Brahmamudi January 8th Episode: రాహుల్ కుట్రకు బలైన రాజ్... కావ్యకు పురిటి నొప్పులు
Photo Courtesy: JioHotstar
కావ్య కడుపులోని బిడ్డను చంపాలని రుద్రాణి పన్నిన కుట్రను కనకం సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతుంది. నాకం తెలియదు, కనకం కావాలని నా మీద నిందలు వేస్తోందని రుద్రాణి తప్పించుకోవాలని చూస్తుంది. అయితే కనకం తీసుకొచ్చిన అడివి మనిషిని చితక్కొట్టి సుభాష్ నిజం కక్కిస్తాడు. కడుపులోని బిడ్డను చంపడానికి రుద్రాణి అమ్మగారు పసరు మందు అడిగితే తయారు చేసి ఇచ్చానని ఆ వ్యక్తి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
మా బావ ఇచ్చిన మాటకు కట్టుబడి నీకు ఈ కుటుంబం కూతురి హోదా కల్పించింది. కానీ నువ్వు మా వారసుడినే చంపాలని అనుకున్నావని దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. రాహుల్, రేఖలు కూడా రుద్రాణిని అసహ్యించుకుంటరు. ఆ వెంటనే రుద్రాణిని మెడపెట్టి బయటకు గెంటేస్తుంద ఇందిర. తనకు జరిగిన అవమానానికి రుద్రాణి పగతో రగిలిపోతుంటుంది. మేం నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే మమ్మల్ని కూడ గెంటేసేవాళ్లని రేఖ, రాహుల్ అంటారు. దుగ్గిరాల ఫ్యామిలీని ముక్కలు చేసే వరకు మీరిద్దరూ అక్కడే ఉండాలి చెబుతుంది రుద్రాణి. కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చి చక్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 8వ తేదీ ఎపిసోడ్ 925లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆ రుద్రాణి గారికి మనం ఏం పాపం చేశామని ఇంత దారుణానికి తెగించిందని రాజ్ దగ్గర కావ్య బాధపడుతుంది. అత్తయ్య ఎప్పటికైనా మారుతుందని ఆవిడని పట్టించుకోవడం మానేశానని అంటాడు రాజ్. బిడ్డను భూమ్మీదకు తీసుకురావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వస్తోందని ఏడుస్తుంది కావ్య. నువ్వు అదృష్టవంతురాలివి.. అందుకే తల్లి బ్రతికేతే బిడ్డ దక్కదు, బిడ్డ బ్రతికితే తల్లి బతకదు అనే భయం నుంచి తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారన్న ఆనందంలోకి వచ్చారంటే ఇది మన అదృష్టం కాదా? అని ప్రశ్నిస్తాడు రాజ్. రుద్రాణి లాంటి చీడపురుగులు అంత కుట్ర చేసినా ఈ క్షణం నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందంటే ఆ దేవుడికి కూడా నీకు బిడ్డను దూరం చేయడం ఇష్టం లేదని అంటాడు రాజ్. దేవుడి అండగా మన బిడ్డని ఎవరూ ఏం చేయలేరని చెబుతాడు. మనం బిడ్డ గురించి ఇంకా అప్రమత్తంగా ఉండాలని అంటాడు రాజ్.
ఇంతమంచి మనుషుల మధ్య కూడా ఒక రాక్షసత్వం బయటపడిందని అంటుంది కావ్య. ఆ చీడపురుగుని బయటికి పంపించేశాం కదా? నీకు ఏ భయం అక్కర్లేదని చెబుతాడు రాజ్. కళ్లముందు ఉంటేనే ఇంత కర్కశంగా మారారు. ఇక ముందు ముందు మన బిడ్డకి ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయంగా ఉందని అంటుంది కావ్య. నేను ఉన్నంత వరకు ఏ చెడు నీడ కూడా నీ మీద పడనివ్వనని చెబుతాడు రాజ్. ఇంకో రెండు నెలల్లో నీ డెలివరీ జరుగుతుంది, పుట్టే బిడ్డే మన జీవితంలో సంతోషాన్ని నింపుతుందని అంటాడు. ఇంట్లోనే ఇలా ఉంటే ఆసుపత్రిలో నాకు, నా బిడ్డకు భద్రత ఉంటుందని అనుకోవడం లేదు.. నేను ఏ రోజు మన బిడ్డకు జన్మనిచ్చినా ఆ క్షణంలో మీరు నా పక్కనే ఉంటానని మాట ఇవ్వండి అని అడుగుతుంది కావ్య. దాంతో నీ పక్కనే ఉంటానని రాజ్ మాటిస్తాడు. ఇకపై మన బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ఇదొక హెచ్చరిక అంటాడు.
