Brahmamudi January 13th Episode: జైలు నుంచి తప్పించుకున్న రాజ్... అప్పూకి అగ్నిపరీక్ష
Photo Courtesy: JioHotstar
మంత్రి ధర్మేంద్ర తన భార్య తులసిని డెలవరీకి తీసుకొచ్చి డాక్టర్ చేతిలో పెడతాడు. బయటి వాళ్లనే ఎంతో కేరింగ్‌గ చూసుకునే మేము.. మీ విషయం ఎలాంటి తప్పు చేయమని అంటారు డాక్టర్లు. ఆపరేషన్ కోసం లోపలికి వచ్చిన డాక్టర్లకు బెడ్ మీద కావ్య కనిపించకపోవడంతో షాక్ అవుతారు ఆ వెంటనే విషయం దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్పగా వారు కంగారు పడతారు. వదిన ఎక్కడుందో నాకు తెలుసు నేను తీసుకొస్తానని కళ్యాణ్ బయల్దేరతాడు.
పురిటి నొప్పులతో బాధపడుతూనే పోలీస్ స్టేషన్‌కు వస్తుంది కావ్య. ఏ తప్పు చేయని మీరు జైళ్లో ఉన్నారని దీని వెనుక ఏదో కుట్ర ఉందని బాధపడుతుంది. తన భర్తను వదిలేయాలని పోలీసులను బతిమలాడగా.. సాక్ష్యాధారాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని పోలీసులు చెబుతాడు. ఇంతలో కావ్యకు నొప్పులు ఎక్కువగా కాగా.. కళ్యాణ్ వచ్చి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కావ్య మరోసారి ఇలా వెళ్లిపోతే మేం చేయగలిగేది ఏం లేదని చీవాట్లు పెడుతుంది డాక్టర్. కానిస్టేబుల్ రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకున్న రాజ్... తాను జైలు నుంచి తప్పించుకుంటానని కళ్యాణ్‌కు చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 13వ తేదీ ఎపిసోడ్ 929లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా జీవితంలో ఇప్పటి వరకు ఏం చేసినా అన్ని నిజాయితీగానే చేశాను.. కానీ ఈసారి మాత్రం కావ్య కోసం తప్పు చేయాలని అనుకుంటున్నట్లు కళ్యాణ్‌తో చెబుతాడు రాజ్. జైలు నుంచి తప్పించుకుంటే నీకు ప్రాబ్లమ్ అవుతుందని కళ్యాణ్ చెప్పగా... కళావతి బాధ ముందు నా బాధ చాలా చిన్నదని అంటాడు రాజ్. అన్నయ్య మాటను కాదు అనలేక సరేనని అంటాడు కళ్యాణ్. ఆ వెంటనే తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఒక కానిస్టేబుల్‌కి ఇంట్లో నుంచి పంపిస్తున్నట్లు పోలీస్ స్టేషన్‌కి క్యారియర్ పంపమని, అందులో భోజనం ఉండకుండా చాలా బరువుగా ఉండేలా పెట్టమని చెబుతాడు కళ్యాణ్. అతను చెప్పినట్లుగానే కళ్యాణ్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్‌కి కారియర్ తీసుకెళ్లి ఇచ్చి కళ్యాణ్‌కు ఫోన్ చేస్తాడు.
ఆ వెంటనే కళ్యాణ్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి మీ స్టేషన్‌లో బాంబు ఉందని చెబుతాడు. అది ఎవ్వరూ నమ్మరు.. మీకు ఓ వ్యక్తి కారియర్ తీసుకొచ్చి ఇచ్చాడు, అది టిఫిన్ బాక్స్ బాంబు అని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి అని అంటాడు. ఈ విషయం ఎస్ఐకి చెప్పిన కానిస్టేబుల్స్ వెంటనే జైళ్లో ఉన్న ఖైదీలను తీసుకుని బయటకు వచ్చేస్తారు. అప్పటికే కళ్యాణ్ బైక్ మీద రెడీగా ఉండగా... రాజ్‌ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో డాగ్ స్క్వాడ్ వచ్చి స్టేషన్ మొత్తాన్ని తనిఖీ చేస్తారు. కానిస్టేబుల్‌కు వచ్చిన కారియర్‌ను చెక్ చేయగా అందులో రాళ్లే ఉంటాయి. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి బాంబు లేదని, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని బాంబు స్క్వాడ్ టీమ్.. ఎస్ఐకి చెబుతుంది. మీ క్యారియర్‌లో రాళ్లు ఉన్నాయి బాంబు లేదని చెబుతారు.
