Brahmamudi 10th July episode: అప్పు గురించి అలానే ఆలోచిస్తా.. రుద్రాణికి కల్యాణ్ జబర్దస్త్ డోస్!
కావ్య అనామిక ఇంటికి వెళ్లి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది కానీ అనామిక వినిపించుకోదు. పైగా కళ్యాణ్ తన కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని కోర్టులో డిమాండ్ చేస్తుంది. కానీ తప్పంతా అనామికదే అని కోర్టులో నిరూపిస్తుంది కావ్య. కోర్టులో శిక్ష పడుతుంది. ఇంటికి వచ్చిన అప్పుని అవమానించేలా మాట్లాడుతారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్లకి కనకం సరైన సమాధానం చెప్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 10వ తేదీ ఎపిసోడ్ 458లో ఏం జరిగిందంటే..
రేపు తల్లిదండ్రుల పెళ్లిరోజు అని ఫోన్లో రాజ్ కి రిమైండర్ వస్తుంది. అది చూసిన రాజ్ నేను రిమైండర్ పెట్టలేదే అంటాడు. నేనే పెట్టాను అంటుంది కావ్య. నిజంగానే ఈ హడావుడిలో పెళ్లిరోజు మర్చిపోయాను అంటాడు రాజ్. అమ్మ నాన్నలని కలపటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటాడు రాజ్. అనామిక వల్ల బాధపడుతున్న కవి గారిని మనలోకి తీసుకురావడానికి ఇదే మంచి అవకాశం పెళ్లిరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అంటుంది కావ్య.

ఇద్దరికీ ఒకేలాంటి ఆలోచన వచ్చినందుకు క్రెడిట్ నాది అంటే నాది అని కాసేపు పోట్లాడుకుంటారు. మరోవైపు దిగులుగా కూర్చున్న భార్య దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. పెళ్లీడుకి వచ్చిన కూతుర్ని నలుగురు నానా మాటలు అంటుంటే బాధపడక ఏం చేయమంటారు అంటుంది కనకం. బాధపడుతూ కూర్చుంటే పని జరగదు, బాధలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఆలోచించు అని ధైర్యం చెప్తాడు కృష్ణమూర్తి.
మన అప్పుకి పెళ్లి చేసేద్దామా అంటుంది కనకం. అప్పు పోలీస్ కావాలని కలలు కంటుంది, అలా అని ఎదురుచూస్తూ కూర్చుంటే పిల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది అంటాడు కృష్ణమూర్తి. అయినా అప్పు పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో అంటాడు. అవన్నీ నేను చూసుకుంటాను మీరు శాస్త్రి గారితో మాట్లాడండి అంటుంది కనకం. సరే అంటాడు కృష్ణమూర్తి.

మరోవైపు ప్రొద్దున్నే బయటికి వచ్చిన సుభాష్ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తారు రాజ్ దంపతులు. అత్తయ్య గారికి విష్ చేశారా అని అడుగుతుంది కావ్య. లేదు ఇప్పుడే వెళ్లి చెప్తాను అని వెళ్లబోతాడు సుభాష్. ఉత్తి చేతులతో వెళ్లి విషెస్ చెప్తారా అంటాడు రాజ్. మరి ఏం చేయమంటావు అంటాడు సుభాష్. మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ అబ్బాయి కూడా ఇలానే ఉన్నారు అని భర్తని ఆట పట్టిస్తుంది కావ్య. మీ ఇద్దరూ తర్వాత పోట్లాడుకుందురు గాని ముందు ఏం చేయమంటారో చెప్పండి అంటాడు సుభాష్.
అప్పుడు కావ్య ఒక గిఫ్ట్ మామగారి చేతిలో పెట్టి మీరు ఇచ్చినట్లుగా అత్తగారికి ఇవ్వండి అని చెప్పి పంపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిరాదేవి నాకు మనవడిని ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంది. మీ మనవడిని అడగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. నీ మనసులో మాటని ఇంకా నీ భార్య కి చెప్పవా ఇంకా ఎన్నాళ్ళు ఇలా అని రాజ్ తో అంటుంది ఇందిరాదేవి.

