Brahmamudi January 10th Episode: కావ్య ప్రాణాల కోసం కళ్యాణ్ అబద్ధం.. కళావతి జీవితంలోకి కొత్త క్యారెక్టర్లు
Photo Courtesy: JioHotstar
రాజ్‌ను అరెస్ట్ చేయడంతో కావ్య టెన్షన్ పడుతూ ఒక్కసారిగా పురిటి నొప్పులతో కుప్పకూలిపోతుంది. దాంతో అందరూ కలిసి కావ్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆమె పరిస్ధితి చూసిన డాక్టర్... వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లీబిడ్డా ఇద్దరికీ ప్రమాదమని చెబుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తన భర్తను చూడాలని కావ్య గారు టెన్షన్ పడుతున్నారు... వీలైనంత త్వరగా అతనిని తీసుకురమ్మని డాక్టర్ చెప్పడంతో సుభాష్, కళ్యాణ్‌లు పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు.
నేను దొంగ బంగారం కొన్నానని శాండీగాడు ఎందుకు చెప్పాడు? అసలు నా కారులోకి ఆ బ్రీఫ్ కేస్ ఎలా వచ్చిందని రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కళ్యాణ్, సుభాష్ వచ్చి వీకెండ్ కావడంతో బెయిల్ దొరకడం కష్టమని చెబుతారు. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో కావ్యకి సీరియస్‌గా ఉందని అప్పూ చెప్పడంతో కళ్యాణ్, సుభాష్‌లు ఆసుపత్రికి పరిగెడతారు. తన భర్త వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య మారాం చేస్తున్నట్లు దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతుంది డాక్టర్. రాహుల్ వింత ప్రవర్తన, పిచ్చి నవ్వు చూసిన అప్పూకి అతని మీద అనుమానం రావడంతో చెల్లెలిపై స్వప్న సీరియస్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 10వ తేదీ ఎపిసోడ్ 927లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మారిన మనిషి మీద ఇన్ని నిందలు వేస్తున్నారని అప్పూ, ధాన్యలక్ష్మీ మీద మండిపడుతుంది స్వప్న. ఈ వాదనతో సీరియస్ అయిన ఇందిర.. ఇక్కడున్న పరిస్ధితి ఏంటీ? మీరు చేస్తున్నదేంటీ? అని మండిపడుతుంది. ఈ ఇంటి కోడలు చావుబతుకుల్లో ఉంది... దాని ప్రాణానికి ప్రాణమైన నా మనవడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. వాడేమో పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే పరిస్ధితుల్లో లేడు, ఇక్కడ కావ్యమే వాడు వస్తేనే గానీ ఆపరేషన్ చేయించుకుంటానని మొండిగా ఉంది. అనుకున్న సమయానికి ఆపరేషన్ జరగకపోతే రెండు నిండు ప్రాణాల్పి కోల్పోవాల్సి వస్తుంది. కావ్యని బతిమాలి ఆపరేషన్‌కు ఒప్పించాల్సిందిపోయి ఇలా కొట్లాడుకుంటారేంటీ? అని మండిపడుతుంది ఇందిర.
కథలోకి కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తాయి. అందులో కడుపుతో ఉన్న భార్య గురించి ఒకతను టెన్షన్ పడతాడు. ఇప్పటికే రెండుసార్లు కడుపు పోయిందని ఆ వ్యక్తి బాధపడుతుండగా.. ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుడుతుందని అంటాడు డాక్టర్. గతాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాడు డాక్టర్. ఏం చేయాలి? ఎంత ఖర్చయినా పర్లేదు... ఎంతమందినైనా తీసుకురమ్మని చెబుతాడు ఆ వ్యక్తి. మీరు ఈసారి కాస్త ముందుగానే మేడంగారిని ఆసుపత్రిలో జాయిన్ చేయమని చెబుతాడు డాక్టర్. ఈరోజే అడ్మిట్ చేద్దామని చెబుతాడు ఆ వ్యక్తి.
ఇంతలో తులసి బయటకు వచ్చి.. నాకెందుకో భయంగా ఉందని చెప్పగా, నేనున్నానని అంటాడు ఆ వ్యక్తి. పదేళ్ల వరకు నేను సంతానం లేని గొడ్రాలిగా మిగిలిపోయాను, ఏ దేవుడు కరుణించాడో కానీ మూడేళ్ల క్రితం తల్లిని అవుతున్నానన్న ఆనందం నన్ను సంతోషపరిచింది. కానీ విధి నన్ను వెక్కిరించింది. ఆనాడు అమ్మ అనే పిలుపుకు నోచుకోలేకపోయాను.. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఆఖరిసారి.. ఇప్పుడు కనుక నా బిడ్డను చూసుకోలేకపోతే నేను బతకనని అంటుంది తులసి. ఈసారి అలా జరగదు, రేపే ఆసుపత్రిలో జాయిన్ అవుదాం.. బిడ్డను తీసుకుని ఇంటికి వద్దామని అంటాడు ఆ వ్యక్తి. కానీ నా బిడ్డకు ఏమైనా జరిగితే మీరే నాకు విషమిచ్చి చంపేయండి అంటుంది తులసి.
