Brahmamudi January 9th Episode: క్రిటికల్‌గా కావ్య కండీషన్, జైళ్లోనే రాజ్... రాహుల్‌పై అప్పూకి అనుమానం
Photo Courtesy: JioHotstar
రుద్రాణి గారికి మనం ఏ పాపం చేశామని నా కడుపులోని బిడ్డను చంపాలని చూసిందని రాజ్‌తో చెప్పుకుని బాధపడుతుంది కావ్య. దేవుడు చల్లగా చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయమేస్తుందని అంటుంది. దేవుడి అండ ఉన్నంత వరకు మన బిడ్డను ఎవ్వరూ ఏం చేయలేరని.. ఇకపై బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు రాజ్. నేను బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటానని మాట ఇవ్వాలని రాజ్ దగ్గర మాట తీసుకుంటుంది కావ్య.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాణి చేసినది తలచుకుంటూ బాధపడుతుంది. మా అమ్మ మీద కోపం తగ్గకపోతే నన్ను, నా చెల్లెలిని శిక్షించాలని నటిస్తాడు రాహుల్. ఇంతలో రాజ్ వచ్చి.. జరిగినదంతా మరిచిపోమ్మని చెబుతాడు. ఆ వెంటనే ఇంటికి పోలీసులు రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీరు దొంగ బంగారం నిల్వ చేస్తున్నారని సమాచారం అందిందని శాండీని తీసుకొచ్చి చూపిస్తాడు ఎస్ఐ. అతను కూడా తాను రాజ్‌కి బంగారం అమ్మినట్లు చెబుతాడు. పోలీసులు ఇళ్లంతా వెతకగా.. రాజ్ కారులో బంగారు బిస్కెట్స్ ఉన్న బ్రీఫ్‌కేస్ దొరుకుతుంది. దాంతో రాజ్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఊహించని పరిణామానికి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తమ ప్లాన్ అమలు కావడంతో రాహుల్, రేఖలు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 9వ తేదీ ఎపిసోడ్ 926లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కావ్య కంగారు పడుతుంది. ఆయనేంటీ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటీ? కలలో కూడా ఇలాంటి తప్పు చేయరు అంటుంది కావ్య. ఇదంతా ఎవరో కావాలని చేశారని, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారని అనిపిస్తుందని అంటాడు కళ్యాణ్. ఎలాగైనా మీ బావగారిని బయటకు తీసుకురమ్మని అప్పూని అడుగుతుంది కావ్య. బావని ఎలాగైనా బయటకు తీసుకొస్తామని అప్పూ చెబుతుంది. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు, ఈరోజు చేయని తప్పుకు ఆయన్ని జైలుకు పంపించారని అంటుంది కావ్య. నువ్వు టెన్షన్ పడితే బిడ్డకు ప్రమాదమని ఇందిర, అపర్ణలు చెప్పినా కావ్య వినిపించుకోదు.
ఎవరో ఆయన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోతున్నారు, కంపెనీ సేల్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు, అందుకే ఇంతకీ తెగించి ఆయనను అరెస్ట్ చేయించారని అంటుంది కావ్య. ఇంతలోనే కావ్యకి పురిటి నొప్పులు వస్తాయి. ఏడో నెలలో పురిటి నొప్పులు రావడం ఏంటీ? అంటూ పెద్దావిడ షాక్ అవుతుంది. అందరూ కలిసి కావ్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కావ్య పరిస్థితి చూస్తే భయంగా ఉందని అపర్ణతో అంటుంది ఇందిర. రాజ్ ఇక్కడ ఉండుంటే పరిస్ధితి మరోలా ఉంటుందని అపర్ణ అనడంతో నేను వెళ్లి తీసుకొస్తానని సుభాష్ చెబుతాడు.
