Brahmamudi February 9th Episode: రుద్రాణి నిజ స్వరూపం తెలుసుకున్న ధర్మేంద్ర.. పాప కోసం రాజ్ బలి
Photo Courtesy: JioHotstar
రాజ్, కావ్యల నుంచి మినిస్టర్‌ను కాపాడతానని మాటిచ్చిన రుద్రాణి వెంటనే తన ప్లాన్‌లో భాగంగా ధాన్యలక్ష్మీకి ఫోన్ చేస్తుంది. రాజ్- కావ్యల కారణంగా ఆ మినిస్టర్ మన ఫ్యామిలీ జోలికి వస్తున్నాడని రెచ్చగొడుతుంది. అతని వల్ల మన ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం పొంచి ఉందని రుద్రాణి భయపెడుతుంది. త్వరలో డెలివరి కానున్న నీ కోడలికి, ఆమె కడుపులోని బిడ్డకు ప్రమాదమని ధాన్యాన్ని హెచ్చరిస్తుంది. మీరెంత చెబుతున్నా వినిపించుకోకుండా ఆ రాజ్, కావ్యలు ఇంకా ధర్మేంద్ర జోలికి వెళ్తూనే ఉన్నారని జాగ్రత్తగా ఉండమని చెబుతుంది రుద్రాణి.
ఆమె మాటలు విన్న ధాన్యలక్ష్మీ వెంటనే కోపంతో నట్టింట్లో పెద్ద గొడవ చేస్తుంది. మీ ఇద్దరి వల్ల దుగ్గిరాల కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతోందని రాజ్, కావ్యలపై మండిపడుతుంది. పిన్ని మాటలతో సీరియస్ అయిన రాజ్.. బిడ్డల్ని మార్చిన దగ్గరి నుంచి మినిస్టర్‌తో గొడవ వరకు జరిగినదంతా చెబుతాడు. ఇంతపెద్ద బాధని నీ గుండెల్లో దాచుకున్న దేవతవని కావ్యని దాంతో దుగ్గిరాల కుటుంబం ప్రశంసిస్తుంది. చేసిన తప్పుకి కావ్యకి క్షమాపణలు చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో జరిగినదంతా రుద్రాణికి రేఖ చెప్పడంతో ఆమె మరో క్రూరమైన ప్లాన్ వేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్ 951లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పాపకు ఆపరేషన్ చేయిస్తుండటంతో కావ్య కంటతడి పెడుతుంది. అది చూసి రాజ్ ఆమెను ఓదారుస్తాడు. నా పాప ఇంకోకరి ఒడిలో క్షేమంగా ఉందని నాకు తెలుసు, అయినా ఈ నెల రోజులు నా రక్తం పంచుకున్న బిడ్డ దూరమైపోయింది. ఇప్పుడు ఇంకొక పాపని ఈ చేతులతో ఆపరేషన్ కోసం పంపించాను, ఏదైనా జరగరానిది.. జరిగితే పాప తిరిగిరాకపోతే, ఈ బిడ్డను కన్నతల్లికి ఏ సమాధానం చెబుతాం. శాశ్వతంగా బిడ్డ దూరమైందని చెబితే ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది? అని ప్రశ్నిస్తుంది దీప. నువ్వు నీ బిడ్డ కోసం ఎంత తపిస్తున్నావో? ఈ బిడ్డను తన కన్నతల్లి దగ్గరికి చేర్చాలని అంతకంటే ఎక్కువగా ఆశపడుతున్నావు. నీ పేగు బంధం గట్టిది కాబట్టి.. నీ బిడ్డ ఎక్కడుందో తెలిసింది, నీ బిడ్డ నీ చుట్టూనే తిరుగుతోంది. అలాగే ఆ తల్లి అమ్మతనమే ఈ బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది, అమ్మకి దగ్గరికి చేస్తుందని అంటాడు రాజ్.
