Brahmamudi January 19th Episode: బిడ్డ కోసం కావ్య పిచ్చి ప్రవర్తన... భార్యతో పారిపోయిన మినిస్టర్

Photo Courtesy: JioHotstar

తన పాప గురించి డాక్టర్ చెప్పిన మాటలతో మినిస్టర్ ధర్మేంద్ర బాధపడుతుంటాడు. ఇంతలో తులసి కళ్లు తెరిచి పాపను చూడాలని అడగటంతో ... పాప బరువు తక్కువ ఉండటంతో ఇంక్యూబెటర్‌లో పెట్టామని ధర్మేంద్ర చెప్పడంతో తులసి షాక్ అవుతుంది. నా పాపకు ఏమైంది? ఇప్పుడే చూడాలని తులసి అడగ్గా... ఇన్ఫెక్షన్ వస్తుంది? ఇప్పుడు వద్దు అని చెబుతాడు. కానీ తులసి పాపని చూడాలని మారాం చేయడంతో భార్యను తీసుకుని వెళ్లి చూపిస్తాడు ధర్మేంద్ర. ఇన్నాళ్లు నేను నోచిన నోములకు దేవుడు కరుణించాడు.. పాపని అల్లారుముద్దుగా కంటికి రెప్పలా చూసుకుంటానని తులసి చెప్పడంతో ధర్మేంద్ర ఎమోషనల్ అవుతాడు.

పాప బతకదని తెలిస్తే తన భార్య దక్కదని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తాడు ధర్మేంద్ర. బిడ్డలను మార్చడానికి నాకు అభ్యంతరం లేదని.. ఇంతకీ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు అని మినిస్టర్ అడుగుతాడు. దాంతో రాజ్, కావ్యలను చూపిస్తుంది రుద్రాణి. ఇంత పెద్ద హాస్పిటల్‌లో, జనం తిరుగుతుండగా ఈ పని చేయగలమా? అని మినిస్టర్ భయపడగా.. డాక్టర్, నర్స్‌కు డబ్బులు ఆశ చూపించి కొనేయమంటుంది రుద్రాణి. డాక్టర్ మన మాట వినడని భావించి నర్స్‌కు డబ్బులచ్చి బిడ్డల్ని మార్చేస్తాడు మినిస్టర్. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వచ్చి పాపను చూడాలని అడగటంతో డాక్టర్ బిడ్డను తీసుకొచ్చి కావ్య చేతిలో పెడుతుంది. చిన్నారి స్పర్శ తగలగానే ఈ బిడ్డ నా బిడ్డ కాదని కావ్య గుర్తుపట్టి గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 19వ తేదీ ఎపిసోడ్ 933లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 19th 2026 Episode 933 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

పాప నీకు వారం రోజులుగా దూరంగా ఉండటం వల్ల స్పర్శ కొత్తగా ఉంది. అయినా నీ పాప కాకుండా పోతుందా అని కావ్యపై మండిపడుతుంది డాక్టర్. వారం కాదు.. ఎన్ని రోజులైనా నా పాప స్పర్శ నాకు స్పష్టంగా గుర్తుంది, నా బిడ్డను తాకిన ఆ క్షణం, అప్పుడు కొట్టుకున్న నా గుండె... ఇప్పుడు ఈ బిడ్డను తాకితే రావడం లేదని చెబుతుంది కావ్య. నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదని అంటుంది. దాంతో అపర్ణ, ఇందిరలు నచ్చచెప్పాలని చూస్తారు. కానీ కావ్య వాళ్లపై సీరియస్ అవుతుంది. నేను గొంతు చించుకుని అరుస్తున్నా మీకెవ్వరికీ అర్ధం కావడం లేదని ఫైర్ అవుతుంది. నువ్వు మాట్లాడుతున్నది తప్పని రాజ్ కూడా సీరియస్ అవుతాడు.

మా హాస్పిటల్‌లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం.. నీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందని డాక్టర్ సీరియస్ అవుతుంది. నా పాపకు కుడిచేతిపై పుట్టుమచ్చ ఉండాలి, మరి ఆ పాపకు పుట్టుమచ్చ లేదు.. నా బిడ్డ మారిపోయింది, నా బిడ్డను ఎవరో మార్చేశారు? అని కావ్య ప్రశ్నించడంతో అంతా ఆలోచనలో పడతారు. నీ చేతులతో పాపని ఇంక్యూబెటర్‌లో పెట్టి.. ట్యాగ్ వేసి తీసుకొచ్చాను.. పాపకు వేసిన ట్యాగ్ అలాగే ఉంది, పాప మారిపోదని చెబుతుంది డాక్టర్. మీరెన్ని చెప్పినా నేను వినను.. ఈ పాప, ట్యాగ్‌లు అంతా అబద్ధమని నా పాపను మార్చేశారని మండిపడుతుంది కావ్య. ఈ పాప నా పాప కాదంటూ అలాగే బెడ్‌ మీద పడిపోవడంతో అంతా కంగారుపడతారు.

