Brahmamudi February 6th Episode: రాజ్‌తో ధర్మేంద్ర తాడోపేడో..రుద్రాణి ట్రాప్‌లో ధాన్యం, షాక్‌లో కావ్య- రాజ్

Photo Courtesy: JioHotstar

రాజ్ దెబ్బకు డాక్టర్ చక్రవర్తిని దాచిన ప్లేస్‌కి వస్తాడు ధర్మేంద్ర. ఇక్కడికి ఎవ్వరూ రాలేదని.. ఒకవేళ వస్తే చస్తారని మినిస్టర్‌కి రౌడీలు చెబుతారు. ఇంతలో రాజ్ ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తితో మాకు పనిలేదు.. నేరుగా బిడ్డల్ని మార్చిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళ్తున్నామని చెప్పడంతో ధర్మేంద్ర అక్కడికి బయల్దేరతాడు. ఈలోగా రౌడీలను చితకబాది డాక్టర్ చక్రవర్తిని విడిపిస్తాడు రాజ్. నర్స్ నీలవేణి ఇంటికి వెళ్లిన ధర్మేంద్ర.. రాజ్- కావ్యల గురించి అడుగుతాడు. బిడ్డల్ని మార్చినట్లు నేను ఒప్పుకున్నానని.. కానీ సాక్ష్యం మాత్రం చెప్పనని అనడంతో నన్ను కావ్య వదిలేసిందని చెబుతుంది నీలవేణి.

మళ్లీ రాజ్ ఫోన్ చేసి.. అసలు ఈ తప్పు ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్తున్నామని చెప్పడంతో ధర్మేంద్ర నేరుగా ఆసుపత్రికి వెళ్తాడు. అప్పటికే తులసి, కావ్య, రాజ్, డాక్టర్ చక్రవర్తి మాట్లాడుకుంటూ ఉండటంతో ధర్మేంద్ర కంగారు పడతాడు. మేం నీ భార్యకు ఏం చెప్పలేదు. కానీ తలచుకుంటే ఇప్పటికిప్పుడే చెప్పేస్తామని... నీకిచ్చిన గడువులోగా బిడ్డను మాకు అప్పగించాలని డెడ్‌లైన్ పెడతాడు రాజ్. తులసి పాప కోలుకుంటోందని, త్వరలోనే ఆపరేషన్ చేద్దామని డాక్టర్ అనూరాధ చెప్పడంతో కావ్య - రాజ్ సంతోషిస్తారు. ఇంటి దగ్గర కళ్యాణ్ అందరికీ స్వీట్స్ పంచి అప్పూ డెలివరీ డేట్ గురించి చెబుతాడు. దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉండటం చూసిన రేఖ రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 6వ తేదీ ఎపిసోడ్ 949లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 6th 2026 Episode 949 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

బిడ్డను ఎలా తెచ్చుకోవాలి? ధర్మేంద్రపై ఎలా గెలవాలి? అన్నదానిపై రాజ్ - కావ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాడి బలహీనతే వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెప్పేస్తామో? వాడి బిడ్డను ఎక్కడ తెచ్చుకుంటామో? అని భయపడి చస్తున్నాడని కావ్యతో చెబుతాడు రాజ్. ఏదో ఒకరోజు తప్పులన్నీ ఒప్పుకుని, మారి మనిషి అవుతాడనే నమ్మకం ఉందని అంటాడు. భార్య మీద వాడికున్న ప్రేమ .. బలహీనతలో నుంచి బలంగా మారితే వాడు ఇంకా రాక్షసుడిలా మారతాడేమో? భార్యను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడేమో అనిపిస్తోందని చెబుతుంది కావ్య. వాడిని మార్చాలి.. బుద్ది బలంతో కొట్టాలి, వాడంతటే వాడే కళ్లు తెరవాలని చెప్పింది నువ్వే కదా అని అంటాడు రాజ్.

సంస్కారం ఉన్న వాళ్లకి ఒకటే దారి.. కానీ అలాంటి నీచులకి, తెగించిన వాళ్లకి వంద దారులు ఉంటాయని అంటుంది కావ్య. అక్కడి వరకు వస్తే వాడికంటే మనం ఒక మెట్టుపైనే ఉంటామని చెబుతాడు రాజ్. తాళి కట్టించుకున్న భార్య కోసం వాడే అంత చేస్తే.. పేగు తెంచుకున్న మమకారం కోసం మనమెంత తెగించాలని అడుగుతాడు. వాడిది స్వార్ధం.. మనది బంధం. తల్లి అనురాగం ముందు వాడి అధికారం ఓడిపోక తప్పదు. ఆ మినిస్టర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని అంటాడు రాజ్.