పోలీస్ స్టేషన్ నుంచి రాజ్ తప్పించుకున్నాడని కానిస్టేబుల్ చెప్పగా.. వాడు ఎక్కడికి వెళ్లాడో? పోలీస్ స్టేషన్‌కి ఎలా తీసుకురావాలో? తనకు బాగా తెలుసునని అంటాడు ఎస్ఐ. కావ్య గురించి ఆలోచిస్తూ అప్పూ బాధపడుతుంది. ఇంతలో అప్పూకి ఎస్ఐ ఫోన్ చేసి మీ బావగారు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడని చెబుతాడు. డిపార్ట్‌మెంట్ కళ్లుకప్పి తప్పించుకున్నాడు.. నువ్వే నీ చేతులతో మీ బావని అరెస్ట్ చేసి స్టేషన్‌లో అప్పగించాలని చెబుతాడు ఎస్ఐ. నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను.. మీరే వచ్చి అరెస్ట్ చేయమని చెబుతుంది అప్పూ. డిపార్ట్‌మెంట్ మొత్తం చూస్తుండగా తప్పించుకున్నాడు... అందుకే ముల్లుని ముల్లుతోనే తీయాలని నిర్ణయించుకున్నానని అంటాడు ఎస్ఐ. నువ్వే అరెస్ట్ చేసి తీసుకురా? ఇది నా ఆర్డర్ అని మండిపడతాడు ఎస్ఐ. ఒక గంటలో వాడిని అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆర్డర్స్ వేస్తాడు.
భర్త గురించి కలవరిస్తూ కావ్య ఏడుస్తుంది. మా ఆయన లేకుండా నన్ను ఆపరేషన్‌కి తీసుకెళ్లొద్దని డాక్టర్‌ని అడుగుతుంది కావ్య. నా భర్త ప్రమాదంలో ఉన్నారని.. నా భర్త వచ్చే వరకు నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లొద్దని అడుగుతుంది కావ్య. ఇలాంటి భార్యను, ఇలాంటి ప్రెగ్నెంట్‌ని నా కెరీయర్‌లో చూడలేదని అంటుంది డాక్టర్. త్వరగా మీ అబ్బాయిని ఇక్కడికి తీసుకురండి, లేదంటే ఆవిడని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుంది. ఇంతలో రాజ్ రావడంతో అంతా షాక్ అవుతారు. కావ్య పరిస్ధితి తెలిసి అక్కడ ఉండలేకపోయానని, అందుకే తప్పించుకుని పారిపోయి వచ్చేశానని రాజ్ చెప్పగా అంతా ఉలిక్కిపడతారు. నువ్వు పక్కన ఉంటేనే ఆపరేషన్ చేయించుకుంటానని గొడవ .. ఏం చేయాలో పాలు పోవడం లేదని అంటుంది ఇందిర.