పాపని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంటాడు మినిస్టర్ ధర్మేంద్ర. పాపను మీ రాజకీయాలకు దూరంగా ఉంచమని భర్తతో అంటుంది తులసి. ఊరంతా పిలిచి నా రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని నేను అనుకుంటుంటే వద్దు అంటున్నావని మండిపడుతుంది. నా కూతురు ఎవ్వరినీ బాధపెట్టకుండా ఒక మంచి మనిషి అయితే అంతే చాలని అంటుంది తులసి. మీ పవర్‌ని ఉపయోగించి ఏం చేశారోనని చెబుతుండగా రుద్రాణి వచ్చి మీతో అర్జెంట్‌గా మాట్లాడాలని చెప్పి ధర్మేంద్రను పక్కకి తీసుకెళ్తుంది. మీరు వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోండి అని రుద్రాణి చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. బిడ్డలను మార్చినట్లు కావ్య గుర్తుపట్టేసిందని రుద్రాణి చెప్పడంతో మినిస్టర్ ఉలిక్కిపడతాడు. మనం బిడ్డల్ని మార్చిన విషయం.. మా డాక్టర్‌కే తెలియదు, అలాంటిది కావ్యకి ఎలా తెలుస్తుందని అడుగుతాడు ధర్మేంద్ర. బిడ్డని చేతిలో పెట్టగానే ఆ బిడ్డ తన బిడ్డ కాదని తెలిసిపోయిందని అంటుంది రుద్రాణి. పాప చేతికి పుట్టుమచ్చ ఉండటం కావ్య గమనించింది.. పాప మీకు దూరం కాకూడదంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెబుతుంది రుద్రాణి.

కావ్య బిడ్డను పట్టుకుని తన బిడ్డ కాదని ఎందుకు చెప్పిందో అర్ధం కావడం లేదని దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కాసేపు కావ్యని రెస్ట్ తీసుకోనివ్వమని అంటాడు రాజ్. హాస్పిటల్‌లో బిడ్డలు మారిపోయే అవకాశం ఉంటుందా? వారం రోజులుగా బిడ్డను చూస్తూనే ఉన్నాం.. బిడ్డ ఎలా మారిపోతుంది? తను డిస్ట్రబ్ అయ్యింది, ప్రస్తుతం తన మైండ్ తన కంట్రోల్‌లో లేదని చెబుతాడు రాజ్. ఇంట్లో గొడవలు, రుద్రాణి అత్తయ్య అలా చేయడం, నువ్వు జైలుకు వెళ్లడం వదిన తట్టుకోలేకపోయింది, పైగా డెలివరి టైంకి నువ్వు తన పక్కన ఉంటావో? లేదో అన్న భయం తనని ఇంకా భయపెట్టింది? దానిలో నుంచే వదినకు ఇలాంటి అనుమానం మొదలైంది అనిపిస్తోందని చెబుతాడు కళ్యాణ్. కళావతికి ఎంత ధైర్యం చెప్పినా తను మాత్రం భయపడుతూనే ఉందని అంటాడు రాజ్.

ఇంతలో నర్స్ వచ్చి.. కావ్య తన బిడ్డ కోసం పిల్లల వార్డ్ మొత్తం గొడవ పడుతుందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెను అడ్డుకుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మీరు నా బిడ్డను దూరం చేశారని కావ్య మండిపడుతుంది. బిడ్డను మార్చడం అంత తేలిక కాదని సీరియస్ అవుతుంది డాక్టర్. మరోవైపు... మినిస్టర్ ధర్మేంద్ర పాపను డాక్టర్ చక్రవర్తి పరీక్షిస్తుండగా మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారని తులసి అడుగుతుంది. ఇంకా టైం పడుతుందని ఇప్పుడే ఏం చెప్పలేమని డాక్టర్ చెబుతాడు. ఇంతలో ధర్మేంద్ర వచ్చి మమ్మల్ని అర్జెంట్‌గా డిశ్చార్జ్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు. పాప కండీషన్ సీరియస్‌గా ఉంది.. ఆపరేషన్ చేయాలని చెబుతాడు డాక్టర్. 5 నిమిషాల్లో మేం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆర్డర్స్ వేస్తాడు మినిస్టర్.

డాక్టర్... రాజ్‌ని పిలిచి కావ్య గురించి చెబుతుంది. ఒత్తిడి, మితిమీరిన ఆలోచన, ప్రేమ, తనని బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయ్... ఆమెను బాగా చూసుకోవడం మీ ఫ్యామిలీ బాధ్యత అంటుంది డాక్టర్. తన కారణంగా అందరూ డిస్ట్రబ్ అయ్యారు.. మీరు వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోమ్మని చెబుతుంది. ఇంట్లో ఉంటే వాతావరణం మారుతుంది. ప్రేమగా చెప్పండి, అర్ధం చేసుకుంటుందని అంటుంది డాక్టర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X