Brahmamudi January 28th Episode: కన్నబిడ్డ ఆచూకీ కనిపెట్టిన కావ్య... షాక్‌లో ధర్మేంద్ర, రుద్రాణి

Photo Courtesy: JioHotstar

కావ్య గురించి ఆలోచిస్తున్న అప్పూ దగ్గరికి స్వప్న వచ్చి జ్యూస్ ఇస్తుంది. అది చూసి అప్పూ షాక్ అవుతుంది. నీకు నా మీద కోపం పోయిందా? అని అడుగుతుంది. రాహుల్‌ని అనుమానించడంతో ముందు నీ మీద కోపం వచ్చినా నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేసి రాజ్‌ని కాపాడవని అంటుంది స్వప్న. ఇంతలో కావ్య వచ్చి స్వప్నకి బిడ్డను ఇచ్చి... నేను నా బిడ్డను వెతుక్కోవడానికి వెళ్తున్నాను.. నేను వచ్చే వరకు బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి తన బిడ్డను వెతకడంలో సాయం చేయమని ప్రాధేయపడుతుంది కావ్య. కళావతి మాటలతో కరిగిపోయిన డాక్టర్.. సాయం చేయడానికి ఒప్పుకుంటుంది.

పాప శాంతి పూజ ఉండటంతో తులసితో పాటు గుడికి వస్తాడు మినిస్టర్ ధర్మేంద్ర. అక్కడ మినిస్టర్‌ని చూసి షాకైన రుద్రాణి... ఎందుకు బయటకు వచ్చారు? అంటూ మండిపడుతుంది. శాంతి పూజ కోసం వచ్చామని త్వరగా వెళ్లిపోతామని చెబుతాడు. ఇంతలో కావ్య అదే గుడికి వచ్చి తన బిడ్డను తనకు చూపించమని ఈశ్వరుడిని వేడుకుంటుంది. ఇదే సమయంలో తులసి ఒడిలో ఉన్న పాప బాగా ఏడుస్తుంది. దాంతో బిడ్డ దగ్గరికి వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 28వ తేదీ ఎపిసోడ్ 941లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 28th 2026 Episode 941 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తులసి ఒడిలో ఉన్న పాప ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో కావ్య అది చూసి జోల పాట పాడుతుంది. ఇది చూసిన మినిస్టర్ ధర్మేంద్ర, రుద్రాణిలు షాక్ అవుతారు. కావ్య ఏమైనా దేవతా? అన్నావు కదా? ఇక్కడి వరకు ఎలా వచ్చిందని రుద్రాణిని అడుగుతాడు ధర్మేంద్ర. గుడికి ఏదో అనుకోకుండా వచ్చి ఉండొచ్చని అంటుంది రుద్రాణి. ఏదో శక్తే తనని తన బిడ్డ దగ్గరికి తీసుకొచ్చిందని అంటాడు ధర్మేంద్ర. ఆ కావ్యకు బిడ్డ మీదున్న ప్రేమ చాలా బలమైనదని చెబుతాడు. గుక్కపట్టిన పాప ఏడుపు ఆపడంతో కావ్యను మెచ్చుకుంటుంది తులసి. నా దగ్గర ఏ మహిమ లేదని అదే ఉండుంటే నా బిడ్డ నా దగ్గరికి వచ్చేదని అంటుంది కావ్య. ఏం జరిగింది? ఎందుకలా బాధపడుతున్నారని తులసి అడుగుతుంది.

ప్రాణాలకు తెగించి కడుపున మోసిన బిడ్డను తనివితీరా చూసుకోకముందే నా బిడ్డ నాకు దూరమైందని చెబుతుంది కావ్య. పురిట్లోనే నా బిడ్డను మార్చి దూరం చేశారు.. అప్పటి నుంచి నా పాప కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నానని అంటుంది కావ్య. మీ లాంటి మంచివాళ్లకే దేవుడు ఇలా చేస్తాడని అంటుంది తులసి. ఏది ఏమైనా ఒక తల్లిని, బిడ్డను దూరం చేసినవారు మట్టి కొట్టుకుపోతారు. మా వారు మినిస్టర్... మీ గురించి మా వారికి చెబితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారని అంటుంది తులసి. ధర్మేంద్ర కోసం అటు ఇటూ చూసి పిలుస్తుంది తులసి.

ఈవిడకి పుట్టిన పాపని ఎవరో మార్చేశారు? వీళ్ల పాపని ఎత్తుకెళ్లి ఇంకో పాపని వీళ్ల దగ్గర పెట్టారని తులసి చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఈ అమ్మాయి తన కన్నబిడ్డ కోసం ఎంతో కుమిలిపోతోంది.. బిడ్డ జాడ కోసం ఎంతో వెతుకుతోంది, మీరు ఈ అమ్మాయికి సాయం చేయాలని చెబుతుంది తులసి. నేనేం చేయగలను అని ధర్మేంద్ర అడగ్గా.. మీరు మినిస్టర్ కదా? ఆవిడ బిడ్డను దూరం చేసిన ఆ నీచుల్ని పట్టుకుని తన బిడ్డను తనకు అప్పగించి ఆ దుర్మార్గులకు శిక్షపడేలా చేయాలని చెబుతుంది తులసి. ఆ మాటలతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. మనం గుడికి ఎందుకు వచ్చాం.. ఏం చేస్తున్నాం.. వెళ్దాం పదా అని కోప్పడతాడు. నీతో మా పీఏ మాట్లాడతాడు.. వివరాలన్నీ అతనితో చెప్పండి.. ఆ తర్వాత నేను చూసుకుంటానని కావ్యతో చెబుతాడు ధర్మేంద్ర.

