Brahmamudi January 17th Episode: బిడ్డల్ని మార్చేసిన రుద్రాణి... తన బిడ్డ కాదని కనిపెట్టిన కావ్య

Photo Courtesy: JioHotstar

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు డాక్టర్ పుట్టాడా? బాబు పుట్టాడా అని అడుగుతాడు మినిస్టర్ ధర్మేంద్ర. ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే మినిస్టర్ సంతోషిస్తాడు. కానీ పాప హార్ట్‌కు ప్రాబ్లమ్ ఉందని, తనకు ఆపరేషన్ చేసినా బతుకుతుందన్న నమ్మకం లేదని డాక్టర్ చెప్పగానే ధర్మేంద్ర షాక్ అవుతాడు. కావ్య స్పృహలోకి వచ్చి కుటుంబాన్ని పలకరిస్తుంది. ఇంతలో కానిస్టేబుల్స్ వచ్చి రాజ్‌ను అరెస్ట్ చేయబోతుండగా అప్పూ అడ్డుకుని మా బావ నిర్దోషి అని కోర్ట్ ఆర్డర్ చూపిస్తుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషించి అప్పూకి థ్యాంక్స్‌తో పాటు క్షమాపణలు చెబుతుంది.

తన పాపను బతికించుకోవడానికి మినిస్టర్ ధర్మేంద్ర ప్రయత్నిస్తుండగా రుద్రాణి వచ్చి మీ పాపని నేను బతికిస్తానని చెబుతుంది. ఈ హాస్పిటల్‌లోనే మరో ఆడపిల్ల పుట్టింది... మీ పాపని ఆ బిడ్డ ప్లేస్‌లో పెట్టమని రుద్రాణి చెప్పగా ధర్మేంద్ర సీరియస్ అవుతాడు. నా కోసం మరో తల్లిని ఏడిపించనని అంటాడు. మీరే నా దారికి వస్తారని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఈ కేసులో మిమ్మల్ని ఎవరో ఇరికించారు.. వాళ్లెవరో తెలియాలని రాజ్‌తో అంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 17వ తేదీ ఎపిసోడ్ 932లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 17th 2026 Episode 932 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

స్పృహలోకి వచ్చిన మినిస్టర్ ధర్మేంద్ర భార్య .. పాప ఎక్కడ? నాకు చూపించడం లేదని ప్రశ్నిస్తుంది. మన పాపని ఇంక్యూబెటర్‌లో పెట్టారని ధర్మేంద్ర చెప్పడంతో తులసి షాక్ అవుతుంది. మన పాపకి ఏం జరిగింది? మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారని బాధపడుతుంది. మీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పడంతో తులసి కంగారుపడుతుంది. డాక్టర్ ఏదో చెప్పబోతుండగా ధర్మేంద్ర కవర్ చేస్తాడు. పాప బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యూబెటర్‌లో పెట్టారని.. ఇది ఈరోజుల్లో కామన్ అని చెబుతాడు ధర్మేంద్ర. మా ఆయన చెప్పేది నిజమేనా? పాపకు ఏం కాలేదు కదా అని తులసి అడగ్గా నా మీద నమ్మకం పోయిందా అంటాడు ధర్మేంద్ర. పాపని చూస్తానని ఒక్కసారి చూపించమని తులసి ప్రాధేయపడగా.. ఇంక్యూబెటర్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని ముట్టుకోకూడదని, ఇన్ఫెక్షన్ సోకుతుందని అంటాడు డాక్టర్.

దాంతో ధర్మేంద్ర తన భార్యను తీసుకుని దూరం నుంచి బిడ్డను చూపిస్తాడు. మన పాప చాలా ముద్దుగా ఉందని, నా కూతురిని కాళ్లు కందకుండా నెత్తిన పెట్టుకుని చూసుకుంటానని చెబుతుంది. ఇక నుంచి నన్నెవరూ గొడ్రాలిని అనరు.. నా పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని అంటాడు. పాపకు ఏ ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటానని ధర్మేంద్ర అంటాడు. మరోవైపు.. రాహుల్, రేఖలతో రుద్రాణి మీటింగ్ పెడుతుంది. రెండ్రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది రేఖ. ఎవరో మినిస్టర్ వల్ల మనం అనుకున్నది జరుగుతుందని చెప్పావు.. ఏం చేశావని అడుగుతాడు రాహుల్. ఆ ఇంటికే వారసుల్ని లేకుండా చేస్తానని అన్నావు.. ఇప్పుడు పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూడదు అన్నావని మండిపడుతుంది రేఖ.

