Brahmamudi January 1st Episode: కావ్యని చుట్టుముడుతున్న కష్టాలు... రేఖ ఉచ్చులో రాజ్

Photo Courtesy: JioHotstar

నీ మనవడిని ఏడిపించే అవకాశం ఇన్నాళ్లకు దొరికింది, అస్సలు వదులుకోనని ఇందిరతో అంటుంది కావ్య. రాజ్‌ని ఇరికించేందుకు గాను రాహుల్ దొంగ బంగారాన్ని కారులో పెడుతుండగా అప్పూ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో రాహుల్‌‌కి ముచ్చెమటలు పడతాయి. ఇంతలో స్వప్న వచ్చి బావని విసిగించకు.. ఏదో దొంగలాగా చూస్తావా అని మండిపడుతుంది. స్వప్న రావడంతో బతికిపోయానని రాహుల్ లోపలికి వెళ్లిపోతాడు. కావ్య అన్నం తిననని మారాం చేయడంతో రాజ్ దగ్గరుండి తినిపిస్తాడు. ఇదంతా చూసిన రేఖ రగిలిపోతుంది.

నాకు రాజ్ బావ కావాలి? బావ ప్రేమ కావాలి? అని రేఖ అడగటంతో రుద్రాణి షాక్ అవుతుంది. రాజ్‌కి ఆల్రెడీ పెళ్లయ్యింది.. తన భార్య కావ్యని తప్పించి రాజ్ ఎవ్వరినీ కన్నెత్తి కూడా చూడడు అంటుంది రుద్రాణి. అందుకే బావ నాకు కావాలని చెబుతుంది రేఖ. ఇంతలో రాహుల్ వచ్చి చెల్లెలి కోరిక తీర్చడం మన బాధ్యత.. కావ్య కడుపు పొగొడితే ఇంటికి వారసుడిని ఇవ్వడం కోసం రాజ్‌ని రేఖకిచ్చి పెళ్లి చేస్తారని అంటాడు. మరోవైపు.. రాహుల్ తీరు తనకు అనుమానాస్పదంగా ఉందని అప్పూ చెప్పడంతో కళ్యాణ్ సర్దిచెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 1వ తేదీ ఎపిసోడ్ 919లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 1st 2025 Episode 919 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వారసుడి కోసం ఇంటిల్లిపాదిని ఒప్పించి మరి కావ్యే దగ్గరుండి రాజ్‌కి మరో పెళ్లి చేస్తుంది. అప్పుడు రాజ్‌కి భార్యగా, ఈ ఇంటికి వారసుడిని ఇచ్చే తల్లిగా నా కూతురు అన్ని విధాలుగా అర్హురాలు నా చెల్లెలిని నిలబెడితే రాజ్‌కి రేఖ భార్య అయ్యే ఛాన్స్ ఉంటుందని అంటాడు రాహుల్. దాంతో అన్నయ్యకి రేఖ థ్యాంక్స్ చెబుతుంది. మీరిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు.. నా కూతురు ఈ ఇంటి కోడలిగా వస్తానంటే నాకూ సొంతోషమే అంటుంది రుద్రాణి. ముందు కావ్య కడుపులో ఉన్న బిడ్డ కన్నుమూయాలని చెబుతాడు రాహుల్. నేను దాని సంగతి చూసుకుంటాను, నువ్వు రాజ్ సంగతి చూసుకోమని చెబుతుంది రుద్రాణి. ఆల్రెడీ ప్లాన్ అమలవుతోందని చెబుతాడు రాహుల్.

సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ బాగా ఇబ్బంది పడుతుంది అప్పూ. ఇంతలో కావ్య వచ్చి బోర్ కొడుతుందని చెబుతుంది. దాంతో ఇద్దరూ కలిసి టీవీ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఎంతసేపని తిని కూర్చొంటామని కావ్యని అడుగుతుంది అప్పూ. వీళ్లందరూ చెబుతున్నట్లు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం.. ఇంకా రెండు నెలలు నా వల్ల కావడం లేదని బాధపడుతుంది. ఇక లాభం లేదు.. మన ఇద్దరు హీరోలతో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని చెబుతుంది కావ్య. రాజ్ బిజినెస్ పనుల్లో, కళ్యాణ్ రైటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారని అంటుంది కావ్య. మనకి లేని ప్రశాంతత వాళ్లకి కూడా ఉండకూడదని అనుకుంటారు కావ్య, అప్పూ.

