Brahmamudi January 16th Episode: మినిస్టర్‌తో రుద్రాణి డీల్... కావ్య - రాజ్‌ల బిడ్డకు పెను ప్రమాదం

Photo Courtesy: JioHotstar

ఆపరేషన్ థియేటర్‌లో క్రిమినల్ ఉండటానికి వీల్లేదని తక్షణం వెళ్లిపోమ్మని రాజ్‌పై సీరియస్ అవుతుంది డాక్టర్. నా భార్యా, బిడ్డల ప్రాణాల కాపాడండి.. కావ్యకి డెలివరీ అయిన వెంటనే పోలీసులకు లొంగిపోతానని చెబుతాడు రాజ్. కావ్య కూడా తన భర్త లేకుండా ఆపరేషన్ చేయించుకోనని చెప్పడంతో డాక్టర్ తప్పనిసరి పరిస్ధితుల్లో ఒప్పుకుంటుంది. ఆపరేషన్ ముగిసిన వెంటనే బావగారిని అరెస్ట్ చేస్తానని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్ అవుతుంది. నీకు నీ అక్కాబావలపై అంత ప్రేమ ఉంటే ముందు రాజ్‌ని జైలు నుంచి బయటకు తీసుకురమ్మని చెబుతారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు.

దాంతో కళ్యాణ్, అప్పూలు స్టేషన్‌కి వెళ్లి రాజ్ కేసు ఫైల్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం సెల్‌లో ఉన్న శాండీని చితకబాదుతుంది అప్పూ. ఇది చూసిన ఎస్ఐ వచ్చి అప్పూని ఆపుతాడు. అసలు మా బావని ఇరికించింది వీడే.. వాడు చెబుతున్నా డేట్స్‌లో రాజ్‌గారు ఇంట్లోనే ఉన్నారని చెబుతుంది. ఆ తర్వాత తన స్టైల్‌లో అప్పూ ఎంక్వైరీ చేయడంతో రాజ్‌గారిపై పగతో ఇదంతా నేనే చేశానని శాండీ ఒప్పుకుంటాడు. ఆసుపత్రిలో కావ్యకి రాజ్ సమక్షంలో డెలివరీ చేస్తారు డాక్టర్స్. ఈ క్రమంలో ఆమెకు పండంటి ఆడపిల్ల పుట్టడంతో పాపను పట్టుకుని మురిసిపోతుంది కావ్య. కావ్యకు ఆడపిల్ల పుట్టిన విషయం తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 16వ తేదీ ఎపిసోడ్ 931లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 16th 2026 Episode 931 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్‌ని నాకు పాప పుట్టాడా? బాబు పుట్టాడా? అని అడుగుతాడు మినిస్టర్ ధర్మేంద్ర. ఆడపిల్ల పుట్టిందని డాక్టర్ చెప్పగా... అంత నీరసంగా చెబుతావేంటీ? ఆడపిల్ల అంటే మహాలక్ష్మీ అంటాడు మినిస్టర్. ఆడపిల్ల పుట్టింది కానీ, పాప కండీషన్ బాలేదని చెబుతాడు. ఈ కండీషన్‌లో బేబీకి గుండె ఎడమ భాగం సరిగా పనిచేయదు, దాని వల్ల ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని డాక్టర్ చెప్పడంతో మినిస్టర్ షాక్ అవుతాడు. ఆపరేషన్ చేయాలి.. పాప బరువు పెరిగిన తర్వాతే సర్జరీ చేయాలని చెబుతాడు డాక్టర్. సంవత్సరం తర్వాత ఆపరేషన్ చేసినా బతుకుతుందని గ్యారంటీ లేదని డాక్టర్ అనడంతో మినిస్టర్ షాక్ అవుతాడు.

సర్జరీని తట్టుకునే శక్తి పాపకి ఉండాలి కదా అని అంటాడు డాక్టర్. మీరు ఈ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో? నాకు తెలుసు కానీ ఏం చేయలేదని పరిస్దితి అంటాడు డాక్టర్. ఈ విషయం నా భార్యకి తెలుసా? అని మినిస్టర్ అడగ్గా.. మేడం స్పృహలోకి రాలేదని చెబుతాడు డాక్టర్. ఈ విషయం నా భార్యకు అప్పుడే చెప్పొద్దని బతిమలాడతాడు మినిస్టర్. తన భార్యాబిడ్డల గురించి తెలుసుకుని ధర్మేంద్ర కుప్పకూలిపోతాడు. కావ్య కళ్లు తెరిచి చూసేసరికి.. దుగ్గిరాల కుటుంబం వచ్చి పలకరిస్తుంది. మీ కలల పంటని మా కళ్ల ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డావని ఫ్యామిలీ అంతా మెచ్చుకుంటుంది. నా మనవరాలు పుట్టిన శుభ సందర్భంలో కంపెనీ వర్కర్స్‌కి రెండు నెలలు బోనస్ ఇవ్వాలని చెబుతాడు సుభాష్.

