Brahmamudi January 21st Episode: కావ్య మాటలతో రాజ్ మనసు ముక్కలు... ధర్మేంద్రతో రుద్రాణి డీల్

Photo Courtesy: JioHotstar

కావ్యని తీసుకుని వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వమని డాక్టర్లు .. రాజ్‌కి వార్నింగ్ ఇస్తారు. దాంతో రాజ్ వెళ్లి కావ్యకు నచ్చచెప్పాలని ఎంత ప్రయత్నించినా వినదు. దాంతో నువ్వు డిశ్చార్జ్‌కు ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టేనని అనడంతో కావ్య తలవంచుతుంది. తర్వాత మినిస్టర్ భార్య, కావ్య - రాజ్‌లు ఆసుపత్రి నుంచి వెళ్లిపోతారు. తమ ప్లాన్ వర్కవుట్ అయినందుకు రుద్రాణి, రాహుల్, రేఖలు సంబరాలు చేసుకుంటారు. ఇంటికొచ్చాక కూడా కావ్య మనస్సు ఏమాత్రం మారదు. ఈ బిడ్డ నాది కాదంటే ఎవ్వరూ వినిపించుకోవడం లేదని మండిపడుతుంది.

పది రోజుల పాటు రాత్రి, పగలు మనబిడ్డ దగ్గరే ఉన్నాం.. డాక్టర్లు కూడా ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు.. అయినా బిడ్డ మారిపోయిందంటే ఎలా అని రాజ్ మండిపడతాడు. భర్త ఎంత చెప్పినా కావ్య వినిపించుకోదు.. మన బిడ్డ కానీ బిడ్డని నేను బిడ్డగా అంగీకరించలేను, నా బిడ్డను నేనే వెతుక్కుంటానని బిడ్డను అపర్ణ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. కావ్య ప్రవర్తనకు దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. బిడ్డను ఆడిస్తూ మినిస్టర్ ధర్మేంద్ర, తులసిలు సంబరాలు చేసుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 21వ తేదీ ఎపిసోడ్ 935లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 21st 2026 Episode 935 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తులసి పాపను చూసుకుని మురిసిపోతుండగా రుద్రాణి వెళ్లి మినిస్టర్ ధర్మేంద్రతో మాట్లాడుతుంది. మీరే లేకపోతే మేమిద్దరం ఏమైపోయే వాళ్లమోనని రుద్రాణితో అంటాడు ధర్మేంద్ర. సమస్య అప్పుడే పోలేదని... కావ్య మనసు ఇంకా మారలేదని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఆషామాషీ కాదు.. ఈ సిటీలోనే పేరున్న వాళ్లు, పరపతి ఉన్న వాళ్లు అని చెబుతుంది రుద్రాణి. కావ్య అనుమానం నిజమని వాళ్లు నమ్మితే ప్రమాదం ముంచుకొస్తుంది. కావ్య అంటే ఆ ఫ్యామిలీకి అంతులేని ప్రేమ.. ఆ ప్రేమే వాళ్లని ఏదో ఒకటి చేసేలా చేస్తుందని అంటుంది రుద్రాణి. వాళ్లు ఏ ప్రయత్నం చేసినా విఫలం అవ్వాలి.. తన దగ్గర ఉన్న బిడ్డ, తన బిడ్డ కాదు అన్న కావ్య అనుమానాన్ని చంపేయాలని చెబుతుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న బిడ్డ శాశ్వతంగా మీ బిడ్డ అవుదుందని చెబుతుంది రుద్రాణి.

ఇంట్లో ఇలాంటి పరిస్ధితి ఉందని నా భార్యకు తెలియకూడదు. నా భార్య కళ్లలో నీళ్లు రాకూడదు, అందుకు నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను.. బిడ్డను మాత్రం నా భార్యకు దూరం కానివ్వనని తేల్చిచెబుతాడు ధర్మేంద్ర. అలా గట్టిగా నిర్ణయించుకోండి, అలర్ట్‌గా ఉండండి అని హెచ్చరిస్తుంది రుద్రాణి. డబ్బు, పవర్ అన్ని ఉన్నవాడిని.. మీకు ఏం కావాలో చెప్పండి, ఏమైనా ఇస్తానని చెబుతాడు ధర్మేంద్ర. వాళ్ల పతనమే నేను కోరుకున్నది.. అది ఆ ఇంట్లో మొదలైపోయింది, టైం వచ్చినప్పుడు నేనే అడిగి తీసుకుంటానని చెబుతుంది రుద్రాణి. ఆ ఇంట్లో నా కొడుకు, నా కూతురు ఉన్నారు.. అక్కడ ఏం జరిగినా మనకి తెలిసిపోతుందని చెబుతుంది.

