Brahmamudi July 10th Episode: యామిని ప్లాన్ ఫెయిల్.. రాజ్ దెబ్బకు కంపెనీ వదిలేసి పారిపోయిన సిద్ధార్ధ్

Photo Courtesy: JioHotstar

ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్లు దిగుతూ వచ్చిన రాజ్‌ నడక, మాట తీరు అంతా అతనికి గతం గుర్తొచ్చినట్లుగా అనిపించడంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. నేను నటిస్తే ఎవ్వరూ కనిపెట్టలేరని చెప్పి కావ్యతో కలిసి ఆఫీస్‌కి వెళ్లిపోతాడు రాజ్. కావ్య లోపలికి వెళ్తుండగా యామిని ఫోన్ చేసి నీకు ఎండీగా ఇదే లాస్ట్ డే.. నీకు ఇంకో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని చెబుతుంది. ఆ మాటలతో కావ్య షాక్‌తో స్వప్న, అప్పూలకి ఫోన్ చేసి అంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది.

యామిని మనుషులు ఏసీబీకి ఫోన్ చేసి అప్పూ తమను లంచం అడిగిందని ఫిర్యాదు చేయడంతో అధికారులు వస్తారు. అప్పూ సమక్షంలో బాకీ తీర్చే వంకతో ఆమెకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఊహించని ఈ పరిణామంతో అప్పూ షాక్ అవుతుంది. అప్పూపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి లాకప్‌లో పెట్టమని కానిస్టేబుల్‌కి ఆర్డర్స్ వేస్తాడు ఏసీబీ ఆఫీసర్. ఎండీగా రాజ్‌ను చూసి సిద్ధార్ధ్ టెన్షన్ పడతాడు. కంపెనీ ఏమాత్రం లాభాల్లో లేదని అందుకే ఎండీని మార్చాలని అనుకుంటున్నట్లు చెబుతాడు సిద్ధార్ధ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 10వ తేదీ ఎపిసోడ్ 770లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 10th 2025 Episode 770 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కంపెనీ లాభాల్లో లేకపోవడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కలిసి ఎండీని మార్చాలని అనుకుంటున్నట్లు రాజ్‌తో చెబుతాడు సిద్ధార్ధ్. ఎండీ ప్లేస్‌లో నేను ఉండాలని అనుకుంటున్నారని అంటాడు. అదంతా నేను రాకముందు వచ్చేశాను కదా ఇక్కడెవరు భయపడాల్సిన పనిలేదని చెబుతాడు రాజ్. మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మళ్లీ పూర్వ వైభవం చూస్తుందని ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని అంటాడు. కానీ నాకు కొంచెం అనుమానం ఉందని చెబుతాడు సిద్ధార్ధ్.

లాభాలు రావాలన్నదే ఇక్కడ టార్గెట్ అని.. అది నువ్వు తీసుకొస్తావన్న నమ్మకం నాకు లేదని అంటాడు. చాలా రోజులుగా నువ్వు ఆఫీస్‌కి రావడం లేదు.. నీ హెల్త్ కండీషన్ కూడా బాలేదు ఇలాంటి టైంలో నువ్వు ఆ పదవిలో ఉండటం కరెక్ట్ కాదని చెబుతాడు సిద్ధార్ధ్. నువ్వు ముందులా సక్సెస్‌ఫుల్‌గా కంపెనీనిన నడిపించగలవని నమ్మకం ఏంటీ? అని ప్రశ్నిస్తాడు. నిన్ను నమ్మి మేమంతా నీ వెంట ఎందుకు నడవాలి? అని నిలదీస్తాడు సిద్ధార్ధ్. నువ్వు ఉన్న కండీషన్‌కి కంపెనీలో గతంలో జరిగిన డీల్స్ గురించి నీకేమైనా తెలుసా? మనం ఇప్పటి వరకు ఎంత టర్నోవర్ చేశామో ఐడియా ఉందా? కనీసం మన క్లయింట్స్ ఎవరో నీకు గుర్తుందా అని నిలదీస్తాడు.

నేను ఎండీగా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు 128 డీల్స్ చేశానని చెబుతాడు రాజ్. 27 శాతంగా ఉన్న లాభాల్ని 42 శాతానికి తీసుకొచ్చానని అంటాడు. కంపెనీ ఎండీ మాత్రమే చెప్పగలిగే మరో విషయం నీకు చెప్పనా అని అడుగుతాడు రాజ్. 2018లో మీ నాన్నగారు బోర్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారని ఆ విషయం తెలిసి నేను తనని బోర్డ్ మెంబర్‌గా తీసేయబోతే మీ నాన్న మా తాతయ్య కాళ్లు పట్టుకోవడంతో నేను బోర్డ్ మెంబర్‌గా ఉండనిచ్చానని అంటాడు. ఆ ప్లేస్‌లోనే ఇప్పుడు నువ్వు కంటిన్యూ అవుతున్నావని.. ఇప్పటి వరకు ఈ విషయం నీకు, మీ నాన్నగారికి.. నాకు, మా తాతగారికి అని చెబుతాడు రాజ్.

