Brahmamudi January 2nd Episode: రుద్రాణి ప్లాన్ సక్సెస్... కావ్య ప్రాణాలకు ముప్పు, రాజ్ చుట్టూ రాహుల్ ఉచ్చు
Photo Courtesy: JioHotstar
కావ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఇంట్లో వాళ్లతో పోట్లాడి మరి రాజ్‌కి మరో పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది. అప్పుడు రాజ్ బిడ్డకు తల్లిగా, ఈ ఇంటికి కోడలిగా అన్ని అర్హతలు రేఖలో ఉన్నాయని నువ్వు నమ్మించమని రుద్రాణికి సలహా ఇస్తాడు రాహుల్. మీ ఇద్దరి మాట అదే అయినప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దు అంటాను.. ముందు కావ్య కడుపులోని బిడ్డను చంపుతానని రేఖతో అంటుంది రుద్రాణి. అడవికి చెందిన ఓ వ్యక్తిని పిలిపించి పసరు మందు తీసుకుంటుంది. దీనిని కనుక కడుపుతో ఉన్నవారు తాగితే పిండం కకావికలమైపోతుందని, రేపు ఇంకో మందు తీసుకొచ్చి ఇస్తానని అంటాడు ఆ వ్యక్తి. అనంతరం రేఖతో కలిసి ఆ పసరు మందుని కావ్య వాడే కషాయంలో కలిపేస్తుంది రుద్రాణి.
తమకు ఇంట్లోవాళ్లు ఏ పని చెప్పకపోవడంతో కావ్య, అప్పూలకు బోర్ కొడుతుంది. దీనిపై ఏదో ఒకటి తేల్చేయాలని ఇద్దరూ కలిసి రాజ్, కళ్యాణ్‌ల దగ్గరికి వెళ్తారు. మాకు బోర్ కొడుతోందని, మా వల్ల కావడం లేదని చెబుతారు. దాంతో రేపటి నుంచి మీకు సర్‌ప్రైజ్ ఇస్తామని చెబుతారు రాజ్, కళ్యాణ్. ఆఫీసుకు వెళ్లకుండా మారాం చేస్తున్న ప్రకాశం, సుభాష్‌లపై ఇందిర, ధాన్యలక్ష్మీ, అపర్ణలు సెటైర్లు వేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 2వ తేదీ ఎపిసోడ్ 920లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అప్పూ, కావ్యలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఒకచోట కూర్చోబెడతాడు రాజ్. ఆ తర్వాత ఒక పాత్రలో చీటీలు రాసుకొచ్చి.. ఇందులో రాసున్న ప్రకారం ఎవరికి ఏ చీటి వస్తే వాళ్లు ఆ పని చేయాలని చెబుతాడు. ముందుగా సీతారామయ్య తీయగా.. ఒక పద్యం పాడాలని వస్తుంది. ఆ తర్వాత ధాన్యం- ప్రకాశంలకు డ్యాన్స్ చేయాలని వస్తుంది. రేఖ పదే పదే రాజ్ మీద చేతులు వేస్తుండటంతో కావ్యకి కోపం వస్తుంది. అది చూసిన రాజ్ పక్కకి వచ్చేస్తాడు. దాంతో రేఖ రగిలిపోతుంది.
ఆ తర్వాత రాహుల్ - స్వప్నల వంతు వస్తుంది. వారు తీసిన చీటిలో సైగలతో సినిమా పేరు చెప్పించే టాస్క్ వస్తుంది. రాహుల్ ఎంత ట్రై చేసినా స్వప్న దానిని కనుక్కోలేకపోవడంతో సరిగా చేయమని రాహుల్‌పై అంతా సీరియస్ అవుతారు. అయితే కాసేపటి తర్వాత స్వప్న ఆ సినిమా పేరు కరెక్ట్‌గా చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. అనంతరం రుద్రాణిని పిలుస్తారు. ఆమె తీసిన చీటిలో బాలయ్య బాబు డైలాగ్ చెప్పమని వస్తుంది. దాంతో చూడు ఒకవైపే చూడు... రెండో వైపు చూడాలని అనుకోకు, మాడిపోతావు అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడంతో ఇందిర భయపడుతుంది. ఎలా ఉంది నా డైలాగ్ అని రుద్రాణి అడగ్గా... బాలయ్య బాబు చెబితే ఓల్టేజ్‌లా ఉంటుంది, నువ్వు చెబితే డ్రైనేజ్‌లో ఉందని సెటైర్లు వేస్తుంది ధాన్యలక్ష్మీ.
ఆ తర్వాత కళ్యాణ్‌తో చీటి తీయిస్తాడు రాజ్.. అందులో మరోసారి సైగలతో సినిమా పేర్లు చెప్పే టాస్క్ ఇస్తాడు. అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే పేరు. దానికి రకరకాల సైగలతో చేసి చెబుతాడు కళ్యాణ్. వాటికి అప్పూ చిటికెలో ఆన్సర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత ఈజీగా చెప్పేశారని రాజ్ అడగ్గా.. మేమిద్దరం పర్ఫెక్ట్ కపుల్ అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఇందిర, అపర్ణలని పిలుస్తాడు రాజ్. మీరిద్దరూ కలిసి ఏదైనా పర్ఫర్మ్ చేయాలని చెబుతాడు.