పాప ఎంత ఏడుస్తున్నా కావ్య వచ్చి పాలు ఇవ్వకపోవడంతో ఇందిర, అపర్ణ, ధాన్యలక్ష్మీలు ఎంత ఆడించినా వినకపోవడంతో అంతా బాధపడతారు. ఇంట్లో పరిస్ధితి చూసి రాజ్ బాధపడతాడు. ఏం చేసినా బిడ్డ ఏడుపు ఆపదు.. తల్లి పాలు, తల్లి స్పర్శ ఇస్తేనే బిడ్డ ఏడుపు ఆపుతుందని అంటుంది ఇందిర. బిడ్డ ఏడుపు విని కూడా కావ్య మనసు ఎందుకు కరగడం లేదు, ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తోందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో బిడ్డ ఏడుపు విని కావ్య వచ్చి లోపలికి తీసుకెళ్లి పాలు ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. నా మనవరాలు ఆ పసిగుడ్డును తన బిడ్డగా అంగీకరించినట్లేనని అంటుంది ఇందిర. ఇప్పటికైనా కావ్య తన బిడ్డను దగ్గరికి తీసుకుంటే ఏ సమస్య లేదని సంతోషిస్తారు. నా కోడలు ప్రేమను దాచుకోలేదని అపర్ణ చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న రేఖ అసహనం వ్యక్తం చేస్తుంది.

ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటున్నారని రాహుల్‌తో చెబుతుంది రేఖ. ఆ కావ్య బిడ్డను ఒప్పుకోదు అన్నారు... ఇల్లు అల్లకల్లోలం అవుతుందని అన్నారు. కానీ ఆ కావ్య బిడ్డను అంగీకరించి పాలు కూడా ఇచ్చిందని చెబుతుంది. కావ్య పరాయి వాళ్ల బిడ్డకు పాలు ఇస్తే తన బిడ్డగా ఒప్పుకుంది అనుకుంటున్నావా? ప్రేమ అనేది కావ్య బ్లడ్‌లోనే ఉంది.. ఈ బిడ్డే కాదు, అవకాశం వస్తే ఏ బిడ్డకైనా పాలు పడుతుందని చెబుతాడు కావ్య. ఆ బిడ్డను కావ్య యాక్సెప్ట్ చేయనంత వరకే ఇంట్లో గొడవలు.. కానీ ఒక్కసారి కనుక కావ్య మనసు మారితే తల్లి మహారాణి అవుతుంది, బిడ్డ యువరాణి అవుతుంది. ఆ తర్వాత రాజ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నేను అడుక్కు తినాలని అంటుంది రేఖ. బిడ్డకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని తెలిస్తే కోట్లు ఖర్చు చేసైనా బతికించుకుంటారని చెబుతుంది రేఖ.

పాపకి అంతపెద్ద ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. ఏం చేసినా సరే బిడ్డను కాపాడటం అసాధ్యం. అప్పుడు రాజ్‌ని అలా చూడలేక, ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలన్న కావ్య కల చచ్చిపోతుంది. ఆ సమయంలో అందరి దృష్టి నీ వైపు మళ్లుతుంది, కాస్త ఓపిక పట్టు.. టైం అందరినీ మారుస్తుందని ధైర్యం చెబుతాడు రాహుల్. కావ్య మనసు మారినందుకు అపర్ణ, ఇందిర, ధాన్యలక్ష్మీలు సంతోషిస్తారు. పాలు పట్టించింది అంటే కూతురిగా ఒప్పుకున్నట్లేనా? మళ్లీ ఏ గొడవ చేయదు కదా అని అపర్ణ టెన్షన్ పడుతుంది. ఇంతలో పాపకు పాలు పట్టాలంటే.. నాకు మంచి పాలు రావాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో చెప్పమని కావ్య అడగటంతో అంతా సంతోషిస్తారు. దాంతో ఎలాంటి ఫుడ్ తినాలో ఇందిర చెబుతుంది.

ఇంతలో రాజ్ వచ్చి నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ పాప నీ బిడ్డేనని ఎలా ఒప్పించాలో తెలియక టెన్షన్ పడ్డానని అంటాడు రాజ్. నేను బయటకు వెళ్లాలి.. నా పాప ఎక్కడుందో తెలుసుకోవాలని కావ్య అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. బిడ్డ ఏడుపు ఆపడానికే పాలు ఇచ్చాను.. మీరు నమ్మినా, నమ్మకపోయినా నా బిడ్డను తెచ్చుకుని.. ఈ బిడ్డను ఆ తల్లి దగ్గరికి చేరుస్తానని చెబుతుంది కావ్య. ఉదయాన్నే కావ్య, బిడ్డ కనిపించకపోవడంతో రాజ్ టెన్షన్ పడతాడు. అందరూ కలిసి బయటికొచ్చి చూడగా బిడ్డను ఆడిస్తూ కావ్య కనిపిస్తుంది. నువ్వెవరు? మీ నాన్న ఎవరు? మీ అమ్మ ఎవరు? నిన్ను ఎలాగైనా మీ అమ్మ దగ్గరికి నేను చేరుస్తానని పాపతో అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. కళావతి అనుమానం రోజు రోజుకు పెరుగుతోందని ఏదో ఒకటి చేయాలని అంటాడు రాజ్. కావ్య ఎలాంటి మనిషో మనకి తెలుసు.. ఎందుకో కావ్య అనుమానం నిజమేనేమో అనిపిస్తోంది. ఒకసారి తన కోణంలోనూ ఆలోచించాలని ఇందిర, అపర్ణలు అంటారు. దీంతో రాజ్ ఆలోచనలో పడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X