కళావతి కోసం ఏం ఆలోచించకుండా వచ్చేశానని అంటాడు రాజ్. సమయానికి మంచి పనిచేశావని దుగ్గిరాల ఫ్యామిలీ మెచ్చుకుంటుంది. రాజ్ లోపలికి వెళ్తుండగా అప్పూ వచ్చి ఆగమంటుంది. నేను ఇప్పుడు దుగ్గిరాల వారింటి కోడలిని కాదు, మీ వైఫ్‌కి చెల్లెలిని కాదు.. డ్యూటీలో ఉన్న ఎస్ఐని అని చెబుతుంది అప్పూ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నువ్వు మర్యాదగా లొంగిపో... నేను నిన్ను అరెస్ట్ చేసి డిపార్ట్‌మెంట్‌కి అప్పగించాలని అంటుంది అప్పూ. ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో రాజ్‌ని అరెస్ట్ చేయమని చెబుతుంది అప్పూ. ఆ మాటలతో ఇందిర రగిలిపోతుంది. నా మనవడిని అరెస్ట్ చేసి, మీ అక్క ప్రాణాలను తీస్తావా? ఒక నిండు ప్రాణం తీయమని చెప్పిందా నీ డ్యూటీ? అని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పూపై మండిపడుతుంది.
బావగారు తప్పించుకుని వచ్చి మరో తప్పు చేశారు.. ఇప్పుడు ఉన్న కేసుకు తోడు మరో కేసు కూడా ఆయన మీద పడుతుందని అంటుంది అప్పూ. అలా జరగకుండా ఉండాలంటే బావగారు లొంగిపోవాలి, నేను అరెస్ట్ చేయాలని చెబుతుంది. నా భార్య ప్రాణాల కంటే ఈ కేసు పెద్ద విషయం కాదు.. నా భార్యను కాపాడుకునేందుకు నేను జీవితాంతం జైళ్లో కూర్చొన్న నష్టం లేదని అంటాడు రాజ్. ఇన్నాళ్లూ నా కోడలితో పాటు నిన్ను కూడా కూతురిలా చూసుకున్నందుకు పెద్ద గిఫ్ట్ ఇచ్చావని మండిపడుతుంది అపర్ణ. చావు బతుకుల్లో ఉన్న మీ అక్క ఇంతకాలం మీ అందరి కోసం పాటుపడితే పెద్ద శిక్ష వేశావని అంటుంది. మా ప్రాణాలు అడ్డుపెట్టి నా కొడుకుని లోపలికి పంపిస్తామని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్‌కి అడ్డుగా నిలబడుతుంది.
అప్పూ గారిని లోపలికి వెళ్లనివ్వకపోతే మమ్మల్ని అయినా వెళ్లనివ్వమని కానిస్టేబుల్స్ అడుగుతారు. మా ఉద్యోగాలు పోతాయని కానిస్టేబుల్స్ ఎంత బతిమలాడినా దుగ్గిరాల ఫ్యామిలీ వినిపించుకోదు. ఆ గొడవకి డాక్టర్ వచ్చి కోప్పడతారు. రాజ్ స్టేషన్ నుంచి తప్పించుకుని వచ్చాడు, అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని చెబుతారు పోలీసులు. పర్మిషన్ లేకుండా ఆసుపత్రిలోకి రాకూడదు, పేషెంట్ గదిలోకి అస్సలు రాకూడదని డాక్టర్స్ చెబుతారు. మీ దగ్గర పర్మిషన్ లెటర్, వారెంట్ ఉందా? అని నిలదీయడంతో పోలీసులు షాక్ అవుతారు. ఇది మా ఫ్యామిలీ విషయమని మేం చూసుకుంటామని అంటుంది అప్పూ.
రాజ్ కళ్లెదుట కనిపించడంతో కావ్య సంతోషిస్తుంది. మీరే నా ధైర్యం, మీరే నా సర్వస్వమని అంటుంది కావ్య. నీ డెలివరీ టైంలో నీ పక్కనే ఉంటానని మాటిచ్చాను కదా? నా మాట నిలబెట్టుకున్నాను, బిడ్డను ఇస్తానన్న నీ మాటను నువ్వు నిలబెట్టుకోవాలి కదా అని అంటాడు రాజ్. మీరొచ్చారు కదా? ఇక నాకు ఏ దిగులు లేదు.. ఆనందంగా మన బిడ్డకి జన్మనిస్తానని చెబుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి రాజ్‌పై మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