ఇంతలో కళావతి కషాయం తాగావా? లేదా అని భార్యని అడుగుతాడు. లేదని ఆమె చెప్పడంతో తనే వెళ్లి తీసుకొని వస్తానని అంటాడు. తమ ప్లాన్ వర్కవుట్ అవుతుందని రుద్రాణి, రేఖలు సంతోషిస్తూ ఉంటారు. మరోవైపు... రాజ్ కారు తాళాలు కొట్టేయాలని రాహుల్ బయటికి వెళ్తాడు. రాజ్ వెళ్లి కషాయం తీసుకుని వస్తాడు. అటు టాస్క్‌లో భాగంగా ఇందిర, అపర్ణలు అత్తా కోడళ్లలాగా స్కిట్ చేస్తారు. వారి పర్ఫార్మెన్స్‌కు అంతా చప్పట్లు కొడతారు. తర్వాత కావ్యకి రాజ్ కషాయం తీసుకొచ్చి ఇస్తాడు. ఈ టైంలో నాకొద్దని కావ్య మారాం చేస్తుండగా.. రాజ్ బతిమలాడతాడు. అది చూసి దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుండగా... రేఖ రగిలిపోతుంది. ఇక చేసేది లేక కావ్య కషాయం తాగుతుంది. భార్య అంటే ఎంత ప్రేమో అంటూ రాజ్‌ని మెచ్చుకుంటుంది ఇందిర. దేనికైనా అదృష్టం ఉండాలి.. కావ్య అదృష్టవంతురాలని ధాన్యం కూడా పొగుడుతుంది. ఇంతలో రాజ్ కారు తాళాలని రాహుల్ కొట్టేస్తాడు.
ఆ తర్వాత రాజ్ చీటిలు తీయగా.. తన భార్య మనసులో ఏముందో ఆ మనసుని గుర్తించి భర్త కరెక్ట్‌గా చెప్పాలనే టాస్క్ వస్తుంది. కళావతి మనసులో ఏముందో మీ అందరికీ తెలుసు. తనకి ఎంత కష్టం వచ్చినా, తన వాళ్ల కళ్లలో కన్నీటి తడి కనిపించకూడదని తను ఎప్పుడూ కోరుకుంటుంది. ఎదుటివాళ్లు ఎంత తప్పు చేసినా, తప్పు చేసినవాళ్లు ఎవరైనా సరే క్షణకాలంలో క్షమించాలన్న గుణం ఉంటుంది. కానీ అందరి విషయంలో తన పద్ధతి నచ్చకపోయినా, నా విషయంలో తను క్షమిస్తుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎన్నో తప్పులు చేశాను, ఆ తప్పులు దిద్దుకుని అవకాశం ఇవ్వడమే కాదు, నా తప్పుల్ని క్షమించి తన తలపై పెట్టుకున్న గొప్ప ఇల్లాలు నా కళావతి. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా నన్ను క్షమిస్తూనే ఉంటుంది. నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది అది నా కళావతి అని రాజ్ చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు.
తర్వాత సుభాష్‌ని పిలిచి డైలాగ్ చెప్పమని టాస్క్ ఇస్తారు రాజ్, కళ్యాణ్. దాంతో సుభాష్ భార్యాభర్తల రిలేషన్‌పై డైలాగ్ చెబుతాడు. చివరికి రేఖ ఒక్కటే మిగలడంతో ఆమెను పిలిచి చీటీ తీయిస్తారు రాజ్, కళ్యాణ్. ఓ మంచి డ్యూయెట్ సాంగ్‌కి డ్యాన్స్ వేయాలని చీటిలో రాసుంటుంది. నేను డ్యూయెట్ ఎలా చేయను, సింగిల్‌గా ఎలా చేస్తానని అడుగుతుంది రేఖ. నీ కోసం హీరోని తీసుకురమ్మంటావా? అని ధాన్యం సెటైర్లు వేస్తుంది. హీరో ఇక్కడే ఉన్నాడు కదా అని రాజ్‌ని చూపిస్తుంది రేఖ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేను రాజ్ బావతోనే డ్యాన్స్ చేస్తానని రేఖ మారాం చేస్తుంది. నా వల్ల కాదని రాజ్ చేతులేత్తేయగా అందరూ కలిసి చేసేయమని అంటారు. దాంతో చేసేది లేక రేఖతో కలిసి గువ్వా గోరింక సాంగ్‌కి డ్యాన్స్ చేస్తాడు రాజ్. ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీయడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాజ్ పక్కన రేఖని చూసి రుద్రాణి మురిసిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










