Brahmamudi January 29th Episode:నర్స్‌ని చితకబాదిన కావ్య..మినిస్టర్‌కు వార్నింగ్, కావ్యని పిచ్చిదిగా చేసిన రేఖ

Photo Courtesy: JioHotstar

కావ్య గుడిలో దండం పెట్టుకుంటుండగా పాప ఏడుపు వినిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే మినిస్టర్, అతని భార్య తులసి ఉంటారు. ఒడిలో పాపను చూడగానే జోల పాట పాడటంతో చిన్నారి ఏడుపు ఆపేస్తుంది. ఇదంతా చూసిన రుద్రాణి.. వెంటనే మినిస్టర్‌ ధర్మేంద్రను పక్కకు పిలిచి మధ్యలో కావ్య ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. కావ్య తల్లి ప్రేమ చాలా బలమైనదని అంటాడు మినిస్టర్. ఇదంతా అనుకోకుండా జరిగిందని.. అంతే తప్పించి ఇందులో ఏం లేదని అంటుంది రుద్రాణి. చీరకు అంటుకున్న పసుపు, కుంకుమలను శుభ్రం చేసుకుంటూ పాపని కావ్యకు ఇస్తుంది తులసి. చిన్నారి స్పర్శ తగలగానే అది తనబిడ్డేనని కావ్య తెలుసుకుంటుంది.

ఇది చూసిన మినిస్టర్ ఆ పాపను బలవంతంగా లాక్కుని వెళ్లిపోతుండగా.. పాప చేతి ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తుంది. దాంతో అది తన పాపేనని కావ్య నిర్ధారించుకుంటుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ రోజున తనతో పాటు డెలివరి అయిన వాళ్ల వివరాలు తెలుసుకుంటుంది. అందులో తులసి కూడా ఉండటంతో షాక్ అవుతుంది. నా పాపను చక్రవర్తి అనే డాక్టర్ గారు చూశారని .. మేం ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెబుతుంది కావ్య. అయితే డాక్టర్ మాయం వెనుక ఖచ్చితంగా మినిస్టర్ హస్తం ఉంటుందని కళావతి అనుమానిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 29వ తేదీ ఎపిసోడ్ 942లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 29th 2026 Episode 942 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మిస్ అయిన డాక్టర్ చక్రవర్తి గారికి అసలు నిజాలు తెలిసే అవకాశం ఉందని ఆయన ఇల్లు ఎక్కడ అని డాక్టర్‌ను అడుగుతుంది కావ్య. అయితే హెడ్ నర్స్ నీలవేణికి ఏమైనా తెలిసే అవకాశం ఉందని డాక్టర్ చెబుతుంది. ఇంతలో తాను 10 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ చైన్ కొన్నానని మరో నర్స్‌తో చెబుతుంది నీలవేణి. అంత డబ్బు నీకు ఎక్కడిది అని అడుగుతుంది నర్స్. ఎవరైనా పెద్దవాళ్లు చిన్న హెల్ప్ అడిగితే సాయం చేస్తే మనకి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తారని అంటుంది నీలవేణి. ఇంతలో కార్తీక్, డాక్టర్ అనూరాధలు అక్కడికి రావడంతో నీలవేణి షాక్ అవుతుంది. ఎవరి బిడ్డను ఎవరికిస్తే నీకు బాగా గిట్టుబాటు అవుతుందనేది మాత్రం నీకు తెలుసు అంటుంది కావ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అనడంతో నీలవేణిని లాగిపెట్టి కొడుతుంది కావ్య.

ఆ రోజు ఏం జరిగింది? మినిస్టర్ దగ్గర ఉన్న పాప ఎవరి పాప? అని నిలదీస్తుంది కావ్య. నాకేం తెలియదని నీలవేణి అంటుంది. ఇది చాలా సీరియస్ మేటర్.. లేదంటే నువ్వు ఇరుక్కుంటావని డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో నీలవేణి జరిగినదంతా చెబుతుంది. ఆ రోజు మినిస్టర్ ధర్మేంద్ర.. నీలవేణిని పిలిచి కావ్యకు పుట్టిన బిడ్డను తులసికి... తులసికి పుట్టిన బిడ్డను కావ్యకు ఇవ్వాలని చెబుతాడు. అలాగే పది లక్షల రూపాయల చెక్‌ను కూడా ఆమెకు ఇస్తాడు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు.. అలాగే నీకు జీవితంలో ఇంత డబ్బు సంపాదించలేవని చెబుతాడు మంత్రి. ఆ మాటలు వినగానే కావ్య, డాక్టర్ అనూరాధ షాక్ అవుతారు.

డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్మేస్తావా? నిన్ను చంపేస్తానని నీలవేణిని చితక్కొడుతుంది కావ్య. దీని వల్ల నేను ఇన్నిరోజులు నరకయాతన అనుభవించాను. నాకు నా బిడ్డను దూరం చేసి ఏం సంపాదించిందని ప్రశ్నిస్తుంది కావ్య. మినిస్టర్ దగ్గరి నుంచి మీ పాపని తెచ్చుకోవడం ఎలా అనేది ఆలోచించాలని చెబుతుంది డాక్టర్. ఇప్పుడే ఈ నర్స్‌ని మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి అందరి ముందు నిజాలు చెప్పించి నా బిడ్డను నేను తెచ్చుకుంటానని అంటుంది కావ్య. దాంతో నీలవేణి మాత్రం నన్ను ఇందులోకి లాగొద్దని.. నిజం తెలిస్తే ఆ మినిస్టర్ నన్ను బతకనివ్వడని చెబుతుంది. మినిస్టర్ గారిని ఎదురించేంత శక్తి, స్థాయి నాకు లేవని కావ్య కాళ్లు పట్టుకుంటుంది నీలవేణి.