కావ్యకి సీరియస్‌గా ఉందని.. బీపీ హై అవుతోంది, తనకి వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు అమ్మాయికి ఏడో నెలే, అప్పుడే డెలివరీ ఏంటీ అని ప్రశ్నిస్తుంది ఇందిర. కొన్ని పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే, తను హైపర్ కావడం వల్ల పెయిన్స్ వచ్చాయని .. ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదమని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇంతకీ తన హజ్బెండ్ ఎక్కడ.. తనని వెంటనే చూడాలని అంటోంది, వీలైనంత త్వరగా తన భర్తను పిలిపించండి అని చెబుతుంది డాక్టర్. ఒకవేళ బీపీ నార్మల్ కాకపోతే ఆపరేషన్ చేయలేం... చాలా ప్రాబ్లమ్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
శాండీగాడు దొంగ బంగారం కొన్నానని నా పేరు ఎందుకు చెప్పాడు? వాడు నా మీద అంత శత్రుత్వం ఎందుకు పెంచుకున్నాడు? గోల్డ్ ఉన్న బ్రీఫ్ కేస్ నా కారులోకి ఎలా వచ్చింది? నా కారులో బ్రీఫ్ కేస్ పెట్టడం శాండీగాడికి ఎలా సాధ్యమని ఆలోచిస్తుంటాడు రాజ్. ఇంతలో సుభాష్, కళ్యాణ్‌లు వచ్చి రెండ్రోజుల్లో బెయిల్ వచ్చే ఏర్పాటు చేస్తానని లాయర్ చెప్పారని అంటారు. బెయిల్ వద్దు.. నేను నిర్దోషిగా బయటకు రావాలి, నాకు తెలియకుండా నా కారులోకి బ్రీఫ్ కేస్ ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని చెబుతాడు రాజ్. ఇదంతా ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంది? వదిన పరిస్ధితి బాలేదని అంటాడు కళ్యాణ్.
నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లగానే కావ్యకి నొప్పులు వచ్చేశాయి... వదినకి బీపీ కంట్రోల్ కావడం లేదని చెబుతారు కళ్యాణ్, సుభాష్. ఇంతలో కావ్య కండీషన్ సీరియస్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెబుతున్నారని సుభాష్‌కి అప్పూ ఫోన్ చేస్తుంది. ఇదంతా తెలుసుకున్న రాజ్ కంగారుపడతాడు. మీ ఆయన ఎక్కడ ఉన్నారో? ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలిసి కూడా ఎందుకు కంగారు పడుతున్నారని కావ్యపై డాక్టర్ సీరియస్ అవుతుంది. మీకు వెంటనే ఆపరేషన్ చేయాలని.. కానీ మీరు ఇలా టెన్షన్ పడితే బీపీ పెరుగుతుందని అప్పుడు మేం ఏం చేయలేని పరిస్థితి అని చెబుతుంది డాక్టర్. మా ఆయన నా పక్కనే ఉంటేనే ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య మారాం చేయడంతో డాక్టర్ సీరియస్ అవుతుంది.
రాజ్‌కి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమని సుభాష్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. తన భర్త పక్కనే ఉండాలని కావ్య మొండిపట్టు పడుతోందని డాక్టర్ చెబుతుంది. కావ్య వినిపించుకోవడం లేదని, తన భర్త పక్కన లేనిదే ఆపరేషన్ థియేటర్‌కు రాను అని చెబుతోందని డాక్టర్ చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. రెండ్రోజుల వరకు రాజ్‌కి బెయిల్ రాదని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో అలా జరిగితే తల్లీబిడ్డా ఇద్దరీకీ డేంజర్ అని చెబుతుంది డాక్టర్. కావ్య ఆసుపత్రిలో, వాడు పోలీస్ స్టేషన్‌లో మనం నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం... కావ్యని ఆపరేషన్‌కి ఎలా ఒప్పించాలి? నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలి? అని అపర్ణ కంగారు పడుతుంది.
ఇంట్లో వాళ్లు ఏడుస్తూ ఉండగా.. రాహుల్ నవ్వుతూ ఉండటంతో అప్పూకి అనుమానం వస్తుంది. ఆరోజు రాత్రిపూట నువ్వొక బ్రీఫ్‌కేస్ పట్టుకుని కారు దిగావు.. ఆ బ్రీఫ్ కేస్‌లో ఏముందని అప్పూ అడగటంతో రాహుల్ షాక్ అవుతాడు. బావగారి కారులో దొరికిన బ్రీఫ్ కేస్, నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ రెండూ ఒకేలా ఉన్నాయని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవతుంది. ఆ రోజు బ్రీఫ్ కేస్ గురించి అడిగితే నువ్వెందుకు తడబడుతున్నావని మండిపడుతుంది అప్పూ. నీ పోలీస్ బుద్ధి నా మొగుడి మీద చూపిస్తావా? అంటూ అప్పూపై సీరియస్ అవుతుంది స్వప్న. బిజినెస్ చేసేవాడు బ్రీఫ్ కేస్‌తో రాకూడదా? అని మండిపడుతుంది స్వప్న. నా కోడలిని ఒక్క మాట అన్నా మర్యాదగా ఉండదని స్వప్నపై కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ. మీరు రాహుల్‌ని తప్పుబట్టారు. రాజ్ కారులోకి ఆ బ్రీఫ్ కేస్ ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు, నీ కోడలు మాత్రం మా ఆయనని దోషిని చేసి అనుమానిస్తోందని మండిపడుతుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