మీ అబ్బాయి ఎప్పుడొస్తున్నాడని కావ్య అడగుతుంది. కళ్యాణ్, నేను వెళ్లి ఈరోజే రాజ్‌ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం.. కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండ్రోజులు ఆలస్యంగా రాజ్ బయటికొస్తాడని అంటాడు సుభాష్. నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే రాజ్‌కి రేపు ఏం సమాధానం చెబుతావని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశ్నిస్తుంది. ఆపరేషన్ టైంలో ఆయన నా పక్కనే ఉంటానని చెప్పారు.. ఆయన లేకపోతే నాకు ధైర్యం చాలడం లేదు, ఆయన లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోనని కావ్య మొండిపట్టు పడుతుంది. బావ గారిని నేను బయటకు తీసుకొస్తానని అప్పూ ధైర్యం చెబుతుంది.
ఇదంతా ఏదో కుట్రలా ఉంది.. ఆయన చుట్టూ ఏదో ఉచ్చు బిగుసుకుంటోందని నాకు భయంగా ఉందని కావ్య ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి.. అన్నయ్య నీదాకా రావడానికి సోమవారం వరకు ఆగాల్సిన అవసరం లేదు. అన్నయ్య బయటికి రాబోతున్నాడు, నీకు ఆపరేషన్ అయ్యే టైంకి నీ పక్కనే ఉంటాడని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో రాహుల్, రేఖ షాక్ అవుతారు. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేయమని డాక్టర్‌తో చెబుతాడు కళ్యాణ్. ఆపరేషన్‌కి కావ్య రెడీ అవ్వడంతో అంతా సంతోషిస్తారు. కావ్య రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయని.. కాకపోతే బేబీ తక్కువ వెయిట్‌తో ఉందని, రెండు వారాలు ఇంక్యూబెటర్‌లో పెట్టి బరువు పెంచుతామని చెబుతుంది డాక్టర్.
బయట కళ్యాణ్‌పై సీరియస్ అవుతుంది అప్పూ. బావగారు ఎలా బయటికొస్తారు? నీకున్న దారి ఏంటీ? అని నిలదీస్తుంది. ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రాసేసి ఉంటారు.. బెయిల్‌కి ఛాన్స్ లేదు. రెండ్రోజుల వరకు ఎంతటి వారైనా ఆగాల్సిందేనని అంటుంది. అలాంటిది బావగారిని ఆపరేషన్ టైంకి ఎలా తీసుకొస్తావని నిలదీస్తుంది అప్పూ. నేను వదినకి అబద్ధం చెప్పానని కళ్యాణ్ అనడంతో అంతా షాక్ అవుతారు. రాజ్ వస్తాడని తన పక్కనే ఉంటాడని, ఎంత నమ్మకం పెట్టుకుందో తెలుసా? అని ఇందిర సీరియస్ అవుతుంది. వదినకి అబద్ధం చెప్పడం తప్పించి ప్రస్తుతం మరో మార్గం లేదని అంటాడు కళ్యాణ్. టైంకి ఆపరేషన్ జరగకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ అంటున్నారు.. మీరెంత చెప్పినా వదిన వినే పరిస్ధితుల్లో లేదు. తనకు తానుగా ధైర్యం తెచ్చుకునే పరిస్ధితుల్లో లేదని అంటాడు. అందుకే అబద్ధం చెప్పానని అంటాడు కళ్యాణ్. అన్నయ్యని చాలా పకడ్బందీగా ఇరికించారు.. బెయిల్ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదని చెబుతాడు. డెలివరి జరిగిన తర్వాత నన్ను అసహ్యించుకున్నా పర్లేదని అంటాడు కళ్యాణ్.
ఓ పెద్ద క్రిమినల్‌ని పోలీసులు పట్టుకుని రాజ్ ఉన్న సెల్‌లో వేస్తారు. వాడు చాలా డేంజర్ అని సెక్యూరిటీ జాగ్రత్తగా పెట్టమని చెబుతారు. కావ్య గురించి ఆలోచిస్తూ రాజ్ బాధపడుతూ ఉంటాడు. ఉదయాన్నే మినిస్టర్ ధర్మేంద్ర తన భార్య తులసిని తీసుకుని హాస్పిటల్‌కు వస్తాడు. నా గతమెంటో నీకు తెలుసు.. నా భార్య, పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు ధర్మేంద్ర. బయటి వాళ్లనే జాగ్రత్తగా చూసుకునే మేము.. మీ విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకుంటామని చెబుతాడు డాక్టర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










