Brahmamudi January 12th Episode: పురిటి నొప్పులతో స్టేషన్‌కి కావ్య... జైలు నుంచి తప్పించుకునేలా రాజ్ ప్లాన్

Photo Courtesy: JioHotstar

రాజ్ జైళ్లో ఉండటం, కావ్య ఆసుపత్రిలో బెడ్ మీద ఉండటంతో అప్పూ బాధపడుతుంది. అయితే రాహుల్, రేఖల ప్రవర్తనపై అప్పూకి అనుమానం వచ్చి .. ఆరోజు నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్, బావగారి కారులోని బ్రీఫ్ కేస్ రెండూ ఒకటేనని అనడంతో రాహుల్ షాక్ అవుతాడు. భర్తను తన చెల్లెలు అనుమానిస్తూ ఉండటంతో స్వప్న సీరియస్ అవుతుంది. నీతో పాటు ఇంట్లో వాళ్లంతా కారణం లేకుండా ప్రతిదానికి రాహుల్‌ను అనుమానిస్తున్నారని మండిపడుతుంది. బిజినెస్ చేసేవాళ్లు బ్రీఫ్‌కేస్ వాడకుండా ఉంటారా? ఒకేరకం బ్రీఫ్‌కేస్‌లు ఉంటాయి కదా అని అంటుంది స్వప్న. దాంతో నా కోడలిని ఏమీ అనొద్దని స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ.

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన ఇంటి మనుషులే తమలో తాము కొట్టుకుంటూ ఉండటంతో ఇందిర సీరియస్ అవుతుంది. మరోవైపు మినిస్టర్ ధర్మేంద్ర భార్యకు ప్రెగ్నెన్సీ నిలవకపోవడంతో బాధపడుతుంటాడు. డాక్టర్ సలహా మేరకు భార్యను తీసుకుని చివరిసారిగా ప్రెగ్నెన్సీ కోసం ఆసుపత్రికి తీసుకొస్తాడు. కావ్య ఎంతకూ ట్రీట్‌మెంట్ చేసుకోకపోవడంతో అన్నయ్య కాసేపట్లోనే తిరిగొస్తానని చెప్పాడని కళ్యాణ్ అబద్ధం చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న కావ్య బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 12వ తేదీ ఎపిసోడ్ 928లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 12th 2026 Episode 928 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మంత్రి ధర్మేంద్ర తన భార్య తులసిని డెలివరీ కోసం తీసుకొస్తాడు. ఈ ఆసుపత్రి మీది.. బయటివాళ్లనే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది మీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండనని చెబుతాడు డాక్టర్. మేడంకి ఏ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్తగా చూసుకోమని స్టాఫ్‌కి చెబుతారు డాక్టర్. ఈసారైనా నా బిడ్డను కళ్లతో చూసుకుంటానా అని తులసి అడుగుతుంది. ఎంత ఖర్చయినా సరే ఈసారి బిడ్డను నీ చేతుల్లో పెడతానని అంటాడు ధర్మేంద్ర. ఇన్నేళ్ల నీ కల.. ఖచ్చితంగా నెరవేరుతుందని ధైర్యం చెబుతాడు. బెడ్‌పై కావ్య కనిపించకపోవడంతో డాక్టర్ కంగారుపడుతుంది. ఎంత వెతికినా కావ్య లేకపోవడంతో ఆసుపత్రి మొత్తం వెతుకుతారు. గదిలో కావ్య లేదని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

వదిన ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసని చెబుతాడు కళ్యాణ్. వదిన అన్నయ్య దగ్గరికే వెళ్లి ఉంటుందని అంటాడు కళ్యాణ్. నేను వెళ్లి తీసుకొస్తానని చెబుతాడు. కావ్య పురిటి నొప్పులతో బాధపడుతూనే రాజ్ కోసం స్టేషన్‌కి వస్తుంది. కావ్యను చూడగానే రాజ్ షాక్ అవుతాడు. నువ్వున్న పరిస్ధితి ఏంటీ? నువ్వు చేస్తున్న పని ఏంటని బాధపడతాడు. అరెస్ట్ చేశారు.. నేనే బయటకు వచ్చేస్తానని అంటాడు కార్తీక్. మీరు నా పక్కన ఉండుంటే నేనిలా ఉండేదానిని కాదని అంటుంది కావ్య. మీరు దొంగ బంగారం కొనడం ఏంటీ? మీ కారులో దొంగ బంగారం దొరకడం ఏంటీ? ఎవరో మీ పేరు చెబితే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటీ? అని బాధపడుతుంది కావ్య.

మీరు బయటకు రారని తెలిసే కవిగారు నాకు అబద్ధం చెప్పారు. కానీ మీరు కూడా అదే అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తున్నారా అని కావ్య బాధపడుతుంది. మీరు రారని తెలిస్తే నేను తట్టుకోలేనని నాకు అబద్ధం చెప్పారని కవిగారు అత్తయ్యగారికి చెబుతుంటు నేను విన్నానని అంటుంది కావ్య. నాకు అంతకన్నా మార్గం కనిపించలేదు.. నేను పక్కనే ఉంటేనే ఆపరేషన్ చేయించుకుంటానని నువ్వు మొండిపట్టు పట్టావని కళ్యాణ్ అలా చెప్పి ఉంటాడని రాజ్ అంటాడు. ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోమని కావ్యని బతిమలాడాడు. మీరు నాతో పాటు రావాలని ఎస్ఐ గారితో మాట్లాడతానని వెళ్తుంది కావ్య.

