Brahmamudi January 14th Episode: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కావ్య... దుగ్గిరాల ఫ్యామిలీలో పండగ
Photo Courtesy: JioHotstar
ఆసుపత్రిలో ఆపరేషన్ టైంకి కావ్య పక్కన ఉండాలంటే నేను నీతి, నిజాయితీలను వదిలేయాలని కళ్యాణ్‌తో చెబుతాడు రాజ్. తాను తప్పించుకోవాలని అనుకుంటున్నానని, నేను చెప్పినట్లు చేయమని అంటాడు. అన్నయ్య చెప్పినట్లే వాళ్ల ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్‌కు భోజనం ఇస్తున్నట్లు క్యారియర్ పంపించాలని, అందులో రాళ్లు తప్ప ఏం ఉండకూడదని చెబుతాడు కళ్యాణ్. అతని ఫ్రెండ్ కూడా కళ్యాణ్ చెప్పినట్లే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి క్యారియర్ ఇస్తాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ క్యారియర్‌లో బాంబు ఉందని, వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసేయమని పోలీసులకు ఫోన్ చేసి చెబుతాడు కళ్యాణ్. దాంతో పోలీసులు, ఖైదీలు భయంతో బయటకు వచ్చేస్తారు. ఇదే అదనుగా కళ్యాణ్ బైక్ మీద రాజ్ తప్పించుకుంటాడు.
పోలీస్ స్టేషన్‌లో బాంబు లేదని తేలడంతో పాటు రాజ్ తప్పించుకున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ వెంటనే అప్పూకి ఫోన్ చేసి విషయం చెప్పి రాజ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ వేస్తాడు. కావ్య కోసం రాజ్ లోపలికి వెళ్తుండగా అప్పూ వచ్చి వెంటనే లొంగిపోవాలని చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్‌కు రక్షణగా అడ్డుగా నిలుస్తుంది. రాజ్ తన కోసం రావడంతో కావ్య సంతోషిస్తుంది. వెంటనే ఆపరేషన్ చేసుకోవడానికి ఓకే చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 14వ తేదీ ఎపిసోడ్ 930లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications










