Brahmamudi July 11th Episode: రాజ్ మనసుని చెడగొట్టిన యామిని.. అప్పూ కోసం ధాన్యంతో కావ్య ఛాలెంజ్

Photo Courtesy: JioHotstar

స్వరాజ్ గ్రూప్ లాభాల్లో లేకపోవడంతో ఎండీని మార్చాలనుకుంటున్నట్లు రాజ్‌తో చెబుతాడు సిద్ధార్ధ్. నీ హెల్త్ కండీషన్ బాలేదని.. ముందులా కంపెనీని చూసుకోగలవా? అని రాజ్‌ని ప్రశ్నిస్తాడు. దాంతో రాజ్ తాను ఎండీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎన్ని లాభాలు తీసుకొచ్చింది చెబుతాడు. అలాగే సిద్ధార్ధ్ నాన్నగారు చేసిన మోసం, దానిని ఎందుకో రహస్యంగా ఉంచినట్లు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్ ఫేక్ అని తేల్చిచెబుతాడు రాజ్.

రాజ్ మాటలతో ఉలిక్కిపడ్డ సిద్ధార్ధ్.. నా డౌట్స్‌ క్లారిఫై అయ్యాయని, నువ్వు ఉండగా కంపెనీ మీద ఫోకస్ చేయనని చెబుతాడు. బోర్డ్ మీటింగ్‌లో సిద్ధార్ధ్‌ని రాజ్ ఓడించాడని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంది. కావ్య మంచి మూడ్‌లో ఉండగా రాజ్ తన మనసులో మాట చెప్పబోతుండగా యామిని ఫోన్ చేసి అప్పూ పోలీస్ ఉద్యోగాన్ని తీయించేశానని చెబుతుంది. ఆ మాటలతో షాకైన కావ్య.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు బయల్దేరుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 11వ తేదీ ఎపిసోడ్ 771లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial July 11th 2025 Episode 771 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

లంచం తీసుకుంటూ పట్టుబడిన అప్పూ నుంచి పోలీస్ యూనిఫాంను తీసుకుంటారు ఏసీబీ అధికారులు. యూనిఫాం చూసుకుని బాధపడుతుంది అప్పూ. ఇదేదో లంచం తీసుకునే ముందు ఆలోచించి ఉంటే బాగుండేదని చెబుతాడు ఏసీబీ ఆఫీసర్. నిజం బయటపడిన రోజున యూనిఫాం మళ్లీ నా దగ్గరికి వస్తుందని అంటుంది కావ్య. ఇంతలో కావ్య లాయర్‌ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. అప్పూని జైళ్లో వేయడానికి కానిస్టేబుల్స్ బాధపడుతుండగా తనంతట తాను సెల్‌లోకి వెళ్తానని చెబుతుంది అప్పూ. ఇంతలో కావ్య వచ్చి బెయిల్ చూపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పుడే ఇంత స్పీడుగా బెయిల్ ఎలా వచ్చింది అని ఏసీబీ ఆఫీసర్ అడుగుతాడు.

ఇలాంటి కేసుల్లో బెయిల్ రాదు కదా అని ఆశ్చర్యపోతాడు. సోసైటీలో మంచి స్టేటస్ ఉండి, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోతే బెయిల్ వస్తుందని చెబుతాడు లాయర్. ఈవిడకి అంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అని ఏసీబీ ఆఫీసర్ అడగ్గా.. నా చెల్లెలు దుగ్గిరాల వారింటి కోడలని కావ్య చెప్పగా ఆఫీసర్ షాక్ అవుతాడు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి చీప్‌గా లంచం తీసుకున్నారా? అని ప్రశ్నిస్తాడు లాయర్. అసలు దీని వెనుక ఎవరున్నారో? ఎవరు ఇదంతా చేయించారో కోర్ట్‌లో తెలుస్తుందని అంటుంది కావ్య. ఆవిడకి అంత సీన్ ఉందా అని ఏసీబీ ఆఫీసర్ .. కానిస్టేబుల్స్‌ను అడగ్గా.. వాళ్లకు కోట్లలో ఆస్తి ఉందని కేవలం పోలీస్ జాబ్‌పై ఇష్టంతోనే ఉద్యోగం చేస్తున్నారని చెబుతాడు కానిస్టేబుల్ శేషు. అలాంటి మనిషి లంచం తీసుకున్నారంటే మేం నమ్మేది లేదని తేల్చిచెబుతాడు.

ఇదంతా నా వల్లే జరిగిందని అప్పూకి సారీ చెబుతుంది కావ్య. నాకు అన్యాయం చేస్తుందని యామినికి నువ్వు వార్నింగ్ ఇచ్చావ్.. అది నా మీదున్న కోపాన్ని నీ మీద చూపించిందని అంటుంది కావ్య. నువ్వు ముందే నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పినా నేనే ఇద్దరు వెదవలు చెప్పిన కట్టుకథను గుడ్డిగా నమ్మేశానని అంటుంది అప్పూ. ఆ యామినిని మాత్రం వదిలిపెట్టనని, నేను తప్పుప చేయనప్పుడు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? అని ప్రశ్నిస్తుంది అప్పూ.

