Brahmamudi January 20th Episode: బిడ్డను విసిరిపారేసిన కావ్య... రాజ్‌పై రుద్రాణి- రాహుల్ కొత్త కుట్ర

Photo Courtesy: JioHotstar

ఈ బిడ్డ నా బిడ్డ కాదని, బిడ్డలు మారిపోయారని కావ్య రాద్ధాంతం చేయడంతో డాక్టర్ సీరియస్ అవుతుంది. ఇన్నేళ్లలో మా హాస్పిటల్‌లో ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే ఫస్ట్ టైం అని.. బిడ్డలు మారిపోయే అవకాశం లేదని చెబుతుంది. ఈ బిడ్డను ఎత్తుకుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ రావడం లేదని.. పైగా పాప చేతిపై పుట్టుమచ్చ లేదని అంటుంది కావ్య. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మరోవైపు.. కావ్యకు బిడ్డల్ని మార్చిన విషయం తెలిసిపోయిందని వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వమని మినిస్టర్ ధర్మేంద్రకు చెబుతుంది రుద్రాణి. దాంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని డాక్టర్ చక్రవర్తికి ఆర్డర్స్ వేస్తాడు ధర్మేంద్ర.

ఆసుపత్రిలో తన బిడ్డను వెతుకుతూ పిల్లల వార్డ్‌లో ప్రతి బిడ్డను ఎత్తుకుంటుంది కావ్య. దాంతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ వచ్చి ఆమెపై సీరియస్ అవుతారు. ఇక్కడే ఉంటే మా ఆసుపత్రి పరువు పోతుందని, మీరు వెంటనే డిశ్చార్జ్ అయి వెళ్లిపోమ్మని రాజ్‌కు చెబుతుంది డాక్టర్. ఇంటి వాతావరణానికి అలవాటుపడితే నెమ్మదిగా కావ్య మారుతుందని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 20వ తేదీ ఎపిసోడ్ 934లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 20th 2026 Episode 934 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య పిచ్చి ప్రవర్తనతో డాక్టర్ క్లాస్ పీకిందని.. కళావతిని ఆసుపత్రిలో ఉండొద్దని.. వెంటనే డిశ్చార్జ్ అయి వెళ్లిపోమ్మని చెప్పారని రాజ్ అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కళావతి ప్రవర్తనకు రెండు గంటలు కూడా ఎవ్వరూ ఆసుపత్రిలో ఉంచుకోరని చెబుతాడు రాజ్. వెళ్లిపోవడానికి మాకు అభ్యంతరం లేదు.. కానీ కావ్య ఒప్పుకుంటుందా అని ఇందిర ప్రశ్నిస్తుంది. కడుపున పుట్టిన పాపని కావ్య తన బిడ్డ కాదు అంటుంది.. ఇలాంటి పరిస్ధితుల్లో ఎలా ఒప్పుకుంటుందని ప్రశ్నిస్తుంది అపర్ణ. అప్పూ కూడా మా అక్క చెప్పేది ఒక్కసారి అర్ధం చేసుకోమ్మని చెబుతున్నా రాజ్ వినిపించుకోడు. మరోవైపు.. బిడ్డను చేతుల్లో పెడుతుండగా నర్స్‌పై మండిపడుతుంది కావ్య.

ఇంతలో రాజ్ వచ్చిన మనింటికి వెళ్లిపోవాలని కావ్యతో చెబుతాడు. నా బిడ్డను క్షేమంగా నాకు అందిస్తేనే వెళ్లిపోదామని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నాలో ఉన్న కన్నతల్లి మనసు ఈ బిడ్డను ఒప్పుకోవడం లేదని చెబుతుంది కావ్య. నీ వల్ల మన కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తోందని, నీకు పిచ్చి పట్టిందా? అని మండిపడతాడు రాజ్. ఎవరో బిడ్డ నాకెందుకు, నా కూతురు నాకు కావాలని కావ్య మారాం చేస్తుంది. నా పాపని చూసి నా కన్నపేగు చల్లబడిన తర్వాతే ఇక్కడి నుంచి అడుగు బయటపెడతానని అనడంతో రాజ్ మండిపడతాడు. ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఒట్టు అని రాజ్ అనడంతో కావ్య ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. కళావతి బట్టలు ప్యాక్ చేస్తే వెళ్లిపోదామని ఇందిర, అపర్ణలకు చెబుతాడు రాజ్.

