Brahmamudi January 7th Episode: రుద్రాణిని గెంటేసిన దుగ్గిరాల ఫ్యామిలీ.. రాజ్ పతనానికి రాహుల్ కుట్ర

Photo Courtesy: JioHotstar

కావ్య కడుపు పొగొట్టాలని రేఖ, రుద్రాణిలు రాజ్ బెడ్ రూం దగ్గర కాపు కాస్తారు. కానీ కావ్య, కనకం, ఇందిరలు అక్కడే ఉండటంతో వారిద్దరూ వెళ్లిపోతారు. అప్పూ, కావ్యలకు వారి భర్తల చేతుల మీదుగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తారు పంతులుగారు. ఫ్యామిలీ అంతా ఫంక్షన్‌లో ఉండగా... కావ్య కషాయంలో పసరు మందు కలపాలని అనుకుంటుంది రుద్రాణి. రాజ్ బెడ్ రూంలోకి వెళ్లి పసరు మందు కలుపుతుండగా కనకం వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దాంతో షాకైన రుద్రాణి... ఏదేదో చెబుతుంది.

కావ్య, అప్పూలను దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా ఆశీర్వదిస్తారు. అయితే ఎక్కడా కనకం కనిపించకపోవడంతో ఆమె కోసం అంతా వెయిట్ చేస్తారు. ఇంతలో కావ్యకి రుద్రాణి బొట్టు పెడుతుండగా కనకం వచ్చి ఆగమంటుంది. నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావు... నీలాంటి ఆశీర్వాదం నా బిడ్డకు అక్కర్లేదని అంటుంది. ఏం జరిగిందని అందరూ అడగ్గా.. కావ్య తాగే కషాయంలో రుద్రాణి పసరు ముందు కలిపిందని చెబుతుంది. అలాగే ఆమెకు పసరు మందు చేసి ఇచ్చిన వ్యక్తిని కూడా పట్టుకొస్తుంది కనకం. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 7వ తేదీ ఎపిసోడ్ 924లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial January 7th 2026 Episode 924 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య కడుపులోని బిడ్డను చంపేలా రుద్రాణి ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో మీరే అడగండి అని అంటుంది కనకం. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ రగిలిపోతుంది. కనకం చెప్పేదంతా అబద్ధమని, అసలు వీడెవడు నాకు తెలియదు. ఇదంతా కనకం నా మీద చేస్తున్న కుట్ర అంటుంది. నిజం చెప్పాలంటూ అడవి మనిషిని సుభాష్ చితకబాదుతాడు. ఆ దెబ్బలతో నిజం చెబుతానని అంటాడు ఆ వ్యక్తి. కనకం అమ్మగారు చెప్పినదంతా నిజమే.. రుద్రాణి అమ్మగారు కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోవడానికి మందు కావాలని అడిగారు. డబ్బులు కూడా ఇచ్చారు, ఆ మందు నేనే ఇచ్చాను. అంతకుమించి నాకేం తెలియదని ఆ వ్యక్తి చెప్పడంతో రుద్రాణి, రేఖలకు ముచ్చెమటలు పడతాయి.

ఇన్నాళ్లూ నువ్వెన్ని పనులు చేసినా క్షమించాం, ఏదో ఒక రోజు మారతావని అనుకున్నాం. ఇంటి మనుషుల గొప్పదనం తెలుసుకుంటావని అనుకున్నాం.. కానీ ఈ ఇంటి వంశాంకురాన్ని పొట్టన పెట్టుకోవాలని కలలో కూడా ఊహించలేదని ఇందిర మండిపడుతుంది. నీకు మా ఇంటికి ఏ సంబంధం లేకపోయినా కేవలం మా నాన్న మాటని గౌరవించి ఈ ఇంటి ఆడబిడ్డ స్థానం ఇచ్చాం. నిన్ను, నీ కొడుకుని, నీ కూతురిని సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకున్నాం. మేం బంధాన్ని పెంచుకుంటే.. నువ్వు బాధ్యతను తెంచుకున్నావని మండిపడతాడు సుభాష్.

ఎప్పుడో మా బావ ఇచ్చిన మాట కోసం నిన్ను దిక్కులేని దానిని చేయలేక, నిన్ను అనాథని చేయడం ఇష్టం లేక నా బిడ్డలతో నిన్ను కూడా కూతురు అనుకున్నాను. అందరిలాగే నువ్వు కూడా ఈ ఇంటి వైభవాన్ని అనుభవించాలని అనుకున్నాను. కానీ నీలో మనిషి చచ్చిపోయి ఇంతటితో మృగం బయటికొస్తుందని అనుకోలేదని అంటుంది ఇందిర. ఎందుకింత భయంకరమైన ఆలోచన వచ్చింది? నేను మీకు ఏం ద్రోహం చేశాను. ఈ బిడ్డని 9 నెలలు మోయటానికి నేను ఏ తల్లి పడని కష్టాలు పడ్డాను. నా బిడ్డకు ఈ ప్రపంచాన్ని చూపించడానికి మృత్యువుతోనే పోరాటం చేశాను. అలాంటిది కడుపులోని పసికందును తుంచేయాలని ఎలా అనిపించిందని ప్రశ్నిస్తుంది కావ్య.