భార్యకి దగ్గర కావాలంటే ఇగో ని పక్కన పెట్టాలి అంటుంది ఇందిరాదేవి. తాతయ్య కూడా ఇలాగే చేసేవాడా అంటాడు రాజ్. మీ తాతయ్య ఏమైనా పైనుంచి ఊడిపడ్డాడా, శ్రీకృష్ణుడు అంతటివాడే భార్య కాళ్లు పట్టుకున్నాడు అంటూ మనవడికి గీతోపదేశం చేస్తుంది ఇందిరాదేవి. మరోవైపు భార్యకి గిఫ్ట్ ఇస్తూ నేను తప్పు చేశాను కాబట్టి నీకు నా మీద కోపంగా ఉంది కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు భార్యగా నువ్వు గెలిచావు అందుకే నీకు ఈ గిఫ్ట్ అని చెప్పి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాడు సుభాష్.
గిఫ్ట్ తీసుకుంటుంది అపర్ణ. ఆ మాత్రానికే బాగా ఎమోషనల్ అయిపోయి కొడుకు దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్తే హగ్ చేసుకుంటాడు ఎందుకు నాన్న ఇంత ఎమోషనల్ అంటాడు రాజ్. నువ్వు ఎంత గొప్ప సాయం చేశావో నీకే తెలియదు అంటాడు సుభాష్. మరోవైపు శాస్త్రి ధనుంజయ్ అనే రౌడీని ఇంటికి తీసుకువస్తాడు. వీడిని ఎందుకు తీసుకువచ్చారు అంటుంది కనకం. మీరే కదా సంబంధం చూడమన్నారు అంటాడు శాస్త్రి.
పెళ్ళాన్ని చంపేసిన ఈ రౌడీ వెదవకి నా కూతుర్ని ఇవ్వాలా అని ఆవేశపడుతుంది కనకం. నీ కూతురు ఎవడితోనో తిరిగి కోర్టుకి కూడా వెళ్ళింది కదా, అలాంటి తిరుగుబోతు కూతురుకి నాలాంటి తిరుగుబోతు వాడే కరెక్ట్ అంటాడు వచ్చిన పెళ్ళికొడుకు. వాడి చెంప పగలగొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది కనకం. తర్వాత ఇలాంటి సంబంధం తెచ్చినందుకు శాస్త్రిని మందలిస్తారు కృష్ణమూర్తి దంపతులు. ఇదంతా అప్పు చూసి బాధపడుతుంది. మరోవైపు బాధగా కూర్చున్న కళ్యాణ్ దగ్గరికి వస్తారు ధాన్యలక్ష్మి దంపతులు.

నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే మాకు ముద్ద దిగటం లేదు, నువ్వు ఇదివరకట్లా మామూలుగా ఉండు అంటుంది ధాన్యలక్ష్మి. అలా ఉండటం చాలా కష్టం అంటాడు కళ్యాణ్. అలా అని మమ్మల్ని బాధ పెడతావా ఎదిగిన కొడుకు ఇలా కూర్చుంటే మేము ఎలా సంతోషంగా ఉండగలం నీకు ఏ పని నచ్చితే ఆ పని చేయు అంతేకానీ ఇలా ఉండి మమ్మల్ని బాధ పెట్టకు అని కొడుక్కి చెప్పి బాధగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది ధాన్య లక్ష్మి, వెనకే ప్రకాష్ కూడా వెళ్ళిపోతాడు.
తరువాయి భాగంలో సుభాష్ పెళ్లిరోజు వేడుకలు సందర్భంగా ఆటలతో గడుపుతారు రాజ్ కుటుంబ సభ్యులు. అది చూసి భరించలేక పోతుంది రుద్రాణి.


Click it and Unblock the Notifications











