Brahmamudi July 10th Episode: కన్నతల్లి కోసం లక్కీ కంటతడి... ఐశ్వర్యకి చుక్కలు చూపించిన నందూ

Photo Courtesy: JioHotstar

నువ్వే నందూ అనడానికి ప్రూఫ్ ఏంటీ అని భ్రమరాంబ అడగటంతో చిన్నప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని చెబుతుంది నందూ. మా కుటుంబం గురించి ఏవో నాలుగు విషయాలు తెలుసుకుని నువ్వే నందూ అంటే మేం నమ్మమని అంటుంది రేఖ. దాంతో నేను చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు ఒక పోలీస్‌కి దొరికాను. ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయనే నా కేస్‌ని మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ చేయించాడని నందూ ఆధారాలు చూపించడంతో అంతా షాక్ అవుతారు. ఇన్నాళ్లూ నీకు దూరంగా ఉంటున్నాను, నీకు బుద్ధి చెప్పే సమయం కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది నందూ.

ఈ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఇందూ అక్క సంతకంతో పాటు నా సంతకం కూడా కావాలని చెప్పి డాక్యుమెంట్స్‌ని చించి రేఖ ముఖాన కొడుతుంది. ఇందూ అక్కకి నేను ఉన్నా.. ఇకపై నువ్వేం చేసినా నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. మమ్మల్ని ఇంతకాలం వదిలేసి ఎక్కడికి వెళ్లావని నందూని చూసి బాధపడతారు సుభాష్, అపర్ణ. నేనే నందూని అని అక్కకి తెలుసని చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. సమయానికి వచ్చి ఆస్తిని కాపాడావని నందూకి థ్యాంక్స్ చెబుతుంది ఇందూ. అయితే ఇదంతా రాజ్ బావ వల్లే.. తనే సమయానికి నన్ను పంపించాడని నందూ చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 10వ తేదీ ఎపిసోడ్ 1081లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 10th 2026 Episode 1081 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్‌ని ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని అపర్ణ చెప్పగా.. దానిని ఇందూ తిరస్కరిస్తుంది. మేమంటే అక్కాచెల్లెళ్లం కాబట్టి రేఖ ఆంటీకి ఎదురునిలబడాలి. తనని తెలివిగా దెబ్బకొట్టాలి.. కానీ రాజ్‌కి ఈ ఇంటికి సంబంధం ఏం ఉంది? నా కోసం తన అమ్మనాన్నల్ని ఎందుకు వదులుకోవాలి? అని ప్రశ్నిస్తుంది ఇందూ. తను నీ భర్త.. జీవితాంతం నీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, కడదాకా తోడు ఉంటానని ఏడడుగులు వేసిన మనిషి అంటుంది అపర్ణ. నేను పిలిస్తే రాజ్ రాడు.. నువ్వు పిలిస్తేనే వస్తాడని అంటుంది. తనని నేను పిలవలేనని వెళ్లిపోతుంది ఇందూ. నిజంగానే అక్కకి రాజ్ భర్త అయితే అలాగే పిలిచేది కానీ, అతను అద్దె మొగుడు అని అనుకుంటుంది నందూ. ఇకపై మొత్తం నేను చూసుకుంటానని మాట ఇస్తుంది.

రేఖకి రాజు ఫోన్ చేసి మన సర్‌ప్రైజ్ ఎలా ఉందని అంటాడు. నీ ఆశలు, నీ కలలు అన్నీ గాల్లో కలిసిపోయినట్లుగా ఉన్నాయి.. మనతో పెట్టుకోవద్దు. నువ్వు కంత్రి దానివి కాదు.. నాకు తెలియకుండా నా చేతే ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నావంటే నీది మామూలు తెలివికాదు. కానీ ఆస్తి మాత్రం నీకు దక్కలేదు కదా అని అంటాడు రాజ్. నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు అని రేఖ మండిపడుతుంది. నేనుండగా నీకు ఆస్తి దక్కదు, నేను ఇంట్లో లేకున్నా నీ ప్లాన్ తిప్పికొట్టాను... ఎప్పుడూ ఇందూ నా భార్యే. ఆ ఇల్లూ నాదే, ఆ కంపెనీ నాదే.. ఆ ఇంటి మనుషుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదేనని వార్నింగ్ ఇస్తాడు రాజ్.

ఆస్తి రాగానే నా మీద కోట్లు కుమ్మరిస్తావని ఎన్నో కలలు కన్నాను ఆ నందూ ఎంట్రీ ఇచ్చి మొత్తం తలకిందులు చేసేసిందని రేఖపై మండిపడుతుంది భ్రమరాంబ. మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదని శేషం అంటాడు. నేను నిజాలే ఎప్పుడూ మాట్లాడతానని చెబుతాడు. ఇందూ చాలా మెతక మనిషి.. మనం ఎన్ని అన్నా భరిస్తుంది, కానీ నందూ మాత్రం నాటు బాంబులా పేల్చేస్తుంది. ఆస్తి సంగతి దేవుడెరుగు, ముందు ప్రాణాలు కావాలి కదా? అవన్నీ జరగాలంటే తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోదామని చెబుతాడు శేషం. ఆ మాటలతో రేఖ, భ్రమరాంబలు షాక్ అవుతారు. నేనుండగా మీకు ఆ పరిస్ధితి రానివ్వనని చెబుతుంది రేఖ.

