Brahmamudi july 11th episode: భర్తని ఎప్పటికీ క్షమించలేనంటున్న అపర్ణ.. రుద్రాణి నోటికి తాళం వేసిన స్వప్న!

కళ్యాణ్ తన కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని కోర్టులో డిమాండ్ చేస్తుంది అనామిక. కానీ తప్పంతా అనామికదే అని కోర్టులో నిరూపిస్తుంది కావ్య. కోర్టులో శిక్ష పడుతుంది. ఇంటికి వచ్చిన అప్పుని అవమానించేలా మాట్లాడుతారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్లకి కనకం సరైన సమాధానం చెప్తుంది. తల్లిదండ్రుల పెళ్లిరోజుని గ్రాండ్ గా జరిపించి ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 11వ తేదీ ఎపిసోడ్ 459లో ఏం జరిగిందంటే..

అపర్ణ పని మనిషిని పిలిపించి తన భర్త తనకి గిఫ్ట్ గా ఇచ్చిన చీరని ఆమెకి ఇచ్చేస్తుంది. ఇంత ఖరీదైన చీర నాకు ఎందుకమ్మా అంటుంది పనిమనిషి. నీకు మాత్రం ఖరీదైన చీర కట్టుకోవాలని ఉండదా, ఈరోజు మా పెళ్ళి రోజు అందుకే ఇస్తున్నాను తీసుకో అని చీరని ఆమె చేతిలో పెడుతుంది అపర్ణ. పనిమనిషి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అని భర్త గురించి మనసులో అనుకుంటుంది అపర్ణ. ఇదంతా దొంగచాటుగా చూస్తున్న రుద్రాణి ఏదో జరుగుతుంది అనుకుంటుంది. మరోవైపు హాల్లో అందరూ కూర్చుంటారు. రాజ్ వాళ్ళు చేస్తున్న హడావిడి చూసి ఏంటి ఈ రోజు విశేషం అంటాడు ప్రకాష్.

Brahmamudi serial July 11th 2024 Episode of 459 Here is full story

ఈరోజు అమ్మానాన్నల పెళ్లిరోజు అని చెప్తాడు రాజ్.ఇంట్లో అందరూ ఆ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తారు. రుద్రాణి మాట్లాడుతూ మొత్తానికి జరిగింది త్వరగానే మరిచిపోయి తొందరగానే కలిసిపోయారు మా అన్నయ్య వదిన అంటుంది. లేదంటే మీలాగా పంతం పట్టి పుట్టింట్లో ఉండిపోవాలని ఎవరు అనుకోరు అని ఆమె నోరు మూయిస్తుంది స్వప్న.అక్కడ కళ్యాణ్ లేకపోవడంతో వాడొక్కడే గదిలో కూర్చున్నట్లు ఉన్నాడు అని బాధగా ఉంటుంది ధాన్యలక్ష్మి. లేదమ్మా నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఫ్లవర్ బొకేతో అక్కడికి వస్తాడు కళ్యాణ్.

పెద్దమ్మ పెదనాన్నలకి బొకే ఇచ్చి కవి భాషలో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాడు. ఇప్పుడు చెప్పండి అన్నయ్య పెదనాన్న పెద్దమ్మలా పెళ్లిరోజు ఎలా సెలబ్రేట్ చేద్దాము వాళ్లకి గుర్తుండిపోయేలాగా చేయాలి అంటాడు కళ్యాణ్. ఈరోజు కొన్ని గేమ్స్ పెడుతున్నాము అందులో మొదటి రౌండ్ నీ మనసు నాకు తెలుసు ఒకరు తన మనసులో ఉన్న మాటని సైగల ద్వారా చెప్తే తన పార్ట్నర్ ఆ సైగ ఏమిటో మనందరికీ నోటితో చెప్తారు అంటాడు రాజ్.

Brahmamudi serial July 11th 2024 Episode of 459 Here is full story

తాతయ్య అమ్మమ్మలు ఈ ప్రోగ్రాం కి జడ్జిలుగా వ్యవహరించి బెస్ట్ కపుల్ ని సెలెక్ట్ చేస్తారు అంటుంది కావ్య. ఈ ప్రోగ్రాం కి నువ్వే హోస్ట్ వి అని కళ్యాణ్ తో చెప్పి రాజ్ వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ భార్యాభర్తల బంధం గురించి అమ్మమ్మ తాతయ్య వివరిస్తారు అంటాడు. చిట్టి మాట్లాడుతూ అందరూ తల్లి ప్రేమ గొప్పది అంటారు నిజమే కానీ భార్య ప్రేమ ఇంకా గొప్పది తల్లి కొన్ని సంవత్సరాలు మాత్రమే పిల్లల్ని పెంచి తర్వాత పెళ్లిళ్లు చేసి పంపిస్తుంది.

తర్వాత జీవితకాలం ఆ భార్యాభర్తలే తోడుగా ఉంటారు. నన్నే తీసుకోండి పెళ్లి అయ్యాక ఇక్కడికి వచ్చిన తరువాత పిల్లలు, వాళ్ళు చదువులు, పెళ్లిళ్లు అంటూ చాలా బాధ్యతలు నెరవేర్చాను ఈ ప్రయాణంలో నాకు నా భర్త తోడుగా నిలబడ్డాడు ఇప్పుడు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇప్పుడు కూడా నాకు నా భర్త తోడు అంటుంది. సీతారామయ్య కూడా భార్య మాటలని సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. చిట్టి అపర్ణ చెవిలో ఒక పేరు చెప్తుంది.

Brahmamudi serial July 11th 2024 Episode of 459 Here is full story

ఆ పేరుని సైగల ద్వారా సుభాష్ కి చెప్తుంది అపర్ణ. సుభాష్ అర్థం చేసుకొని ఆ పేరు ఏమిటో చెప్తాడు. తర్వాత ధాన్యలక్ష్మి జంట, రాజ్ జంట కూడా ఈ గేమ్ ఆడతారు కానీ ఓడిపోతారు. తర్వాత రెండో రెండో రౌండ్లో సుభాష్ దంపతులిద్దరికీ కళ్ళ కి గంతలు కడతారు రాజ్ దంపతులు. పెళ్లిచూపుల్లో డాడీ నీతో ఫస్ట్ ఏం మాట్లాడారో బోర్డు మీద రాయు అంటాడు రాజ్. నేను నచ్చానా అనే పదం రాస్తుంది అపర్ణ. సుభాష్ కూడా అదే మాట చెప్పడంతో అందరూ చప్పట్లు కొడతారు.

తరువాయి భాగంలో ఆటలు, పాటలు అయిపోయిన తర్వాత పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని అందరికీ స్నాక్స్ తీసుకు వస్తుంది. అది చూసి షాక్ అవుతారు సుభాష్, రాజ్, కావ్య. ఇంత ఖరీదైన చీర నీకు ఎక్కడిది అని అడుగుతుంది రుద్రాణి. పెళ్లిరోజు సందర్భంగా అమ్మగారు ఇచ్చారు అంటుంది పనిమనిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X