా భార్యకు నిజం చెప్పాలని అనుకుంటున్నావా అని నిలదీస్తాడు. నువ్వు ఆ రాజ్ కావ్యలతో చేతులు కలపలేదా అని ఫైర్ అవుతాడు. నేను నోరు తెరిస్తే మీ చేతుల్లో చస్తానని నాకు తెలుసని అంటుంది నీలవేణి. మరి మనం బిడ్డల్ని మార్చిన విషయం.. నీ పేరు ఆ రాజ్‌గాడికి ఎలా తెలిశాయని నిలదీస్తాడు ధర్మేంద్ర. ఆ రోజు కావ్య ఆసుపత్రికి వచ్చి డాక్టర్ అనూరాధతో కలిసి నిజం తెలుసుకుంది. అందులో నా హస్తం ఉందని తెలుసుకుని నన్ను బెదిరించింది.. నిజం ఒప్పుకున్నానని అంటుంది నీలవేణి. కానీ నేను ఎక్కడా ఎవరికీ నిజం చెప్పలేదని.. కావ్య గారిని ప్రాధేయపడితే నన్ను వదిలేసిందని చెబుతుంది.

కావ్య రాజ్‌ల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు.. ఎలా వాళ్లు మీ భార్యని నమ్మిస్తారని నీలవేణి ప్రశ్నిస్తుంది. ప్రాణం పోయినా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను.. అక్కడి దాకా వస్తే నా పిల్లలని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్లిపోతానని అంటుంది నీలవేణి. నా భార్యను అడ్డం పెట్టుకుని ఆ రాజ్‌గాడు నన్ను పరిగెత్తిస్తున్నాడని చెబుతాడు ధర్మేంద్ర. ఇంతలో రాజ్ మళ్లీ ఫోన్ చేసి ఈ తప్పు ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్తున్నాం.. వచ్చి నీ భార్యకు నిజం చెప్పకుండా ఆపుకోమని సవాల్ విసురుతాడు. దాంతో హాస్పిటల్‌కు బయల్దేరతాడు ధర్మేంద్ర. ఇంతలో తులసితో డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ కనిపించడంతో ధర్మేంద్ర వణికిపోతాడు. వీళ్లు చెప్పేదంతా అబద్ధం.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదామని తులసితో అంటాడు.

కారు నెట్టుకుంటూ వచ్చారా? బీపీ పెరిగిపోతోందా? అని ధర్మేంద్రపై సెటైర్లు వేస్తాడు డాక్టర్ చక్రవర్తి. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పాడని భార్యను ప్రశ్నించగా.. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే సమస్య క్లియర్ అవుతుందని చెప్పారని తులసి అంటుంది. పాపకు పాలు సరిపోవడం లేదని కావ్యకు చెబితే ఆసుపత్రికి తీసుకొచ్చానని చెబుతుంది తులసి. డాక్టర్ గారు దేవుడిలాంటి మనిషి.. ఒకరికి సాయం చేస్తారు కానీ తప్పు చేయరని అంటాడు డాక్టర్ చక్రవర్తి. నేను డెలివరీ అయ్యాక .. రెగ్యులర్ చెకప్ చేయడానికి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్లారని తులసి అడగటంతో ధర్మేంద్ర కంగారుపడతాడు. ఓ సీరియస్ కేసు వస్తే వేరే హాస్పిటల్‌కి నేనే పంపించానని అంటాడు ధర్మేంద్ర.

తులసి డాక్టర్ దగ్గరికి చెకప్‌కు వెళ్లగానే.. ఊపిరి పోసే తల్లి విలువ తెలియదు, ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ విలువ తెలియదని ధర్మేంద్రపై కావ్య మండిపడుతుంది. నా బిడ్డను నాకు దూరం చేసినప్పుడు నా మనసు ఎంత తల్లడిల్లిందో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది. తప్పు నువ్వు చేసి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు.. అప్పుడు కూడా నాకు ఇదే భయం కలిగింది, నువ్వు చేసిన దుర్మార్గాన్ని నీ చేతే బయటపెట్టించడానికి మాకు క్షణం కూడా పట్టలేదు. నీకిచ్చిన గడువులోగా నా బిడ్డను నా చేతుల్లో పెట్టాలని ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తుంది కావ్య. నీ ఇంటి సంతోషం కోసం తప్పు చేశావు.. నీ భార్యకు సర్దిచెప్పుకుని మా బిడ్డను మాకు అప్పగించాలని డెడ్‌లైన్ పెడతాడు రాజ్.