ఆఫీస్ నుంచి బాధగా వచ్చిన రాజ్‌ని కావ్యకి ప్రపోజ్ చేశావా? లేదా? అని అడుగుతుంది యామిని. కావ్య వాళ్ల ఆఫీస్‌లో ఏదో ప్రాబ్లం ఉందని ఆమె ఆ టెన్షన్‌లో ఉందని చెబుతాడు రాజ్. కళావతికి ప్రపోజ్ చేయబోతుండగా కరెక్ట్‌గా అదే టైంలో అప్పూ ఏసీబీ వాళ్లకి పోలీస్ స్టేషన్‌లో దొరికిపోయినట్లు కాల్ వచ్చేసరికి మధ్యలోనే వెళ్లిపోయిందని అంటాడు. దాంతో తనకి ప్రపోజ్ చేయడం కుదరలేదని చెబుతాడు. అప్పూ అరెస్ట్ అయ్యిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదని, అంత నిజాయితీగా ఉండే అప్పూ అరెస్ట్ కావడం అంటే నాకు డౌట్‌గా ఉందని అంటుంది యామిని. ఆ కళావతి నీ దగ్గరే కావాలనే అబద్ధం చెప్పిందని, నీ ప్రపోజ్ నుంచి తప్పించుకోవడానికే అలా చేసింది చెబుతుంది.

కరెక్ట్‌గా నువ్వు ప్రపోజ్ చేసే టైంకి ఏదో ప్లాన్ చేసినట్లుగా కాల్ రావడం ఏంటీ? అలా రెండు సార్లు జరిగిందని అంటుంది యామిని. ఇంతకుముందు కూడా అర్జెంట్ వర్క్ ఉందని తప్పించుకుందని, ఇప్పడు అప్పూ అరెస్ట్ అయ్యిందని కాల్ వచ్చిందని చెబుతున్నావని అంటుంది. ఇవన్నీ చూస్తుంటే కళావతి కావాలనే నిన్ను దూరం పెట్టడానికే ఇలా చేస్తుందని నాకు డౌట్‌గా ఉందని చెబుతుంది యామిని. ఆ మాటలతో రాజ్ కోప్పడతాడు. కళావతి అంటే ఏంటో? తన వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసని అంటాడు రాజ్. నేనంటే తనకి ప్రాణమని, అలాంటి మనిషి నాకు అబద్ధం చెబుతుందా అని ప్రశ్నిస్తాడు. ఇష్టం లేదంటే డైరెక్ట్‌గా ముఖం మీదే చెబుతుంది కానీ అబద్ధాలు మాత్రం చెప్పదని అంటాడు రాజ్. ఎదుటి మనిషి కష్టాన్ని చూసి హేళనగా మాట్లాడొద్దని హెచ్చరిస్తాడు రాజ్. నా ముందు కావ్యని పొగిడితే నాకు నచ్చదని అనుకుంటుంది యామిని.

ఇంతలో వైదేహి వచ్చి ఎందుకిలా అల్లుడుగారితో తిట్లు తింటున్నావని మండిపడుతుంది. బావకి మనం ఇంజెక్ట్ చేసిన విషం ఎక్కాలంటే అతనితో తిట్లు తినాలని చెబుతుంది యామిని. కావ్యకి బావ ప్రపోజ్ చేయడానికి వెళ్లాడని కానీ కరెక్ట్ టైంకి నేను చెడగొట్టేశానని అంటుంది యామిని. బావ ప్రయత్నాలను ప్రతిసారి నేను చెడగొడతానని, ప్రతిసారి కావ్య ఎందుకు దూరంగా వెళ్లిపోతుందో అర్ధం కాక బావ పిచ్చొడు అయిపోతాడని అంటుంది. ఆ టైంలో అనుమానం అనే బీజం వేస్తానని చెబుతుంది యామిని.

అప్పూ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిందని రుద్రాణి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నానని కానీ ఒక్కరు కూడా నా మాటలు పట్టించుకోలేదని ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఇంతలో అప్పూ, కావ్యలు ఇంటికి వస్తారు. మీ చెల్లి లంచం తీసుకుంటూ దొరికిపోయిందని చెబితే ఎవ్వరూ నమ్మడం లేదని నువ్వే చెప్పమని కావ్యతో అంటుంది రుద్రాణి. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని, కొంతమంది స్వార్ధంతో నా చెల్లెల్ని ఇరికించారని చెబుతుంది కావ్య. చేయని తప్పుకు భయపడొద్దని అప్పూకి అండగా నిలబడతాడు కళ్యాణ్. అప్పూ నిర్ధోషి అయితే దానిని ఎలా ప్రూవ్ చేస్తావని కావ్యని అడుగుతుంది రుద్రాణి.

సాక్ష్యం దొరక్కపోతే.. అప్పూ జైలుకి వెళ్తే ఈ ఇంటి పరువు ఏం కావాలని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఈ చిన్నపిల్లలతో వద్దని.. మీరే అప్పూని ఈ కేసు నుంచి బయటపడేయమని సుభాష్‌ని అడుగుతుంది ధాన్యం. బలం, బలగం లేకపోయినా ధర్మం మనవైపు ఉంది.. అందరి ముందు నా చెల్లెలు నిర్దోషి అని నిరూపిస్తానని అంటుంది కావ్య. అలా చేయలేకపోతే నా చెల్లెలు మీరు కోరిన కోడలిగా ఇంట్లోనే ఉంటుందని ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు ఏ తప్పూ చేయలేదని మేం నమ్ముతున్నామని.. ఇంట్లో వాళ్లు కూడా నమ్ముతారని అప్పూకి ధైర్యం చెబుతుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X