ఇంతలో ఇంటికొచ్చిన మినిస్టర్‌ని పాప సంగతి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది తులసి. అదే పనిలో ఉన్నానని చెబుతాడు ధర్మేంద్ర. ఆసుపత్రిలో పాపకు రెగ్యులర్‌గా చెకప్‌లు చేయిస్తుంటుంది కావ్య. ఒక గుడిలో తులసిని కావ్య కలిసి బిడ్డలతో ఆడుకోవడం చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. అది చూసిన ధర్మేంద్ర కావ్య చేతిలో ఉన్న పాపని లాక్కుని వెళ్లిపోతాడు. ధర్మేంద్ర టిఫిన్ చేస్తుండగా కావ్య రావడంతో తులసితో సంబరపడిపోతుంది. ఇంతలో పాప ఏడుస్తుండగా కావ్య వెళ్లి బిడ్డను ఓదారుస్తుండగా ధర్మేంద్ర ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. తనకి మనశ్శాంతి లేకపోవడంతో ఈ టెన్షన్ తాను పడలేనని, నాకు నేను నా భార్య ముందు తప్పు ఒప్పుకుని నిజం చెప్పాలి, నా భార్యను క్షమించమని అడగాలి. తులసిని కాపాడుకోవాలని అనుకుంటాడు ధర్మేంద్ర.

పాపను ఆడిస్తున్న తులసి దగ్గరికి వెళ్లి ఆ కావ్య, రాజ్‌ల వాళ్ల ప్రాబ్లమ్ గురించి చూస్తున్నానని చెబుతాడు ధర్మేంద్ర. కావ్య తన బిడ్డకు దూరమై.. ఎంత వేధన పడుతుందో తెలుసా? మీరే వాళ్లకి సాయం చేస్తానని చెప్పారు కదా అని అంటుంది. ఎవరో ఒకరు పురిట్లోనే వాళ్ల బిడ్డను మార్చేశారు అంటే వాళ్లకు ఆ బిడ్డతో ఎంత అవసరం ఉందో? వాళ్లు ఏ పరిస్థితుల్లో అలా చేశారో? వాళ్ల వైపు కూడా ఒకసారి ఆలోచించాలని కదా అని అంటాడు ధర్మేంద్ర. ఆ మాటలతో తులసి కోప్పడుతుంది.. కన్నతల్లికి బిడ్డను దూరం చేసి ఆ తల్లి కన్నీళ్లకు కారణమైన వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడుతుంది. కారణం ఏదైనా సరే.. వాళ్లు మీకు కనక దొరికితే నేను వాళ్లను జైళ్లో వేయిస్తానని వార్నింగ్ ఇస్తుంది తులసి. చివరికి మీరైనా శిక్ష పడాల్సిందేనని చెబుతుంది. ఆ మాటలతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. మీరు కనుక అలా చేస్తే నేను బతుకుతానా? అని అంటుంది తులసి.

రాజ్‌కి ఫోన్ చేసి వెంటనే నేను నిన్ను కలిసి మాట్లాడాలని అడిగి అతనిని కలుస్తాడు ధర్మేంద్ర. నేను ఇంత చెబుతున్నా, ఇంత తాపత్రయపడుతున్నా.. నా పాపని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నావా అని ఫైర్ అవుతాడు. నేను తీసుకెళ్తానన్నది మీ పాపని కాదు.. నా పాపని అని చెబుతాడు. పాపని ఇవ్వలేను.. నా భార్య బతకదు. నా భార్యకు నిజం చెప్పలేను, ఈ ప్రపంచంలో నాకు నా భార్య కన్నా ఏది ఎక్కువ కాదు. కావాలంటే నా పదవినైనా వదులుకుంటాను కానీ, నా పాపని వదులుకోను, నా భార్యను చంపుకోనని తేల్చేస్తాడు ధర్మేంద్ర. నీ భార్య మాత్రం ఆరోగ్యంగా ఉన్న పాపతో ఆనందంగా ఉండాలి.. నా భార్య మాత్రం తన కడుపున బిడ్డను దూరం చేసుకుని సంబంధం లేని బిడ్డను చూసుకుంటూ కన్నీళ్లతో బతకాలా? అని నిలదీస్తాడు రాజ్. నీకు నీ భార్య మీదున్నది ప్రేమే అయితే నా భార్య తన బిడ్డ మీద పెట్టుకున్న మమకారానికి ఏం పేరు పెడతావని అడుగుతాడు. మా కన్న బిడ్డను మాకు ఇచ్చేయమనడం స్వార్ధమా అని అంటాడు రాజ్.