పాప బాడీ ట్రీట్‌మెంట్‌ చాలా బాగా జరుగుతుంది. సర్జరీకి పాప బాడీ సహకరిస్తుందని డాక్టర్ చెప్పడంతో కావ్య, రాజ్‌లు సంతోషిస్తారు. పరాయి బిడ్డ మీద కూడా ఇంత ప్రేమ పెంచుకున్నావని డాక్టర్ ప్రశంసిస్తుంది. తులసి గారు నా బిడ్డ మీద ఎంతో ప్రేమ పెపంచుకున్నారు.. రేపు మా బిడ్డను మేం తీసుకునేటప్పుడు తన బిడ్డను తనకు అప్పగించినప్పుడు ఆమెకు ఎలాంటి అన్యాయం జరగకూడదని చెబుతుంది కావ్య. మా దగ్గర ఉన్న తన బిడ్డను తనకు ఇచ్చినప్పుడు తను సంతోషపడాలే కానీ ఏమాత్రం బాధపడకూడదని అంటుంది కావ్య. నా బిడ్డను నేను ఆనందంగా తెచ్చుకోవాలన్నా.. ఆ బిడ్డ ప్రాణాన్ని మీరే కాపాడాలని చెబుతుంది. పాపని ప్రతిరోజూ ఆసుపత్రికి తీసుకు రావాల్సి ఉంటుందని చెబుతుంది డాక్టర్.

కళ్యాణ్ ఇంట్లో వాళ్లందరికీ స్వీట్స్ ఇస్తాడు.. అప్పూకి డెలివరి డేట్ ఇచ్చారని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. నా కోసం నీ ఇష్టాల్ని పక్కనపెట్టావు.. నా కండీషన్స్‌ని భరించావని కోడల్ని మెచ్చుకుంటుంది ధాన్యం. ఇంతలో రాజ్, కావ్యలు రావడంతో వాళ్లకు జరిగినది చెబుతాడు కళ్యాణ్. ఇప్పటి వరకు జరిగిన ట్రీట్‌మెంట్‌కు పాప ఆరోగ్యం కుదుటపడిందని అంటాడు రాజ్. మిగిలింది ఆపరేషనే.. త్వరలోనే సర్జరీ చేస్తారని డాక్టర్ చెప్పారని అంటాడు. అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెబుతుంది అపర్ణ. నేనైతే రాజ్‌కి, కళ్యాణ్‌కి గుండు కొట్టిస్తానని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో రాజ్, కళ్యాణ్‌లు షాక్ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా ఉండటం చూసి రేఖ రగిలిపోతుంది.

ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ.. ఆ మినిస్టర్ మూర్ఖుడు, వాడు మారతాడా? మన బాధని అర్ధం చేసుకుని మన పాపని మనకు అప్పగిస్తాడా? అనిపిస్తోందని ప్రశ్నిస్తుంది కావ్య. వాడు జుట్టు ఇప్పుడు మన చేతిలో ఉంది.. వాడి బలహీనతే వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెబుతామో? వాడి భార్యకు ఏమవుతుందోననే భయం వాడి కళ్లలో కనిపిస్తోంది. కాబట్టి ఏదో ఒకరోజు, ఏదో ఒక్క క్షణం వాడు చేసిన తప్పుని ఒప్పుకుని మారి మనిషి అవుతాడని అంటాడు రాజ్. కానీ భార్య మీద వాడికున్న ప్రేమ.. బలహీనతలోంచి అదే బలంగా మారితేనని కావ్య ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X