నా భర్త ఏ తప్పు చేయలేదు.. ఆయనని వదిలేయండి అని ఎస్ఐని అడుగుతుంది కావ్య. నా భర్త గురించి ఈ సిటీలో ఎవరిని అడిగినా చెబుతారని అంటుంది. మీ ఆయన గురించి నాకు కూడా తెలుసు.. సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి, పై నుంచి ఆర్డర్స్ వున్నాయని ఏదైనా కోర్టులో చూసుకోండి అని ఎస్ఐ తేల్చిచెబుతాడు. ఈ సాక్ష్యాలు ఎక్కడివి? ఎవరు సృష్టించారు.. మన మీద ఎవరు ఇంత కుట్ర చేశారని బాధపడుతుంది కావ్య. నేను నిర్దోషినని తేల్చడానికి కోర్టులు ఉన్నాయి.. ముందు నువ్వు ఆపరేషన్ చేయించుకోమని బతిమలాడతాడు రాజ్. ఇంతలో కావ్యను వెతుక్కుంటూ కళ్యాణ్ వస్తాడు. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్లనని అంటుంది కావ్య. ఆసుపత్రిలో అంతా నీకోసం కంగారు పడుతున్నారని కళ్యాణ్ చెబుతాడు. నా డెలివరి సమయంలో మీరు నా పక్కనే ఉంటానని చెప్పారు కదా? మొదటిగా మీరే నా బిడ్డను ముట్టుకోవాలని అంటుంది. అంతలో కావ్యకి నొప్పులు రావడంతో కావ్యను తీసుకుని వెళ్తాడు కళ్యాణ్.

కావ్య, కళ్యాణ్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుంది. ఇంతలో కావ్యను వీల్‌చైర్‌లో పెట్టుకుని తీసుకొస్తాడు కళ్యాణ్. నొప్పులతో బాధపడుతున్న కావ్యని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. వెంటనే కావ్యకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కావ్య పరిస్ధితి ఏం బాలేదని... ప్రమాదం అంచుల మీద కొట్టుమిట్టాడుతోందని చెబుతుంది డాక్టర్. తన కండీషన్ ఏంటో గంట గంటకు చెబుతూనే ఉన్నాం.. కానీ తనను ఆపరేషన్‌ కోసం ఎందుకు నచ్చచెప్పడం లేదని మండిపడుతుంది డాక్టర్. కానీ ఆపరేషన్ టైంకి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని ఫైర్ అవుతుంది. ఏదైనా జరగరానిది జరిగితే మా హాస్పిటల్ పరువు ప్రతిష్టలు పోతాయని మండిపడుతుంది. తప్పు మీరు చేస్తే బాధ్యత మేం తీసుకోవాలా? మరో ఆసుపత్రికి తీసుకెళ్లిపోమ్మని ఫైర్ అవుతుంది.

దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డాక్టర్‌ను బతిమలాడుతుంది. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మాదని చెబుతుంది అపర్ణ. తను కాస్త ధైర్యంగా ప్రశాంతంగా ఉంటే బీపీ నార్మల్‌గా ఉంటుంది. ఆపరేషన్ చేస్తే తల్లీ, బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉంటారని మాకు కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతుంది డాక్టర్. ఇకపై అక్కని మేం జాగ్రత్తగా చూసుకుంటామని అప్పూ చెబుతుంది. కావ్యే తనకు తాను బీపీని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే తన భర్త ఇక్కడికి రావాలని తేల్చిచెబుతుంది డాక్టర్. దాంతో ఏం చేయాలో తెలియక దుగ్గిరాల ఫ్యామిలీ కంగారు పడుతుంది.

మరోవైపు.. తన భార్య గురించి ధర్మేంద్ర టెన్షన్ పడతాడు. రిపోర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయని ఆపరేషన్‌కి రెడీ చేద్దామని డాక్టర్ చెబుతాడు. నా ధైర్యం, నా నమ్మకం మీరేనని అంటుంది తులసి. కావ్యకి ఎలా ఉందో? ఆపరేషన్ జరిగిందో లేదోనని రాజ్ కంగారు పడతాడు. దాంతో కానిస్టేబుల్‌ని పిలిచి ఒకసారి ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. రాజ్ ఎంత బతిమలాడినా కానిస్టేబుల్ ఫోన్ ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలని చెప్పి బతిమలాడటంతో కానిస్టేబుల్ ఫోన్ ఇస్తాడు. వెంటనే కళ్యాణ్‌కి ఫోన్ చేసి కళావతిని చూడాలని ఉందని, ఆపరేషన్‌ జరిగే టైంలో తన పక్కనే ఉంటానని అంటాడు. కానీ అదెలా సాధ్యమని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. ఇప్పటి వరకు నీతి, నిజాయితీలతోనే ఉన్నానని.. కానీ జీవితంలో మొదటిసారి నా భార్య కోసం తప్పు చేస్తానని చెబుతాడు. జైలు నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్లాన్ చెబుతాడు. అన్నయ్య మాటలు వినగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X