రుద్రాణి రౌడీలకు ఫోన్ చేసి ఆపరేషన్ థియేటర్ నుంచి పాప ప్రాణాలతో బయటకు రాకూడదని చెబుతుంది. ఆ వెంటనే నీలవేణికి ఫోన్ చేసి మళ్లీ నీ సాయం కావాలని అంటుంది రుద్రాణి. ఒక్కసారి మినిస్టర్ గారికి సాయం చేసి ఇరుక్కుపోయాను, ఆ కావ్య గారు మంచోళ్లు కాబట్టి కొట్టి వదిలేశారని అంటుంది నీలవేణి. ఈసారి నువ్వు అంత రిస్క్ చేయాల్సి పనిలేదు.. ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న పాపకి నా మనుషుల్ని రిసీవ్ చేసుకుంటే చాలని అంటుంది రుద్రాణి. నాకు ఏ డబ్బు వద్దు.. మళ్లీ మీరు పాపకి ప్రమాదం తలపెట్టబోతున్నారు, నన్ను లాగొద్దని బతిమలాడుతుంది రుద్రాణి. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయకపోతే .. నా మనుషులు హాస్పిటల్ కన్నా ముందు నీ ఇంటికి వెళ్తారు. నీ పిల్లలు ఈరోజు స్కూల్‌కి వెళ్లలేదనుకుంటా అని రుద్రాణి అంటుంది. నేను ఫస్ట్ అడుగుతాను, వినకపోతే తరుముతానని చెబుతుంది. ఆ మాటలకు నీలవేణికి చెమటలు పడతాయి. ఆ పాపని ఏం చేయబోతున్నారని నీలవేణి అడగ్గా.. శాశ్వతంగా ఈ భూమ్మీదే లేకుండా చేయబోతున్నానని రుద్రాణి చెప్పడంతో నీలవేణి షాక్ అవుతుంది. మీరు చెప్పినట్లే చేస్తానని రుద్రాణికి చెబుతుంది.
పాపకి ఆపరేషన్ చేస్తుండగా రాజ్, కావ్యలు టెన్షన్ పడతారు. వెంటనే అక్కడికి వచ్చి పాప ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతుంది నీలవేణి. లోపల పాపకి ఆపరేషన్ జరుగుతోంది కదా.. కానీ కొందరు పాపని చంపాలని చూస్తున్నారని అంటుంది. ఆ మాటలతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఇప్పటికే నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నోరు విప్పకపోతే ఇంకా పెద్ద తప్పు చేసిన దానిని అవుతానని అంటుంది నీలవేణి. పాపని చంపాలని చూస్తున్నది ఎవరు అని రాజ్ అడగ్గా.. మినిస్టర్ గారే అని చెబుతుంది. ఆ మాటలతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఆ మినిస్టర్ కాసేపట్లో హాస్పిటల్‌కు వస్తారు, వాళ్లకు నేను హెల్ప్ చేయాలని అనుకున్నాని అంటుంది నీలవేణి. వాళ్ల దగ్గర ఉన్న మీ పాప.. వాళ్ల దగ్గరే శాశ్వతంగా ఉండటానికి మీ దగ్గరే ఉన్న పాపని చంపాలని చూస్తున్నారని అంటుంది నీలవేణి.
వాళ్లు చెప్పినట్లు వినకపోతే మా బిడ్డను చంపేస్తామని అన్నారని, అయినా ధైర్యం చేసుకుని మీకు నిజం చెబుతున్నాని అంటుంది. నువ్వేం కంగారు పడొద్దు, బిడ్డను నేను కాపాడతానని అంటాడు రాజ్. ముందు మనవాళ్లను ఇక్కడి నుంచి పంపించేయాలని చెబుతాడు రాజ్. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, కానీ పాప స్పృహలోకి రావడానికి టైం పడుతుందని చెబుతుంది డాక్టర్. పాప స్పృహలోకి వస్తేనే కానీ ఆమె పరిస్ధితి ఏంటనేది చెప్పలేమని అంటుంది. మరోవైపు.. రుద్రాణి పంపిన రౌడీలను చూసిన నీలవేణి వెంటనే ఈ విషయాన్ని రాజ్‌కు ఫోన్ చేసి చెబుతుంది. పాప ఆరోగ్యం గురించి దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండటంతో నేను, కావ్య బిడ్డను చూసుకుంటాం మీరు ఇంటికి వెళ్లండి అని రాజ్ చెబుతాడు. మీరు ఇక్కడే ఉంటే అమ్మ, నానమ్మ టెన్షన్ పడుతుంటారు. ముందు మీరు బయల్దేరండి అని చెబుతాడు. మినిస్టర్ మనుషులు వచ్చేశారని కావ్యకి రాజ్ చెబుతాడు. కన్నకూతురిని చంపుకోవాలని ఆ మినిస్టర్‌కి ఎలా అనిపించిందని మండిపడుతుంది కావ్య. వాడికి మనమే బుద్ధి చెబుదామని కావ్యకి ప్లాన్ చెబుతాడు రాజ్. ఇంతలో రౌడీలు లోపలికి వెళ్తుండగా వాళ్లను పక్కకు తీసుకెళ్తుంది నీలవేణి.