నువ్వు తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్ తాలూకా ఫైల్ మొత్తం చదివానని, అది ఒక భోగస్ కంపెని అని చెబుతాడు రాజ్. కేవలం పేపర్స్ మీద మాత్రమే ఉందని, ఫేక్ లెక్కల్ని చూపించి కంపెనీ నష్టాల్లో నడుస్తోందని వీళ్లందరినీ మోసం చేశావని మండిపడతాడు. ఆ మాటలతో సిద్ధార్ధ్ వణికిపోతాడు. కళావతిని చీట్ చేయాలని అనుకున్నాడని.. తనను ఎండీగా తప్పించాలని ఇదంతా ప్లాన్ చేశాడని చెబుతాడు రాజ్. బోర్డ్ మెంబర్స్ కూడా సిద్ధార్ధ్‌పై సీరియస్ అవుతారు. నేను తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఒక మీడియేటర్ ద్వారా వచ్చిందని, ఆ కంపెనీ గురించి వివరాలు తెలియవని అంటాడు. నువ్వుండగా నేను ఆ చైర్ కోసం పోటీ పడనని చెబుతాడు సిద్ధార్ధ్.

ఇదంతా చూసిన కావ్య.. రాజ్‌కు గతం గుర్తొచ్చినట్లు అనుకుని మర్యాదగా నిజం చెప్పమని అడుగుతుంది. సిద్ధార్ధ్ నాన్న తప్పు చేసిన విషయం నాకు ఇప్పటి వరకు తెలియదని అంటుంది కావ్య. ఆయనకు నెమ్మదిగా గతం గుర్తొస్తూ ఉండటంతో కావ్య సంతోషిస్తుంది. కంపెనీ తిరిగి కావ్య చేతికి వచ్చినట్లు తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం సంబరపడిపోతుంది. రాజ్ బోర్డ్ మీటింగ్‌ని సక్సెస్ చేశాడని సుభాష్ చెప్పడంతో అంతా సంతోషిస్తాడు. ఆ సిద్ధార్ధ్ కూడా రాజ్ ఉన్నంత వరకు ఎండీ చైర్ వైపు చూడనని ఒప్పుకున్నట్లు చెబుతాడు సుభాష్.

రాజ్- కావ్యలు గెలవడంతో రుద్రాణి, రాహుల్‌లు తట్టుకోలేకపోతారు. ఇక జీవితాంతం ఆ స్వప్న కాళ్ల దగ్గర కుక్కలా పడి ఉండాలని, ఆ రాజ్‌కి పోయిన గతాన్ని దేవుడు మళ్లి తిరిగి ఇచ్చేశాడని అంటాడు రాహుల్. ఇక నుంచి వాళ్లంతా నన్ను చీప్‌గా ట్రీట్ చేస్తారని, ఆ యామిని వల్ల కంపెనీ సిద్ధార్ధ్ చేతుల్లోకి వెళితే.. నా పెళ్లాం చేతుల్లో నుంచి తప్పించుకోవచ్చని చిన్న ఆశ ఉండేదని, ఇప్పుడు అది కూడా చచ్చిపోయిందని అంటాడు రాహుల్. బోర్డ్ మీటింగ్ ఎలా ఫెయిల్ అయ్యిందని రుద్రాణి ఆలోచిస్తుంటుంది.

యామిని చేసిన రెండో ప్లాన్ ఏంటో అర్ధం కావడం లేదని కావ్య ఆలోచిస్తుంది. అది చూసి ఏం జరిగిందని రాజ్ అడుగుతాడు. ఈ మంచి సమయంలో కావ్యకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు రాజ్. కావ్య చేతులు పట్టుకుని చెప్పబోతుండగా యామిని ఫోన్ చేస్తుంది. నేను ప్లాన్ ఏలో ఫెయిల్ అయ్యానని.. కానీ ప్లాన్ బీలో సక్సెస్ అయ్యానని అంటుంది యామిని. అప్పూ చేసిన ఓవరాక్షన్‌కి దాని ఒంటి మీదున్న పోలీస్ డ్రెస్‌ను దూరం చేస్తానని నీకు ముందే చెప్పాను కదా .. ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశానని, అప్పూ ఇప్పుడు సస్పెండ్ అయి, అరెస్ట్ కూడా అయ్యిందని చెబుతుంది.

ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఏడుస్తున్న నీ చెల్లెలిని ఓదార్చు.. నీ చెల్లెలి ఉద్యోగం పోవడానికి కారణం నువ్వే, దానిని చూస్తూ ప్రతిక్షణం ఏడవాలని అంటుంది యామిని. కావ్య కంగారు పడుతుండటంతో ఏం జరిగిందని రాజ్ అడుగుతాడు. అప్పూని అక్రమంగా ఓ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించారని చెబుతుంది కావ్య. పోలీస్ స్టేషన్‌కు వెళ్లబోతూ రాజ్‌ని హత్తుకుంటుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X