Brahmamudi July 12th episode: కుప్ప కూలిపోయిన కళ్యాణ్.. ఇదే మంచి సమయం అంటున్న ఇందిరా దేవి!

తప్పంతా అనామికదే అని కోర్టులో నిరూపిస్తుంది కావ్య. కోర్టులో శిక్ష పడుతుంది. ఇంటికి వచ్చిన అప్పుని అవమానించేలా మాట్లాడుతారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్లకి కనకం సరైన సమాధానం చెప్తుంది. తల్లిదండ్రుల పెళ్లిరోజుని గ్రాండ్ గా జరిపించి ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తారు రాజ్ దంపతులు. తల్లి చేత తండ్రికి గిఫ్ట్ ఇప్పిస్తారు రాజ్ దంపతులు. అపర్ణ గిఫ్ట్ తీసుకోవడంతో ఎమోషనల్ అవుతాడు సుభాష్ ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 12వ తేదీ ఎపిసోడ్ 460లో ఏం జరిగిందంటే..

డాడీ మీరు మొదటిసారి మమ్మీని కలిసినప్పుడు ఏ కలర్ షర్టు వేసుకున్నారు రాయండి అంటాడు రాజ్. వైట్ కలర్ షర్ట్ అని రాస్తాడు సుభాష్. అపర్ణ కూడా అదే ఆన్సర్ చెప్తుంది.అందరూ చప్పట్లు కొడతారు మీరు సూపర్ అంటూ తల్లిదండ్రులని పొగుడుతాడు రాజ్. తర్వాత ధాన్యలక్ష్మి దంపతులను పిలుస్తారు రాజ్ దంపతులు. ధాన్య లక్ష్మీ దంపతుల కళ్ళకి గంతలు కట్టి బాబాయ్ పిన్ని తో మొదటిసారి ఏం మాట్లాడావు అనే విషయాన్ని పిన్ని బోర్డు మీద రాస్తుంది నువ్వు చెప్పాలి అంటాడు రాజ్.

Brahmamudi serial July 12th 2024 Episode of 460 Here is full story

ధాన్యలక్ష్మి బోర్డు మీద ఏదో చెప్పాలనుకున్నాను మరిచిపోయాను అని రాస్తుంది. కానీ ప్రకాష్ మాత్రం ఎప్పటిలాగే మరిచిపోయాను అని చెప్తాడు అక్కడ ఉన్న అందరూ సరదాగా నవ్వుతారు. తర్వాత ఫస్ట్ నైట్ అప్పుడు పిన్ని మొదటిసారి నీతో ఏం మాట్లాడిందో బోర్డు మీద రాయు, పిన్ని చెప్తుంది అంటాడు రాజ్. ఇంత మతిమరుపు మొగుడిని అంటగట్టి నా గొంతు కోశారు అని బోర్డు మీద రాస్తాడు ప్రకాష్. ధాన్య లక్ష్మి కూడా సేమ్ ఆన్సర్ చెప్తుంది. ఈ రౌండ్ లో విన్ అయ్యారు అంటుంది కావ్య.

ఈ మాట మాత్రం మరిచిపోలేదు ఇలాంటి గుర్తుపెట్టుకుంటారు అని భర్తని ఆట పట్టిస్తుంది ధాన్యలక్ష్మి. అవును మరి రాత్రి అంతా గొడవ పడుతూనే ఉన్నావు కదా ఎలా మర్చిపోతాను అంటాడు ప్రకాష్.. అందరూ నవ్వుతారు తర్వాత ప్రకాష్ దంపతులు రాజ్ దంపతులకు కళ్ళకి గంతలు కడతారు. మీరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు అని అడుగుతాడు ప్రకాష్. వినాయకుని బొమ్మకి రంగులు వేసినప్పుడు అని రాస్తాడు రాజ్.

Brahmamudi serial July 12th 2024 Episode of 460 Here is full story

కానీ కావ్య మాత్రం మొదటిసారి కార్ తో ఆయన నా సైకిల్ ని గుద్దేసినప్పుడు అంటుంది. అవును కదా మరిచిపోయాను అంటాడు రాజ్. మళ్ళీ అందరూ నవ్వుతారు. నీ భర్తకి నువ్వు పెట్టిన నిక్ నేమ్ ఏమిటో బోర్డు మీద రాయు అని కావ్య తో చెప్తాడు ప్రకాష్. అందరికీ కోపం వస్తుందేమో అంటుంది కావ్య. గేమ్ లో గెలుపోటములు తప్పితే కోపతాపాలకి తావు లేదు అంటాడు ప్రకాష్. మిస్టర్ డిఫెక్ట్ అని రాస్తుంది కావ్య. అదే ఆన్సర్ రాజ్ కూడా చెప్తాడు.

అందరూ చప్పట్లు కొడతారు కానీ కళ్యాణ్ మూడీగా ఉండడం గమనిస్తుంది కావ్య. ఈ ఆటలో ఎలాగైనా కవి గారిని ఇన్వాల్వ్ చేయాలి అని భర్తతో చెప్తుంది కావ్య. సరే అంటూ ఒక్కొక్క జంటని పిలిచి డాన్స్ లు వేయిస్తాడు రాజ్. రుద్రాణి డాన్స్ చాలా బాగా చేస్తుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి మీ అమ్మ డాన్స్ ఇరగదీసింది అని భర్త తో చెప్తుంది స్వప్న. తర్వాత కళ్యాణ్ చేత డాన్స్ వేయిస్తారు రాజ్ దంపతులు అతను డాన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ కుప్పకూలిపోతాడు.

Brahmamudi serial July 12th 2024 Episode of 460 Here is full story

అందరూ కంగారు పడతారు. నేను నిజంగా ఏడవటం లేదు పర్ఫామెన్స్ చేస్తున్నాను మీ అందరికీ నా పర్ఫామెన్స్ నచ్చలేదా అని అడుగుతాడు కళ్యాణ్. నచ్చింది అన్నట్లుగా అందరూ చప్పట్లు కొడతారు. ఇక చివరిగా రాజ్ దంపతులని డాన్స్ వేయమంటాడు కళ్యాణ్. ఇందిరా దేవి రాజ్ ని దగ్గరికి పిలిచి నీ మనసులో మాట చెప్పటానికి ఇదే సరైన సమయం అంటుంది. సరే అంటాడు రాజ్. తర్వాత భార్యతో కలిసి డాన్స్ చేస్తాడు.

Brahmamudi serial July 12th 2024 Episode of 460 Here is full story

తరువాయి భాగంలో సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదు, ఒక ఆడది కొడుకు కూతురు తప్పు చేస్తే క్షమించగలుగుతుంది కానీ భర్త తప్పు చేస్తే క్షమించలేదు అని కావ్యతో అంటుంది అపర్ణ. మీరు మావయ్య గారికి మాత్రమే శిక్ష వేయడం లేదు మిమ్మల్ని మీరు కూడా శిక్షించుకుంటున్నారు, మీ మనసులో ఈ భారం మోస్తున్నంతకాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X