మినిస్టర్ గారిని వ్యతిరేకించిన చక్రవర్తి గారు కనిపించకుండా పోయారని, ఇప్పుడు నేను నిజం చెప్పానని తెలిస్తే మినిస్టర్ నన్ను బతకనివ్వడని చెబుతుంది కావ్య. నాకు ఇద్దరు బిడ్డలు.. ఇద్దరూ చిన్నవాళ్లే.. వాళ్లకు నేను తప్ప ఎవరూ లేరు, మీకు నిజం చెప్పగలను కానీ... మినిస్టర్ ముందు నిలబడలేనని అంటుంది కావ్య. బిడ్డకు తల్లి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు... అందుకే వదిలేస్తున్నానని నీలవేణిని పంపేస్తుంది కావ్య. ఉన్నది నీలవేణి సాక్ష్యం ఒక్కటే.. ఇప్పుడే ఏ ప్రూఫ్‌తో నీ బిడ్డను తెచ్చుకుంటావని అంటుంది డాక్టర్. నా పాపకి అరచేతిలో పుట్టుమచ్చ ఉందని ఆ లిస్ట్ ఇస్తే నేను చూసుకుంటానని చెబుతుంది కావ్య.

పాప ఏడుస్తుండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్‌పై మండిపడుతుంది. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని రాజ్ అంటాడు. కావ్యకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమని అపర్ణ, సుభాష్ చెబుతారు. కావ్య రోడ్ల మీద పిచ్చిదానిలా పరుగులు తీస్తోందని రేఖ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రోడ్ల మీద వెళ్తున్న కార్లు ఆపి నా పాపను ఇవ్వమని.. చంటి బిడ్డలను లాగేసుకుంటోందని, కావ్య నెమ్మదిగా పిచ్చిదానిలా మారుతోందని అంటుంది రేఖ. ఆ మాటలతో సుభాష్ మండిపడతాడు. దుగ్గిరాల వారి కోడలికి పిచ్చి పట్టిందని నలుగురు మాట్లాడుకుంటే ఎంత అప్రతిష్ట అని రేఖ భయపెడుతుంది. రాజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కావ్య కట్ చేస్తుంది.

మినిస్టర్‌కు పుట్టిన పాప చేతికి పుట్టుమచ్చ ఉన్నట్లు ఇందులో నోట్ చేశారని డాక్టర్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. హాస్పిటలే వాళ్లది.. ఏమైనా చేయగలడని డాక్టర్ చెబుతుంది. ఇక్కడ ఇంత దుర్మార్గం జరుగుతుందని తెలిసి షాక్ అయ్యాను.. కానీ నీ పోరాటం చూశాక, నీ బిడ్డ మీద నీ మమకారం అర్ధం చేసుకోవడానికి టైం పట్టింది.. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానని అంటుంది డాక్టర్. కావ్య ఎక్కడికి వెళ్లిందో? ఏం చేస్తుందో అర్ధం కావడం లేదని రాజ్ బాధపడతాడు. రుద్రాణి - మినిస్టర్‌లు కావ్య గుడికి రావడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య మినిస్టర్ ఇంటికి రావడంతో రుద్రాణి, ధర్మేంద్రలు షాక్ అవుతారు. అది నన్ను చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది.. మీరే హ్యాండిల్ చేయమని రుద్రాణి సైడ్ అయిపోతుంది.

కన్నతల్లి గుండెకు గాయం చేసిన చేతితో నాకు సాయం చేస్తారా అని కావ్య మండిపడుతుంది. నా బిడ్డను మార్చింది, నాకు నా బిడ్డను దూరం చేసింది నువ్వేనని నాకు తెలుసని కావ్య అనడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. బిడ్డ బతకదని తెలిసి మరో కన్నతల్లికి అన్యాయం చేస్తారా? నా బిడ్డ ఎక్కడ? అని కావ్య నిలదీస్తుంది. నోరు ఉంది కదా అని నా మీద నిందలు వేస్తే నీకే నష్టం అంటాడు ధర్మేంద్ర. నాది అనుమానం కాదు.. పచ్చి నిజమని రిపోర్ట్స్ చూపిస్తుంది. మీకు పుట్టిన బిడ్డకు ఉన్న వ్యాధి.. ఆరోగ్యంగా ఉన్న నా బిడ్డకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తుంది కావ్య. దాంతో ధర్మేంద్రకు చెమటలు పడతాయి. నేను హాస్పిటల్‌లో అంత పకడ్బందీగా మార్చేసిన రిపోర్ట్స్ కూడా పట్టుకున్నావు అంటే నువ్వు చాలా దూరం వచ్చేశావని అంటాడు ధర్మేంద్ర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X