ఇంతలో పోలీసులు వచ్చి.. ఇప్పటి వరకు మానవత్వంతో వెయిట్ చేశామని, ఇకనైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్దామా అని కానిస్టేబుల్స్ రాజ్‌ని అడుగుతారు. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. డెలివరి సమయంలో నా భార్య పక్కన ఉంటే చాలు అనుకున్నాను.. ఇప్పుడు ఆమె సేఫ్‌గా ఉంది, ఇక మీతో రావడానికి నాకు ఏ అభ్యంతరం లేదని అంటాడు రాజ్. నిందితుడిగా వెళ్లి నిర్దోషిగా బయటకు రావాలి.. మన ఫ్యామిలీ మీద ఎవరు బురద జల్లారో వాళ్లని చట్టం ముందు నిలబెడదామని అంటాడు రాజ్. ఇంతలో అప్పూ వచ్చి మా బావ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదని అంటుంది. మా బావ మీద ఆరోపణలు చేసిన శాండీగాడు.. నేనే రాజ్‌గారిని ఇరికించానని ఒప్పుకోవడంతో కోర్ట్.. మా బావ అరెస్ట్‌ని ఆపమని చెప్పిందని అంటుంది అప్పూ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషించగా... రాహుల్, రేఖలు షాక్ అవుతారు. దాంతో అప్పూకి కావ్య, రాజ్‌ థ్యాంక్స్ చెబుతారు.

నువ్వు తొందరపడ్డావని నానామాటలు అన్నామని అప్పూకి అపర్ణ, ఇందిరలు క్షమాపణలు చెబుతారు. మీరంతా ఇలా చేయబట్టే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని బావగారిని నిర్దోషిగా తీసుకొచ్చానిన చెబుతుంది. నీ కూతురు పుట్టిన వేళా విశేషం.. నా మనవడు నిర్దోషిగా బయటకు వచ్చాడు, అది మనింటి మహాలక్ష్మీ అని ఇందిర అంటుంది. ఈ మాటలు విన్న రుద్రాణి రగిలిపోతుంది. ఇప్పటి వరకు నా ముని మనవరాలిని చూడలేదు, కనీసం ముట్టుకోలేదని అంటుంది ఇందిర. నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడదని భయపడ్డాను.. కానీ నా కూతురే తన తండ్రిని తన దగ్గరికి తీసుకొచ్చుకుందని చెబుతుంది కావ్య.

ఇంతలో తన బిడ్డను కాపాడగలిగే వారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకురండి, ఎంత ఖర్చయినా పర్లేదని ఫోన్‌లో మాట్లాడతాడు ధర్మేంద్ర. ఇంతలో రుద్రాణి వచ్చి.. మీ పాపకు వచ్చిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నా దగ్గర ఉందని చెబుతుంది. తన పాప బతకదని మీ భార్యకు తెలిస్తే తన పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలాసార్లు పుట్టిన బిడ్డను పురిట్లోనే కోల్పోయి, ఇప్పుడు పుట్టిన బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఈ బిడ్డ కూడా బతకదని తెలిస్తే తను బతకగలదా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఈ హాస్పిటలే మీది.. మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించగలరు, ఆ బిడ్డ బతకదని అంటుంది రుద్రాణి.

దీనికి ఒటే సొల్యూషన్.. ప్రాణాలతో పోరాడుతున్న మీ పాప ప్లేస్‌లోకి వేరే ఆరోగ్యంగా ఉన్న పాపని మారిస్తే సరిపోతుందని చెబుతుంది రుద్రాణి. అలాంటి పాప ఎక్కడుందో కూడా నాకు తెలుసు.. మీ అదృష్టంకొద్దీ నాకు తెలిసినవాళ్లకు కూడా ఆడపిల్ల పుట్టింది.. ఆ పాప చాలా ఆరోగ్యంగా ఉంది. ఆ పాప ప్లేస్‌లో మీ పాపని పెట్టాలి... ఇది మూడో కంటికి తెలియకుండా జరిగిపోతుందని అంటుంది రుద్రాణి. ఆ మాటలు వినగానే మినిస్టర్ ధర్మేంద్ర సీరియస్ అవుతాడు. పిల్లలని మార్చడం ఎంత పెద్ద క్రైమ్ అనేది తెలియదా? మీ భార్య బతకాలా? వద్దా? అనేది మీ చేతుల్లోనే ఉందని అంటుంది రుద్రాణి. అలాంటి పనులు నేను చేయను.. నా ఫ్యామిలీ కోసం ఇంకో తల్లిని బాధపెట్టలేను అంటాడు మినిస్టర్.

ఈ సొసైటీలో బతకాలంటే మంచి, మానవత్వం వంటివి చూడకూడదని అంటుంది రుద్రాణి. అలాంటి పనులు నేను చేయనని మినిస్టర్ సీరియస్‌గా వెళ్లిపోతుండగా... అతనికి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి నాతో మీకు అవసరం వస్తుందని చెబుతుంది రుద్రాణి. కావ్య నిద్రపోతుండగా రాజ్ వచ్చి పాలు ఇస్తాడు. నా కడుపున పడిన దగ్గరి నుంచి నేటి వరకు పోరాటం చేశానని అంటుంది కావ్య. ఓ పక్క మీరు, మరోవైపు పాప గురించి టెన్షన్ పడ్డానని చెబుతుంది. మిమ్మల్ని కావాలని ఎవరో ఇరికించారు.. మనకి తెలియకుండా మన వెనుక ఏదో జరుగుతోందని బాధపడుతుంది కావ్య. ఏం జరిగినా నేను చూసుకుంటానని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X