అల్లుడు రెబల్ అయితే ఈ నందూ రఫ్ అండ్ టఫ్.. అల్లుడు ఇక్కడ లేడు కాబట్టి తన సంగతి వదిలేయండి, మరి నందూ సంగతి ఏంటీ? తనతో పాటే తన పగ కూడా పెద్దదై తిరిగొచ్చింది. ఈ 20 ఏళ్ల పగంతా మీ మీద తీర్చుకోవాలని కసితో ఉంది.. అదే జరిగితే నువ్వు భస్మమై పోతావని చెబుతాడు శేషం. ఆ నందూ చిన్నప్పుడే చచ్చింది అనుకున్నా.. అందుకే తన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బతికే ఉందని తెలిస్తే ఇక్కడికి రాకుండా అడ్డుకునేదానిని, అయినా ఏం పర్లేదు. ఎందుకంటే మన ప్లాన్ కేవలం పోస్ట్‌పోన్ అయ్యింది. ఆస్తి నా సొంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు, నందూకి నేనంటే ఏంటో చూపిస్తానని ధైర్యం చెబుతుంది రేఖ.

నేను ఇందూకి దూరంగా ఉన్నా సరే నేను అక్కడికి వెళ్లకుండానే తన ప్రాబ్లమ్ సాల్వ్ చేశానని లక్కీతో చెబుతాడు రాజ్. ఏదో సొంత మొగుడిలా ఫీలైపోతున్నావు, నీకు తనకు మధ్య ఉన్న అద్దె మొగుడు అన్న కాంట్రాక్ట్ పూర్తయిపోయింది కదా అని అంటాడు లక్కీ. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. అమ్మానాన్న ఉన్నారు.. ఇంకోవైపు కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయి అద్దె మొగుడిగా చేయమని నిన్ను పిలిచింది. అది నటన అయినా బంధంలా మారింది. కానీ నా బతుక్కి ఏం లేదు.. ఎవ్వరూ లేని ఏకాకిని అని బాధపడతాడు లక్కీ. నీకు నేనున్నాను కదా అని రాజ్ ధైర్యం చెబుతాడు. నువ్వు ఉన్న రోజున నాకేం తెలియలేదు. నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడే ఈ లోకం నన్ను ఎలా చూస్తుందో అర్ధమైంది. అమ్మనాన్నలు ఉండి ఆర్ధిక పరిస్ధితి బాలేకపోయినా అడుక్కు తినైనా బతకొచ్చు. ఒకవేళ దురదృష్టం కొద్దీ అమ్మానాన్నలు మధ్యలోనే చనిపోతే అలా కూడా బతికేయొచ్చు, కానీ అమ్మనాన్న ఎవరో తెలియకుండా బతికే బతుకు మాత్రం దరిద్రం అని బాధపడతాడు లక్కీ.

నేను ఎవరికి పుట్టానో తెలియదు.. తల్లీ లాలన, తండ్రి పాలన ఎలా ఉంటుందో తెలియదు. అసలు నన్ను ఎవరు కన్నారో? ఎందుకు వదిలేశారో కూడా తెలియదు. ఒక మనిషికి సన్నాఫ్ అనేది లేకపోతే విలువ లేదు. ఆ కాలమ్‌లో అనాథ అని రాయాలంటే మనసు ఒప్పుకోదు.. మా అమ్మ బతికే ఉంది, ఈ విషయం ఆ ఆంటోనీకి తెలుసు. నా చేత అవసరాలు తీర్చుకుంటున్నాడు కానీ నిజం మాత్రం చెప్పడం లేదని బాధపడతాడు లక్కీ. మా అమ్మని ఒకే ఒక్కసారి కలవాలని ఉందని, తనతో మాట్లాడాలని ఉందని.. ఎందుకు నన్ను పుట్టగానే విసిరేశావని నిలదీయాలని ఉందని అంటాడు లక్కీ. ఆ మాటలు విన్న రాజ్ బాధపడతాడు.

ఇందూ రూమ్‌లోకి వచ్చిన ఐశ్వర్య.. మీరిద్దరూ కలిసి నన్ను అవమానించారు, అందుకే రాజ్‌గాడు ఈ ఇంట్లో ఉండకూడదని గట్టిగా కోరుకున్నానని అంటుంది. ఈ రూమ్‌ నాది.. వాడే లేనప్పుడు ఈ రూమ్ నీకెందుకు వెంటనే ఖాళీ చేయ్, వెళ్లి స్టోర్ రూమ్‌లో పడుకోమని చెబుతుంది ఐశ్వర్య. మా అక్క ఎక్కడికీ వెళ్లదు, తనతో పాటే నేను కూడా ఉంటానని చెబుతుంది నందూ. ఇన్నాళ్లూ రోడ్డు మీద తలదాచుకున్న నీకు ఇప్పుడు ఈ ఏసీ రూమ్ కావాలా? అని ఫైర్ అవుతుంది ఐశ్వర్య. నేను ఇందూ అక్కలా సాఫ్ట్ కాదు.. నువ్వు బయటికి వెళ్లకపోతే మెడపట్టుకుని బయటికి గెంటేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది నందూ. అది నిజంగా కొట్టినా కొట్టేస్తుంది, ముందు నువ్వు వెళ్లమని నచ్చచెబుతుంది ఇందూ. నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా ఊరుకోనని తేల్చేస్తుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X