Brahmamudi January 31st Episode: మినిస్టర్ ఇంటికి సీక్రెట్‌గా రాజ్, కావ్య.... బిడ్డను గుర్తుపట్టిన రాజ్

Photo Courtesy: JioHotstar

బిడ్డల్ని మినిస్టర్ మార్చిన విషయం తెలుసుకున్న కావ్య నేరుగా ధర్మేంద్ర ఇంటికి వస్తుంది. నీ బిడ్డను నేనే మార్చాను.. ఈ జన్మలో నీకు దక్కనివ్వనని చెబుతాడు ధర్మేంద్ర. డబ్బు, పరపతి, పవర్ ఉన్నాయని రెచ్చిపోతున్నావు.. ఇంకో 15 రోజుల్లో నీకు బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. దాని కాన్ఫిడెన్స్ ఏంటీ.. మినిస్టర్‌ని అని కూడా లేకుండా నాతో అలా మాట్లాడిందని రుద్రాణితో అంటాడు ధర్మేంద్ర. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుండటంతో అప్పుడే ఇంటికి వచ్చిన కావ్యను రాజ్ గుమ్మంలోనే ఆపేస్తాడు.

నాకు నిజం తెలిసింది.. ఇకపై నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలదని మాటిస్తుంది కావ్య. గొడవ జరకుండా, కావ్యను ఎవ్వరూ ఏమీ అనకపోవడంతో రేఖ రగిలిపోతుంది. ఇదే విషయాన్ని రుద్రాణికి చెబుతుంది. నేను అనుకున్న ప్లాన్ జరగాలంటే కావ్య ఇంటిలో నుంచి బయటికి రాకూడదని అంటుంది రుద్రాణి. బిడ్డను ఆడిస్తున్న కావ్య దగ్గరికి వెళ్లి ఇకనైనా నీకు ఏం జరిగిందో చెప్పు.. ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు రాజ్. దాంతో ఆసుపత్రిలో బిడ్డలను మార్చిన విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 31వ తేదీ ఎపిసోడ్ 944లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 31st 2026 Episode 944 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని మీ కళ్లారా చూస్తే అయినా మీకు నమ్మకం కుదురుతుందని ఒకసారి నాతో రమ్మని రాజ్‌తో చెబుతుంది కావ్య. దాంతో భార్య మాట కాదనలేక వెళ్దామని చెబుతాడు రాజ్. ఇంతలో పాపని శృతి పడుకోబెడుతుండగా ధర్మేంద్ర వచ్చి పిలుస్తాడు. మీ అరుపుకి పాప లేస్తుందని, ఏం కావాలని అడుగుతుంది. పాప పుట్టిన దగ్గరి నుంచి పాప చుట్టూ తిరుగుతున్నావు కానీ మొగుడిని మాత్రం మరిచిపోతున్నావని మండిపడతాడు ధర్మేంద్ర. మీ పనులు మీరు చూసుకుంటారు... నా బిడ్డ చంటి బిడ్డ అంటుంది తులసి. లేక లేక పుట్టిన బిడ్డ.. ఈ బిడ్డే లేకపోయుంటే నేను అనేదానిని ఉండేదానిని కాదు. అలాంటిది నా ప్రాణానికి ప్రాణమైన పాపని ప్రాణంగా చూసుకుంటానే తప్పించి.. పనివాళ్లకు ఎందుకు అప్పగిస్తానని ప్రశ్నిస్తుంది తులసి.

బిడ్డ మీద మరీ ఇంత ప్రేమ పనికిరాదని అంటాడు ధర్మంద్ర. ఆడదానికి బిడ్డ పుట్టేవరకే భర్త మీద ప్రేమ.. బిడ్డ పుట్టి తల్లయిన తర్వాత ఆ బిడ్డే ప్రపంచమని చెబుతుంది తులసి. నాకు సవాలక్ష పనులు ఉంటాయి.. నా గురించి కూడా ఓ పది నిమిషాలు పట్టించుకోమని అంటాడు ధర్మేంద్ర. మీకు గుడిలో పాట పాడిన అమ్మాయి గురించి పని అప్పగించాను కదా ఏమైందని అడుగుతుంది తులసి. ఆ మాటలు విన్న ధర్మేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు నేను పాడపాడితే పాప ఏడుపు ఆపిందని రాజ్‌కి చెబుతుంది కావ్య. గుడిలో మీరెందుకు అంత విచిత్రంగా ప్రవర్తించారు. కావ్య మన పాపని ఎత్తుకుంటే మీకేదో కొంపలు మునిగిపోయినట్లు పాపని లాగేసుకుని, హడావుడిగా నన్నూ లాక్కొచ్చేశారని మండిపడుతుంది తులసి. మన పాప పరాయివాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేక అలా చేశానని అంటాడు ధర్మేంద్ర.