మీ ఇద్దరూ మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని.. ఇంట్లోవాళ్లు మాకు ఏ పని చెప్పడం లేదు, పోనీ మా పని మేం చేసుకుంటామన్నా ఒప్పుకోవడం లేదని అంటుంది కావ్య. ఖాళీగా ఉంటూ తిని రెస్ట్ తీసుకోవడం కంటే అదృష్టం ఉంటుందా? ప్రపంచంలో చాలామంది మనుషులు దీని కోసమే ఎదురు చూస్తున్నారని అంటాడు రాజ్. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇంట్లో వాళ్లు చెప్పారని.. ఈ విషయం వాళ్లకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారని అంటారు రాజ్, కావ్య. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేస్తామని రేపటి నుంచి బుల్లితెరపై చూడండి అని చెబుతారు.

కావ్య కడుపులో బిడ్డని చంపేందుకు విషాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రుద్రాణికి ఫోన్ చేసి కిందకి రమ్మంటాడు. రుద్రాణి బయటకు వెళ్తుండగా ప్రకాశం ఎదురొస్తాడు. అతనిని చూడగానే రుద్రాణి ఉలిక్కిపడుతుంది. అయితే ప్రకాశానికి నిద్రలో నడిచే అలవాటు ఉండటంతో నవ్వుకుంటుంది. ఆ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి పసరు మందు తీసుకుంటుంది. ఇది అనుకున్న విధంగా పనిచేస్తుందా? లేదా? అని అతనిని అడుగుతుంది రుద్రాణి. ఈ పసరు మందు ఒక్కసారి కడుపులోకి వెళ్లిందంటే పిండం కకావికాలం కావడం ఖాయమని అంటాడు ఆ వ్యక్తి. కడుపునొప్పి మొదలవుతుంది... ఆ తర్వాత పిండం చనిపోతుంది, అలాగే రేపు ఇంకో పసరు మందు ఇస్తాను.. అది కడుపు మొత్తాన్ని కడిగేస్తుందని చెబుతాడు ఆ వ్యక్తి. మందు తీసుకున్న రుద్రాణి సంతోషిస్తుంది.. నీ అదృష్టమో, దురదృష్టమో కానీ సరైన టైంలో నా కూతురు దిగింది. ఈ ఆస్తి మొత్తం నా కూతురికి దక్కబోతుందని అనుకుంటుంది.

ఉదయాన్నే ప్రకాశం, సుభాష్‌లు ఆఫీసుకి వెళ్లడానికి ఇబ్బంది పడతారు. మాకు కొత్త కొత్త వెరైటీలు కావాలని అడగ్గా... నిన్నటి ఉప్మా ఉంది తీసుకురమ్మంటారా అని సెటైర్లు వేస్తుంది ధాన్యం. రాత్రి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. వీడికి నిద్రలో నడిచే అలవాటు కూడా వచ్చినట్లుందని ప్రకాశంపై అందరూ సెటైర్లు వేస్తారు. ఇంతలో రాజ్, ప్రకాశంలు వచ్చి ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్లొద్దని రాజ్, కళ్యాణ్‌లు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈరోజు హౌస్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెబుతాడు రాజ్. మేం బోర్ కొడుతుందని అడగ్గా మీ అబ్బాయిలు ఇలా ప్లాన్ చేశారని కావ్య, అప్పూలు జరిగినదంతా చెబుతారు.

రాజ్ బెడ్‌రూమ్‌లోకి సీక్రెట్‌గా వెళ్లిన రుద్రాణి- రేఖలు కషాయంలో పసరు మందు కలిపేస్తారు. ఈ పసరు మందు పనిచేస్తుందా? లేదా? అని రుద్రాణిని అడుగుతుంది రేఖ. అడవిలో నుంచి తెచ్చిన ఈ పసరు మందు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు.. ఒకప్పుడు అడవిలో బతికిన వారంతా ఇలాంటి మందుతోనే ప్రాణాలు కాపాడుకున్నారని చెబుతుంది రుద్రాణి. మొన్నటి దాకా కడుపు విషయం కావ్య చాలా ఇబ్బందులు పడింది.. కావ్య బిడ్డను కంటే కావ్య చనిపోతుంది, కావ్య బతకాలంటే బిడ్డ దక్కదు. డాక్టర్లంతా చేతులు ఎత్తేశారు.. అప్పుడు కావ్యని కేరళకి తీసుకెళ్లి వైద్యం చేయించాడు రాజ్. ఇప్పుడు కావ్యకి ఏ సమస్యా లేదని అంటుంది రుద్రాణి. ఇప్పుడు దానికి దురదృష్టాన్ని నువ్వే క్రియేట్ చేయాలని చెబుతుంది రేఖ. ఈ మందు ఒక్కరోజులో రెండు సార్లు తాగితే కడుపు పోతుంది అని అంటుంది రుద్రాణి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానన్న రాజ్, కళ్యాణ్‌ల కోసం కుటుంబం మొత్తం వెయిట్ చేస్తుంది. ఒక బౌల్‌లో చీటీలు రాసుకొచ్చి ఎవరికి ఏం వస్తే వాళ్లు ఆ పర్ఫార్మెన్స్ చేయాలని చెబుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X