Brahmamudi January 26th Episode: కావ్యపై రుద్రాణి స్కెచ్.. జాతకంలో బయటపడ్డ పాప రహస్యం... షాక్‌లో మినిస్టర్

Photo Courtesy: JioHotstar

పాప నోట్లో నుంచి నురగా రావడం, శరీరమంతా రంగు మారిపోతుండటంతో రాజ్, కావ్యలు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చక్రవర్తి పాపను పరీక్షించి టెస్టులు చేస్తాడు. పాపకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. మినిస్టర్ ధర్మేంద్ర గారి పాపకు ఎలాంటి వ్యాధి ఉందో అదే వ్యాధి ఈ పాపకు కూడా ఉండటంతో ఉలిక్కిపడతాడు. నేను వినలేదని.. మరో రకంగా బిడ్డల్ని మార్చేసి ఉంటాడని కోపంతో రగిలిపోయిన చక్రవర్తి నేరుగా మినిస్టర్ ఇంటికి వెళ్తాడు.

రుద్రాణి, ధర్మేంద్రలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లి మీరు ఇలా చేయడం అస్సలు బాలేదని.. మర్యాదగా మీ బిడ్డ స్థానంలో ఉన్న కావ్య బిడ్డను ఇచ్చేయమంటాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్న డాక్టర్ చక్రవర్తిని మినిస్టర్ మనుషులు వెనుక నుంచి కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో అతనిని తన గెస్ట్ హౌస్‌లో బంధిస్తాడు ధర్మేంద్ర. వెంటనే నర్స్ నీలవేణికి ఫోన్ చేసి నాటకం ఆడతాడు. పాప రిపోర్ట్స్ డాక్టర్ అనూరాధ చేతికి రావడంతో అది చూసి ఆమెకు షాక్ అవుతుంది. పాపకు అరుదైన వ్యాధి ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 26వ తేదీ ఎపిసోడ్ 939లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 26th 2026 Episode 939 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

పాప హెల్త్ గురించి డాక్టర్ చెప్పడంతో కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. పాప బతకాలంటే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఎంత ఖర్చయినా సరే చేసేయండి అని చెబుతాడు రాజ్. ప్రాబ్లమ్ డబ్బు గురించి కాదని.. 10 రోజుల పాపకు ఆపరేషన్ చేస్తే బతుకుతుందా? లేదా? అన్నదే సమస్య అని అంటుంది డాక్టర్. సర్జరీ చేస్తే పాప ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం.. కానీ మీరు ఒక నిర్ణయానికి వచ్చి ధైర్యంగా స్టెప్ తీసుకుంటే ప్రయత్నం చేయొచ్చని అంటుంది డాక్టర్. ఈ పాపని మీరే ఉంచుకోండి.. నా కన్నబిడ్డను తిరిగి ఇవ్వండి అంటుంది కావ్య. ఆ మాటలతో డాక్టర్, రాజ్ షాక్ అవుతారు.

ఎవరి బిడ్డకో మీరు చెప్పిన వ్యాధి ఉంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా లేదు, అదే సమయంలో నా పాప పుట్టింది ఆరోగ్యంగా ఉంది కాబట్టే ఆరోగ్యంగా లేని ఆ బిడ్డను నాకు ఇచ్చి, నా బిడ్డను వాళ్లకి ఇచ్చేశారని ఆరోపిస్తుంది కావ్య. అందరూ ఒక్కటై మా మీద కుట్ర చేశారు, తల్లిని బిడ్డను వేరు చేశారు.. మర్యాదగా నా బిడ్డను నాకు ఇవ్వండి అంటుంది. మీ ఆవిడ ఇక మారదా? మళ్లీ మళ్లీ ఇదే చెబుతుందని డాక్టర్ సీరియస్ అవుతూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని అంటుంది. హాస్పిటల్‌లో జరిగినదంతా నర్స్ నీలవేణి చూస్తుంది.