తుఫాన్ వచ్చేటప్పుడు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది.. నేను కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది రుద్రాణి. పుట్టిన బిడ్డను ఇంక్యూబెటర్‌లో పెట్టారు.. మనం వారం రోజులు ఇలాగే వదిలేస్తే ఇంటికెళ్లి బారసాల చేసుకుంటారని రాహుల్ సెటైర్లు వేస్తాడు. ఆ ఇంట్లో అలజడి వచ్చేది ఎప్పుడు? కావ్య చచ్చేది ఎప్పుడు? బావ నాకు దక్కేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తుంది రేఖ. ఆ మినిస్టర్ నన్ను కలిసిన క్షణం నుంచి దుగ్గిరాల వారింట్లో కన్నీళ్ల వర్షం కురుస్తుందని అంటుంది రుద్రాణి. మినిస్టర్‌కు తన భార్యంటే ప్రాణం.. తన భార్య కోసం తన బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తాడు. ది జరగాలంటే మినిస్టర్ నన్ను కలిసేలా ప్లాన్ చేశానని అంటుంది రుద్రాణి. ఇంతలోనే మినిస్టర్ ఫోన్ చేసి కలవాలని చెబుతాడు.

నా భార్యను కాపాడుకోవాలి.. నా బిడ్డ పరిస్ధితి నా భార్యకు చెప్పే ధైర్యం నాకు లేదు. మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు.. నా భార్య బతకాలి, ఆనందంగా ఉండాలి. తనకు పుట్టిన బిడ్డ బ్రతకదన్న భయం నా భార్యకు రాకూడదంటే నా బిడ్డ స్థానంలోకి మరో బిడ్డ రావాలి. బిడ్డను మార్చడానికి నేను సిద్ధమేనని రుద్రాణితో చెబుతాడు ధర్మేంద్ర. కానీ ఇప్పటికప్పుడు నా బిడ్డ స్థానంలోకి మరో బిడ్డ ఎలా వస్తుంది? ఆ బిడ్డ ఎవరు? అని అడుగుతాడు. దాంతో బిడ్డను, రాజ్- కావ్యలను ధర్మేంద్రకు చూపిస్తుంది రుద్రాణి. వాళ్ల బిడ్డను నాకు ఇవ్వడానికి వాళ్లు ఒప్పుకుంటారా? అని ధర్మేంద్ర అడగ్గా.. మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలని చెబుతుంది రుద్రాణి.

ఈపని చేయడానికి డాక్టర్ చక్రవర్తి ఒప్పుకోడని ధర్మేంద్ర చెప్పగా... నర్స్ నీలవేణిని కొనేయమని చెబుతుంది రుద్రాణి. దానికి ధర్మేంద్ర సరేనని చెబుతాడు. నేను నా భార్యను బతికించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను, కానీ మీరెందుకు ఇదంతా చేస్తున్నారని ధర్మంద్ర అడగ్గా... పిల్లల కోసమని చెబుతుంది రుద్రాణి. ఈరోజు రాత్రికే బిడ్డల్ని మార్చేద్దామని ప్లాన్ చేస్తారు ధర్మేంద్ర, రుద్రాణి. ధర్మేంద్ర డబ్బుకు అమ్ముడుపోయిన నర్స్.. అర్ధరాత్రి బిడ్డల్ని మార్చేస్తుంది. కావ్య, రాజ్‌లు ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు.

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి రావడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. మేమే పాపని తీసుకుని ఇంటికి వచ్చేస్తాం కదా.. మీరెందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు రాజ్. మీరు వచ్చే వరకు నా మహాలక్ష్మీని చూడకుండా ఉండలేమని అంటుంది ఇందిర. అలాంటప్పుడు ఇంట్లో ఎలా ఉంటాం.. ఈరోజు కోసం వారం నుంచి ఎదురుచూస్తున్నామని అంటుంది పెద్దావిడ. ముందు నేను ఎత్తుకున్నాకే పాపని మీకు అప్పగిస్తానని చెబుతుంది కావ్య. తర్వాత తులసి, కావ్యలకి పాపలను ఇస్తారు. బిడ్డను చూడగానే మురిసిపోతుంది తులసి. బారసాల అయిన వెంటనే మనం తిరుమలకు వెళ్లాలని తులసి చెప్పగా.. ఖచ్చితంగా వెళ్లి స్వామివారికి కోటి రూపాయలు కానుక వేద్దామని చెబుతాడు ధర్మేంద్ర. మరోవైపు.. పాప స్పర్శ తగలగానే కావ్యకి అనుమానం వస్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదని కళావతి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా పాప వేరు, ఈ పాప వేరని డాక్టర్‌తో అంటుంది కావ్య. ఈ పాపని హత్తుకుంటే నాకు తల్లిని అన్న ఫీలింగ్ రావడం లేదని కావ్య అనడంతో అంతా షాక్ ఉలిక్కిపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X