Brahmamudi January 3rd Episode: రాజ్, కావ్యలకు పొంచి ఉన్న ప్రమాదం.. కూతుళ్ల కోసం కనకం త్యాగం
Photo Courtesy: JioHotstar
కావ్య, అప్పూలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం కోసం ఇంటిల్లిపాదని ఒక్కచోటికి చేరుస్తారు రాజ్, కళ్యాణ్. ఒక పాత్రలో చీటీలు రాసుకొచ్చి ఎవరికి ఏం వస్తే అది చేయమంటాడు రాజ్. దాంతో సీతారామయ్య, అప్పూ- కళ్యాణ్, ఇందిర - అపర్ణ, ప్రకాశం - ధాన్యలక్ష్మీ, స్వప్న - రాహుల్, సుభాష్, స్వప్న, రుద్రాణిలు రకరకాల షోలు చేస్తారు. చివరికి రేఖ ఒక్కతే మిగిలిపోవడంతో ఆమెతో చీటి చేయించగా డ్యూయెట్ చేయాలని వస్తుంది. దాంతో నేను రాజ్ బావతో కలిసి డ్యూయెట్‌కి డ్యాన్స్ చేస్తానని రేఖ మారాం చేయడంతో రాజ్.. తప్పనిసరి పరిస్ధితుల్లో డ్యాన్స్ చేస్తాడు.
ఇంతలో కావ్య కషాయం తాగకపోవడంతో తనే స్వయంగా కలుపుకుని తీసుకొచ్చి ఆమెతో తాగిస్తాడు రాజ్. ఇదే అదనుగా రాజ్.. కారు తాళాలను కొట్టేస్తాడు రాహుల్. రాజ్‌కి భార్య గురించి చెప్పాలనే టాస్క్ రావడంతో కావ్యని ఆకాశానికి ఎత్తేస్తాడు. రాజ్ లాంటి భర్త దొరికినందుకు కావ్య అందరికంటే అదృష్టవంతురాలని ఇందిర, ధాన్యలక్ష్మీలు మెచ్చుకుంటారు. దాంతో రేఖ రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 3వ తేదీ ఎపిసోడ్ 921లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ బావతో డ్యాన్స్ చేయడంతో రేఖ మురిసిపోతుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ కారు తాళాలు దొరికాయని, ఆ దొంగ బంగారాన్ని అందులో పెట్టాలని రుద్రాణితో చెబుతాడు. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది. దొంగ బంగారాన్ని కొన్న కేసులో వాడిని పూర్తిగా ఇరికించేయమని చెబుతుంది రుద్రాణి. అది అంత ఈజీ కాదని, ఎవ్వరూ చూడని సమయంలో బంగారాన్ని పెట్టాలని చెబుతాడు రాహుల్. వెంటనే పోలీసులను రప్పించి రాజ్‌ని, రాజ్ కంపెనీని రోడ్డు మీదకి లాగాలని చెబుతాడు. దొంగ బంగారం కేసులో రాజ్ బావని ఇరికిస్తారా? అని రేఖ అడుగుతుంది. నువ్వేందుకు అంత ఫీల్ అవుతున్నావని రాహుల్ ప్రశ్నించగా.. ఎంతైనా నేను చేసుకోబోయేవాడు కదా? నాకు కాబోయేవాడు జైళ్లో ఉంటే బాగోదు కదా అంటుంది.
అప్పుడే వాడు నీకు మొగుడు అయిపోయాడా? అంతదాకా వెళ్లావా? అని ప్రశ్నిస్తాడు రాహుల్. వాడు నీకు దక్కాలంటే ఇంకా చాలాదూరం వెళ్లాలని చెబుతాడు. మీరు ప్లాన్ చేసి జైలుకు పంపిస్తే బావ నా వాడు ఎలా అవుతాడని అడుగుతుంది రేఖ. వాడిని జైలుకు పంపకపోతే నేను నెంబర్‌వన్ కాలేనని అంటాడు రాహుల్. వాడు నీకు దక్కాలంటే ముందు రాజ్ మన కంట్రోల్‌లో ఉండాలి. కష్టం వాడు చుట్టూ అలుముకోవాలి.. వాడు ఒంటరి అయిపోతే, అప్పుడు మన మాట వినే స్థితికి వస్తాడు. నువ్వు వాడి లైఫ్‌కి ఎంత అవసరమో తెలిసేలా చేయాలని చెబుతుంది రుద్రాణి. బావ మనసంతా ఆ కావ్యే ఉంది కదా? కావ్య కడుపు పోతుంది.. మళ్లీ దానికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెబుతుంది రుద్రాణి. ఇంటికి వారసుడు కావాలి కాబట్టి.. ఈ ఇంటికి, రాజ్‌కి నువ్వే ఆప్షన్ కావాలని చెబుతుంది.
కావ్య కడుపు పోవాలి, దొంగ బంగారం కేసులో రాజ్ జైలు పాలు కావాలని చెబుతుంది రుద్రాణి. బావ జైలుకు వెళ్తాడన్నది నేను భరించలేకపోతున్నానని రేఖ చెప్పగా.. అక్కడి దాకా నేనెందుకు రానిస్తాను రాజ్‌ని నేనే బెయిల్‌పై బయటకు తీసుకొస్తాను. అప్పుడు మన మీద నమ్మకం బాగా కుదురుతుందని అంటాడు రాహుల్. నేను వేసిన ప్లాన్ పక్కాగా అమలవుతుంది, కానీ నువ్వు వేసిన ప్లాన్ ఫెయిల్ కాకుండా చూసుకోమ్మని చెబుతాడు. ఈరోజు రాత్రి కొత్త పసరు మందుని కావ్య చేత తాగిస్తా, కావ్య కడుపు కడిగేస్తానని అంటుంది రుద్రాణి.
