Brahmamudi January 6th Episode: రుద్రాణి కుట్ర బయటపెట్టిన కనకం.. షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ
Photo Courtesy: JioHotstar
కావ్య కడుపుని పొగొట్టేందుకు పసరు మందు తీసుకొస్తుండగా కనకానికి ఎదురవుతుంది రుద్రాణి. ఇంత అర్థరాత్రి పూట ఏం చేస్తున్నావని అడగ్గా.. నాకు బాగా అజీర్తి చేసిందని తెలిసినవాళ్లు పసరు మందు ఇస్తే తెచ్చుకుంటున్నానని సీసా చూపిస్తుంది. అయినా నువ్వు ఈ ఇంటికి ఆడపిల్లని ఇచ్చావు.. ఎంతలో ఉండాలో? అంతలో ఉండాలని కనకానికి వార్నింగ్ ఇస్తుంది. పసరు మందుని పగటి పూట మాత్రమే ఇస్తారు.. అలాంటిది అర్ధరాత్రి పూట ఎందుకు తీసుకొస్తుందని రుద్రాణిపై అనుమానపడుతుంది కనకం.
కావ్య, అప్పూల శ్రీమంతం కోసం రాజ్, కావ్యలు ఏర్పాట్లు ఇరగదీస్తారు. వారికి ఎంతో ఖరీదైన బంగారు నగల్ని తీసుకుని రాగా.. మట్టిగాజులు ఎక్కడ? అని కనకం అడుగుతుంది. బంగారు గాజులు తీసుకొచ్చినప్పుడు మట్టిగాజులు ఎందుకు అని అంతా ప్రశ్నించడంతో వాటి గొప్పదనం గురించి చెబుతుంది కనకం. రాజ్, కళ్యాణ్‌లు తమ భార్యలను అందంగా ముస్తాబు చేస్తారు. పసరు మందు కలిపేందుకు మంచి టైం కోసం చూస్తూ కావ్య గదిలోకి దూరతారు రుద్రాణి, కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 6వ తేదీ ఎపిసోడ్ 923లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈ సంతోషం నీతో పదికాలాల పాటు ఉంటే తల్లిగా అంతకుమించి కావాల్సింది లేదని కావ్యతో అంటుంది కనకం. ఇంతలో ఇందిర వచ్చి నీ తల్లీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామా అని సెటైర్లు వేస్తుంది. మా అమ్మ రాకరాక వచ్చింది.. ఆ మాత్రం మంచి చెడు చెప్పుకోవద్దా అని ప్రశ్నిస్తుంది కావ్య. నువ్వు ఉన్న చోట చెడుకి స్నానం ఎక్కడ ఉంటుంది.. అంతా మంచే కదా అంటుంది ఇందిర. నా బిడ్డ ఇన్నాళ్లూ ఎన్నో ఆటంకాలను దాటిందో.. ఇప్పుడిప్పుడే దాని మనసు కుదుట పడుతోంది అంటుంది కనకం. ఇక అంతా మంచే.. నా మనవరాలే ఈ ఇంటికి వెలుగు అయినప్పుడు ఇక వెలుగుకి లోటు ఏముంది? అని ఇందిర ప్రశ్నిస్తుంది. వాళ్ల సెంటిమెంట్ ముగిసేలాగా కనిపించకపోవడంతో పసరు మందు తర్వాత కలుపుదామని రేఖ, రుద్రాణిలు వెళ్లిపోతారు.
మీరు నా కూతురిని ఎంత పొగిడినా ఇదంతా మీ వల్లే జరిగిందని ఇందిరకి దండం పెడుతుంది కనకం. అనంతరం కావ్య, అప్పూలను అందంగా ముస్తాబు చేసి కిందకి తీసుకొస్తారు. వారిద్దరినీ రాజ్, కళ్యాణ్‌లు కుర్చీలో కూర్చోబెడతారు. తర్వాత అత్తమామలతో శుద్ధి కార్యక్రమం చేయిస్తారు పంతులుగారు. ఇంతలో పుట్టింటి సారె తీసుకుని వస్తుంది కనకం. ముందుగా వారి ఒడిని నింపాల్సింది వారి భర్తలే. శ్రీమంత అంటేనే కట్టుకున్నవాడు చేసే కార్యక్రమం అని చెబుతారు పంతులుగారు. మాక్కూడా కావాల్సింది అదే పంతులుగారు.. మేమే అన్నీ దగ్గరుండి చేస్తామని అంటాడు రాజ్. దాంతో రాజ్, కళ్యాణ్‌ల చేత పూజ చేయిస్తాడు పంతులుగారు. ఇదే అదనుగా భావించిన రుద్రాణి... పసరు మందుని కావ్య తాగే కషాయంలో కలపాలని అనుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ మందు కలపబోతుండగా... కనకం వచ్చి రుద్రాణి చేతిని పట్టుకుంటుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది.