పాప కావ్య తన బిడ్డ కోసం తల్లిడిల్లిపోతోందని.. మనవాళ్లకి చెప్పాను.. బిడ్డ గురించి వెతుకుతున్నారని చెబుతాడు ధర్మేంద్ర. ఇంతలో పాపని చూపిస్తానని రాజ్‌ని తీసుకెళ్తుంది కావ్య. బిడ్డను చూడగానే కావ్య ముద్దు పెట్టుకుంటుంది. మన కూతురు, మన ఇంట్లో నా ఒడిలో ఉండాల్సిన బిడ్డ అని, పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చని చూపిస్తుంది కావ్య. మీ కూతురు ఎలా ఉందని కావ్య అడగ్గా.. అచ్చం నీలాగే ఉందని అంటాడు రాజ్. ఇంతలో పాప ఏడవటంతో తులసి, ధర్మేంద్రలు పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్నపిల్లలు అన్నాక ఏడుస్తారు. ఆ మాత్రం దానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తావా? అని ధర్మంద్ర భార్య మీద సీరియస్ అవుతాడు. పాప కిందపడిపోతుందని అలా చేశానని అంటుంది తులసి. నువ్వు మెట్ల మీద నుంచి కిందపడిపోయేదానివి.. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అని అడుగుతాడు ధర్మేంద్ర.

నా పాపకి ఏమైనా అయితే నేను చచ్చిపోతాను.. పాప నా ప్రాణం, పదేళ్లు ఎదురుచూసిన వరమని చెబుతుంది. నాకు ఎన్నిసార్లు ఆ దేవుడు అన్యాయం చేసినా బిడ్డల్ని తీసుకెళ్లిపోయినా, ఈసారి నా మీద దయతలిచి నన్ను అమ్మను చేశాడు. ఆ దేవుడు కరుణించిన బిడ్డ, అలాంటి నా బిడ్డ మీద ఈగ వాలినా నా ఊపిరి ఆగిపోతుందని అంటుంది తులసి. నువ్వు అంతలా చెబుతున్నా.. వినిపించుకోలేదు నేను ఫూల్‌ని అంటాడు రాజ్. కన్నతల్లి స్పర్శ గొప్పతనం ఎంతటితో గుర్తించలేకపోయానని క్షమాపణలు చెబుతాడు. పాప ఏడుస్తుంటే నా మీద ఎందుకు కోప్పడ్డారు, తండ్రి బంధం మిమ్మల్ని పాప వైపు లాగిందని చెబుతుంది కావ్య. వాళ్ల పాపని వాళ్లకు అప్పగించి.. మన పాపని ఎలా తెచ్చుకోవాలనే దానిపై ఆలోచించాలని చెబుతుంది.

మనకు ఇంత అన్యాయం చేసి ఏమీ తెలియనట్లు వాడి భార్య దగ్గర నటిస్తున్నాడు. వాడు పవర్‌లో ఉన్నాడు, ఏం చేయలేమనే పొగరుతో ఉన్నాడు.. మనం ఆ తులసి గారికి దగ్గర కావాలి. వాడి కళ్లముందే తిరుగుతూ వాడికి నిద్రపట్టకుండా చేయాలి. ఇక నుంచి నువ్వు ఏం చెబితే అది చేస్తానని అంటాడు రాజ్. మన బిడ్డ మనల్ని చేరే వరకు ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం చెప్పొద్దని కావ్య చెబుతుంది. ఉదయాన్నే బిడ్డను ఆడిస్తున్న కావ్యని చూసి అపర్ణ, సుమిత్రలు సంతోషిస్తారు. కావ్య నిన్న అలా మాట్లాడింది కదా.. ఇంతలోనే అంత మార్పా అని రాజ్‌ని అడుగుతుంది అపర్ణ. నీ కోడలికి నిజమేంటో? అబద్ధం ఏంటో చెప్పాను అందుకే తనలో ఈ మార్పు అని చెబుతాడు రాజ్. పాప ఆరోగ్యం గురించి తప్పించి కావ్య ఏం ఆలోచించలేదని అంటాడు.

ఉదయాన్నే పాపని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది తులసి. తనకు పాలు రావడం లేదని చెబుతుంది తులసి. ఇంతలో కావ్య, రాజ్‌లు అక్కడికి వస్తారు. నా బిడ్డను వెతికే ప్రయత్నంలో ఉన్నామని.. మినిస్టర్ గారి సాయం లేకుండా మేం ఏం చేయలేమని తులసితో చెబుతుంది కావ్య. పాపకు ప్రాబ్లమ్ ఉందని చెప్పిన డాక్టర్ చక్రవర్తి గారు సర్జరీ చేయాలని అంటుంది కావ్య. చక్రవర్తి గారు ఎక్కడున్నారు. ఆయనని కలవాలని అడుగుతుంది కావ్య. ఆయన చాలా రోజులుగా హాస్పిటల్‌కు రావడం లేదు.. ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని చెబుతుంది డాక్టర్. నాకు డెలివరీ చేసిన తర్వాత చక్రవర్తి గారు మళ్లి కనిపించలేదని చెబుతుంది తులసి. ఇది మీ హాస్పిటల్.. మీ దగ్గర పనిచేసే డాక్టర్ కనిపించకపోతే మినిస్టర్‌ని అడగమని అంటుంది కావ్య. ఇంతలో తులసి చేతిలో బిడ్డ ఏడుస్తుంది. దాంతో పాపకి డబ్బా పాలు పడుతుంది తులసి. అది చూసిన కావ్య.. ఏం జరిగిందని అడగ్గా.. పాపకు సరిపడా పాలు పడలేదు, పాప డబ్బా పాలు కూడా తాగడం లేదని చెబుతుంది తులసి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X