Brahmamudi January 27th Episode: కళావతికి డాక్టర్ సాయం... కన్నబిడ్డ దగ్గరికి కావ్యను చేర్చిన దేవుడు
Photo Courtesy: JioHotstar
మీ బిడ్డకు అరుదైన వ్యాధి ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతుంది డాక్టర్. దాంతో వెంటనే ఆపరేషన్ చేయమని చెబుతాడు రాజ్. కానీ ఈ ఆపరేషన్ చేసినా పాప బతుకుతుందన్న నమ్మకం లేదని డాక్టర్ చెప్పడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఈ పాపకు ఉన్న వ్యాధి గురించి మీకు ముందే తెలుసు.. అందుకే రోగంతో ఉన్న పాప స్థానంలో ఆరోగ్యంగా ఉన్న నా బిడ్డను మార్చారని ఆరోపిస్తుంది కావ్య. ఆమె మాటలతో డాక్టర్ సీరియస్ అవుతుంది.
ఇంటికొచ్చిన రాజ్... కావ్య పిచ్చి ప్రవర్తన గురించి అందరికీ చెబుతాడు. ఎవరేం అనుకున్నా.. నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డను మాత్రం మార్చేశారు. ఈ పాప నా బడ్డ కాదని తేల్చేస్తుంది కావ్య. అలాగని ఈ బిడ్డ ప్రాణాలను కాపాడకుండా ఉండలేనని అంటుంది. తన ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ కావడంతో రాహుల్, రేఖలతో కలిసి రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. త్వరలో కావ్య పిచ్చిది అయిపోతుందని ఆ వెంటనే రాజ్‌తో నీకు పెళ్లి అని రేఖతో రుద్రాణి చెబుతుంది. పాప జాతకంలో చిన్న దోషం ఉందని.. పూజ చేస్తే అన్ని దోషాలు పోతాయని జ్యోతిష్యుడు చెప్పడంతో మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 27వ తేదీ ఎపిసోడ్ 940లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తన బిడ్డను తెచ్చుకోవడానికి కావ్య మరోసారి ఆసుపత్రి వస్తుంది. కావ్యను కలవడం తనకు ఇష్టం లేదని, బిజీగా ఉన్నానని నర్స్‌కు చెబుతుంది డాక్టర్. ఇదే మాట కావ్యకి నర్స్ చెబుతుంది. నర్స్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా డాక్టర్ దగ్గరికి దూసుకెళ్తుంది కావ్య. హాస్పిటల్‌లో నా బిడ్డను మార్చి నాకు అన్యాయం చేశారు. నాకు న్యాయం చేయండి అని కావ్య ప్రాధేయపడుతుంది. ఇక్కడ రోగికి ట్రీట్‌మెంట్ చేస్తారు న్యాయం చేయరు అని డాక్టర్ అంటుంది. కానీ ఈ హాస్పిటల్‌లో నా బిడ్డను మార్చి నాకు అన్యాయం జరిగిందని కావ్య చెబుతుంది. ఆ మాటలతో సీరియస్ అయిన డాక్టర్.. ఒకసారి చెబితే అర్ధం కాదా? పదేపదే ఎన్నిసార్లు అదే మాట అంటావని మండిపడుతుంది.
నా చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ అని నా కడుపులో పేగు ఒప్పుకోనంత వరకు నేను అదే మాట అంటానని అంటుంది కావ్య. ప్రాణం పోయినా ఈ హాస్పిటల్‌లో అలా జరగదు, బిడ్డల్ని మార్చే అవకాశం కూడా ఉండదు, ఎలా చెప్పాలి నీకు అని సీరియస్ అవుతుంది డాక్టర్. మీరు డాక్టర్‌గా ఆలోచించే వరకు మీకు సమాధానం దొరకదు. మీరు నన్ను నా మాటలను నమ్మే వరకు నా బాధను అర్ధం చేసుకోలేరని చెబుతుంది కావ్య. ఒక్కసారి మీరు పేషెంట్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా ఆలోచించండి. మీకూ పిల్లలు ఉంటారు కదా? వాళ్ల కోసం తపించే మీ గుండెతో ఆలోచించండి. ఈ అమ్మ వేదన ఏంటో మీకూ అర్ధం అవుతుంది అంటుంది. కావ్య.
బిడ్డ కానీ బిడ్డకు ఆకలి తీర్చగలుగుతున్నానే కానీ ఆప్యాయత పంచలేకపోతున్నానని అంటుంది కావ్య. నాకు సాయమంటూ చేతులు జోడించి అడుగుతుంది కావ్య. ఆ మాటలతో కరిగిపోయిన డాక్టర్... కావ్యకు సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆరోజు నాతో పాటు పురుడు పోసుకున్న బిడ్డల లిస్ట్ కావాలని చెబుతుంది కావ్య. ఆ వెంటనే నర్స్‌ని పిలిచి కావ్యకు కావాల్సిన రిపోర్ట్ ఇవ్వమని చెబుతుంది డాక్టర్.