అప్పూ, కావ్యలు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ బాధపడతారు. ఇంతలో కనకం వచ్చి కూతుళ్లని చూసి మురిసిపోతుంది. మీరు నాకు చిన్నపిల్లలు లాగానే ఉన్నారు.. అలాంటిది మీరు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోతుందని అంటుంది కనకం. పంతులుగారిని ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా.. నెలలు నిండాయి కదా? మిమ్మల్ని మనింటికి తీసుకెళ్లాలి? నా చేతులతో పురుడు పోయాలి? అని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని అంటుంది కనకం. వచ్చింది మా అమ్మే అయినా నన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటోందని చెబుతుంది కావ్య. నా కోడలు బంగారం అని అపర్ణ మెచ్చుకుంటుంది. అప్పూ ఏం చెప్పకపోవడంతో నేను నిన్ను సరిగా చూసుకోవడం లేదా? అని ధాన్యలక్ష్మీ అలుగుతుంది. మా అక్క బయటికి చెప్పింది, నేను చెప్పలేకపోయానని అంటుంది ధాన్యలక్ష్మీ.
సడెన్‌గా వచ్చావు.. పంతులుగారిని వెంటబెట్టుకుని ఎందుకు వచ్చావని అడుగుతుంది ఇందిర. అమ్మాయిల్ని పురిటికి పుట్టింటికి తీసుకెళ్తానని చెబుతుంది కనకం. అప్పూ డెలివరి ఇక్కడ జరగదా? అని కళ్యాణ్ అడగ్గా.. ఏ ఆడపిల్లాడికైనా తొలి కాన్పు తన పుట్టింటిలోనే జరగాలని అంటుంది స్వప్న. కోడళ్లు ఇద్దరూ ఉన్నపళంగా పుట్టింటికి వెళ్లడం అంటే బాధగా ఉందని అంటుంది అపర్ణ. పిల్లలిద్దరూ కొన్నాళ్లు మా ఇంట్లోనే ఉండాలన్నది మా అందరి కోరిక అని చెబుతుంది ఇందిర. అయితే శ్రీమంతం అయ్యాకే నా కూతుళ్లని తీసుకుని వెళ్తానని కనకం చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. దాంతో రాజ్, కళ్యాణ్‌లు శ్రీమంతం ఏర్పాట్ల కోసం ప్లాన్ చేస్తుంటారు.
ఇంతలో కావ్య, అప్పూలు అక్కడికి వచ్చి సినిమాలు చూసి మా శ్రీమంతం చేస్తారా? అని షాక్ అవుతారు. ఆ వెంటనే కనకం వచ్చి డబ్బులు ఇస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. దీనిని మీ మావయ్యగారు ఎంతో కష్టపడి సంపాదించారు.. కన్నవాళ్లం మాకు తోచినంత ఇస్తున్నామని అంటుంది కనకం. దాంతో రాజ్ ఆమె దగ్గరి నుంచి డబ్బులు తీసుకుంటాడు. అంతా బాగానే ఉంది కానీ శ్రీమంతం ఎలా చేస్తారోనని నాకు డౌట్‌గా ఉందని అంటుంది కావ్య. ఇంతలో రేఖ వచ్చి శ్రీమంతం ఈవెంట్స్ చేశానని చెబుతుంది. నాకు నీ ప్లాన్స్ వద్దు.. మా బాధలు మేం పడతామని వెళ్లిపోతారు. ఆ మాటలతో కావ్య, రేఖలు నవ్వుకోవడంతో రేఖ రగిలిపోతుంది.
సుభాష్ మందు తాగుతుండటంతో అపర్ణ సీరియస్ అవుతుంది. రాజ్, కావ్యలు లేని టైంలో మన కంపెనీకి 10 కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదా.. కానీ మన కొడుకు, కోడలు ఆ నష్టాన్ని కవర్ చేశారని చెబుతాడు సుభాష్. నాకు మాత్రం ఆ విషయంలో చాలా కోపంగా ఉంది.. ఆ రాహుల్ చేసిన మోసం తెలిసి కూడా బుద్ధి చెప్పకుండా వదిలేశారని మండిపడుతుంది. కావ్యకి డెలివరీ అయితే ఈ దుగ్గిరాల కుటుంబంలో కొత్తదనం వస్తుందని అంటాడు సుభాష్. అప్పూ కోసం చీర కొంటాడు కళ్యాణ్.. కానీ ఇంతలో కనకం తీసుకొచ్చిన చీరను చూసి మురిసిపోతుంది అప్పూ. కళ్యాణ్ కూడా చీర తీసుకొచ్చినట్లు గమనించిన అప్పూ దానిని కట్టుకుంటానని చెబుతుంది. ముందే చెప్పొచ్చు కదా అని అప్పూ అడగ్గా.. ఈ రెండు చీరల్లో ఏది కట్టుకోవాలా? అని నువ్వు ఇబ్బంది పడతావు కదా? నా వల్ల చిన్న ఇబ్బంది కూడా నువ్వు పడకూడదని అంటాడు కళ్యాణ్. ఆ మాటలతో అప్పూ భర్తని హత్తుకుని బాధపడుతుంది. నువ్వు తీసుకొచ్చిన చీరే కట్టుకుంటానని అప్పూ చెప్పగా.. వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న చీరనే కట్టుకోమని చెబుతాడు కళ్యాణ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