నిన్ను ఏ రోజూ మేనత్త అనుకోలేదు.. నా తల్లి తర్వాత తల్లి అనుకున్నాను. రాహుల్‌ని నా సొంత తమ్ముడు అనుకుని వాడికి అండగా నిలబడ్డాను. రాహుల్ తెగిన గాలిపటంలా దిక్కులేనివాడిలా తిరుగుతుంటే రాహుల్‌ని నిలబెట్టమని కావ్య చెప్పింది, అలాంటి కళావతి కడుపుని పొగొట్టాలని ఎందుకు అనుకున్నావు. కోట్లు ఖర్చు పెట్టి వాడితో కంపెనీ పెట్టించాను, వాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించాం. అలాంటిది నా బిడ్డ మీద ఎందుకంత కోపమని నిలదీస్తాడు రాజ్. నువ్వింత కుట్రకు తెరలేపుతావని అనుకోలేదని అంటాడు. నా కోడలి మీద కక్ష కట్టినప్పుడే దీనితో బంధం తెగిపోయిందని అంటుంది అపర్ణ.

ఏదో క్షణికావేశంలో తప్పు చేశానని.. నన్ను క్షమించాలని రుద్రాణి అంటుండగా నువ్వు మాట్లాడొద్దని రాహుల్ సీరియస్ అవుతాడు. గుండెల్లో గునపం దించి ఇప్పుడు క్షమించమని అడుగుతావా? రాజ్, కావ్యలు నా మనసు మార్చి నన్ను మంచి మార్గంలో నడిపించారని అంటాడు రాహుల్. నిన్ను నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుందని చెబుతాడు రాహుల్. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందని రేఖ కూడా సీరియస్ అవుతుంది. నన్ను క్షమించాలని రాజ్, కావ్యలను అడుగుతుంది రుద్రాణి. నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు... నిన్ను క్షమించడం జరగదు, నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వమని మెడ పట్టుకుని రుద్రాణిని గెంటేస్తుంది ఇందిర. ఇంతలో కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

పసరు మందు ప్రభావం కావ్య బిడ్డపై పడలేదని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటుంది. మా అమ్మ చేసిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నానని అంటాడు రాహుల్. ఆ దొంగ మాటలొద్దు, ఏం చేసినా మీ తల్లీకొడుకులు కలిసే చేస్తారని ధాన్యలక్ష్మీ నానామాటలు అంటుంది. దాంతో స్వప్న సీరియస్ అవుతుంది. మా అత్త తప్పు చేస్తే నా భర్తను నిందిస్తున్నారని మండిపడుతుంది. కావ్యకి ఏమైనా జరుగుంటే మా అత్తని మీరు గెంటడం కాదు... నేనే చంపేసేదానిని అంటుంది స్వప్న. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఈ కుటుంబం.. మనం తలదించుకున్నామంటే కారణం మా అమ్మ అని రాహుల్ వెళ్లిపోతాడు. ఇక ఎప్పటికీ ఆ రుద్రాణి పేరు ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని అంటుంది ఇందిర.

తనకు జరిగిన అవమానంపై రుద్రాణి రగిలిపోతుంది. నీకు సపోర్ట్‌గా మాట్లాడలేకపోయామని రాహుల్, రేఖలు సారీ చెబుతారు. ఆ టైంలో మీరు చేసింది కరెక్టే... లేదంటే మీకు కూడా ఆ ఇంట్లో స్థానం ఉండేది కాదని అంటుంది రుద్రాణి. ఇన్నాళ్లు నేను ఎన్నో అవమానాలు పడింది... మీ కోసమే. మిమ్మల్ని ఆ ఇంటికి వారసులను చేయడం కోసమని అంటుంది రుద్రాణి. మీరు ఆ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే చిచ్చు పెట్టాలి. బంధాలని, బంధుత్వాలని తెంచేయాలి ఆస్తిని మీ సొంతం చేసుకోవాలని చెబుతుంది. ఆస్తిని సొంతం చేసుకోవడమే కాదు... రాజ్ లైఫ్‌ని అల్లకల్లోలం చేస్తానని అంటాడు రాహుల్. నిన్ను అవమానించిన వాళ్లని అంత సులువుగా వదిలిపెట్టం... కావ్యకి జీవితమే లేకుండా చేస్తానని రేఖ అంటుంది. రేపు ఉదయం కల్లా ఆ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఉండేలా చేస్తానని అంటాడు రాహుల్. ఇంట్లో జరిగినదాని గురించి కావ్య బాధపడుతుండగా రాజ్ వచ్చి ఓదారుస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X