మరోవైపు.. దుగ్గిరాల వారింట్లో పాపకు ఆకలి వేసి బాగా ఏడుస్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి.. పాపని మీరిద్దరూ ఆడిస్తున్నారు, కావ్య ఎక్కడ అని మండిపడుతుంది. పాప అలాగే గుక్కపెట్టి ఏడుస్తుంది అలాగే ఏడిస్తే ఊపిరి ఆడదని రేఖ కూడా అంటుంది. రాజ్ కూడా తనకు తెలియదని ఆన్సర్ ఇస్తాడు. పాపని మీకు ఇచ్చి కళావతి ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు రాజ్. కావ్య బయటకు వెళ్లింది, తన పాపను వెతకడానికి వెళ్లిందని స్వప్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కావ్యకి ఎలా చెబితే అర్ధమవుతుంది? మన మాటలను ఎందుకు నమ్మడం లేదు? ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించామని అంటుంది అపర్ణ. అది ఎందుకింత మొండిగా తయారైంది? దాని ప్రవర్తన ఎందుకిలా మారిపోతోందని అడుగుతుంది. ఈ ప్రవర్తన చాలా ప్రమాదకరం.. 15 రోజులకే బిడ్డను ఇలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదని అంటుంది రేఖ.
బిడ్డకు శాంతి హోమం కోసం మినిస్టర్ ధర్మేంద్ర గుడికి వచ్చి ఫాస్ట్‌గా పూజ ముగించాలని చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణి... మినిస్టర్‌ని పిలుస్తుంది. పూజని ఇంత తూతూ మంత్రంగా చేయిస్తున్నావు. గ్రాండ్‌గా చేయించాలని కదా అంటుంది రుద్రాణి. నేను చేసిన తప్పు చిన్నది కాదు.. ఆ రాజ్, కావ్యలకు ఎక్కడ అనుమానం వస్తుందోనని భయంగా ఉందని అంటాడు మినిస్టర్. ఎవ్వరినీ తక్కువుగా అంచనా వేయొద్దని ప్రకృతి కూడా వాళ్లకు సహకరిస్తుందని అంటాడు. ఇంతలో పంతులుగారు పిలుస్తున్నారని మినిస్టర్ ధర్మేంద్ర వెళ్లిపోతాడు. ఏం చేస్తున్నారండీ అక్కడ అని తులసి అడుగుతుంది. తెలిసినవారు కనిపిస్తే మాట్లాడుతున్నానని కవర్ చేస్తాడు మినిస్టర్. ఇంతలో కావ్య ఆ గుడి దగ్గరిలో కూర్చొని పాప కోసం బాధపడుతుంది.
పాపకి నూనెలో తన ముఖాన్ని చూపించమని పంతులుగారు చెబుతారు. ఇంతలో గుడిగంటల శబ్ధం వినిపించడంతో కావ్య గుడిలోకి వెళ్తుంది. అమ్మా అని పిలిపించకునే అదృష్టం ఇచ్చింది నువ్వే.. తనివితీరా నా బిడ్డ స్పర్శ పొందకుండా దూరం చేసింది నువ్వే. నేనేం చేశానని నా పరీక్ష.. నా ఒడిలో ఉండాల్సిన బిడ్డను దూరం చేసి నువ్వు గుడిలో ఉండి చోద్యం చూస్తున్నావా? నా బిడ్డను మార్చారని, ఈ తల్లిని ఏమార్చారని ఎవరికీ చెప్పుకున్నా నమ్మడం లేదు. అయినవాళ్లు, కట్టుకున్న భర్త కూడా నాది భ్రమ అని కొట్టిపారేస్తే ఎవరికి చెప్పుకోను. నా కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డను నేను పోల్చుకోలేకపోతున్నాను అంటున్నారు.
నా రక్తం పంచుకున్న పాపని నేనే తెలుసుకోలేనని అంటున్నారు. ఏం చేయను? ఏ సాక్ష్యాన్ని తీసుకురాను? అందరూ అడుగుతున్న సాక్ష్యాన్ని చూపించాల్సిన బాధ్యత.. నా బిడ్డ ఎక్కడుందో చెప్పే బాధ్యత కూడా నాదే.. నన్ను నా బిడ్డ వైపు నడిపించే దారిని నువ్వు చూపించమని వేడుకుంటుంది కావ్య. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర పాప ఏడుపు వినిపించి అటు వైపు చూస్తుంది కావ్య. పాలు తాగించినా బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో తులసి కంగారుపడుతుంది. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి బిడ్డను నాకు ఇవ్వమని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