రాజ్, కావ్యల గురించి ఆలోచిస్తున్న మినిస్టర్ దగ్గరికి తులసి వచ్చి భర్తని పిలుస్తుంది. ఆ కావ్య గురించి తలచుకుంటే మనసంతా బాధగా ఉందని చెబుతుంది. ఎవరో కానీ దుర్మార్గులు.. తన పాపని మార్చి తనని బాధపెట్టారు. కనీసం తన దగ్గరున్న పరాయి వాళ్ల పాపని చూసుకుని అయినా కాస్త తృప్తి పడుతుంది అనుకుంటే ఆ బిడ్డకు ఆయుష్షు గ్యారంటీ లేదు, ఆ తల్లి ఎలా తట్టుకుంది. ఈరోజు ఆ పాపకి ఆపరేషన్ చేయిస్తున్నారు. కావ్య మనసు ఎంత మంచిదో చూశారా? తన బిడ్డను దూరం చేసి ఎవరి పాపనో తన ఒడిలో పెడితే... అసహ్యించుకోవాల్సిందిపోయి అప్యాయంగా చూసుకుంటోందని చెబుతుంది. అయినా ఆ పాపకి ఆపరేషన్ ఎందుకు చేయిస్తున్నారో తెలుసా? ఏనాటికైనా వాళ్ల కన్నబిడ్డ వాళ్ల దగ్గరికి వస్తుందనే నమ్మకం.. వాళ్ల దగ్గరున్న పాప పూర్తి ఆరోగ్యంగా ఉంచి వాళ్ల అసలు తల్లిదండ్రులకు అప్పగించాలని కావ్య కోరిక అంటుంది తులసి. పాప ఆపరేషన్ సక్సెస్ కావాలని, వాళ్ల కన్నబిడ్డ వాళ్ల దగ్గరికి రావాలని చెబుతుంది. ఈ మాటలు విన్న ధర్మేంద్ర ఎమోషనల్ అవుతాడు.
ఇంతలో రుద్రాణి ఆనందంతో అక్కడి వచ్చి మీకు గుడ్‌న్యూస్ చెబుతానని అంటుంది. మీరు పడుతున్న టెన్షన్స్‌కి తెరపడిపోతోందని, ఈరోజు నేను వేసిన ప్లాన్‌తో ఆ రాజ్, కావ్యలు లైఫ్‌లో మీ జీవితంలోకి రారు, మీ పాప మీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతుంది రుద్రాణి. ఈరోజు వాళ్ల దగ్గరున్న పాపకి ఆపరేషన్.. సర్జరీ సక్సెస్ అయినా, కాకపోయినా ఆ పాపని చంపేయమని చెప్పానని రుద్రాణి అనడంతో మినిస్టర్ షాక్ అవుతాడు. కావ్య దగ్గరున్న పాపే లేకపోతే మీ దగ్గరున్న పాపని ఎలా అడుగుతారు? ఎలా తీసుకెళ్తారు? ఆ పాపకి అంత్యక్రియలు చేయడం తప్పించి వాళ్లేం చేయలేరని అనడంతో రుద్రాణిని లాగిపెట్టి కొడతాడు ధర్మేంద్ర. అక్కడున్నది నా పాప.. నా పాపని చంపేయాలని చెబుతావా అని మండిపడతాడు.
నా భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పు చేశాననే తప్ప... నా కూతురిని చంపుకునేంత దుర్మార్గుడిని కాదు. ఆయుష్షు లేని నా బిడ్డ ఎక్కడున్న క్షేమంగా ఉంటే చాలు అనుకున్నా... పసిబిడ్డ, అందులోనూ నా బిడ్డ అంటాడు మినిస్టర్. నీ మనుషులకు ఫోన్ చేసి వెంటనే వెనక్కి వచ్చేయమని చెప్పమని అంటాడు. వాళ్లు ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు.. ఈ టైంలో కాంటాక్ట్ అవ్వలేమని చెప్పడంతో రుద్రాణిని మరోసారి పీకుతాడు. వాళ్లని ఆపాలి, ఇప్పుడు రాజ్- కావ్యలకు ఫోన్ చేసి చెప్పినా నా మాటను వినరు, నా బిడ్డను ఎలా కాపాడాలని పరిగెత్తుకుంటూ వెళ్తాడు ధర్మేంద్ర. ఇంతలో రౌడీలకు నీలవేణి దారి చూపించడంతో వాళ్లు ఆపరేషన్ రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ బొమ్మ కనిపిస్తుంది. ఆ వెంటనే రౌడీలని రాజ్ చితకబాదుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











