Brahmamudi January 30th Episode: మినిస్టర్‌కు కావ్య డెడ్‌లైన్.. నిజం తెలుసుకున్న రాజ్, ప్లాన్ మార్చిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar

నా పాప గురించి కనిపించకుండా పోయిన డాక్టర్ చక్రవర్తి గారికి తెలుస్తుందని డాక్టర్‌తో అంటుంది కావ్య. అయితే హెడ్ నర్స్‌కి కూడా ఇక్కడేం జరుగుతుందో తెలిసే అవకాశం ఉందని చెబుతుంది డాక్టర్. దాంతో ఇద్దరు కలిసి వెళ్లి హెడ్ నర్స్ నీలవేణిని నాలుగు పీకడంతో ఆమె బిడ్డల్ని మార్చినట్లు ఒప్పుకుంటుంది. మీకు నిజం చెప్పాను... మీరే మీ బిడ్డను తెచ్చుకోండి. ఈ విషయం తెలిస్తే ఆ మినిస్టర్ నన్ను చంపేస్తాడని చెబుతుంది నీలవేణి. కావ్య, డాక్టర్‌లు బిడ్డ పుట్టుమచ్చ కోసం రిపోర్ట్స్ పరిశీలించగా... మినిస్టర్ మొత్తం మార్చేస్తాడు. మా హాస్పిటల్‌లో ఎంతో తప్పు జరిగింది.. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానని చెబుతుంది డాక్టర్.

కావ్య ఎంతకు రాకపోవడం, బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో రాజ్‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. ఇంతలో రేఖ వచ్చి కావ్య పిచ్చిదానిలా రోడ్ల వెంట పరుగులు తీస్తోందని, కనిపించినవారి పిల్లలను లాక్కుంటోందని చెబుతుంది. రాజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కావ్య కాల్ కట్ చేస్తూనే ఉంటుంది. ధరేంద్ర, రుద్రాణిలు మాట్లాడుకుంటూ ఉండగా కావ్య నేరుగా మినిస్టర్ ఇంటికి వస్తుంది. ఆమెను చూడగానే రుద్రాణి లోపలికి వెళ్లి దాక్కుంటుంది. నువ్వు నా బిడ్డను మార్చేసిన సంగతి ఆధారాలతో సహా సంపాదించానని కావ్య చెప్పడంతో మినిస్టర్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 30వ తేదీ ఎపిసోడ్ 943లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 30th 2026 Episode 943 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను హాస్పిటల్‌లో పక్కాగా మార్చేసిన రిపోర్ట్స్‌ని కూడా పట్టుకోగలిగావు అంటే నువ్వు చాలా దూరం వచ్చేశావని కావ్యతో అంటాడు మినిస్టర్ ధర్మేంద్ర. నీ దగ్గర ఉన్న బిడ్డ.. నా బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు. నా చూపు చాలు.. నాకు తగిలే నా బిడ్డ ఊపిరి చాలు. నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావని తెలుసుకోవడానికి అంటుంది కావ్య. నీ బిడ్డను నేనే మార్చాను... నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చను అంటాడు మినిస్టర్. నీ బిడ్డను మార్చి.. నా ఒడిలోకి చేర్చే హక్కు నీకు ఎవరిచ్చారు? అని కావ్య ప్రశ్నిస్తుంది. నీ మీద నాకు ఎలాంటి పగ, ద్వేషం ఏం లేవు.. ఆ రోజు మాకు పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్య ఉందన్నారు.. బ్రతకదన్నారు. కానీ పాప గురించి తెలిస్తే నా భార్య నాకు దక్కదు. అందుకే మరో మార్గం లేక అలా చేశానని చెబుతాడు ధర్మేంద్ర.

అందుకని మరో తల్లికి కడుపుకోత మిగులుస్తావా? ఇంకో ఆడదాని చేత కన్నీళ్లు పెట్టిస్తావా? అని మండిపడుతుంది కావ్య. నా భార్య సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తానని చెబుతాడు ధర్మేంద్ర. నువ్వు తెలుసుకున్న నిజం, ఈ రిపోర్ట్స్ చాలా చిన్నవి.. ఈ బిడ్డ నీది అని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా? అని నిలదీస్తాడు మంత్రి. మీ ఇంట్లో చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా నేనే మార్చేశాను.. నువ్వు ఎక్కడ పట్టుకోలేవు, ఇండియాలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయని చెబుతాడు. మీకు ఈ పాప కాకపోయినా మళ్లీ బిడ్డను కనేందుకు అవకాశం ఉంది.. కానీ మాకు ఆ అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను... నీ బిడ్డను మాత్రం మరిచిపోమని చెబుతాడు ధర్మేంద్ర.

డబ్బు, పలుకుబడి, పదవి ఉందని విర్రవీగుతున్నావు... నీ పవర్‌ని అడ్డం పెట్టుకుని ఎందరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చని అనుకుంటున్నావు, వాటిని నేను పెకిలిస్తున్నాను. పదవితో వచ్చిన పవర్ నీది, పేగు తెంచుకుని కన్న మమకారం నాది. నీది బిడ్డల్ని మార్చిన కిరాతకం, నాది రక్తం పంచిన అమ్మతనం. ఇక నీకు, నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావు.. ముగింపు నేను ఇస్తాను, నా బిడ్డను నేను తిరిగి తీసుకెళ్తానని చెబుతుంది కావ్య. నీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను.. గడువులోపు నీకు నువ్వుగా చేసిన తప్పు ఒప్పుకునేలా నీ చేతుల్లో బిడ్డని, నా చేతుల్లో పెట్టేలా చేస్తాను. నా పాపని నేను తీసుకెళ్తానని కావ్య వార్నింగ్ ఇస్తుంది.