మీ చీరకు పసుపు, కుంకుమ అంటుకుందని కావ్య చెప్పడంతో తులసి ఆ బిడ్డను కావ్యకు ఇస్తుంది. బిడ్డ స్పర్శ తగలగానే అది తన బిడ్డేనని కావ్య గుర్తుపడుతుంది. అది చూసి ధర్మేంద్ర కంగారుపడతాడు. అయితే ధర్మేంద్ర మాత్రం పాపని బలవంతంగా తీసుకుని కోపంగా వెళ్లిపోతాడు. పాపను తీసుకుని వెళ్తుండగా.. పాప చేతి మీద పుట్టుమచ్చను చూసిన కావ్య షాక్ అవుతుంది. నా పాప అంటూ పరిగెత్తుకుంటూ మినిస్టర్‌ వెంట పరుగులు తీస్తుండగా రుద్రాణి ఆమెను పట్టుకుంటుంది. నిన్ను చూసి ఎన్ని రోజులైందో.. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నట్లు నటిస్తుంది. నేను కావాలని చేయలేదు... అయినా అందరూ నన్ను వదిలేస్తారా అంటూ మండిపడుతుంది.

ఇంతలో మినిస్టర్ తన కుటుంబంతో వెళ్లిపోవడంతో కావ్య అక్కడే కుప్పకూలిపోతుంది. ఆ అమ్మాయి చేతిలో నుంచి మన పాపని అలా లాక్కున్నారని అడుగుతుంది తులసి. నేను ప్యూన్‌ని కాదు.. మినిస్టర్‌ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతాడు ధర్మేంద్ర. ఈ ప్లాన్ గీసింది, నీకు నీ బిడ్డను దూరం చేసింది నేనే.. నువ్వు ఎప్పటికీ నీ బిడ్డను కలుసుకోలేవు, కలవనివ్వనని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో కావ్యకు డాక్టర్ అనూరాధ ఫోన్ చేసి రిపోర్ట్ రెడీ చేశానని చెబుతుంది. కావ్య గురించి ఆలోచిస్తూ రాజ్ రగిలిపోతూ ఉండగా అది చూసిన రేఖ.. బావని నా వైపుకు తిప్పుకోవాలని అనుకుని జ్యూస్ ఇస్తుంది. పాప ఆరోగ్యంతో పాటు కుటుంబమంతా కంగారుపడుతోంది, కావ్య ప్రవర్తన రోజురోజుకు మారిపోతోంది. తన వల్ల ఇంట్లో వాళ్లంతా బాధపడుతున్నారని రాజ్ దగ్గర నటిస్తుంది రేఖ. బలవంతంగా రాజ్‌కి జ్యూస్ ఇస్తుంది రేఖ.

ఇంతలో రేఖకి రుద్రాణి కాల్ చేస్తుంది. ఈరోజు కావ్య పాపని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది. బావ బాధపడుతుంటే నేను మెల్లిగా నా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటుంది రేఖ. కావ్యని రాజ్‌కి దూరం చేసి ఇంకా దగ్గరయ్యేలా ప్లాన్ చెబుతానని అంటుంది రుద్రాణి. ఆ కావ్య పిచ్చిపట్టిన దానిలా కారు వెంట పరుగులు తీసిందని ఇంట్లో వాళ్లకి చెప్పు... అప్పుడు కావ్యను ఇంట్లో నుంచి కదలనివ్వరు, అందరికీ అసహ్యం పుడుతుందని అంటుంది రుద్రాణి. ఈ ప్లాన్‌ని పర్ఫెక్ట్‌గా అమలు చేస్తానని అంటుంది రేఖ.

ఇంతలో కావ్య ఆసుపత్రికి వచ్చి పిల్లల లిస్ట్ చూస్తుంది. ఆరోజు మా పాపని ఆసుపత్రిలో వెయిట్ తక్కువగా ఉందని ఇంక్యూబెటర్‌లో పెట్టారు కదా? అలా ఇంకెవరినైనా పెట్టారా? అని అడుగుతుంది కావ్య. డాక్టర్ రిపోర్ట్స్ చూసి తులసి పేరు చెబుతుంది. ఆ మాట వినగానే తులసి గారి దగ్గర ఉన్న పాపే నా బిడ్డ అంటుంది కావ్య. ఆ మాటలతో డాక్టర్ షాక్ అవుతుంది. పాప స్పర్శతో పాటు తన చేతిపై పుట్టుమచ్చ కూడా ఉందని చెబుతుంది. ఇంతలో మినిస్టర్ గారి వైఫ్ తులసికి పుట్టిన బిడ్డ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అనూరాధ... పాప డెలివరి కేసును చూసింది డాక్టర్ చక్రవర్తి అని చెబుతుంది. ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది.

దాంతో డాక్టర్ గారి ఫోటో ఒకసారి చూపించమని కావ్య అడుగుతుంది. ఆ ఫోటో చూడగానే మా పాపకి ఈయన టెస్టులు చేశారు.. అర్జెంట్ వర్క్ ఉందని వెళ్లిపోయారు, అప్పటి నుంచే చక్రవర్తి గారు కనిపించలేదని అంటుంది కావ్య. ఆరోజు చక్రవర్తి గారికి కూడా నిజం తెలిసి ఉంటుంది.. కానీ పిల్లలను మార్చడంలో చక్రవర్తి గారు వ్యతిరేకించి ఉంటారు. కానీ డాక్టర్‌తో ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించి.. మినిస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి చక్రవర్తిని ఎక్కడో దాచేసి ఉంటారని అంటుంది కావ్య. ముందు మనం ఆ చక్రవర్తి గారిని కాపాడాలని అంటుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X