బిడ్డ బతికితే తల్లి బతకదు, తల్లి బతికితే బిడ్డ బతకదని డాక్టర్లు నాకు తెగేసి చెప్పారు.. ఎన్నో గండాలు, ఎన్నో ఆటంకాలు దాటుతూ నా ప్రాణం కన్నా నా బిడ్డకు ఊపిరి పోయడమే తల్లిగా నా బాధ్యత అని నమ్మి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడిన నా భార్య కళావతి కోసం నేనెంత ఆరాటపడాలని ప్రశ్నిస్తాడు రాజ్. పరాయి తల్లి బిడ్డను ఎత్తుకెళ్లి ఆ తల్లికి శోకాన్ని మిగిల్చిందే కాక.. నీ పదవితో మా మీద పడగ విప్పావని మండిపడతాడు. నువ్వు ఏమైనా చెప్పు నా నిర్ణయం మాత్రం మారదని తేల్చేస్తాడు ధర్మేంద్ర. మారకపోతే నీకే నష్టం.. రేపే మీ పాపకి ఆపరేషన్ చేయిస్తున్నాం, నీకిచ్చిన గడువు కూడా రేపటితో ముగుస్తుంది. అప్పుడు నిజాలన్నీ బయటపడి నా పాప.. నా భార్య ఒడిలో ఉంటుందని హెచ్చరిస్తాడు రాజ్.

పాపని తీసుకుని ఉదయాన్నే తులసి దగ్గరికి వస్తుంది కావ్య. పసిబిడ్డకు ఇలాంటి వ్యాధిని ఇచ్చాడు.. నీలాంటి మంచి మనిషికి ఇలాంటి క్షోభను ఇచ్చాడని బాధపడుతుంది తులసి. మా పాపకి బారసాల జరిపించబోతున్నామని నువ్వు, మీ ఆయన తప్పకుండా రావాలని ఆహ్వానిస్తుంది. పాపకి ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నామని తులసికి చెబుతుంది కావ్య. నీ బిడ్డ కాకపోయినా ఈ బిడ్డను కాపాడాలని అనుకుంటున్నావు.. నువ్వు గ్రేట్ అంటుంది తులసి.

రాజ్ తనకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని రుద్రాణికి చెబుతాడు ధర్మేంద్ర. నాకెంత పవర్ ఉన్నా.. నాకు నా భార్య బలహీనత అని అంటాడు. వాళ్లు మీ వైఫ్‌ని అడ్డుపెట్టుకుని మీతో ఆడుకునేంతగా మీ భార్యకు దగ్గర అవుతుంటే మీరేం చేస్తున్నారని, నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది రుద్రాణి. నువ్విచ్చిన ఐడియాతో వాళ్లని భయపెట్టాక.. ఇక జన్మలో నా వైపు చూడరు అనుకున్నా. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్ స్టార్ట్ చేశారని చెబుతాడు ధర్మేంద్ర. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోంది. అలాంటప్పుడు మెదడు ఎలా అలర్ట్ అవుతుందని ప్రశ్నిస్తాడు. పిల్లల్ని మార్చిన దగ్గరి నుంచి నా మనసు తప్పు చేశానన్న భావనతోనే ఉంది.. ఇప్పుడు పరిస్ధితుల్ని చూస్తుంటే నేను ఓడిపోతానని భయంగా ఉందని అంటాడు ధర్మేంద్ర.

నా భార్య ఆనందాన్ని చూసుకున్నాను కానీ.. అవతల మరో తల్లి బాధను పట్టించుకోలేదు. ఈ సమయంలో ఇలా వెనకడుగు వేయడం ఎవ్వరికీ మంచిది కాదు.. ఇప్పటి వరకు కథను మీరు నడిపించారు, ఇకపై నేను నడిపిస్తానని చెబుతుంది రుద్రాణి. నిజం చెబితే మీ భార్య తట్టుకోగలదా? అని అడగటంతో తులసికి ఏం కాకూడదని అంటాడు మినిస్టర్. ఇక విషయాన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని చెబుతుంది రుద్రాణి. వెంటనే ధాన్యలక్ష్మీకి ఫోన్ చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X