ఉదయాన్నే అందరికీ టీ, కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంది. కానీ అంతా వద్దని చెబుతారు. దాంతో రాహుల్ తన ప్లాన్ వేస్తాడు. మా అమ్మ వల్ల మీరు ఇలా కుమిలిపోతే తట్టుకోలేమని నటిస్తాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇంకా నిన్న జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు. ఇప్పుడు కష్టానికి చోటు లేదు.. దుఖానికి తావు లేదని, అయినా మీరెంత బాధపడి నన్ను నా బిడ్డను బాధపెడతారా? అని కావ్య ప్రశ్నిస్తుంది. ఇంతలో ప్రకాశం వచ్చి రుద్రాణి అస్సలు కనిపించడం లేదని అడుగుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి బాబాయ్.. మాకు కూడా జరిగినది మరిచిపోయే వరం ఉంటే బాగుంటుందని అంటాడు రాజ్.
ఇంతలో పోలీసులు రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీరు దొంగ బంగారం నిల్వ చేస్తున్నారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని ఎస్ఐ చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. రాజ్ అనే ఇతనే శాండీ అనే స్మగ్లర్ దగ్గర స్మగుల్డ్ గోల్డ్ కొన్నారని ఆధారాలు ఉన్నాయని ఎస్ఐ అంటాడు. నెల రోజుల క్రితం మీ ఆఫీసుకొచ్చాడు, మీతో బిజినెస్ మాట్లాడాడు, మీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారమే 2 కోట్ల రూపాయల బంగారం కొన్నారని ఎస్ఐ చెప్పడంతో రాజ్ సీరియస్ అవుతాడు. శాండీ మా ఆఫీస్‌కి రావడం, దొంగ బంగారం సప్లయ్ చేస్తానని చెప్పిన మాట కూడా నిజమే. కానీ ఇలాంటివి మేం చేయమని వాడిని కొట్టి తన్ని తరిమేశాడమని చెబుతాడు రాజ్. మీ రాజ్‌కి స్వయంగా బంగారం అమ్మినవాడు చెబితే అస్సలు నమ్ముతారా అని ఎస్ఐ.. వాడిని పిలిపిస్తాడు. వీడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే నిన్న దొరికాడని అంటాడు ఎస్ఐ.
మా ఎంక్వైరీలో తెచ్చిన గోల్డ్ అంతా మీకే అమ్మానని చెప్పాడని ఎస్ఐ అనడంతో రాజ్ సీరియస్ అవుతాడు. దొంగ బంగారం రాజ్‌కే అమ్మానని శాండీ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా కొడుకు అలా చేయడు, ఎవరో వెనకుండి చేయిస్తున్నారని అంటుంది అపర్ణ. స్వరాజ్ కంపెనీ ఎప్పుడూ అలా చేయదని ఇందిర అనగా.. మా దగ్గర సెర్చ్ వారెంట్ ఉంది, ఈ ఇల్లంతా సెర్చ్ చేయాలని ఎస్ఐ చెప్పడంతో దానిని అప్పూ చూసి అవునని చెబుతుంది. దాంతో ఇళ్లంతా వెతుక్కోమని సుభాష్ సీరియస్‌గా చెబుతాడు. ఆ వెంటనే పోలీసులు ఇళ్లంతా వెతుకుతారు. కానీ ఇంట్లో ఎక్కడ వెతికినా బంగారం కనిపించదు. అయితే బయట కారు పార్క్ చేసి ఉండగా.. రాజ్ కారులో వెతకగా బంగారంతో ఉన్న బ్రీఫ్‌కేస్ కనిపిస్తుంది. అయితే దానికి ముందు రోజు రాత్రే రాజ్ కారులో ఆ బ్రీఫ్‌కేస్ పెడతాడు రాహుల్. ఆ వెంటనే శాండీకి ఫోన్ చేసి పోలీసులకు దొరికిపోమని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు.
రాజ్ కారులో దొరికిన బ్రీఫ్‌కేస్‌ని తెరిచి చూడగా దాని నిండా బంగారం ఉండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీ కారులోకి ఇంత గోల్డ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తాడు ఎస్ఐ. ఇది ఎలా వచ్చిందో మేం తెలుసుకుంటామని రాజ్‌ని అరెస్ట్ చేస్తాడు ఎస్ఐ. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. నా భర్త అలాంటి వారు కాదని కావ్య చెప్పినా వినకుండా రాజ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసులు. భర్తను అరెస్ట్ చేశారని టెన్షన్ పడుతుండగా కావ్యకి నొప్పులు వస్తాయి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