నువ్వెందుకు నా కూతురు రూమ్‌లోకి వచ్చావు.. ఎందుకు నా కూతురు తాగే కషాయంలో మందు కలుపుతున్నావని ప్రశ్నిస్తుంది కనకం. కావ్య శ్రీమంతం హడావుడిలో పడి కషాయం తాగడం మరిచిపోయింది. కావ్యకి కషాయం ఇద్దామని వచ్చానని అంటుంది రుద్రాణి. కషాయం ఇచ్చేదానివి అయితే నీ దగ్గర ఉన్న.. నా కూతురు తాగే కషాయంలో ఎందుకు కలుపుతున్నావని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో రుద్రాణి తడబడుతుంది. కడుపులో కుళ్లును నింపుకున్న ఆడదానిలా కనిపిస్తున్నావు.. అందరి కళ్లు కప్పి ఏదో కీడు తలపెట్టాలని చూస్తున్నావని ప్రశ్నిస్తుంది. నువ్వెంటో, నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడమని కనకానికి వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. కావ్యకి కన్నతల్లిని... ఆ స్థాయి నాకుంది కాబట్టే మర్యాదగా అడుగుతున్నాను, ఈ పసరు మందు ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కనకం. ఈ పసరు మందు నా కూతురు తాగే కషాయంలో ఎందుకు కలపాలని అనుకున్నావని నిలదీస్తుంది.
అవతల పండుగ జరుగుతుంటే నువ్వు అనవసరం రాద్ధాంతం చేయొద్దని అంటుంది రుద్రాణి. రాత్రి ఈ మందు నీ కోసం తెప్పించుకున్నానని అన్నావు.. మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. నా కోసం తెచ్చుకున్న పసరు మందు వేరు.. ఇది వేరని చెబుతుంది రుద్రాణి. ఇది అబద్ధమని నాకు అనిపిస్తుంది అంటుంది కనకం. ఈ మందు గురించి ఇంటిల్లిపాదికి తెలుసు.. ఈ కషాయం కావ్య మందులో కలిపితే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అంటుంది రుద్రాణి. నేను ఈ ఇంటి ఆడపడుచుని, ఈ ఇంటి మనిషిని అలాంటిది నా వాళ్ల చెడు ఎందుకు కోరుకుంటానని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఈ పండగ నాశనం చేయాలనే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు.. అందరి సంతోషం చూసి ఓర్వలేకపోతున్నావని మండిపడుతుంది. అవేవీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది రుద్రాణి.
ఆ తర్వాత కావ్య, అప్పూల మెడలో రాజ్, కళ్యాణ్‌లు దండలు వేసి స్వీట్ తినిపిస్తారు. పుట్టింటి వారు ఒడిని నింపాలని కనకం ఎక్కడ అని పంతులు గారు అడుగుతారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో మిగిలిన పనులు చేసేయమంటారు పంతులుగారు. దాంతో అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కావ్యకి రుద్రాణి బొట్టు పెడుతుండగా.. ఆగమంటూ కనకం సీరియస్ అవుతుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చిన వాడిని తీసుకొస్తుంది. నా కూతురికి నువ్వు బొట్టు పెట్టడానికి వీల్లేదని సీరియస్ అవుతుంది కనకం. ఏమైంది? ఎవరితను? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని దుగ్గిరాల కుటుంబం ప్రశ్నిస్తుంది. ఇతనెవరో రుద్రాణికి బాగా తెలుసని అంటుంది కనకం.
ఈ కుటుంబం మీద పడగ విప్పింది? నా కూతురు అల్లుడి జీవితాలను నాశనం చేయాలని.. కావ్య కడుపులోని బిడ్డను చిదిమేయాలని చూసిందని అంటుంది కనకం. ఈ ఇంటికి రాబోతోన్న వారసుడిని నలిపివేయాలని అనుకుందని చెబుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. రోజూ కావ్య తాగే కషాయంలో ఈ రుద్రాణి విషం కలిపే ప్రయత్నం చేసిందని కనకం చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. వీడి దగ్గర పసరు మందు కొనింది.. నిన్న కావ్య తాగిన కషాయంలోనూ కలిపింది, ఈరోజు కలపబోతూ నాకు దొరికిపోయిందని అంటుంది. కానీ నన్నే దబాయించింది.. నేను మీ సంతోషాన్ని చెడగొడుతున్నానని నా మీదే నిందలు వేసి తప్పించుకుంది. నిజానిజాలు తెలియాలంటే సాక్ష్యం కావాలి.. అందుకే నా బిడ్డల శ్రీమంతం జరుగుతున్నా వదిలేసి వీడిని పట్టుకోవడానికి వెళ్లానని అంటుంది కనకం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