తులసి ఆసుపత్రి నుంచి వెళ్తూ వెళ్తూ నర్స్‌కు డబ్బులు ఇస్తుంది. మినిస్టర్ భార్య, కావ్యలు ఒకేసారి హాస్పిటల్ నుంచి బయటకు అడుగుపెడతారు. తాను అనుకున్న ప్లాన్ వర్కవుట్ కావడంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. నేను వేసిన ప్లాన్ ఎలా ఉందని కొడుకుని అడగ్గా... జీవితాల్నే తారుమారు చేసిందని అంటాడు రాహుల్. నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశానని చెబుతుంది రేఖ. మనం వేసి ప్లాన్ వర్కవుట్ చేయడానికి ఆవేశపడకూడదు.. అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాలని అంటుంది రుద్రాణి. దుగ్గిరాల ఫ్యామిలీ కూలిపోవడానికి, కావ్య బతుకు కాలిపోవడానికి ఒక్క క్షణం చాలు.. కానీ ఆ క్షణానికి మనం చేరడానికి ఎంతో వర్క్ చేయాలని చెబుతుంది రుద్రాణి.

జీవితంలో కావ్యకి పుట్టిన పాపని ఎన్నటికీ చూడలేదు. కన్నబిడ్డ కావాలని కావ్య ఆ ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది, కావ్యని కంట్రోల్ చేయలేక కుటుంబం మొత్తం పిచ్చెక్కిపోతుంది. అప్పుడు రాజ్‌కి నరకం కనిపిస్తుంది, ఇల్లు స్మశానం అవుతుందని చెబుతుంది రుద్రాణి. ఇదంతా జరగడానికి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవ్వరికీ అనుమానం రానీయొద్దని వార్నింగ్ ఇస్తుంది. నేను బయటే ఉండి కథ నడిపిస్తాను, ఆస్తిని అన్నయ్యకి కట్టబెట్టి.. రాజ్ బావని నీ సొంతం చేస్తానని అంటుంది రుద్రాణి.

హాస్పిటల్‌లో నిన్ను కంట్రోల్ చేయడానికి కోప్పడ్డానని క్షమించమని కావ్యతో అంటాడు రాజ్. మీరు నా మాటలు నమ్మనందుకే నాకు బాధగా ఉందని అంటుంది కావ్య. ఈ బిడ్డ నాది కాదని నాకు తెలుసు అని చెబుతుంది కావ్య. ప్రసవం అంటే ఆడదాని మనసు రకరకాలుగా ఉంటుంది. ఆ సమయంలో కొందరి మనసు బాధగా ఉంటుంది, మరికొందరికి పట్టరాని సంతోషంగా ఉంటుందని ఇందిర చెబుతుంది. మీ అందరి మనసు పొంగిపోతుంది, కానీ పరాయి బిడ్డను నా చేతుల్లో మోస్తుంటే నా మనసు కుదుటపడదని అంటుంది కావ్య. నాది మొండి పట్టుదల కాదు.. నా మనసు అర్ధం చేసుకోండి అని చెబుతుంది. ఆసుపత్రులు, డాక్టర్లు నీకు పిచ్చివాళ్లులాగా కనిపిస్తున్నారా అని మండిపడుతాడు రాజ్.

బిడ్డను తీసుకొచ్చి అపర్ణ చేతిలో పెట్టేసి ఈ బిడ్డ నా బిడ్డ కాదని, నా బిడ్డ ఎక్కడుందో నేనే తెలుసుకుని.. తిరిగి వెనక్కి తెచ్చుకుంటానని కావ్య విసురుగా వెళ్లిపోతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కళావతి తొందరపాటుతో ఏదేదో ఆలోచిస్తోందని మీరేం కంగారు పడొద్దని రాజ్ చెబుతాడు. నిజాన్ని నమ్మించాల్సిన అవసరం లేదు.. కావ్యే ఒప్పుకుంటుందని అంటాడు రాజ్. కావ్యకు అర్ధమయ్యేట్లు నువ్వే చెప్పమని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చెప్పడంతో రాజ్ సరేనని అంటాడు. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా కుదుటపడుతుందని కావ్యతో చెబుతాడు రాజ్. అందరూ ఆశ్చర్యపోయే ఆలోచనలు నీ మనసులోకి రానీయొద్దని చెబుతాడు కావ్య. నేను చెప్పేది మీకు అర్ధం కావడం లేదు? ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరు మార్చారు? నన్ను ఎవరు ఏమార్చారు? నా బిడ్డను ఎందుకు దూరం చేశారు? ఈ ప్రశ్నలన్నీంటికీ సమాధానం కావాలని అడుగుతుంది కావ్య.

నీ ప్రశ్నలే తప్పు అయితే సమాధానం ఎవరు చెబుతారని రాజ్ మండిపడతాడు. పాప పుట్టిన క్షణం నుంచి మనం పాపతోనే ఉన్నాం.. ఈ పాపని ఎందుకు కాదు అంటున్నావని అడుగుతాడు రాజ్. మా ఇంట్లో వాళ్లంతా పాప నీకే పుట్టిందని బలంగా నమ్ముతున్నారని చెబుతాడు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా మన బిడ్డ కాదని తేల్చిచెబుతుంది కావ్య. మరోవైపు.. మినిస్టర్ ధర్మేంద్ర, అతని భార్య తులసిలు పాపను చూస్తూ మురిసిపోతారు. ఇంతలో రుద్రాణి అక్కడికి వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X