దాని కాన్ఫిడెన్స్ ఏంటీ? మినిస్టర్‌తో మాట్లాడుతున్నానన్న భయం కూడా లేదని రుద్రాణిని అడుగుతాడు ధర్మేంద్ర. అది ఒంటరి ఆడది, దాని భర్త, దాని కుటుంబమే దానిని నమ్మడం లేదు. దానికి అంత సీన్ లేదని చెబుతుంది రుద్రాణి. ఈరోజు నుంచి ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలవుతుంది. అందరూ దానిని పిచ్చిదానిలా ట్రీట్ చేస్తారని అంటుంది రుద్రాణి. మరోవైపు... అప్పుడే ఇంటికి వచ్చిన కావ్యని గుమ్మం దగ్గరే ఆగమని కోపంగా చెబుతాడు రాజ్. నా పాపని వెతుక్కోవడానికి వెళ్లానని కావ్య చెప్పగా.. వెతుక్కోవడానికి పాపేం వస్తువు కాదు, నువ్వేం పాపని పడేయలేదు అని అంటాడు రాజ్. నీ అనుమానం హద్దులు దాటి పాపని పట్టించుకోకుండా రోడ్లు ఎక్కడమా? పాప నీ కోసం ఇక్కడ అల్లాడిపోతోంది? ఫోన్ చేస్తే కట్ చేస్తావు అని సీరియస్ అవుతాడు రాజ్.

అపర్ణ వచ్చి మేం నిన్ను నమ్మడం లేదా? మేం నిన్ను అర్ధం చేసుకోవడం లేదా అని కావ్యపై మండిపడుతుంది. నిజానికి, అబద్ధానికి తేడా తెలియడం లేదు.. ఎందుకు రోడ్ల మీద పరుగులు తీస్తున్నావని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఇలాగే నీ మనసును పాడు చేసుకుంటే నువ్వు ఏమైపోతావోనని భయంగా ఉందని అంటుంది. ఇప్పటిదాకా నా అనుమానంతో, నా మాటలతో మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. కానీ ఇప్పుడే నిజం తెలుసుకున్నానని.. ఇకపై నా వల్ల మీరు బాధపడరు, నా వల్ల మీరు ఇబ్బందిపడరని అంటుంది కావ్య. ఈరోజే నాకు క్లారిటీ వచ్చిందని చెప్పి వెళ్లిపోతుంది.

ఈరోజు ఎవరో బిడ్డను చూసి తన బిడ్డేనని కావ్య అనుకుని ఉంటుందని రేఖ అంటుంది. ఎవరి బిడ్డనో రేపు తన బిడ్డ అంటే ఎవరు ఊరుకుంటారు? కావ్యను ఇకనైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూస్తే మనకే మంచిదని అనిపిస్తుందని చెబుతుంది రేఖ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచనలో పడుతుంది. ఇంతలో రేఖకి రుద్రాణి ఫోన్ చేసి ఇంట్లో ఏం జరిగిందని అడుగుతుంది. నేను అంతా కరెక్ట్‌గానే చేశానని.. కానీ కావ్య వచ్చి అందరినీ మాటలతో మాయ చేసిందని మండిపడుతుంది రేఖ. కావ్య కూతురు ఎక్కడుందో దానికి తెలిసిపోయింది.. ఈరోజు ఏకంగా మినిస్టర్ ఇంటికి వెతుక్కుంటూ వచ్చేసింది. 15 రోజుల్లోనే తన బిడ్డను తెచ్చుకుంటానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిందని రుద్రాణి చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.

మినిస్టర్ ఇంటి వరకు వచ్చింది అంటే తన కూతురిని తిరిగి తెచ్చుకోలేదా? తన కూతురు ఎక్కడుందో తెలిసిపోతే తను ఊరుకుంటుందా? తప్పకుండా రాజ్‌తో కలిసి ఏదో ఒక ప్రయత్నం చేస్తుందని అంటుంది రేఖ. ఇంత కష్టపడి ప్లాన్ చేసి తన కూతురిని దూరం చేసింది.. తిరిగి దాని చేతిలో పెట్టడానికా? దానిని ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది. నన్ను ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబం మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది.. దానిని అంత సులువుగా వదులుకోను. ఆ కావ్యను ఇల్లు దాటి వెళ్లకుండా ఆపు.. ఇంట్లో వాళ్లకి తన ప్రవర్తన మీద అనుమానం కలిగేలా చేయమని తన ప్లాన్ చెబుతుంది రుద్రాణి.

ఎవరికో పుట్టిన బిడ్డను నా కూతురిగా ఎందుకు పెంచుకుంటానని కావ్యతో అంటాడు రాజ్. నిన్నటి దాకా నేను కూడా అదే అనుకున్నాను.. కానీ ఈరోజు హాస్పిటల్‌కి వెళ్లి నిజం తెలుసుకున్నానని జరిగినదంతా చెబుతుంది కావ్య. ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలియడం లేదా అని మండిపడుతుంది. ఆ మినిస్టర్ ఇంటికి వెళ్తే మీకే అసలు నిజం తెలుస్తుందని చెప్పి ధర్మేంద్ర ఇంటికి రాజ్‌ని తీసుకుని వెళ్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X