కావ్య, రాజ్‌లు ఇంటికి రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. ఇంతలో కొడుకు, కోడలు ఇంటికి రావడంతో పాపకు ఏమైంది? ఎందుకిలా జరిగిందని అడుగుతుంది అపర్ణ. ఇది చేసిన పనికి తలెత్తుకోలేకపోయానని మండిపడతాడు రాజ్. ఒకవైపు పాప కండీషన్ గురించి డాక్టర్ చెబుతుంటే.. డాక్టర్‌తోనే గొడవ పడతావా? అని కావ్యపై సీరియస్ అవుతాడు రాజ్. పాప పరిస్ధితి అస్సలు బాలేదని, గుండెల్లో ప్రాబ్లమ్ ఉందట. పాపకి ఆపరేషన్ చేయాలి.. ఒకవేళ ధైర్యం చేసి ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేమని అంటున్నారని రాజ్ అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు కళావతి.. ఆ డాక్టర్ మీద విరుచుకుపడింది. ఇదంతా డాక్టర్ల కుట్ర అని.. ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డను మార్చి, అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఇచ్చారని .. తన బిడ్డను తిరిగి ఇచ్చేయమంటూ చాలా పెద్ద రాద్ధాంతం చేసిందని చెబుతాడు. నా బిడ్డను ఎలా కాపాడాలని ఆలోచించాలా? కళావతి మనసు ఎలా మార్చాలో ఆలోచించాలా? ఏం చేయను అంటూ రాజ్ మండిపడతాడు. మీరు నన్ను అర్ధం చేసుకుంటే దారి దొరుకుతుంది. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది.. ఎవరికో డాక్టర్ సహకరించారు. అందుకే బిడ్డలను మార్చేశారని మళ్లీ అదే చెబుతుంది కావ్య. ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అనడానికి నీ దగ్గర ఆధారం ఏముంది? అని అడుగుతాడు రాజ్. నా దగ్గర ఇప్పుడు సాక్ష్యం లేకపోవచ్చు... కానీ నా బిడ్డ ఎక్కడుందో నేనే కనుక్కుంటానని అంటుంది కావ్య.

ఓ వైపు పాపకు అంత ప్రమాదకరమైన జబ్బు అంటున్నారు.. లేని పాప కోసం ఎందుకంత తాపత్రయం అంటాడు సుభాష్. ఈ పాపకు ఏం కానివ్వను, నా బిడ్డను జాగ్రత్తగా తెచ్చుకుని.. ఈ బిడ్డను ఆ తల్లిదండ్రులకు ఆరోగ్యంగా అప్పగిస్తానని చెబుతుంది కావ్య. ఈ బిడ్డను బతికించుకుంటాను, నా బిడ్డను కనిపెడతానని అంటుంది. కావ్య పరిస్ధితి చూసి రాజ్ బాధపడతాడు. మరోవైపు.. నీ పథకం బాగా వర్కవుట్ అయ్యిందని రేఖ, రాహుల్‌‌లు రుద్రాణితో చెబుతారు. వాళ్లు డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్లినా.. రిపోర్ట్ మాత్రం వ్యతిరేకంగా రావడంతో చాలా హ్యాపీ అంటుంది రేఖ. త్వరగా ఆ కావ్యను సైడ్ చేస్తే బావకి నేను దగ్గరైపోతానని అంటుంది. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి రాహుల్ ఆ ఇంటికి మహారాజు అవుతాడు, నువ్వు రాజ్‌కి భార్య అవుతావని అంటుంది రుద్రాణి.

కావ్యను మీరిద్దరూ రెచ్చగొడితే.. ఇంట్లో వాళ్లపై అరుస్తుంది. తన కూతురు తనకు దొరకదు, ఈ పాప చనిపోతుంది. బిడ్డను సరిగా పట్టించుకోకపోవడం వల్లే చనిపోయిందని కావ్యపై అంతా సీరియస్ అవుతారు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుందని అంటుంది రుద్రాణి. మరోవైపు.. బిడ్డతో కావ్య ఆడుకుంటూ ఉండటంతో రాజ్ బాధపడతాడు. ఉదయాన్నే తన ఇంటికి జ్యోతిష్యుడిని పిలిపించి పాప జాతకం గురించి తెలుసుకుంటాడు మినిస్టర్ ధర్మేంద్ర. పాప జాతకం చూసిన జ్యోతిష్యుడు... పాప పుట్టగానే వైద్యులు ఏమైనా అనారోగ్య సమస్యలు చెప్పారా? అని అడుగుతాడు. ఆ మాటలతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. నా పాపకు అలాంటివి ఏం లేవని మండిపడతాడు మినిస్టర్. పాప జాతకంలో కొన్ని గండాలు ఉన్నాయి.. పాప పేరు మీద గుడిలో శాంతి పూజ చేయాలని చెబుతాడు పంతులుగారు. ఆ మాటలు విన్న తులసి టెన్షన్ పడుతుంది. వెంటనే ఆ పూజ చేయించమని చెబుతుంది.

అప్పూకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది స్వప్న. నా మీద నీకు కోపం పోలేదు అనుకున్నాను అంటుంది అప్పూ. నేను ఆ రోజు రాహుల్‌ని కావాలని అనలేదు.. నా మాటల వల్ల హర్ట్ అయితే క్షమించమని అడుగుతుంది. నువ్వు పోలీస్‌వి నీ డ్యూటీ నువ్వు చేశావు.. రాజ్‌ని ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చావు. లేదంటే కావ్య పరిస్ధితి ఎలా ఉండేదో అంటుంది స్వప్న. ఇంతలో కావ్య వచ్చి పాపని స్వప్నకి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని బయటకు వెళ్లిపోతుంది. ఇప్పటికే నీ గురించి అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పాపను ఇలా వదిలి వెళ్తే ఇంట్లో వాళ్లు ఇంకా టెన్షన్ పడతారని అంటుంది అప్పూ. నా కన్నబిడ్డను పట్టుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X